breaking news
-
జమిలి ఎన్నికలపై ఎర్రబెల్లి ఆసక్తికర కామెంట్స్
సాక్షి,వరంగల్: బీఆర్ఎస్ దీక్షాదివస్ సందర్భంగా వరంగల్‌లో శుక్రవారం(నవంబర్ 29) జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయని,కేసీఆర్ మళ్లీ సీఎం కాబోతున్నారని ఎర్రబెల్లి అనడం చర్చనీయాంశమైంది. ‘కేసిఆర్ మళ్ళీ సీఎం కాబోతున్నారు.పార్టీ శ్రేణులు,ప్రజలు అధైర్య పడొద్దు.వెయ్యి మంది తెలంగాణ బిడ్డలను బలి తీసుకున్న బలి దేవత సోనియాగాంధీ. రేవంత్ రెడ్డికి సిగ్గులేదు. సోనియాగాంధీని నాడు బలి దేవత అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు దేవత అంటున్నాడు.రేవంత్ రెడ్డి నీకు తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలుసా?తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ చేసిన ఘనత కేసిఆర్‌ది. కాంగ్రెస్‌కు ఓటువేసిన ప్రజలంతా తప్పు చేశామని భావిస్తున్నారు’అని ఎర్రబెల్లి అన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ.. జీవన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్
జగిత్యాల: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎన్నికల్లో పోటీ చేయడం, చేయించడం పార్టీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. తన వ్యక్తిగత నిర్ణయం ఏమీ లేదని కుండబద్ధలు కొట్టారు.పట్టభద్రుల ఎమ్మెల్సీ అంశంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తే బాగుంటుంది. ఆ అభిప్రాయం అధిష్టానానికి కాంగ్రెస్ రాష్ట్ర శాఖ నివేదిస్తుంది. నివేదిక తర్వాత ఎవరు బరిలో ఉండాలనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. పోటీ చేయడం, చేయించడం పార్టీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. నా వ్యక్తిగత నిర్ణయం అంటూ ఏది లేదు.గతంలో కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీగా నేనే వ్యక్తిగతంగా ఏమీ పోటీ చేయలేదు. పార్టీ నిర్ణయం మేరకే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాను. నాకు ఎవరూ హామీ ఇవ్వలేదు.. నాకు ఎలాంటి ఒప్పందాలూ లేవు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల టీపీసీసీ చీఫ్ పార్టీ నేతలతో మాట్లాడుతూ.. వచ్చే పట్టభ్రదుల ఎన్నికల్లో మరోసారి జీవన్ రెడ్డికే అవకాశం ఇవ్వాలని కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డికే అవకాశం దక్కే అవకాశం ఉంది. -
కేటీఆర్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: ‘గురివింద గింజ తరహాలో.. బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వారిని కాంగ్రెస్‌లోకి.. చేతి గుర్తుపై గెలిచిన వారిని గులాబీ పార్టీలోకి పంపించుకుని.. మంత్రి పదవులు తీసుకున్నప్పుడు ఎవరు ఎవరితో కలిసినట్లో కేటీఆర్ చెప్పగలరా?’ అని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ప్ర శ్నించారు. ఎక్స్ వేదికగా కేటీఆర్ పోస్ట్‌పై గురువా రం ఢిల్లీలో కిషన్‌రెడ్డి స్పందిస్తూ... ‘కేటీఆర్ మిడిమి డి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేసింది వారు. ప్రభుత్వంలో భాగంగా ఉన్నది వారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నది వారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకుంటోంది.ఇప్పుడు బుర ద జల్లడం కోసం మాపైన ఆరోపణలు చేస్తున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలను పట్టించు కోవాల్సిన అవసరం లేదు’ అని వ్యా ఖ్యానించారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ అనుసరించిన మోసపూరిత విధానాలనే.. ఇవాళ కాంగ్రెస్ కాపీ కొట్టి ఏడాదిగా అనుసరిస్తున్న మాట వాస్తవం కాదా? కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ మొద లైన బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణా లు, కేసుల విషయంలో పురోగతి లేకపోవడమే ఎవ రితో ఎవరు కలిసున్నారని చెబుతోంది’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ ఒక సిద్ధాంతం ఆధా రంగా ఎదిగిన పార్టీ అని.. జాతీయవాదం, అంత్యో దయ వంటి నినాదాలతో పనిచేసే పార్టీ తమదని అన్నా రు. కుటుంబపాలన, అవినీతి వంటివి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలని.. అందుకే ఎవరికి ఎవరు దోస్తులనేది తెలంగాణ సమాజానికి తెలిసిపోయిందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. -
కేటీఆర్ ట్వీట్.. కిషన్‌రెడ్డి రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: మిడిమిడి జ్ఞానంతో కేటీఆర్ మాట్లాడుతున్నారంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్ ట్వీట్‌పై ఆయన స్పందిస్తూ.. ‘‘గురివింద గింజ తరహాలో.. బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వారికి కాంగ్రెస్ లోకి.. చేతి గుర్తుపై గెలిచిన వారికి గులాబీ పార్టీలోకి పంపించుకుని.. మంత్రిపదవులు తీసుకున్నప్పడు.. ఎవరు? ఎవరితో కలిసినట్లో.. కేటీఆర్ చెప్పగలరా?’’ అంటూ ప్రశ్నించారు.‘‘మేం గిల్లినట్లు చేస్తాను.. మీరు ఏడ్చినట్లు చేయండన్న తెరచాటు ఒప్పందంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సంయుక్తంగా పనిచేస్తున్నాయి. పదేళ్ల పాటు బీఆర్ఎస్ అనుసరించిన మోసపూరిత విధానాలనే.. ఇవాళ కాంగ్రెస్ కాపీ కొట్టి ఏడాదిగా అనుసరిస్తున్న మాట వాస్తవం కాదా? కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ మొదలైన బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలు, కేసుల విషయంలో పురోగతి లేకపోవడం.. ఎవరితో ఎవరు కలిసున్నారని చెబుతోంది?’’ అంటూ దుయ్యబట్టారు.‘‘రైతులను మోసం చేయడంలో, నిరుద్యోగ యువతను నడిరోడ్డుపై నిలబెట్టడంలో, ప్రజల మధ్య విభేదాలు రెచ్చగొట్టడంలో, హిందూ సమాజాన్ని నిట్టనిలువునా చీల్చడంలో, కుటుంబ పాలనను ప్రోత్సహించడంలో.. అవినీతిని పెంచి పోషించడంలో.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల ఆలోచన, పరిపాలనలో సారూప్యతను చూస్తే ఎవరు, ఎవరి చేతుల్లో ఉన్నారో, ఎవరు సంగీతం వాయిస్తే..ఎవరు డాన్స్ చేస్తున్నారో ప్రజలకు ఈపాటికే అర్థమైపోయింది...బీజేపీ ఒక సిద్ధాంతం ఆధారంగా ఎదిగిన పార్టీ. జాతీయవాదం, అంత్యోదయ వంటి నినాదాలతో పనిచేసే పార్టీ మాది. కుటుంబపాలన, అవినీతి వంటివి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు. అందుకే ఎవరికి ఎవరు దోస్తులనేది తెలంగాణ సమాజానికి తెలిసిపోయింది. రాజకీయ అస్తిత్వాన్ని కోల్పోతున్న సందర్భంలో.. ఏదో ఒకటి మాట్లాడి వార్తల్లో ఉండాలనుకునే మనస్తత్వాలకు ప్రజలే సరైన బుద్ధి చెబుతారు.’’ అంటూ కిషన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. -
ప్రజా పాలన విజయోత్సవాలు.. షెడ్యూల్ ఇదే
సాక్షి, హైదరాబాద్: తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉత్సవాలను ఘనంగా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 9వ తేదీ సెక్రటేరియట్ తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభం చేయనున్నారు. భారీ బహిరంగ సభకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 1వ తేదీ ఇంటిగ్రేటెడ్ భవనాలకు శంకుస్థాపనలు జరగనుంది.డిసెంబర్ 2వ తేదీ అన్ని జిల్లాల్లో సీఎం కప్ పోటీలను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఒక్కో రోజు ఒక్కో డిపార్ట్మెంట్కు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శాఖల వారీగా ఏడాది కాలం పనితీరుపై లెక్కలను మంత్రులు వెల్లడించనున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు మంత్రులు వరుస మీడియా సమావేశాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో రాష్ట్ర వ్యాప్త వేడుకలను ప్రభుత్వం కీలకంగా భావిస్తోంది.డిసెంబర్ 1:ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 2వ దశకు శంకుస్థాపన కార్యక్రమాలు.విద్యార్థుల కోసం వ్యాస రచన పోటీలు.సీఎం కప్ పోటీలు (డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 8 వరకు)డిసెంబర్ 2:16 నర్సింగ్ మరియు 28 పారా మెడికల్ కళాశాలల ప్రారంభోత్సవం213 కొత్త అంబులెన్సులు ప్రారంభం33 ట్రాన్స్ జెండర్ క్లినిక్‌ల ప్రారంభంట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్ జెండర్ల పై పైలట్ ప్రాజెక్టుడిసెంబర్ 3:హైదరాబాద్ రైజింగ్ కార్యక్రమాలుఆరాంఘర్ నుంచి జూ పార్క్ ఫ్లైఓవర్ ప్రారంభం.రూ. 150 కోట్లు విలువైన బ్యూటిఫికేషన్ పనుల ప్రారంభండిసెంబర్ 4:తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవన శంకుస్థాపనవర్చువల్ సఫారి మరియు వృక్ష పరిచయం కేంద్రం ప్రారంభం9,007 మందికి నియామక పత్రాల పంపిణీ.డిసెంబర్ 5:ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభంస్వయంసహాయక గ్రూపుల్లో చర్చలు3 (మేడ్చల్, మల్లేపల్లి, నల్గొండ లో) అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ప్రారంభంఘట్ కేసర్లో బాలికల ITI కాలేజీ ప్రారంభండిసెంబర్ 6:యాదాద్రి పవర్ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి ప్రారంభం244 విద్యుత్ ఉపకేంద్రాల శంకుస్థాపన.డిసెంబర్ 7:స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రారంభంపోలీస్ బ్యాండ్ ప్రదర్శనతెలంగాణ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు.డిసెంబర్ 8:7 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రాజెక్టుల ప్రారంభం130 కొత్త మీ సేవల ప్రారంభంయంగ్ ఇండియా యూనివర్శిటీకి శంకుస్థాపనతెలంగాణ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక వేడుకలుడిసెంబర్ 9:లక్షలాది మంది మహిళా శక్తి సభ్యుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ.ట్యాంక్ బండ్ మీద ముగింపు వేడుకలుడ్రోన్ షో, ఫైర్ వర్క్, ఆర్ట్ గ్యాలరీ, వివిధ స్టాళ్ల ఏర్పాటు -
కేటీఆర్, హరీష్ రావులది నా స్థాయి కాదు: కోమటిరెడ్డి
సాక్షి, నల్గొండ జిల్లా: కేటీఆర్, హరీష్ రావులది తన స్థాయి కాదని.. వాళ్లు కేవలం కేసీఆర్ కుమారుడు, అల్లుడు మాత్రమేనంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి.. అనంతరం మీడియాతో మాట్లాడారు.‘‘బంగారు తెలంగాణ అంటూ అప్పులు చేసి కేసీఆర్ ఫాంహౌస్‌లో పడుకున్నాడు. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలు అవుతున్నాయా?. ఇప్పటికే 18 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం. మిగతా రుణమాఫీ ఈ నెల 30న చేస్తాం’’ అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.మోదీ సొంత రాష్ట్రంలో పదమూడు వందలకు గ్యాస్ సిలిండర్ విక్రయిస్తున్నారు. తెలంగాణలో రూ.500కే సిలిండర్ ఇస్తున్నాం. రూ.500కే గ్యాస్ ఎందుకు ఇవ్వడం లేదో ప్రధాన మోదీ, బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి’’ అని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో కేసీఆర్ అప్పులపాలు చేసి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తారిలా మార్చారు. ఒక ఇళ్లు కట్టకుండా కేసీఆర్ ఏడు లక్షల కోట్ల అప్పులు చేశాడుకేసీఆర్ ఫామ్ హౌస్‌లో పడుకుంటే మోదీ విదేశాల్లో తిరుగుతున్నారు. డిసెంబరు మొదటి వారంలో సీఎం రేవంత్ నల్లగొండ జిల్లాలో పర్యటిస్తారు’’ అని కోమటిరెడ్డి తెలిపారు. -
కేటీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందే: ఐఏఎస్‌ల సంఘం
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యల పట్ల ఐఏఎస్ అధికారుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. సిరిసిల్ల కలెక్టర్‌పై కేటీఆర్ ఆరోపణలు సరికాదంటూ ఖండించింది.సివిల్ సర్వీసెస్ అధికారిపై కేటీఆర్ ఆరోపణలు నిరాధారం. ఇలాంటి ఆరోపణలతో వ్యవస్థలపై చెడు ప్రభావం పడుతుంది. కలెక్టర్ విధులను వక్రీకరించొద్దని ఐఏఎస్ అధికారుల సంఘం తెలిపింది.సివిల్ సర్వీసు అధికారుల గౌరవం, స్వతంత్రత, నిష్పక్షపాతత్వాన్ని కాపాడటానికి అండగా నిలబడతామని సంఘం స్పష్టం చేసింది. నిరాధారమైన ఆరోపణలు చేసిన కేటీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని తెలంగాణ ఐపీఎస్‌ల సంఘం డిమాండ్ చేసింది. -
ఇథనాల్ మంటలు: కాంగ్రెస్ నేతలకు తలసాని సవాల్
సాక్షి, హైదరాబాద్: దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇథనాల్ కంపెనీతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అలాగే, దీనిపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని మీడియాతో మాట్లాడుతూ..‘ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంలో నా కుమారుడికి సంబందం ఉందని పీసీసీ అధ్యక్షుడు, మంత్రి సీతక్క ఆరోపణలు చేశారు. ఇథనాల్ కంపెనీతో మా కుటుంబానికి సంబంధం లేదు. ఇథనాల్ కంపెనీ వద్దు అని అక్కడి గ్రామస్తులు ధర్నాలు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. రాజమండ్రి దగ్గర ఒక డిస్టిలరీస్ కంపెనీలో 8 మంది డైరెక్టర్లలో ఒకరిగా నా కుమారుడు ఉన్నారు. 2016లోనే డిస్టిలరీస్ కంపెనీ డైరెక్టర్ గా నా కుమారుడు రాజీనామా చేశాడు.ఆ పేపర్లను పట్టుకుని మాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. నా కుటుంబానికి చెందిన కంపెనీ అని నిరూపిస్తే మీకే కంపెనీని రాసిస్తాను. బీఆర్ఎస్ పార్టీపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. దిలావర్పూర్ గ్రామ ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాజకీయాల్లో విమర్శలు.. ప్రతి విమర్శలు సహజం. ఇథనాల్ కంపెనీకి గత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇథనాల్ కంపెనీ పర్మిషన్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. లగచర్లలో కేటీఆర్ కుట్ర చేశారని ప్రభుత్వం ఆరోపణలు చేసింది. రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు అంటూ కామెంట్స్ చేశారు. -
ఫుడ్ పాయిజన్ అంశం.. సీతక్క సంచలన ఆరోపణలు
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీపై మంత్రి సీతక్క సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉందన్నారు. కుట్రదారుల వెనుక అధికారులు ఉంటే వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కామెంట్స్ చేశారు.మంత్రి సీతక్క తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉంది. రాజకీయ పార్టీ కుట్ర ఉందని మేము అనుమానిస్తున్నాం. కుట్ర వెనుక ఎవరు ఉన్నారనేది బయటపెడతాం. అన్ని అలజడుల వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉంది. కుట్రదారుల వెనుక అధికారులు ఉంటే వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగిస్తామన్నారు. అన్ని ఘటనలపై పూర్తి వివరాలతో బయట పెడతాం అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో దిలావర్పూర్ లో ఇథనాల్ పరిశ్రమ విషయంలో తలసానిపై కూడా ఘాటు విమర్శలు చేశారు. దీంతో, మంత్రి వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. దిలావార్పూర్ ఇథనాల్ కంపెనీకి అన్ని అనుమతులు బీఆర్ఎస్ హాయాంలోనే ఇచ్చారు. గత ప్రభుత్వం చేసిన తప్పును బీఆర్ఎస్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. పర్మిషన్ కాపీలో కేసీఆర్, కేటీఆర్ సంతకాలు ఉన్నాయి. ఇథనాల్ కంపెనీలో డైరెక్టర్లుగా మాజీ మంత్రి తలసాని కొడుకు తలసాని సాయి ఉన్నాడు. దీని గురించి కేటీఆర్ ఎందుకు మాట్లాడడం లేదు. దమ్ముంటే కేటీఆర్ దిలావార్పూర్ రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసినట్లుగా కేటీఆర్ విష ప్రచారం చేస్తున్నారు.విధ్వంసం సృష్టించడం.. ఆ తర్వాత శాంతిభద్రతలకు విఘాతం అని కేటీఆర్ టీం ప్రచారం చేస్తున్నారు. తలసాని శ్రీనివాస్ వియ్యంకుడు పుట్టా సుధాకర్ ఇథనాల్ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నాడు. కేటీఆర్ నువ్వు దిలావార్పూర్ రావాలి.. నేను కూడా వస్తా.. తప్పెవరిదో తేల్చుదాం. అసైన్డ్ భూములను రియల్ ఎస్టేట్ చేసిన చరిత్ర కేటీఆర్ దే. కేటీఆర్ నీకు నిజంగా నీతి చర్చకు రావాలి. వచ్చే అసెంబ్లీలో ఇథనాల్ కంపెనీపై చర్చ పెడతాం. కేటీఆర్ మీ ప్రభుత్వంలో గురుకాలలో ఎంత మంది చనిపోయారో లెక్క చెప్పమంటావా?. మంత్రులు, అధికారులు అంతా గురుకులాలలో మంచి సౌకర్యాల కోసం ప్రయత్నం చేస్తున్నాం. లగచర్లలో గ్రామ సభ జరుగుతుంది.. ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం ఉంటుంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
నాటి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసేందుకే దీక్షాదివస్: గంగుల
సాక్షి, కరీంనగర్: రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి గుర్తు చేసేందుకే దీక్షాదివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. రేపటి దీక్షాదివస్ లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు వివరిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పటికే తిరుగుబాటు మొదలైందని గంగుల కామెంట్స్ చేశారు.రేపటి దీక్షాదివస్ కోసం కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం అల్గునూరులో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. కార్యక్రమ ఏర్పాట్లను మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా గంగుల మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి గుర్తు చేసేందుకే దీక్షాదివస్ ని నిర్వహిస్తున్నాం. బీఅర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామన్న కాంగ్రెస్ నేతలకు కనువిప్పు కలగాలి.తెలంగాణ అంటేనే సెంటిమెంట్.. ఆ సెంటిమెంట్ ను ఎందుకు మర్చిపోతాం?. రేపటి దీక్షాదివస్ లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు వివరిస్తాం. ఇప్పటికే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. తెలంగాణ తరహా మలిదశ ఉద్యమానికి మరోసారి శ్రీకారం చుట్టబోతున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు. -
మీరే నాకు స్ఫూర్తి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కొనసాగుతున్న ప్రజల నిరసనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన పలువురు మహిళల పోరాటానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసి వారే తనకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. సమ్మక్కలు, సారక్కలు.. మొక్కవోని ధైర్యంతో ముందుకురుతున్న ఐలమ్మలు.. అలుపెరగక పోరాటం చేస్తున్న రుద్రమ్మలు.. మీరంతా నాకు స్ఫూర్తి అంటూ ఫొటో షేర్ చేశారు.సమ్మక్కలు, సారక్కలు….మొక్కవోని ధైర్యంతో ముందుకురుకుతున్న ఐలమ్మలు….అలుపెరగ పోరాటం చేస్తున్న రుద్రమ్మలు! మీరంతా నా స్పూర్తి! I salute your spirit and I will be your brother in this fight for a better Telangana! జై తెలంగాణ ✊🏼 pic.twitter.com/6wiFIHlT2u— KTR (@KTRBRS) November 28, 2024అంతకుముందు లగచర్ల, దిలావర్పూర్ రైతులకు సంబంధించిన పోరాటంపై కూడా కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. దిలావర్ పూర్ లో రైతుల దెబ్బకు దిగివచ్చిన రేవంత్ రెడ్డి లగచర్లలో కూడా లెంపలేసుకోవాలి.. వెంటనే లగచర్లలో.. అల్లుడి కోసం.. ఆదానీ కోసం.. ఇండస్ట్రియల్ కారిడార్ ముసుగులో పెడుతున్న ఫార్మా, సిమెంట్ ఫ్యాక్టరీల ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలి..అమాయకులైన గిరిజనుల భూములను దొంగచాటుగా బలవంతంగా లాక్కునే కుట్రలకు ఇప్పటికైనా తెరదించాలి.. అక్కడ శాంతిని నెలకొల్పాలి.ఢిల్లీలో రైతుల సంఘటన శక్తిలో ఉన్న బలం ముందు దేశ ప్రధాని కూడా చివరికి వెనక్కి తగ్గిన చరిత్ర మన కళ్ళ ముందు ఉంది..అనాలోచిత నిర్ణయాలతో మొన్న లగచర్లలో లడాయికి కారణమైన రేవంత్ రెడ్డి.. తన మొండి వైఖరి వల్లే నిన్న నిర్మల్ లో ఇథనాల్ మంటలను రాజేశారు.తలకు మాసిన ఆలోచనలతో రేపు రేవంత్ ఏ జిల్లాలోని.. ఏ పచ్చని పంట పొలాల్లో ఎలాంటి బాంబు పేలుస్తారోననే భయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరిలో వ్యక్తం అవుతుంది.ప్రజల అభీష్టం మేరకు నడుచుకోవడం.. వారి మనోభావాలను గౌరవించడం అనేది పాలకుడి ప్రాథమిక విధి. ఈ విషయాన్ని గుర్తెరిగి వెంటనే నిర్మల్ తరహాలోనే.. సొంత నియోజకవర్గంలో లగచర్ల సమరానికి ఫుల్ స్టాప్ పెట్టాలి.. తప్పు ఒప్పుకుని వెనక్కి తగ్గినంత మాత్రాన సీఎం రేవంత్ రెడ్డి కిరీటం ఏమీ పడిపోదు.. లేకపోతే జరిగే పరిణామాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది..జై తెలంగాణ అంటూ కామెంట్స్ చేశారు. దిలావర్ పూర్ లో రైతుల దెబ్బకు దిగివచ్చిన రేవంత్ రెడ్డి లగచర్లలో కూడా లెంపలేసుకోవాలి..వెంటనే లగచర్లలో.. అల్లుడి కోసం.. ఆదానీ కోసం.. ఇండస్ట్రియల్ కారిడార్ ముసుగులో పెడుతున్న ఫార్మా, సిమెంట్ ఫ్యాక్టరీల ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలి..అమాయకులైన గిరిజనుల భూములను దొంగచాటుగా… https://t.co/b8TOcIT0PV— KTR (@KTRBRS) November 27, 2024 -
తెలంగాణ ప్రజలు బీజేపీ పాలన కోరుకుంటున్నారు : ప్రధాని మోదీ
ఢిల్లీ : బీఆర్ఎస్ దుష్టపాలన భయంకరమైన జ్ఞాపకాలు, ఇప్పటికే కాంగ్రెస్ పాలనతో విసిగిన ప్రజలు బీజేపీ పాలన కోరుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు.ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ప్రధాని మోదీ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు ఇతర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హజరయ్యారు. అనంతరం ఈ భేటీపై ఎక్స్ వేదికగా మోదీ స్పందించారు. ‘‘తెలంగాణ బీజేపీ శాసనసభ్యులతో, ఎంపీలతో చాలా మంచి సమావేశం జరిగింది. రాష్ట్రంలో మా పార్టీ ఉనికి వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌తో విసిగిపోయారు అంతేకాక బీఆర్ఎస్ దుష్టపాలన వల్ల కలిగిన భయంకరమైన జ్ఞాపకాలతో ఉన్నారు. ఎంతో ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భాజపా తన స్వరాన్ని గట్టిగా వినిపిస్తూనే ఉంటుంది. మా కార్యకర్తలు మా అభివృద్ధి ఎజెండాను వివరిస్తూనే ఉంటారు’’ అని ట్వీట్లో పేర్కొన్నారు.అంతకు ముందు భేటీలో తెలంగాణ బీజేపీ నేతలకు మోదీ దిశానిర్ధేశం చేశారు. ఈ భేటీలో విభేదాలు పక్కన పెట్టి, తెలంగాణలో బీజేపీ గెలుపే లక్ష్యంగా కలిసి పనిచేయాలని నేతలకి ప్రధాని మోదీ హితవు పలికారు.తెలంగాణ బీజేపీ శాసనసభ్యులతో, ఎంపీలతో చాలా మంచి సమావేశం జరిగింది.రాష్ట్రంలో మా పార్టీ ఉనికి వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌తో విసిగిపోయారు అంతేకాక బీఆర్ఎస్ దుష్టపాలన వల్ల కలిగిన భయంకరమైన జ్ఞాపకాలతో ఉన్నారు. ఎంతో ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు.… pic.twitter.com/hkutfaIeF8— Narendra Modi (@narendramodi) November 27, 2024 -
నిరూపించే దమ్ముందా.. కేటీఆర్, బీజేపీకి మంత్రి సీతక్క సవాల్
హైదరాబాద్: అబద్దాల పునాదులతో అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందన్నారు మంత్రి సీతక్క. ప్రజలను రెచ్చగొట్టడం బీఆర్ఎస్ పార్టీకి అలవాటైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో నిర్మల్ జిల్లా ప్రజలకు కేటీఆర్ ఓమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంపై మంత్రి సీతక్క స్పందించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. దిలావార్పూర్, గుండంపల్లి మధ్యలో ఇథనాల్ ఫ్యాక్టరీపై కుట్ర జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హాయాంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి అన్ని రకాల అనుమతులు వచ్చాయి. మా ప్రభుత్వం వచ్చాక మేము ఎటువంటి పక్రియ చేపట్టలేదు.. అయినా మా ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారు. దొంగ నాటకాలు, రెచ్చగొట్టడం బీఆర్ఎస్ పార్టీకి అలవాటు అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫ్యాక్టరీలు వస్తే గొప్పగా చెప్పుకున్నారు కదా. ఇథనాల్ ఫ్యాక్టరీకి బీఆర్ఎస్, బీజేపీలు అనుమతులు ఇచ్చింది వాస్తవం కాదా?. ఇథనాల్ ఫ్యాక్టరీలో డైరెక్టర్లుగా బీఆర్ఎస్ నేతలైన తలసాని సాయికుమార్, మరో వ్యక్తి ఉన్నారు. ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడేందుకు వెళ్లిన ఆర్డీవోపై బీఆర్ఎస్, బీజేపీకి చెందిన వ్యక్తులు దాడులు చేశారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం విషం వెదజల్లుతున్నారు. తలసాని సాయి కుమార్ ఎవరో బీఆర్ఎస్ చెప్పాలి. ఇథనాల్ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చిన వారిలో బీజేపీ నేత ఉన్నారు.ఉచిత బస్సు సౌకర్యం ఇస్తే బీఆర్ఎస్ విమర్శలు, ఉద్యోగాలు ఇస్తామంటే బీఆర్ఎస్ ఆందోళనలు.. ఇంత దారుణమా?. సిరిసిల్ల కలెక్టర్ పై కేటీఆర్ దొర చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణం. మల్లన్న సాగర్, కొండపోచమ్మ భూ నిర్వాసితులకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన న్యాయం ఏంటి?. కిరాయి మనుషులతో సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు, కేసులు పెడితే తప్పా?.ఇథనాల్ ఫ్యాక్టరీలో తలసాని పాత్రపై కేటీఆర్ సమాధానం చెప్పాలి. నిర్మల్ ప్రజలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి. అప్పుడు అన్ని అనుమతులు ఇచ్చి ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్న కేటీఆర్ ముక్కు నేలకు రాయాలి. మా ప్రభుత్వం ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు ఆపించింది. ఫౌంహౌస్ నుంచి పాలన చేసిన మీరు మా గురించి మాట్లాడే అర్హత లేదు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే ఇథనాల్ ఫ్యాక్టరీకి మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్పగలరా? అంటూ సవాల్ విసిరారు. -
Adani Row: ‘అమెరికా మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు’
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనలో ఏం చేశారో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే, అదానీ అంశంపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని నేడు తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిశారు. అనంతరం, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర నేతలతో ప్రధాని మోదీ చర్చించారు. తెలంగాణలో అభివృద్ధి పనులపై ఆరా తీశారు. అభివృద్ది విషయంలో సానుకూల ధోరణితో పని చేయాలన్నారని చెప్పుకొచ్చారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాదిలో ఏం చేశారో రేవంత్ రెడ్డి చెప్పాలి. వంద రోజులలో ఆరు గ్యారెంటీల అమలులో విఫలమయ్యారు. నాది బీజేపీ డీఎన్ఏ.. మీలాగా పది పార్టీలు మారిన డీఎన్ఏ కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలపై డిసెంబర్ 1 నుంచి 5 వరకు ప్రచారం చేస్తాం. ఇప్పటికైనా సీఎం రేవంత్, విపక్షాలను తిట్టే బదులు పాలనపై దృష్టి పెట్టాలి.విషాహారం తిని విద్యార్థులు చనిపోవడానికి గల కారణాలపై దృష్టి సారించాలి. ఎమ్మెల్యేల ఫిరాయింపులను నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు దొందూ దొందే అన్న చందంగా వ్యవహరిస్తున్నాయి అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇదే సమయంలో అదానీ అంశంపై కూడా కిషన్ రెడ్డి స్పందించారు. అదానీ అంశంలో అమెరికా మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అక్కడ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. అదానీపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. కొన్ని శక్తులు కుట్ర పూరితంగా ఈ ఆరోపణలు చేస్తున్నాయి. మా దేశంపై ఎలా ఆరోపణలు చేస్తారు. పార్లమెంటు సమావేశాలకు ముందుగానే ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
కేటీఆర్.. ఇంకా భ్రమలోనే ఉన్నావా?: భట్టి సెటైర్లు
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా కేటీఆర్ టార్గెట్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘాటు విమర్శలు చేశారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉందనే భ్రమలో కేటీఆర్ ఉన్నారని ఎద్దేవా చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీని ఏదో చేస్తానని మాట్లాడుతున్నాడని అన్నారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కలెక్టర్లు, ఎమ్మెల్యేలను పాఠశాలలు తనిఖీ చేయాలని ఆదేశించాం. ఫుడ్ పాయిజన్ ఘటనలు బాధాకరమే. ఐఏఎస్ అధికారులపై కేటీఆర్ తీరు సరైంది కాదు. జిల్లా కలెక్టర్ ను అసభ్య పదజాలంతో తిట్టడం ఏంటి?. కేటీఆర్ ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలి. తామే అధికారంలో ఉన్నామనే భ్రమలో కేటీఆర్ ఉన్నారు. భ్రమల్లో నుంచి కేటీఆర్ బయటకు రావాలి.రాజకీయ కుట్రలను జార్ఖండ్ ప్రజలు ఎదురించారు. అన్ని కుట్రలపై జార్ఖండ్ ప్రజలు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఏమీ చేయలేరు. కాంగ్రెస్ పార్టీని ఏదో చేస్తానని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. పార్టీలో సమిష్టి నిర్ణయాలతో ప్రభుత్వం నడుస్తోంది. కాంగ్రెస్ ఆలోచనా విధానంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు.. పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి డైలీ సీరియల్ అనేది అలవాటు. డ్రగ్స్ కేసు , మియాపూర్ భూముల కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుల లాంటివి బీఆర్ఎస్ ప్రభుత్వంలో నెలల తరబడి నడిపారు అంటూ కామెంట్స్ చేశారు. -
అదానీ వ్యవహారంలో తెలంగాణలో పోటాపోటీ రాజకీయం!
అదానీ స్కామ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రాజకీయ ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ఒకపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్.. ఇంకోపక్క బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు వ్యూహాలు రచిస్తున్నారు. స్కిల్ యూనివర్శిటీకి అదానీ ప్రకటించిన రూ.వంద కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు రేవంత్ ప్రకటించి తొలి అస్త్రం సంధించగా అదే అదానీతో రేవంత్ కుమ్మక్కు అయ్యారని కేటీఆర్, హరీశ్‌లు ఆరోపణలకు దిగారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై ఉలుకు, పలుకూ లేకుండా ఉండటం. బహుశా మింగలేక, కక్కలేక అన్నట్టుగా ఉన్నట్టుంది బాబు గారి పరిస్థితి!సౌర విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించి అదానీపై అమెరికా కోర్టులో కేసు నమోదైన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున విమర్శలకు దిగిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీపై కూడా కాంగ్రెస్ తనదైన శైలిలో విరుచుకుపడింది. అయితే ఈ అంశం తెలంగాణలో రేవంత్‌కు కొంత ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అదానీని విమర్శిస్తూంటే.. రేవంత్ మాత్రం కుమ్మక్కు అయ్యారని కేటీఆర్, రేవంత్‌లు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అదానీతో సంబంధాలు, పెట్టుబడులపై మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చేందుకు రాహుల్ కొంత తడబడాల్సి వచ్చింది.ఆ తర్వాత ఏమైందో కాని తెలంగాణ సీఎం స్కిల్ యూనివర్శిటీకి అదానీ ఇచ్చిన వంద కోట్లను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేయడంతోనే రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా దావోస్‌లో అదానీతో కుదుర్చుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాల మాటేమిటని, రేవంత్ స్వస్థలం కొడంగల్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ సంగతేమిటి? అని కూడా కేటీఆర్, హరీశ్‌కు ప్రశ్నిస్తున్నారు. అదానీకి తాము గతంలో రెడ్‌లైట్ చూపామని, రేవంత్ మాత్రం రెడ్ కార్పెట్ పరిచారని ఎద్దేవా చేస్తున్నారు.కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై రేవంత్ ప్రభుత్వం కమిషన్లు వేయడం, ఈ-ఫార్ములా రేస్ నిర్వహణకు సంబంధించి రూ.55 కోట్ల దుర్వినియోగం ఆరోపణతోపాటు కొన్ని ఇతర అంశాల విషయంలోనూ కేటీఆర్‌పై కేసులు పెట్టే ప్రయత్నం చేయడం ద్వారా రేవంత్ బీఆర్ఎస్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో ఎన్నికల హామీల అమలు వైఫల్యంతోపాటు హైడ్రా వ్యవహారాలు, మూసీ నదీగర్భంలో ఇళ్ల కూల్చివేత, లగచర్ల భూసేకరణ వివాదం వంటి అంశాలతో బీఆర్ఎస్ జనాల్లోకి వెళుతోంది. వీటన్నింటి మధ్యలో వచ్చిన అదానీ కేసును కూడా అందిపుచ్చుకునేందుకు ఇరు పక్షాలూ ప్రయత్నిస్తున్నాయి. నిజానికి అదాని విరాళానికి, ఆయనపై వచ్చిన కేసుకు సంబంధం ఉండకూడదు. కానీ.. రాజకీయాలలో పరిస్థితి అలా ఉండదు. అదానీ ప్రధాని మోడీకి సన్నిహితుడని, అతడిని రక్షిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నేతలు ఆరోపిస్తున్న విషయం కొన్ని రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలకు, నేతలకూ ఇబ్బందిగా మారింది. ఉదాహరణకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్‌తో చత్తీస్ లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఒప్పందం చేసుకుంది. దీన్ని రాహుల్ ఎలా సమర్థించుకుంటారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తమిళనాడులోని డీఎంకే ఆధ్వర్యంలోని కూటమిలో కాంగ్రెస్ భాగస్వామి. జమ్ము-కశ్మీర్లో రాష్ట్రపతి పాలన ఉండగా ఒప్పందం కుదిరింది. అంటే బీజేపీ ఆధ్వర్యంలోని రాష్ట్రంలలో ఒప్పందం కుదురిందన్నమాట. ఇందులో అవినీతి జరిగి ఉంటే ఆ మకిలీ కాంగ్రెస్, బీజేపీలు రెండింటికీ అంటుకుంటున్నట్లు అవుతుంది కదా! బీజేపీ ఇదే వాదన చేసి కాంగ్రెస్ పై ద్వజమెత్తింది. ఈ క్రమంలో తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఇరుకునపడినట్లయింది.ఇదీ చదవండి: కొత్త దుష్ట సంస్కృతికి తెరలేపిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి!విద్యుత్ సరఫరా ఒప్పందం తెలంగాణతో జరగక పోయినా ఆ ప్రభావం పెట్టుబడులపై పడుతోంది. రాజకీయంగా బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య సాగుతున్న వార్ నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. దీనిపై రేవంత్ వివరణ ఇస్తూ తానేదో అప్పనంగా వంద కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు రావడం తనకు ఇష్టం లేదని, స్కిల్ యూనివర్శిటీ వివాదాలలో చిక్కుకోరాదన్న భావనతో అదానీ విరాళాన్ని తిరస్కరించినట్లు చెప్పారు. అయితే తొలుత రేవంత్ ప్రభుత్వం సంతోషంగానే ఈ మొత్తాన్ని స్వీకరించడానికి సిద్దపడింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యూనివర్శిటీకి ఉపయోగపడుతుందని భావించింది. కానీ రాజకీయ విమర్శల కారణంగా వెనక్కి తగ్గుతున్నారు.గతంలో అదానితో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవడం కష్టమన్న భావను రేవంత్ వ్యక్తపరిచారు. వారు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుందని అన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా అదానీతో డేటా సెంటర్ తదితర అగ్రిమెంట్లు చేసుకుందని రేవంత్ వ్యాఖ్యానించారు. పెట్టుబడులపై బీఆర్ఎస్ విధానం ఏమిటని ప్రశ్నించారు. నిజమే! ఏ పారిశ్రామిక వేత్త అయినా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే దానిని స్వీకరించకుండా ఉండడం కష్టమే. ఎందుకంటే రేవంత్ అన్నట్లు పరిశ్రమలు రాకపోతే తేలేదని అంటారు. తీరా ఏవైనా పరిశ్రమలు వస్తే ఆరోపణలు చేస్తుంటారని ఆయన అన్నారు.అనుభవమైంది కనుక రేవంత్ ఈ మాటలు చెబుతున్నారు. అదే తెలంగాణలో కాంగ్రెస్ విపక్షంలో ఉంటే ఆయన కూడా ఇదే తరహా రచ్చ చేసేవారు. అంతెందుకు...గతంలో వైఎస్ జగన్ పై పెట్టిన ఆక్రమ కేసులలో అనేక పరిశ్రమలకు తెలుగుదేశంతో కలిసి కాంగ్రెస్ అడ్డుపడిందన్న ఆరోపణలు ఉన్నాయి. దానివల్ల ఉమ్మడి ఏపీకి చాలా నష్టం జరిగింది. అమెరికాలో అదానీ కేసు తేలకముందే ఇక్కడ రాజకీయ దుమారాన్ని సృష్టించుకుని పెట్టుబడులపై ప్రభావం పడేలా చేస్తారా అన్న చర్చ వస్తుంది.మరో వైపు చంద్రబాబు నాయుడు ఏపీలో జగన్ టైమ్ లో ఏదో ఘోరం జరిగిపోయినట్లు ప్రచారం చేస్తూ, అదే టైమ్‌లో అదానితో మాత్రం స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. జగన్ లేనిపోని ఆరోపణలు చేసే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో కుదిరిన ఒప్పందం గురించి మాట్లాడదు. ఈ ఒప్పందం వల్ల రూ.లక్ష కోట్ల నష్టం వస్తుందని ఎల్లో మీడియా పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తోంది. ఈనాడు రాసింది నిజమే అయితే చంద్రబాబు వెంటనే సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలి కదా! అదానితో జగన్ ప్రభుత్వం అసలు ఒప్పందమే చేసుకోకపోయినా, ఎల్లో మీడియా తప్పుడు కథనాలు వండి వార్చుతోంది. అదానీ పై తన వైఖరి ఏమిటో చంద్రబాబు చెప్పరు.జగన్ టైమ్ లో సుమారు రూ.2.5 లక్షల కోట్ల విలువైన సౌర, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను చేపట్టడానికి అదాని ముందుకు వచ్చారు. వాటిని కాదనే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అదానిని ఏమైనా అంటే అది మోడీకే తగులుతుందన్న భయంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నట్లు తెలియడం లేదా? పోనీ జగన్ టైమ్ లో కుదిరిన అగ్రిమెంట్లను వదలివేసి కొత్తగా అదానితో ఎలాంటి ఒప్పందాలు ఉండబోవని చంద్రబాబు ప్రభుత్వం చెప్పగలుగుతుందా? అలాంటిది ఏమీ లేదు. పైగా అదానికి స్వయంగా ఎదురేగి స్వాగతం పలికి అనేక రంగాలతో పాటు అమరావతిలో కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆ గ్రూపు ముందుకు వచ్చిందని చంద్రబాబు ఆనందంగా ప్రకటించారు. అంటే అదానితో స్నేహం ఉండాలి. కాని జగన్ ను మాత్రం అప్రతిష్టపాలు చేయాలన్నమాట. చంద్రబాబు వ్యూహంలోని డొల్లతనం ఇక్కడే బహిర్గతం అయిపోతోంది. అదానీ, అంబాని వంటి పెద్ద పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి పెట్టుబడి తెస్తూంటే ఎవరూ వద్దనలేని పరిస్థితి ఉంది. కాకపోతే పారిశ్రామికవేత్తలపై వచ్చే ఆరోపణలను తమ రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికి మాత్రం వాడుకుంటున్నారు.ఇక్కడ ఒక సంగతి గమనంలోకి తీసుకోవాలి. అంబానీ, అదాని తదితర బడా పారిశ్రామికవేత్తలను కాదని కాంగ్రెస్, బీజేపీలు ఏమీ చేయడానికి సిద్దపడవన్నది వాస్తవం. గతంలో కేంద్రంలో కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉన్నప్పుడు అంబానీకి వ్యతిరేకంగా అప్పటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం నేపథ్యంలో ఆయన శాఖే మారిపోయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు.ఈనాడు మీడియా ఇన్ని నీతులు వల్లిస్తుంటుంది కదా.. అంబానీకి వ్యతిరేకంగా ఒక్క వార్త ఇవ్వగలుగుతుందా? మార్గదర్శి అక్రమ డిపాజిట్ల కేసులో రామోజీకి అంబానీ సాయపడ్డారని చెబుతారు. ఇప్పుడు కూడా అంబానీ, అదానీలు బీజేపీకి సన్నిహితులే.కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అదానీపై విమర్శలు చేస్తున్నా, అధికారంలోకి వస్తే వారూ ఏమీ చేయరన్నది బహిరంగ రహస్యమే. అంబానీ, అదానీలను కాదంటే దాని ప్రభావం దేశ ఆర్ధిక వ్యవస్థపై పడే అవకాశం ఉంది. రాజకీయ దుమారం వేరు. వాస్తవ పరిస్థితి వేరు. ఇలాంటి పారిశ్రామికవేత్తలు రాజకీయాలను పరోక్షంగా శాసిస్తున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. దీనికి రేవంత్ అయినా, చంద్రబాబు అయినా, మరెవరైనా అతీతం కాదన్నది నిజం.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కాసేపట్లో ప్రధానితో టీబీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల భేటీ
సాక్షి, హైదరాబాద్: బుధవారం ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా తమ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, కేంద్రం నుంచి ఆయా రంగాలకు సంబంధించి ప్రత్యేక సహాయం తదితర అంశాల గురించి ప్రధానితో చర్చించే అవకాశాలున్నట్టు సమాచారం.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు అనుసరించాల్సిన బ్లూప్రింట్ గురించి భేటీలో ప్రస్తావనకు రావొచ్చని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడంపై బీజేపీ ప్రజాప్రతినిధులకు ప్రధాని దిశా నిర్దేశం చేసే అవకాశాలున్నాయంటున్నారు.ఢిల్లీలో టీబీజేపీ నేతలు ‘సాక్షి’ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీ బలోపేతంపై చర్చించబోతున్నామన్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కాంగ్రెస్ సర్కార్ నిధులివ్వడం లేదు. రేవంత్ ప్రభుత్వం పక్షపాతాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది’’ అని వారు తెలిపారు. -
ఎవరనుకున్నారు.. ‘మార్పు’ ఇంత మోసగిస్తుందని..: కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: రేవంత్ సర్కార్ పాలనా వైఫల్యాలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా మరోసారి ఎత్తి చూపారు. తెలంగాణాలో పింఛన్ల కోసం వృద్దులు రోడ్డెక్కుతారని ఎవరనుకున్నారు?. ఠంచన్‌గా అకౌంట్లో పడే పైసలు ఆగిపోతాయని ఎవరునుకున్నారు?’’ అంటూ ప్రశ్నస్త్రాలు సంధించారు.‘‘మూసీ బ్యూటిఫికేషన్ కోసం లాక్షా యాభై వేల కోట్లు వెదజల్లి... కనికరం లేకుండా వృద్దుల పెన్షన్ డబ్బులను ఆపుతారని ఎవరనుకున్నారు?. మందుబిళ్లల కోసం కొడుకులు , కోడళ్ల దగ్గర చేయిచాచే అవసరమే లేని రోజుల నుంచి మళ్లీ వేడుకునే 'మార్పు' వస్తుందని ఎవరనుకున్నారు?’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.‘‘అణువణువునా కర్కశత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యంలో.. ఇంటింటా ఇక్కట్లే ఉంటాయని ఎవరనుకున్నారు?. మార్పు ఇంత మోసగిస్తుందని ఎవరనుకున్నారు?’’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు.ఇట్లా అవునని ఎవరనుకున్నారు?తెలంగాణాలో ఫించన్ల కోసం వృద్దులు రోడ్డెక్కుతారని ఎవరనుకున్నారు?టంచన్ గా అకౌంట్లో పడే పైసలు ఆగిపోతాయని ఎవరునుకున్నారు?మూసీ బ్యూటిఫికేషన్ కోసం లాక్షా యాభై వేల కోట్లు వెదజల్లి...కనికరం లేకుండా వృద్దుల పెన్షన్ డబ్బులను ఆపుతారని ఎవరనుకున్నారు?… pic.twitter.com/hDQKbjOSrR— KTR (@KTRBRS) November 27, 2024 -
రాహుల్ తిట్టినందుకే అదానీ విరాళం వెనక్కి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘అదానీ నుంచి రూ.100 కోట్ల విరాళం తీసుకోవడంపై రాహుల్‌గాంధీ ఫోన్ చేసి తిడితే నష్ట నివారణ కోసం సీఎం రేవంత్‌రెడ్డి వెనక్కి తగ్గాడు. అదానీ విరాళంగా రూ.100 కోట్ల చెక్‌ను ఇచ్చి 38 రోజులు పూర్తయినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు నగదుగా ఎందుకు మార్చుకోలేదు? చెక్ చూపించి వెనుక నుంచి డబ్బులు దోచుకునే కుట్ర జరుగుతోందా?..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రశ్నించారు. ‘అదానీ ఫ్రాడ్ అని రేవంత్‌కు ఇప్పుడే తెలిసిందా? అదానీని రాహుల్‌గాంధీ ఫ్రాడ్ అంటుంటే రేవంత్ మాత్రం ఫ్రెండ్ అంటూ రూ.12,400 కోట్ల ఒప్పందాలు చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులను బీఆర్ఎస్కు అంటగడుతూ అసత్య ప్రచారం చేస్తున్న సీఎం తన పేరును అబద్ధాల రేవంత్‌రెడ్డిగా మార్చుకోవాలి..’ అని కేటీఆర్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు తలసాని, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, మాగంటి గోపీనాథ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ అసలైన శాడిస్ట్..: ‘అదానీ విషయంలో రాహుల్‌గాందీకి, రేవంత్‌కు నడుమ ఏకాభిప్రాయం కనిపించడం లేదు. రాహుల్‌తో తిట్లు తిన్న అసహనంతో నన్ను రేవంత్ ఇష్టమొచ్చినట్లు తిడుతున్నాడు. చిట్టి నాయుడికి చిప్ దొబ్బినట్లు కనిపిస్తోంది. అదానీ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. రాష్ట్రంలో అదానీకి రెడ్ సిగ్నల్ ఇవ్వడమే కేసీఆర్ చేసిన తప్పా? తెలంగాణ వనరులను దొంగకు దోచిపెట్టడాన్ని ప్రశ్నించిన నేను సైకోనా? తాను తప్పులు చేసి మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్న రేవంత్ అసలైన శాడిస్ట్. రేవంత్ మాదిరిగా కాళ్లు పట్టుకోవడం, లుచ్చా పనులు చేయడం, మస్కా కొట్టడం, గౌతమ్ భాయ్ అంటూ తిరిగే రకం కాదు మేము. నేను దావోస్‌లో అదానీతో కలిసి దిగిన ఫోటోను బహిరంగంగా ట్విట్టర్లో పెట్టా. కానీ రేవంత్ తరహాలో ఆయనను ఇంటికి పిలుచుకుని నాలుగు గంటలు రహస్యంగా కలవలేదు. కోహెనూర్ హోటల్లో కాళ్లు పట్టుకోలేదు. అదానీ కాళ్లు ఒత్తుకుంటూ ఉండే అలవాటు నాకు లేదు..’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీకి అనుమతులపై అబద్ధాలు ‘సీఎం ప్రతి అంశంపైనా అవగాహన లేకుండా ఇష్టారీతిన మాట్లాడుతూ రాష్ట్ర గౌరవం మంటగలుపుతున్నాడు. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్‌ను అదానీతో ముడి పెడుతూ సీఎం ప్రెస్మీట్లు పెడుతున్నాడు. రక్షణ శాఖ, కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఇచ్చిన అనుమతులు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అంటగడుతున్నాడు. డ్రై పోర్టు, విద్యుత్ ట్రాన్స్మిషన్ అనుమతులతో మాకు సంబంధం లేదు..’ అని మాజీమంత్రి స్పష్టం చేశారు. గురుకుల మరణాలన్నీ సర్కారు హత్యలే ‘గురుకుల పాఠశాలల్లో చదివే 48 మంది పిల్లలు చనిపోయినా సీఎం సమీక్ష నిర్వహించడం లేదు. గురుకుల విద్యార్థుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే. కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు రేవంత్‌రెడ్డే కారణం..’ అని కేటీఆర్ ఆరోపించారు. జనతా గ్యారేజ్‌లా తెలంగాణ భవన్ బంజారాహిల్స్ (హైదరాబాద్): కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలపై పగ పెంచుకుని వేధిస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ, హైడ్రా బాధితులు, ఆటోడ్రైవర్లు తదితర నగర ప్రజలు.. ప్రభుత్వం పెడుతున్న బాధలు చెప్పుకునేందుకు తెలంగాణ భవన్‌కు వస్తున్నారని, తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్గా మారిందని చెప్పారు. ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి సంబంధించి హైదరాబాద్ జిల్లా సన్నాహక సమావేశాన్ని మంగళవారం తెలంగాణ భవన్లో నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం కూడా సంతోషంగా లేదని ఆయన విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు. రేవంత్‌రెడ్డి ఎత్తైన కుర్చీలో కూర్చొని గొప్ప మనిíÙని కావాలని భావిస్తున్నాడని, కానీ కేసీఆర్‌లా ప్రజలకు మంచి చేసినప్పుడు మాత్రమే వారి గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకోగలమని గుర్తించడం లేదని అన్నారు. హైదరాబాద్‌ను నాలుగు ముక్కలు చేసే కుట్ర ఓఆర్ఆర్ లోపల ఉన్న హైదరాబాద్‌ను మూడు లేదా నాలుగు ముక్కలు చేయాలని సీఎం కుట్ర చేస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ ఇమేజ్ను డ్యామేజ్ చేసే కుట్రలో బీజేపీకి కూడా భాగం ఉందని అన్నారు. కాంగ్రెస్ తప్పుడు హామీలను నమ్మి మోసపోయామని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ అఖండ మెజార్టీ సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇవ్వని ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావుగౌడ్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. -
కేటీఆర్.. కాంగ్రెస్ ముందు నీ అనుభవమెంత?: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కల్పవృక్షం లాంటిది. కేటీఆర్, హరీష్ రావు కోతల రాయుళ్లు అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అలాగే, కాంగ్రెస్ వ్యూహాల ముందు కేటీఆర్ ఆలోచన, అనుభవం ఎంత? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇవ్వడం వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టి మీ(బీఆర్ఎస్) నెత్తి మీద పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో పెకలిస్తామని అంటారా?. అధికారంలో ఉన్నా.. లేకున్నా కాంగ్రెస్ నేతలందరూ గంభీరంగానే ఉంటారు. కేటీఆర్, హరీష్ రావు కోతలు కోసే కోతల రాయులు. కాంగ్రెస్ పార్టీ కల్పవృక్షం లాంటిది. కాంగ్రెస్ పార్టీ లాంటి మర్రి చెట్టును కేటీఆర్ పీకేస్తా అనడం సాధ్యమా?.కేటీఆర్ వయసు ఎంత? కాంగ్రెస్ వయసు ఎంత?. కాంగ్రెస్ వ్యూహాల ముందు కేటీఆర్ ఆలోచన, అనుభవం ఎంత?. కాంగ్రెస్ పార్టీ వయసులో కేటీఆర్ వయసు పావు వంతు. రాజకీయం కోసం నిందలు వేయడాన్ని కూడా మేం తప్పు పట్టడం లేదు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ లేదా టీడీపీ ప్రభుత్వం ఏర్పడేది. రాష్ట్రం రావడం వల్లే కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. మా పాలనపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు.బీఆర్ఎస్ పార్టీ ఇంకో ఇరవై ఏళ్తు ప్రతిపక్షంగా కొనసాగాలి. కాంగ్రెస్ వ్యూహాలు అంతుచిక్కవు. మా వ్యూహాలు ఎవరికి అర్థం కావు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బ్యూరోక్రాట్స్ సంతోషంగా నిద్రపోయే రోజులు వచ్చాయి. అధికారులను మానసికంగా కుంగదీసి కలెక్టర్లను మోకాళ్లపై కూర్చోపెట్టిన ఘనత బీఆర్ఎస్ నాయకులది. ఈ భూమి మీద మనుషులు ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. దేశంలో ఉన్న అనేక రాజకీయ పార్టీలు కాంగ్రెస్ అధికారంలోకి రావాలి.. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాయి’ అని కామెంట్స్ చేశారు. -
తుమ్మితే ఊడిపోయేది రేవంత్ పదవి: కేటీఆర్ సెటైర్లు
సాక్షి, రాజన్న సిరిసిల్ల: తుమ్మితే ఊడిపోయేది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి అని సెటైరికల్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ కొడంగల్ వెళ్తే అక్కడి ప్రజలు ఉరికించి కొట్టే వాళ్లు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.సిరిసిల్లలో ఈ నెల 29న నిర్వహించనున్న దీక్ష దివాస్ కార్యక్రమ నిర్వహణపై బీఆర్ఎస్ శ్రేణులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఆర్ఎస్ బ్రదర్స్ లాగా రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌పై చర్చ నడుస్తోంది. జిల్లా కలెక్టర్‌ను పార్టీ మారమని సలహాలు ఇస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వీళ్లు ఏమీ చేయలేరు. తుమ్మితే ఊడిపోయేది రేవంత్ రెడ్డి పదవి. ఎక్కడికి వెళ్ళినా రేవంత్ రెడ్డి.. కేసీఆర్ మీద తిట్ల దండకం తప్ప చేస్తున్నదేమీలేదు. దేవుళ్ల మీద ఒట్లు, కేసీఆర్ మీద తిట్లు, పథకాలకు తూట్లు.. ఇవే రేవంత్ రెడ్డి నినాదాలు.కొడంగల్‌కు వెళితే రేవంత్ రెడ్డిని ఉరికించి కొట్టేవాళ్ళు అక్కడి ప్రజలు. రాష్ట్రం నుండి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిస్తే కేంద్రం నుండి 8 రూపాయలు తెచ్చారా?. ఒక్కసారి తప్పు చేస్తే ఐదేళ్లు ఏళ్లు శిక్షనా అని ఒక ఆటోడ్రైవర్ నాతో అంటున్నాడు. సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ ఉంటే వేములవాడలో యారాన్ డిపో ఏర్పాటు చేస్తున్నారు. బోడిగుండుకు దెబ్బ తాకితే మోకాలుకు మందు రాస్తున్నాడు.కేసీఆర్ దీక్షతో పార్లమెంట్ దిగివచ్చి డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది. కేసీఆర్ అనే మొక్కను మొలవకుండా చేస్తా అంటుండు చిట్టినాయుడు. ఊడలమర్రి చెట్టులా వ్యాపించి వృక్షంలా మన కార్యకర్తలు ఉన్నారు.బండి సంజయ్, రేవంత్ రెడ్డిల భరతం పట్టాలి. లోక్‌సభ ఎన్నికల్లో బండి సంజయ్ మీద డమ్మీ క్యాండిడేట్‌ను పెట్టి సంజయ్ గెలిచేలా చిట్టి నాయుడు చేశాడు’ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. -
కేసీఆర్ మళ్లీ సీఎం అవ్వడం ఖాయం: జగదీష్ రెడ్డి
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో రాక్షస పాలన నడుస్తోందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ అంటేనే ప్రజలు భయపడుతున్నారని కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో రాబోయే రోజుల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు.నల్లగొండలో మంగళవారం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్ కిషోర్, కంచర్ల హాజరయ్యారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..‘రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంది. కాంగ్రెస్ అంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకే ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హామీలను నెరవేర్చడం లేదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.రాబోయే రోజుల్లో కేసీఆర్ మళ్ళీ సీఎం అవ్వడం ఖాయం. ఈనెల 29న దీక్షా దివాస్‌ను అందరూ ఘనంగా జరుపుకోవాలి. కేసీఆర్ ఎన్నో పథకాలను తెచ్చారు. ప్రజలకు మంచి పాలన అందించారు. ఎంతో సంక్షేమం అందించారు. ప్రత్యేక తెలంగాణ కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని తెచ్చిన మహానుభావుడు కేసీఆర్’ అని చెప్పుకొచ్చారు. -
హాయ్ చెప్తే..అంత డ్రామా చేస్తారా: మంత్రి పొంగులేటి ఫైర్
సాక్షి,హైదరాబాద్: తాను వ్యాపారవేత్త అదానీతో హైదరాబాద్‌లోని ఓ హోటల్లో భేటీ అయ్యానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు.ఈ విషయమై పొంగులేటి మంగళవారం(నవంబర్26) ‘సాక్షి’ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.‘అదానీ నేను హైదరాబాద్‌లోని ఒక హోటల్లో లిఫ్ట్ దగ్గర కలిశాం. పాత పరిచయంతో అదానీకి హాయ్ చెపితే దానికి ఇంత డ్రామా చేస్తారా? అదానీతో పదేండ్లు అంటకాగింది బీఆర్ఎస్ పార్టీ. గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అదానీతో చాలా ఒప్పందాలు చేసుకుంది. అదానీకి బీఆర్ఎస్ ఇచ్చిన కాంట్రాక్టులు రద్దు చేయాలా వద్దా క్లియర్‌గా చెప్పండి.మనసులో ఏదో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వంపై అదానీ మార్క్ వేస్తారా?మా నాన్న తర్వాత మీ నాన్ననే ఎక్కువగా నమ్మాను.ఐదేళ్లు తడిబట్టతో నా గొంతు కోశారు’అని పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: సీఎం రేవంత్‌కు కేటీఆర్ గట్టి కౌంటర్ -
సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్: రాహుల్ గాంధీ మొట్టికాయలు వేయడం వల్లే సీఎం రేవంత్ అదానీ ఇచ్చిన వంద కోట్లు తిరస్కరించాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. మంగళవారం(నవంబర్ 26) కేటీఆర్ తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు.‘కొసరు మాత్రమే తిరిగిస్తే సరిపోదు. 12,400కోట్లు ఒప్పందాల సంగతేంటి?రాహుల్,రేవంత్‌రెడ్డిలలో ఎవరు పిచ్చోళ్ళో వాళ్లే తేల్చుకోవాలి.ఇకపై అనుముల రేవంత్ రెడ్డి కాదు..అబద్దాల రేవంత్ రెడ్డి. మైక్రోసాఫ్ట్ డేటా ప్రాజెక్టును అదానీ డేటా సెంటర్ అని రేవంత్ అనడం హాస్యాస్పదం.తనకంటే చిన్నవాడిని కాబట్టి తిట్టినా పడతాను. కానీ కేసీఆర్‌ను అనడానికి రేవంత్‌కు ఎంత ధైర్యం?ఈడీ కేసు కోసం రేవంత్,అతని మంత్రుల లెక్క మేం అదానీ కాళ్ళు పట్టుకోలేదు.బ్యాగులు మోసిన గజ దొంగ రేవంత్‌రెడ్డి.చిట్టినాయుడికి చిప్ దొబ్బిందని నిన్నటి రేవంత్ కామెంట్స్ చూస్తే అర్థమవుతోంది.నేను సైకో అయితే..సీఎం రేవంత్ సన్నాసినా? శాడిస్టా? ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఢిల్లీ నుంచి 8 రూపాయలు కూడా తీసుకురాలేదు.28సార్లు ఢిల్లీ వెళ్ళి..రేవంత్ 28 రూపాయలు కూడా తీసుకురాలేదు.అదానీ జాతీయ రహదారులు,రక్షణ శాఖ పనులు చేస్తే మాకేం సంబంధం?రేవంత్‌లో సబ్జెక్టు,సరుకు ఉండదు. ఎవరైనా చెప్తే వినడు. దావోస్‌లో నేను అదానీని బరాబర్ కలిసిన. మీ మాదిరి కోహినూరులో కాళ్ళు పట్టుకోలేదు. కేసీఆర్ హాయాంలో అదానీని ఎప్పుడు ప్రోత్సహించలేదు.అదానీకి రేవంత్ రెడ్ కార్పెట్ వేస్తే..మేం రెడ్ సిగ్నల్ చూపించాం.మాజీ సర్పంచ్ సాయిరెడ్డిది సీఎం రేవంత్ సోదరులు చేసిన హత్యే. ఏడాదిగా అదానీ,అల్లుడు, అన్న,బావమరిదికి అమృతం పంచటం కోసమే రేవంత్ పనిచేస్తున్నాడు.రేవంత్‌రెడ్డి అసహనం,నిరాశ, నిస్పృహలో ఉన్నారు.ముఖ్యమంత్రి అయ్యాక కూడా రేవంత్‌కు కేసీఆర్,మా మీద ఫ్రస్టేషన్ ఎందుకు?కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 48 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారు.వాంకిడి గురుకుల విద్యార్థి శైలజది ప్రభుత్వం చేసిన హత్యే.తల్లిదండ్రుల మాదిరి చూసుకోవాల్సిన ప్రభుత్వమే విద్యార్థులను చంపేస్తోంది.గురుకుల విద్యార్థుల హత్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతాం’అని కేటీఆర్ హెచ్చరించారు.ఇదీ చదవండి: అదానీ నిధులు వద్దన్నాం: సీఎం రేవంత్ -
అదానీ నిధులు వద్దన్నాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్కిల్స్ యూనివర్సిటీ కోసం అదానీ సంస్థ ఇస్తామని ప్రకటించిన రూ. 100 కోట్లను తీసుకోవడం లేదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అదానీ గ్రూపు విషయంలో వివాదాలు, జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న వివాదాలకు, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదని పేర్కొన్నారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు జంగా రాఘవరెడ్డి, రోహిణ్‌రెడ్డి, సామా రామ్మోహన్‌రెడ్డిలతో కలిసి రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. సదుద్దేశంతో ప్రారంభించిన స్కిల్ వర్సిటీ వివాదాలకు లోనుకావడం తమకు ఇష్టం లేదని.. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని, తమను లాగొద్దని విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలు ఈ వ్యవహారాన్ని రాజకీయ కోణంలో చూడటం ద్వారా నిరుద్యోగులకు నష్టం చేసే వైఖరిని అవలంబించవద్దని విజ్ఞప్తి చేశారు. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి కార్పస్ ఫండ్ కింద నిధులు ఇచ్చేందుకు చాలా సంస్థలు ముందుకొచ్చాయని సీఎం రేవంత్ చెప్పారు. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద రూ.100 కోట్లు ఇచ్చేందుకు అదానీ సంస్థ ముందుకొచ్చిందని తెలిపారు. కానీ అదానీ సంస్థ అదేదో తెలంగాణ రాష్ట్రానికో, ముఖ్యమంత్రికో అప్పనంగా రూ.100 కోట్లు ఇచ్చినట్టు చర్చ జరుగుతోందన్నారు. ‘‘అదానీ సహా ఇప్పటివరకు ఏ సంస్థ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అదానీ సంస్థ నుంచి నిధులు తీసుకున్నారంటూ వ్యక్తిగతంగా నా గురించి చర్చ జరగడం నాకు, కేబినెట్ సహచరులకు ఇష్టం లేదు. అందుకే మా అధికారి జయేశ్‌రంజన్ ద్వారా అదానీ సంస్థకు లేఖ రాశాం. ఆ సంస్థ ప్రకటించిన రూ.100 కోట్లు స్వీకరించడానికి సిద్ధంగా లేమని, ఆ నిధులు ప్రభుత్వానికి బదిలీ చేయవద్దని ఆ లేఖలో స్పష్టం చేశాం’’ అని రేవంత్ తెలిపారు. ఒప్పందాల రద్దు అంత సులువుకాదు అదానీ గ్రూపుతో గతంలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటారా? అని మీడియా ప్రశ్నించగా.. అది అంత సులువైనది కాదని, అలా రద్దు చేసుకుంటే వారు కోర్టులకు వెళ్లే అవకాశం ఉంటుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ‘‘అయినా అదానీ ఫ్లైట్‌లో ఆడంబరంగా తిరిగింది వాళ్లు. కేసీఆర్‌లా మేం అదానీ నుంచి అప్పనంగా తీసుకోలేదు. అదానీతో ఎన్నో ఒప్పందాలు చేసుకున్నవారు మాపై ఆరోపణలు చేస్తున్నారు. అసలు పెట్టుబడుల విషయంలో వారి విధానమేంటి? పెట్టుబడులు రాకపోతే తీసుకురాలేదంటారు. తెస్తే రద్దు చేసుకోవాలంటారు. అంటే గత ప్రభుత్వం అదానీ గ్రూపుతో జాతీయ రహదారులు, డేటా సెంటర్ల ఏర్పాటు కోసం ఒప్పందాలు చేసుకున్నందుకు కేసీఆర్‌ను ప్రాసిక్యూట్ చేయాలా? వారి మీద కూడా కేసులు పెట్టాలా?’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. వాళ్ల కాకిగోలను పట్టించుకోబోం పెట్టుబడుల విషయంలో తాము ఎవరికీ ఆయాచిత లబ్ధి చేకూర్చబోమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ‘‘2023లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. 2024లో డిపాజిట్లు కోల్పోయింది. ఇప్పుడు మెదడు కోల్పోయింది. మీ కడుపు మంట మాకు తెలుసు. మీ దుఃఖం మాకు తెలుసు. మీ కాకిగోలను పట్టించుకోం. మీలాంటి వాళ్లు అరుస్తుంటే మాకు ఉత్సాహం వస్తుంది. మా కార్యకర్తలు సంతోషపడతారు. మీ క్షోభను చూస్తుంటే అప్పుడప్పుడు కోపం వస్తుంది. అయినా ఏకాగ్రత, కార్యదీక్షతో మేం ముందుకెళుతున్నాం’’ అంటూ బీఆర్ఎస్ నేతలను ఎద్దేవా చేశారు. ఆ ఎన్నికల్లో వచ్చింది లేదు.. పోయింది లేదు జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఉప ఎన్నికలపై రేవంత్‌రెడ్డి స్పందిస్తూ... ఆ ఎన్నికల వల్ల ఎవరికీ వచ్చింది లేదని, ఎవరికీ పోయింది లేదని పేర్కొన్నారు. ‘‘మహారాష్ట్రలో బీజేపీ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చాయి. జార్ఖండ్‌లో ఇండియా కూటమికి ఎక్కువ సీట్లు వచ్చాయి. కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. బెంగాల్లో బీజేపీ డిపాజిట్లు కోల్పోయింది. దేశంలోని రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు మోదీని ఓడించి రాహుల్, ఖర్గేల నాయకత్వాన్ని బలపర్చారు. కేరళలోని వాయనాడ్ నుంచి ప్రియాంకా గాంధీ భారీ మెజార్టీతో గెలిచారు. మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానాన్ని మేమే గెలిచాం. దీన్నిబట్టి దేశ ప్రజలు మోదీ నాయకత్వాన్ని, కిషన్‌రెడ్డిని ఛీ కొట్టారని అర్థమవుతోంది. అయినా కిషన్‌రెడ్డి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. ఆయనను కేంద్ర మంత్రిగా చేయడం తెలంగాణ దురదృష్టం..’’ అని రేవంత్ విమర్శించారు. పైరవీల కోసం కాదు.. పెళ్లి కోసం ఢిల్లీ వెళ్తున్నా.. తాను ఢిల్లీ వెళ్లినప్పుడల్లా మంత్రివర్గ విస్తరణ గురించి వార్తలు వస్తున్నాయని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పుడు తాను ఢిల్లీకి వెళ్తోంది లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహం కోసమని చెప్పారు. సోమవారం రాత్రి వివాహానికి హాజరై... మంగళవారం ఉదయం తెలంగాణ ఎంపీలతో సమావేశమవుతామన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, దీర్ఘకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల గురించి పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించే వ్యూహంపై చర్చిస్తామని చెప్పారు. అందుబాటులో కేంద్ర మంత్రులెవరైనా ఉంటే కలుస్తామన్నారు. అయితే తాము బీఆర్ఎస్ నేతల్లా పైరవీలు చేసేందుకు, కాళ్లు పట్టుకునేందుకు, కేసుల నుంచి తప్పించుకునేందుకో, మోదీ ముందు మోకరిల్లేందుకో ఢిల్లీకి వెళ్లడం లేదని పేర్కొన్నారు. కేంద్రాన్ని నిలదీసి అయినా నిధులు తెచ్చుకునేందుకు వెళుతున్నామని.. ఎన్నిసార్లయినా వెళ్తామని రేవంత్ చెప్పారు. కేంద్రం సమాఖ్య స్ఫూర్తితో ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు ఇవ్వాలని ఇవ్వాలని... అదేమీ బీజేపీ ఖజానా కాదని వ్యాఖ్యానించారు. ఏ ఎన్నికలైనా బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించాలనేది కాంగ్రెస్ పార్టీ విధానమని, తనది కూడా అదే అభిప్రాయమని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేటీఆర్ జైలుకెళ్లినా సీఎం అయ్యే చాన్స్ లేదు! ఎప్పుడెప్పుడు జైలుకు పోదామా అని కేటీఆర్ ఎదురుచూస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘జైలుకు వెళ్లినవారంతా ముఖ్యమంత్రులు అయ్యారని పేపర్లలో వార్తలు చూసి తాను కూడా జైలుకెళితే ముఖ్యమంత్రి అవుతానని కేటీఆర్ అనుకుంటున్నారు. కానీ కేటీఆర్ కన్నా ముందు ఆయన చెల్లెలు కవిత జైలుకు వెళ్లింది. ఇప్పుడిక సీఎం అవకాశం కూడా కేటీఆర్‌కు లేదు. సీఎం పోస్టు కోసం కేసీఆర్ కుటుంబంలో పోటీ ఎక్కువైంది. పదేళ్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి తెలివిని వాడాలి. చిల్లర ఆలోచనలు మానాలి. ఏ ఎల్లయ్యో, పుల్లయ్యో, బోడిగాడో చెప్పినట్టు ప్రభుత్వం వ్యవహరించదు. ఇక నుంచి ఆయన పేరును సైకో రామ్‌గా ఫిక్స్ చేయండి’’ అని ఎద్దేవా చేశారు.