breaking news
-
రేవంత్ ఇటుకతో కొడితే.. మేం రాయితో బదులిస్తాం
ఇప్పటికే తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిన రేవంత్.. ఆయన గురువు చెప్పినట్టుగా రేపు తెలంగాణను కూడా మాయం చేస్తాడు కాబోలు. తెలంగాణ అస్తిత్వం మీద దాడి ఇది. సీఎం తెలంగాణ తల్లిని బీదరాలిగా ఎందుకు చూడాలనుకుంటున్నారు? తెలుగు తల్లి, భరతమాత తరహాలో తెలంగాణ తల్లికి కిరీటాలు ఉండొద్దా? ఇప్పుడు బతుకమ్మ మాయం.. రేపు తెలంగాణ మాయం చేస్తారా?తెలంగాణ తల్లి విగ్రహం మార్పు తెలంగాణ అస్తిత్వం మీద తెలంగాణ ద్రోహులు చేస్తున్న దాడి. ఈ సీఎం తెలంగాణ ఉద్యమంలో లేరు.. ఎన్నడూ జైతెలంగాణ అనలేదు. సమైక్యవాదులు, తెలంగాణ వ్యతిరేకుల పార్టీలో పనిచేసి.. కేసీఆర్ పట్ల వ్యతిరేకత, ద్వేషం పెంచుకున్నారు. కేసీఆర్ చేసిన ప్రతి పనికి ఉల్టా చేయడం రేవంత్ పని. కవులు, కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలు, శిల్పుల అభిప్రాయాలు తీసుకుని ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లికి రూపకల్పన జరిగింది.2009లో కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో తెలంగాణ వ్యాప్తంగా వేలాది విగ్రహాలు పెట్టారు. కానీ ఈ మూర్ఖుడు తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తున్నాడు. ఇప్పటికే తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిన రేవంత్.. ఆయన గురువు చెప్పినట్లుగా రేపు తెలంగాణను కూడా మాయం చేస్తాడు కాబోలు. తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్న ఈ దాడిపై ప్రజలు నిరసన తెలపాలి. సీఎం తెలంగాణ తల్లిని బీదరాలిగా ఎందుకు చూడాలనుకుంటున్నారు? తెలుగు తల్లి, భరత మాత తరహాలో తెలంగాణ తల్లికి కిరీటాలు ఉండొద్దా?సాక్షి, హైదరాబాద్: ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పారు. ఆరు గ్యారంటీల ముసుగులో ఇచ్చిన 13 ప్రధాన గ్యారంటీలు, 420 హామీల అమలుపై ప్రభుత్వ తీరును నిలదీస్తామన్నారు. దళితబంధు, రైతు రుణమాఫీ, మహాలక్ష్మి, ఆసరా పింఛన్ల పెంపు తదితర హామీల అమలు కోసం పట్టుబడతామని.. హామీల అమలు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎండగడతామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించినా ప్రశ్నించడం ఆపేదే లేదని, ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ఏడాది అవుతున్న నేపథ్యంలో ఆదివారం ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘24 ఏళ్ల ప్రస్థానంలో గత ఏడాది బీఆర్ఎస్ అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఉద్యమ సమయంలో గెలుపోటములతో సంబంధం లేకుండా రాష్ట్ర సాధన కోసం పనిచేశాం. తెలంగాణ సిద్ధించాక పదేళ్లు అధికారంలో కొనసాగినా.. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో అధికారం కోల్పోయాం. ఈ ఏడాది కాలంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి, కవిత అరెస్టు, కేసీఆర్ కాలికి గాయం వంటి అనేక ఒడిదుడుకులు ఎదురయ్యాయి. కానీ మా నాయకుడు ఇచ్చిన స్ఫూర్తి, నాయకులు, కార్యకర్తల పోరాట పటిమతో బీఆర్ఎస్ తిరిగి నిటారుగా నిలబడింది. తిరిగి అధికారంలోకి వచ్చి మరో 25 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగుతుందనే ఆత్మస్థైర్యం వచ్చింది. మాకు పోయింది అధికారమే తప్ప పోరాట పటిమ కాదు. సమాధానం చెప్పలేకే రేవంత్ దూషణలు రేవంత్‌రెడ్డికి అనుకోకుండా అవకాశం వచ్చి సీఎం అయ్యారు. ఆయన పట్ల మాకు ఎలాంటి జెలసీ లేదు. ఆయనను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కోరితే దూషణలకు దిగుతున్నారు. మమ్మల్ని దూషించినా వయసులో చిన్న వాళ్లం సహిస్తాం. కానీ కేసీఆర్‌ను దూషించడాన్ని ప్రజలు జీర్ణించుకోవడం లేదు. తెలంగాణ సాధించిన మహానాయకుడిని స్థాయికి తగని వ్యక్తి విమర్శించడం సరికాదు.రేవంత్ వైఖరి మారకపోతే మాపై కేసులు పెట్టినా సరే... ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఆయన భాషలోనే స్పందిస్తాం. ఇటుకతో కొడితే రాయితో బదులిస్తాం. రేవంత్ చేస్తున్న పనికి మేం ఎక్కడా అడ్డుపడటం లేదు. బలవంతపు భూసేకరణ, దళితబంధు ఆపేయడం, మూసీ పేరిట లక్షల కోట్ల రూపాయల దోపిడీకి ప్లాన్చేయడంపై మేం ప్రశి్నస్తుంటే.. రేవంత్‌కు జీర్ణం కావడం లేదు. సమాధానం చెప్పే సత్తా లేక దూషణలకు దిగుతున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటున్న సీఎం... మొదట తన జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి బయటికి వచ్చి లగచర్లకు, తన సొంతూరు కొండారెడ్డిపల్లికి వెళ్లాలి. కేసీఆర్ స్థాయికి రేవంత్ సరిపోడు.. ప్రతిపక్ష నేత ఎలా ఉండాలో రేవంత్ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. గతంలో ఎనీ్టఆర్, జయలలిత శపథం చేసి అసెంబ్లీకి రాలేదు. కానీ కేసీఆర్ అలా కాదు. రేవంత్ కోరుకున్నప్పుడు కాదు.. ప్రజలు కోరుకున్నపుడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు. కేసీఆర్ స్థాయికి రేవంత్ సరిపోడు. ప్రజలు కేసీఆర్ ఎక్కడని అడగటం లేదు. హామీల అమలు, ఆరు గ్యారంటీల గురించి ప్రశి్నస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా మా పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గొంతు విప్పుతారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం.. ఉద్యమాల నుంచి వచ్చిన మాకు కేసులు, నిర్బంధాలు, అరెస్టులు కొత్త కాదు. వందల కేసులు పెట్టినా వెనక్కి తగ్గం. ప్రభుత్వం చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు మా కార్యకర్తలను జైలుకు పంపుతోంది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పార్టీని బలోపేతం చేసుకుంటాం. పోరాటాలకు కేడర్‌ను సిద్ధం చేస్తాం. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం. కేసీఆర్ పర్యవేక్షణలో సమర్థవంతమైన ప్రతిపక్షంగా పనిచేస్తున్నాం. కేసీఆర్, పార్టీ నిర్ణయం మేరకు పాదయాత్ర నేను కచ్చితంగా పాదయాత్ర చేస్తా.. కానీ తొందరపడకుండా ప్రజల అవసరాన్ని బట్టి షెడ్యూల్ నిర్ణయిస్తాం. ఎప్పుడు పాదయాత్ర చేయాలో మా అధినేత కేసీఆర్, పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయిస్తుంది. రేవంత్‌కు రక్షణ కవచంలా బీజేపీ ఎంపీలు బీజేపీ ఎన్ని కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టినా వారు రాష్ట్రంలో 8 అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలిచారు. మా ఓటమికి కారకులై కాంగ్రెస్ గెలుపునకు ఉపయోగపడ్డారు. బీజేపీ ఎంపీలు రఘునందన్‌రావు, అరి్వంద్, బండి సంజయ్ వంటివారు రేవంత్‌రెడ్డికి రక్షణ కవచంలా నిలబడుతున్నారు. అదానీ విషయంలో రేవంత్ వైఖరిపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. అనుముల రేవంత్‌రెడ్డి బ్రదర్స్ అదానీలను మించి పోతున్నా కేంద్రం ఎలాంటి దర్యాప్తులు చేయడం లేదు..’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
అసెంబ్లీలో రేవంత్ సర్కార్‌ను నిలదీస్తాం: కేటీఆర్
సాక్షి, సిద్ధిపేట: రైతుల తరపున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదిస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గురుకులాల్లో ఉన్న దుర్భర పరిస్థితులపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఓ రిపోర్ట్ ఇచ్చామన్నారు. రైతులపై దాడి చేస్తూ భూములు లాక్కుంటూ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తే అడ్డుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు.‘‘మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. అత్యంత మూర్ఖంగా, అనాలోచితంగా చరిత్ర గురించి తెలియకుండా ఏర్పాటు చేస్తున్న విగ్రహం గురించి పోట్లాడతాం. మోసాలు, అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోపై నిలదీస్తాం. రాష్ట్ర ప్రజల గొంతుకై తెలంగాణ సమస్యలపై అసెంబ్లీలో పోరాడతాం. అరకొరగా రుణమాఫీ చేశారు. కొనుగోలు కేంద్రాలు సరిగా నడపలేని పరిస్థితి. విజయోత్సవాల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మరోసారి మోసం చేస్తోంది ’’ అని కేటీఆర్ దుయ్యబట్టారు.రేపటి నుంచి (సోమవారం) నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో నేడు బీఆర్ఎస్ శాసనసభా పక్ష భేటీ జరిగింది. ఎర్రవల్లి నివాసంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కొందరు ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. సుమారు వారం రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు, ఏడాదిలో రేవంత్ ప్రభుత్వ పాలన వైఫల్యాలతో పాటు ప్రజా సమస్యలను ప్రస్తావించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు సోమవారం బీఏసీ సమావేశంలో ప్రతిపాదించే ఎజెండా ఆధారంగా తమ వ్యూహానికి పదును పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. -
‘తెలంగాణలో వీఆర్ఓ, వీఆర్ఏ సేవలు’
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను పున:ప్రారంభిస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పదేళ్ల పాలనకు...ఏడాది ఇందిరమ్మ పాలనకు స్పష్టమైన తేడా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధరణిని ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకున్నాం. మేం అధికారంలోకి వచ్చే నాటికి 2 లక్షల 40 వేల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ వస్తున్నాం.డిసెంబర్ 1 నుంచి ధరణి పోర్టల్‌ను ఎన్ఐసీకి అప్పగించాం. 2024 కొత్త ఆర్వో ఆర్ చట్టాన్ని తయారు చేశాం. అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదిస్తాం. గతంలో ధరణి 33 మాడ్యుల్స్‌తో ఇబ్బందిగా ఉండేది. మాడ్యుల్స్‌ను తగ్గిస్తాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేశారు. మళ్ళీ మేం ఈ వ్యవస్థలను తీసుకు వస్తాం.గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పింక్ షర్ట్స్ వేసుకున్న వాళ్ళకే వచ్చాయి. మేము అత్యంత నిరుపేదలకు మాత్రమే ఇళ్లు ఇస్తాం. ప్రతి నియోజక వర్గానికి 3500 ఇళ్లు. ఇందిరమ్మ ఇళ్లు ఒక్కసారి ఇచ్చి వదిలేసే కార్యక్రమం కాదు. కేంద్రం ఇందిరమ్మ ఇళ్లకు నిధులు ఇవ్వకపోయినా మా ప్రభుత్వం ఇస్తుంది. ఆనాటి ప్రభుత్వం ఖజానాను కొల్లగొట్టక పోయి ఉంటే వడివడిగా హామీలు నెరవేర్చే వాళ్ళం. అయినా మేము ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తాం.జర్నలిస్టుల ఇళ్ల స్థలాలను పరిష్కారం చేసుకుందాం. రియల్ ఎస్టేట్ పడిపోయిందని కొంత మంది మాజీ మంత్రులు అంటున్నారు. రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగిందని ప్రధాన ప్రతిపక్షం గ్రహించాలి. మేము 15 నుంచి 18 శాతం అనుకున్నాం కానీ..ఆశించినంత పెరగలేదు. ప్రతిపక్ష పార్టీకి జ్ఞానోదయం కలగకపోవటం బాధాకరం. ప్రతిపక్ష పార్టీకి డిశ్చార్జ్ షీట్ ప్రజలు ఇచ్చారు.ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌లో నడుపుతున్నది తుగ్లక్ పాలనా?సెక్రటేరియట్లో నడుపుతున్నది తుగ్లక్ పాలనా?.రేపటి కార్యక్రమానికి కేసీఆర్ వస్తారని ఆశిస్తున్నాం’ అని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. చదవండి👉 : ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ.. బీఆర్ఎస్ ఎల్పీలో కేసీఆర్ -
‘తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వo’: కేసీఆర్
సాక్షి,ఎర్రవల్లి: తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వo అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ, మండలి సమావేశాలు సోమవారం (డిసెంబర్ 9) నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో గజ్వేల్ జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ ఎల్పీ ఆదివారం సమావేశమైంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా కేసీఆర్ పార్టీ నేతలకు కీలక సూచనలు జారీ చేశారు. ‘‘అసెంబ్లీ, మండలి సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలి. సమావేశాల్లో అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి. నాడు రైతుబంధు తీసుకొచ్చిన ఉద్దేశం, ప్రయోజనాలను ప్రజలకు వివరించాలి. బీఆర్ఎస్ ఎల్పీలో తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఘత్వం. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా?. సమస్యలు, పరిష్కారంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. కానీ.. మార్పులు చేసుకుంటూ పోతే ఎలా?’’ అని ప్రశ్నించారు. అందుకే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాల్లో ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఆవశ్యకత, పరిస్థితులను అందరికీ వివరించాలి. నాడు తెలంగాణ తల్లి విగ్రహం నింపిన స్ఫూర్తి గురించి చెప్పాలి. ఫార్మాసిటీ ఎందుకు ప్రతిపాదించింది. పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలను వివరించాలి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది. నిర్భంద పాలన గురించి సమావేశాల్లో ప్రస్తావించాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రోటోకాల్ విషయమై నిలదీయాలి. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా వైఫల్యాలను ఎత్తిచూపాలి. అసెంబ్లీ సమావేశాల తర్వాత బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం, పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమం, కొత్త కమిటీల నియామకం, భారీ బహిరంగ సభ నిర్వహించేలా బీఆర్ఎస్ శాసనసభా పక్షనేతలతో కేసీఆర్ చర్చించారు. చదవండి👉 తెలంగాణలో వీఆర్ఓ, వీఆర్ఏ సేవలు -
కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్.. మంత్రి కోమటిరెడ్డి రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ విడుదల చేసిన ఛార్జ్‌షీట్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. పదేళ్లలో మీరు ఏం చేశారని.. మాపై ఛార్జ్‌షీట్ అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి చేయని పథకం లేదంటూ దుయ్యబట్టారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ రాకుంటే చరిత్ర హీనునిగా మిగిలిపోతారంటూ వ్యాఖ్యానించారు.హరీష్, కేటీఆర్ గురించి మాట్లాడడం అనవసమని సీఎం రేవంత్ రెడ్డికి సూచించా.. ఇక నేను కూడా మాట్లాడను. తెలంగాణ విగ్రహావిష్కరణ కు రానివారంతా తెలంగాణ ద్రోహులే.. త్వరలోనే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశాం’’ అని కోమటిరెడ్డి చెప్పారు. -
కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్
సాక్షి, హైదరాబాద్: రేవంత్ పాలనలో అన్నీ తిట్లు, ఒట్లేనని.. ప్రశ్నించే గొంతుకలపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ‘ఏడాది పాలన-ఎడతెగని వంచన’ పేరిట ఆయన ఛార్జ్‌షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, పోలీసుల చేత పోలీస్ కుటుంబాలను కొట్టించారన్నారు.‘‘రేవంత్‌రెడ్డికి పరిపాలనలో స్థిరత్వం లేదు. రేవంత్ విధానాలతో తెలంగాణ తిరోగమనంలో వెళ్లింది. గ్యారెంటీలు, హామీల అమల్లో ప్రభుత్వం విఫలమైంది. తెలంగాణకు కొత్త పరిశ్రమలు రావడం లేదు. రేవంత్ అడుగులు కూల్చివేతలతో ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఆగం అయ్యింది. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైంది.’’ అని హరీష్‌రావు ధ్వజమెత్తారు.‘‘శాంతి భదత్రల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కాంగ్రెస్ హయాంలో తొమ్మిది చోట్ల మత కలహాలు జరిగాయి. మద్యం విక్రయాలు పెంచాలని మెమోలు ఇచ్చారు. గాంధీభవన్‌లో ఇచ్చే సూచనల ఆధారంగా చట్టాలు చేస్తున్నారు’’ అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.ఇదీ చదవండి: ఇది గారడీ సర్కార్ -
కేసీఆర్ అధ్యక్షతన మీటింగ్.. ఎర్రవెల్లి చేరుకున్న గులాబీ నేతలు
సాక్షి, సిద్దిపేట: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరుగనుంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేయనున్నారు కేసీఆర్. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా ఎర్రవల్లికి చేరుకుంటున్నారు.కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ వేదికగా బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కొనసాగనుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు ఎర్రవల్లికి వస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్ రావు, ఎమ్మెల్సీలు వెంకట్రామి రెడ్డి, నవీన్ కుమార్ కుమార్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలు ఎర్రవల్లి చేరుకున్నారు. -
నాడు పిల్లి శాపనార్థాలు.. బీజేపీ, బీఆర్ఎస్కు మంత్రి పొన్నం కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతిపక్షాలు ఇచ్చింది ఛార్జ్‌షీట్ కాదు రిప్రజెంటేషన్ అని చెప్పుకొచ్చారు.మంత్రి పొన్నం ప్రభాకర్.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఛార్జ్షీట్లకు కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలు ఇచ్చింది ఛార్జ్‌షీట్ కాదు రిప్రజెంటేషన్. బీజేపీ, బీఆర్ఎస్ వేరు కాదు. వాళ్ళు ఇచ్చిన ప్రజెంటేషన్ ఛార్జ్‌షీట్.. మాకు ఇచ్చిన రిప్రజెంటేషన్‌గా భావించి వాటిని కూడా పరిశీలిస్తాం. కానీ, దురదృష్టకరం ఎంటంటే సంవత్సర కాలం పరిపాలన తరువాత ఇప్పుడు ఛార్జ్‌షీట్ ఇచ్చి మమ్మల్ని విమర్శిస్తే బాగుండేది.అంతేకానీ, ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుండే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మళ్ళీ సంవత్సరం కాగానే ఛార్జ్‌షీట్ ఇవ్వడం భావ్యం కాదు. ప్రభుత్వం ఏర్పడిన నెలకు ప్రభుత్వం ఎలా నడుస్తుంది అన్నారు.. పిల్లి శాపనార్థాలు పెట్టారు. ప్రభుత్వాన్ని కూల గొడతామన్నారు. రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేశారు. ఇదంతా తెలంగాణ ప్రజలు గమనించాలి. తప్పకుండా వాళ్ళు ఇచ్చిన అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. -
‘తెలంగాణ తల్లి కాదు.. కాంగ్రెస్ మాత విగ్రహం’
సాక్షి, నల్లగొండ: తెలంగాణను అన్ని రంగాల్లో నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అలాగే, కాంగ్రెస్ పెడుతున్నది తెలంగాణ తల్లి విగ్రహం కాదు.. కాంగ్రెస్ మాతా విగ్రహమని ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా కేసీఆర్ నామస్మరణే చేస్తున్నారని ఎద్దేవా చేశారు.నల్లగొండ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘అది తెలంగాణ తల్లి విగ్రహం కాదు. కాంగ్రెస్ మాతా విగ్రహం. కాంగ్రెస్ మాత విగ్రహాన్ని సచివాలయంలో పెట్టొద్దు. గాంధీ భవన్లో పెట్టుకోండి. కేసీఆర్ నామస్మరణ చేస్తోందే రేవంత్ రెడ్డి. కేసీఆర్ నా కలలోకి వస్తున్నాడని రేవంత్ ఒప్పుకున్నాడు. కేసీఆర్ ప్రజల హృదయం నిండా ఉన్నాడు. కేసీఆర్ నరసింహస్వామిలా బయటకు వస్తాడేమో అని రేవంత్‌కు భయం పట్టుకుంది. మేం ట్రయల్ రన్ చేసిన ప్రాజెక్టును ప్రారంభించారు.కేసీఆర్ ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు కానీ ఒక రూపాయి నిధులు ఇవ్వలేదు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఉన్నా జిల్లాకు ఒరిగిందేమీ లేదు. ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా శంకుస్థాపన చేయలేదు. 4000 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఇచ్చినందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు. కాంగ్రెస్ చేతకానితనం వల్లనే కరువు, ఫ్లోరైడ్ వచ్చింది. కాంగ్రెస్ నిర్లక్ష్యం కారణంగానే జిల్లా నాశనం అయింది. ఫ్లోరైడ్‌ను లేకుండా చేసేందుకు మిషన్ భగీరథ నల్లగొండ జిల్లాలోనే ప్రారంభించాడు. వైటీపీఎస్ని ఆపేస్తా అని ఆనాడు కోమటిరెడ్డి అన్నాడు. అనేక కుట్రలు చేశాడు. నిన్న మంత్రులు మాట్లాడుతుండగానే జనాలు వెళ్లిపోయారు.రేవంత్ చేసిందేమీ లేదు.. బూతులు మాట్లాడటం తప్ప. కాంగ్రెస్ ఇచ్చిన ఉద్యోగాలు 12000 మాత్రమే. మిగతా 50వేలు కేసీఆర్ ఇచ్చినవే. మూసీ మురికి వదిలించేందుకు ప్రక్షాళన మొదలు పెట్టిందే మేము. మూసీ ప్రక్షాళన చేసి తీరాల్సిందే. తెలంగాణను అన్ని రంగాల్లో నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ నాయకత్వంలో ప్రపంచంలో తక్కువ కాలంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతం తెలంగాణ. గోదావరి జలాలను ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తీసుకొచ్చిందే కేసీఆర్. మంత్రులు అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. కాళేశ్వరంతో సంబంధం లేకుండా పంట పండాయి అనడం దారుణం. అభివృద్ధి చేయకపోతే మీ భరతం పడతా. మంత్రులు ప్రజలను ఏవిధంగా లూటీ చేశారో అన్ని ఆధారాలు ఉన్నాయి. మీ బాధిత సంఘాలు కూడా ప్రారంభం అయ్యాయి’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. -
కోల్పోయింది అధికారమే.. పోరాటతత్వం కాదు!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది అధికారాన్ని మాత్రమేనని.. పోరాటతత్వాన్ని కాదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. బీఆర్ఎస్ పారీ్టపై ప్రజలకు అభిమానం ఏమాత్రం తగ్గలేదని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పనిచేస్తామని స్పష్టంచేశారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దర్శకత్వం వహించి, నిర్మించిన ‘నమ్మి నానబోస్తే’ షార్ట్ ఫిల్మ్‌తో పాటు కాంగ్రెస్ పాలనపై రూపొందించిన ‘అంతా ఉత్తదే’ పాటను కేటీఆర్ శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి బీఆర్ఎస్ పార్టీ 24 ఏళ్లు పూర్తి చేసు కుని 25వ ఏట అడుగుపెడుతోంది. గడిచిన ఏడాది పార్టీకి అత్యంత గడ్డుకాలం.అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, కేసీఆర్ తుంటి ఎముకకు గాయం, ఎమ్మెల్సీ కవిత అరెస్టు, లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం వంటి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. బీఆర్ఎస్ తరపున గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ నేతల అరెస్టులకు కుట్రలు జరుగుతు న్నాయి. ఈ పరిణామాలన్నీ దాటుకుంటూ బీఆర్ఎస్ తిరిగి బలంగా నిలబడింది. ఇచి్చన హామీలను నిలబెట్టుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదినే వ్యతిరేకత మూటగట్టుకుంది. ఉపఎన్నిక జరిగితే పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా గెలవరు’ అని అన్నారు.అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాం«దీభవన్ బోసిపోతుండగా.. విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ మాత్రం నిత్యం కళకళలాడుతోందని తెలిపారు. ‘ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు రసమయి బాలకిషన్ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ అద్దం పట్టింది’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతీనెల షార్ట్ ఫిల్మ్‌లు రూపొందించి విడుదల చేస్తానని రసమయి బాలకిషన్ ప్రకటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎస్.మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, రవిశంకర్, చిన్నయ్య, లింగయ్య, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, డాక్టర్ రాజయ్య, ఆనంద్, క్రాంతికిరణ్, ప్రభాకర్‌రెడ్డి, పార్టీ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవీప్రసాద్ పాల్గొన్నారు.భూసేకరణ రద్దయ్యే వరకు పోరులగచర్లలో భూసేకరణ నోటిఫికేషన్ రద్దు అయ్యేంత వరకు పోరాటం చేస్తామని, రైతులు, గిరిజనులకు అండగా నిలుస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రకటించారు. రైతులు, గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా ఎస్పీతో టెలిఫోన్లో మాట్లాడిన కేటీఆర్ పోలీసు వేధింపులు నిలిపివేయాలని కోరారు. లగచర్ల బాధితులు శనివారం తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను కలిసి తమ సమస్యలు వివరించారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు జైలులో ఉన్న బాధితులను బెయిల్‌పై తీసుకువచ్చేందుకు బీఆర్ఎస్ లీగల్ విభాగం సర్వశక్తులూ ఒడ్డుతోందని కేటీఆర్ చెప్పారు. లగచర్ల బాధితుల డిమాండ్లను అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతామని ప్రకటించారు. భేటీలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. -
నేడు బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 9 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో నేడు బీఆర్ఎస్ శాసనసభా పక్ష భేటీ జరగనుంది. ఎర్రవల్లి నివాసంలో ఆదివారం ఉదయం 10.30కు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కొందరు ముఖ్య నేతలు కూడా హాజరుకానున్నారు. సుమారు వారం రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ నాయకులకు దిశానిర్దేశం చేస్తారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు, ఏడాదిలో రేవంత్ ప్రభుత్వ పాలన వైఫల్యాలతో పాటు ప్రజా సమస్యలను ప్రస్తావించాలని బీఆర్ఎస్ భావిస్తోంది.మరోవైపు సోమవారం బీఏసీ సమావేశంలో ప్రతిపాదించే ఎజెండా ఆధారంగా తమ వ్యూహానికి పదును పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కాగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేది, లేనిదీ ఆదివారం జరిగే భేటీలో స్పష్టత వచ్చే అవకాశముంది. గత ప్రభుత్వం చేసిన పలు చట్టాలకు ప్రస్తుత ప్రభుత్వం సవరణలు తీసుకువస్తోంది. అలాగే విద్యుత్ కొనుగోలు అంశంపై విచారణ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టేందుకు అధికార పార్టీ సన్నద్ధమవుతోంది.ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పాలనలో తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వం ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తే వాటిని తిప్పికొట్టేందుకు అనుసరించే వ్యూహంపైనా ఈ భేటీలో కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. కేవలం అసెంబ్లీ సమావేశాల కోణంలోనే కాకుండా జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, బీఆర్ఎస్ ప్రతిస్పందించాల్సిన తీరుపై కేసీఆర్ సూచనలు చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.ఏడాది పాలనపై బీఆర్ఎస్ చార్జిషీట్ నేడుసాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన వైఫ ల్యాలపై ఆదివారం ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ చార్జిషీట్ విడుదల చేయనుంది. మాజీ మంత్రి హరీశ్ రావు, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు, బీ ఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యక్రమంలో పాల్గొంటారు. ‘నమ్మించారు.. నట్టేట ముంచారు. ఏడాది కాంగ్రెస్ పాలన చూస్తే.. వంచనే తప్ప ఏ వర్గానికి జరిగిన మేలు లేదు.. అన్ని వర్గాలను విజయవంతంగా రోడ్డెక్కించారు’..అని బీఆర్ఎస్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. -
విపక్షంగా బీఆర్ఎస్, బీజేపీ ఫెయిల్
సాక్షి, హైదరాబాద్: రా ష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించటంలో బీఆర్ ఎస్, బీజేపీలు విఫలమ య్యాయని పీసీసీ అధ్య క్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ విమర్శించారు. బీ ఆర్ఎస్ పార్టీలో మూ డు ముక్కలాట, బీజేపీ లో నాలుగు ముక్కలా ట నడుస్తున్నదని ఎద్దే వా చేశారు. ‘కుర్చీ కా వాలని కేసీఆర్ కుమార్తె కవిత అడుగుతోంది. కాదు నాకే కావాలని కుమారుడు కేటీఆర్ అంటున్నారు. ఈ ఇద్దరి మధ్య ఏదైనా జరిగితే కుర్చీ లాక్కోవాలని హరీశ్‌రావు చూస్తున్నారు. ఇక, బీజేపీలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఉత్తర, దక్షిణ ధృవాలుగా పనిచేస్తున్నారు. ఈటల రాజేందర్ తూర్పు చూస్తుంటే, డి.కె.అరుణ పడమర చూస్తున్నా రు’ అని ఎద్దేవా చేశారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీ డియాతో మాట్లాడుతూ.. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి తెలంగాణ రా జకీయ ముఖచిత్రం నుంచి బీఆర్ఎస్ కనిపించకుండా పోతుందని చెప్పా రు. ఆ పార్టీ నుంచి చాలా మంది తమతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. 8 మంది ఎంపీలను గెలిపిస్తే బీజేపీ నేతలు రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చా రని ప్రశ్నించారు. తాము కేటీఆర్ అరెస్టు కోసం గవర్నర్ అనుమతి కోరిన ప్పటికీ ఎందుకు అనుమతి రావడం లేదో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు మంత్రివర్గంలో చేరాలనే ఆలోచన ఎప్పుడూ లేదని అ న్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఏఐసీసీ నిర్ణయమే ఫైనల్ అని స్పష్టంచేశారు. సమగ్ర సర్వే గణాంకాల ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. పాలమూరు వీర పాట విడుదల: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్స రం పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్‌పై రూపొందించిన ‘పాలమూ రు వీర’ అనే పాటను మహేశ్‌గౌడ్ శనివారం అసెంబ్లీ అవరణలో ఆవిష్క రించారు. నిర్మాత యుగంధర్‌గౌడ్ ఆధ్వర్యంలో కవి రేలారే ప్రసాద్ రచించిన ఈ గీతం అద్భుతంగా ఉందని ఆయన ప్రశంసించారు. ఈ గీతానికి కళ్యాణ్ సంగీతం అందించగా, ఎంఎల్ఆర్ కార్తికేయ ఆలపించారు. -
ఇది గారడీ సర్కార్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గారడీ ప్రభుత్వం కొనసాగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. ఆచరణ సాధ్యంకాని హామీ లిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్.. ఏడాది నుంచి ప్రజల్ని వంచిస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఏడాది పాలనంతా గత బీఆర్ఎస్ పాలనకు నకలుగా ఉందని ఎద్దేవా చేశారు. శనివారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో ‘కాంగ్రెస్ ఏడాది పాలన–వైఫల్యాలపై బీజేపీ నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన జేపీ నడ్డా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.అన్నీ మోసపూరిత హామీలే... ‘తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ పరిస్థితు లను చూస్తే కాంగ్రెస్ వైఖరి స్పష్టమవుతుంది. పాత పెన్షన్ స్కీం జాడలేదు. 2 లక్షల ఉద్యోగాల ఊసులేదు. మహిళలకు ప్రతి నెలా ఇస్తామన్న రూ. 2,500 ఏ ఒక్కరికీ అందలేదు. ఆటోడ్రైవర్లకు రూ. 12 వేల హామీ ఏమైంది? రైతులకు ఎకరాకు రూ. 15 వేలు, కౌలు రైతులకు రూ. 12 వేలు, షాదీ ముబారక్ కింద రూ.లక్ష, తులం బంగారం, విద్యార్థులకు రూ.5 లక్షల క్రెడిట్ కార్డులు, స్కూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు... ఇలా వందల సంఖ్యలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా రేవంత్ ప్రభుత్వం అమలు చేయలేదు. దీనిపై ప్రశ్నించిన మాపై ఎదురుదాడి చేస్తున్నారు’ అని నడ్డా మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆయనపైనే నమ్మకం లేదని.. అందుకే పూటకోమాట చెప్పి ప్రజల్ని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారని వివర్శించారు. అప్పులు చేస్తూ మనుగడ సాగించే ప్రభుత్వాలు ఎక్కువకాలం ఉండవంటూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.కాంగ్రెస్‌పై పోరాడతాం..‘కాంగ్రెస్ ఏడాది పాలనను ప్రజల ముందే ఎండగట్టేందుకు ఇక్కడికి వచ్చా. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, ఇప్పుడున్న కాంగ్రెస్ పాలనకు ఏమాత్రం తేడా లేదు. ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలు ఇప్పటికీ మోసపోతూనే ఉన్నారు. మాయమాటలతో రైతులు, మహిళలు, యువకులు, కార్మికులను మోసగించిన కాంగ్రెస్‌పై పోరాడాలని నిర్ణయించాం’ అని నడ్డా పేర్కొన్నారు.భవిష్యత్ అంతా బీజేపీదే...ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓట్ల శాతం భారీగా పెరిగిందని నడ్డా ఉద్ఘాటించారు. ‘దేశంలోని 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. మరో ఆరు రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వాలున్నాయి. ఒక్కసారి బీజేపీ అధికారంలోకి వస్తే అది శాశ్వతంగా ఉంటుంది. గత 30 ఏళ్లుగా గుజరాత్లో బీజేపీదే అధికారం. అక్కడి ప్రజల గుండెల్లో కేవలం కమలమే ఉంది. రాజస్తాన్‌లో ఆరుసార్లు, గోవా మూడుసార్లు, మధ్యప్రదేశ్‌లో మూడుసార్లు, యూపీలో రెండుసార్లు బీజేపీ అధికారం దక్కించుకుంది. మహారాష్ట్రలోనూ మూడోసారి విజయం సాధించింది. ఉత్తరాఖండ్‌లో రెండు, మణిపూర్‌లో మూడు, అస్సాంలో రెండు, హరియాణాలో మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఇకపై దేశ భవిష్యత్ అంతా బీజేపీదే. వచ్చే ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుంది’ అని నడ్డా ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణకు ఎన్నో కేంద్ర ప్రాజెక్టులు..మోదీ ప్రభుత్వంలో తెలంగాణకు ఎంతో అభివృద్ధి జరిగిందని. పన్నుల రూపంలో రూ. 1.60 లక్షల కోట్లు, గ్రాంట్ల ద్వారా రూ. 1.12 లక్షల కోట్లు, స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు, టెక్స్టైల్, రైల్వేకు 20 రెట్ల బడ్జెట్ కేటాయింపులు, వందేభారత్ రైళ్లు, భారత్ మాలా ప్రాజెక్టు కింద హైదరాబాద్ ఇండోర్, సూరత్ చెన్నై, హైదరాబాద్–వైజాగ్ లాంటి జాతీయ రహదారులు, బీబీనగర్‌లోనూ ఎయిమ్స్ నిర్మాణం తదితర ఎన్నో ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయన్నారు.నిజమైన మార్పు బీజేపీతోనే సాధ్యం: కిషన్రెడ్డిబీఆర్ఎస్ పాలనపై అసంతృప్తితో ఉన్న రాష్ట్ర ప్రజలకు కొత్త హామీలతో కాంగ్రెస్ పార్టీ వల వేసి ఓట్లు వేయించుకొని ఇప్పుడు వాటిని అమలు చేయకుండా మోసగిస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. నిజమైన మార్పు కేవలం బీజేపీతోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో మరింత ఆర్థిక సంక్షేభం ఏర్పడిందని, ఇకపై ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీదే అధికారమని జోస్యం చెప్పారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్కు సరైన నాయకుడు లేడని.. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. రేవంత్ పాలనలో భాగ్యనగర్ బంగ్లాదేశ్‌గా మారుతోందని ఆరోపించారు.హామీలు నెరవేర్చకుండా సంబురాలా?: డీకే అరుణ, కొండారాష్ట్రంలో ఒక నియంత గద్దె దిగాడనుకుంటే మరో నియంత వచ్చాడని సీఎం రేవంత్‌ను ఉద్దేశించి మెదక్ ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వం.. ఏ ముఖంతో సంబురాలు చేసుకుంటోందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల భూములను బడా కంపెనీలకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. ప్రపంచ నేతగా గుర్తింపు పొందిన ప్రధాని మోదీపై కాంగ్రెస్ అడ్డగోలు ఆరోపణలు చేస్తోందని.. విదేశీ శక్తులకు తొత్తుగా మారిందని బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ దుష్టపాలనకు చరమగీతం పాడాలని బీజేపీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. -
కేసీఆర్, మోదీకి సీఎం రేవంత్ సవాల్
సాక్షి, నల్గొండ జిల్లా: కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర ఎందుకు పోషించడం లేదంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఆయన ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడం సరికాదన్నారు. నల్గొండలో మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం, నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన చేసిన తర్వాత గంధంవారి గూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఏ రాష్ట్రంలోనైనా రూ.21 వేల కోట్ల రుణమాఫీ జరిగిందా?. నిరూపిస్తే మేమంతా వచ్చి క్షమాపణలు చెబుతాం అంటూ కేసీఆర్, మోదీకి సీఎం రేవంత్ సవాల్ విసిరారు.‘‘సమస్యను ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యత. కేసీఆర్ ఈ సంవత్సర కాలంలో ఏనాడైనా ప్రతిపక్ష నాయకుడి బాధ్యతను పోషించారా?. ఒక్కరోజైనా తెలంగాణ ప్రజల కోసం పనిచేశారా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉండటం మంచిదేనా?. మేం ఓడిపోయినా మళ్లీ ప్రజా తీర్పు కోరినాం. గెలిస్తే ఉప్పొంగడం.. ఓడితే కుంగిపోవడం మంచిదేనా?. కేసీఆర్ ఓ గాలి బ్యాచ్‌ను జతచేశారు. పరిశ్రమలు తెస్తామంటే, ఫార్మాసిటీ కడతాం అంటే, రోడ్లు వేస్తామంటే, ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామంటే మీరు వద్దు అంటున్నారు. రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది? అంటూ రేవంత్ దుయ్యబట్టారు.పరీక్షలు పెట్టొద్దు.. ఉద్యోగాలు ఇవ్వొద్దంటే తెలంగాణకు మంచిదేనా?. 1200 మంది ప్రాణ త్యాగం చేసింది మీ ఇంట్లో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్సీలు చేయడానికా?. జూన్ 2కు ఎంత ప్రాధాన్యత ఉందో డిసెంబరు 7కు అంతే ప్రాధాన్యత ఉంది. తొలి దశ ఉద్యమ కాలంలో కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్లు మంత్రి పదవికి రాజీనామా చేశారు. మలిదశ ఉద్యమకాలంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవి త్యాగం చేశాడు. తొలి, మలిదశ ఉద్యమంలో నల్లగొండ గడ్డ ప్రాధాన్యత ఎంతో గొప్పది. నల్లగొండ గడ్డపై కాలు పెడితే నిజాంలను తమిరికొట్టిన ఉద్యమ స్పూర్తి వస్తుంది. ఫ్లోరైడ్ కారణంగా కన్నపిల్లలను కూడా తాళ్లతో కట్టేసి పనికిపోవాల్సిన పరిస్థితి ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే కేసీఆర్ పాలనలో ఎక్కువ అన్యాయం జరిగింది’’ అని మండిపడ్డారు. -
మాయల ఫకీర్‌లా రేవంత్ సర్కార్: జేపీ నడ్డా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. సరూర్‌నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ నిరసన సభలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ ప్రభుత్వం మాయల ఫకీర్‌లా మోసం చేస్తోందన్నారు. కాంగ్రెస్ అధికారం వారి స్వార్థం కోసం వాడుకుంటోందని.. బీజేపీ ప్రజల అవసరాలు తీర్చేందుకు ఉపయోగిస్తోందన్నారు.‘‘దేశంలో వరుసగా 3వ సారి ప్రధాని అయినా ఘనత మోదీదే. విపక్షాలు బలంగా ఉన్నప్పటికీ కూడా మోదీ మూడోసారి ప్రధాని అయ్యారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రభుత్వ అనుకూల ఓటు వచ్చింది. 13 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఆరు రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. 19 రాష్ట్రాల్లో కమలం వికసిస్తోంది. తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యం. గత రికార్డులను బ్రేక్ చేస్తూ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేశాం. కాంగ్రెస్ ఇతర పార్టీల మద్దతుతో నిలబడే ప్రయత్నం చేసి ఆ పార్టీలను ముంచేస్తోంది...ప్రాంతీయ పార్టీల అండతోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తోంది. తెలంగాణ ప్రజలు బీజేపీ ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో బీజేపీఅధికారంలోకి రావడం ఖాయం. ఇతర పార్టీల బలహీనతలే.. కాంగ్రెస్ బలం’’ అని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.రేవంత్‌కి ఆయన మీద ఆయనకే భరోసా లేదు. ఇక ప్రజలకు ఏమీ భరోసా కల్పిస్తారు. విద్య భరోసా కార్డు ఎక్కడ?. మహిళలకు రూ.2500 వచ్చాయా?. తులం బంగారం, లక్ష రూపాయలు అందాయా?. రేవంత్ ప్రభుత్వం మహిళ, యువత, రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఒక్కసారి కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరిస్తే మళ్లీ వారిని ఆ రాష్ట్ర ప్రజలు ఆదరించరు. ఉదాహరణకు 60 ఏళ్లుగా తమిళనాడులో, 30 ఏళ్లుగా గుజరాత్, ఉత్తర ప్రదేశ్, 25 ఏళ్లుగా బీహార్‌లో కాంగ్రెస్ అధికారంలోకే రాలేదు. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్‌కు ఇదే గతి రావడం ఖాయం.రేవంత్‌రెడ్డి అబద్దాలతో గద్దె నెక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో తెలంగాణలో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. వారందరికీ బీజేపీ అండగా ఉంటుంది. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలను లేవనెత్తి అధికారమే లక్ష్యంగా బీజేపీ ఉద్యమాలు చేపడుతుంది. బీజేపీ ఫ్యూచర్ ఆఫ్ ది తెలంగాణ. 70 ఏళ్ల భారత చరిత్రలో ప్రభుత్వాలపై ప్రజల వ్యతిరేకత పెరిగేది. మోదీ అధికారంలోకి వచ్చాక బీజేపీకి ఆదరణ పెరుగుతూ వచ్చింది. 2019తో పోలిస్తే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ రూ.5 కోట్లకు పైగా ఓట్లు పెరిగాయి.తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలను చూశారు. వచ్చే రోజుల్లో బీజేపీకి పట్టం కట్టేందుకు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో బీజేపీ తిరిగి మళ్లీ మళ్లీ అధికారంలో వస్తోంది. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ఒంటరిగానే మెరుగైన స్థానాలు సాధించింది. కాంగ్రెస్ పరాన్నజీవి పార్టీ లాంటిది. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ రీజినల్ పార్టీలపై ఆధారపడి గెలుస్తూ వస్తుంది. కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, తెలంగాణలో ప్రజలను మోసం చేసి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. హిమాచల్‌లో ఫ్రీ కరెంట్ దేవుడు ఎరుగు.. అసలు కరెంట్ ఇవ్వడం లేదు’’ అంటూ జేపీ నడ్డా మండిపడ్డారు. -
ముదురుతున్న వివాదం.. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తల్లి విగ్రహ వివాదం ముదురుతోంది. విగ్రహ ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాపన నిలిపివేయాలని జూలూరి గౌరీశంకర్ పిటిషన్ వేశారు. విగ్రహంలో మార్పులను వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలైంది. విగ్రహంలో మార్పులంటే తెలంగాణ అస్తిత్త్వంపై జరుగుతున్న దాడిగా పిటిషన్లో పేర్కొన్నారు.కాగా, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘రేవంత్ ప్రతిష్టిస్తోంది.. తెలంగాణ తల్లినా? కాంగ్రెస్ తల్లి విగ్రహాన్నా? విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానం మాకు మ్యాటర్ కాదు.. తెలంగాణ తల్లి మాకు మ్యాటర్. తెలంగాణ తల్లి విగ్రహం అంటే రేవంత్ రెడ్డి ఇంట్లో కార్యక్రమం కాదంటూ మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? ప్రభుత్వాలు మారినపుడల్లా గత ప్రభుత్వం నిర్ణయాలు మారాలా?’’ అంటూ ప్రశ్నించారు.ఇదీ చదవండి: విగ్రహావిష్కరణకు రండి.. కేసీఆర్‌కు రేవంత్ సర్కార్ ఆహ్వానంమరోవైపు, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. డిసెంబర్ తొమ్మిదో తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం వద్ద విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ తెలంగాణ తల్లికి సంబంధించిన ఒక ఫొటో బయటకు వచ్చింది. ఈ ఫొటోలో ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. మెడలో కంటె, బంగారు ఆభరణాలు ఉన్నాయి. అలాగే, ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న కంకులు, జొన్నలు ఉన్నాయి. చెవులకు కమ్మలతో నిండుగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. -
లోకల్ బాడీ ఎన్నికలు.. కుల గణన ఆధారంగా టికెట్స్: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలో కుల గణన సర్వే ఆధారంగానే లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్స్ ఇస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో, కుల గణన అంశం రాష్ట్రంలో కీలకంగా మారనుంది.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. కుల గణన సర్వే ఆధారంగానే లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్స్ ఇవ్వడం జరుగుతంది. అసెంబ్లీ సమావేశాల తర్వాతే కేబినెట్ విస్తరణ ఉంటుంది. ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది. తెలంగాణ నుంచి సినిమా ఇండస్ట్రీలో కీలకంగా ఉన్నారనే దిల్ రాజుకు కార్పోరేషన్ పదవి ఇచ్చాం. తెలంగాణ తల్లిని విమర్శించడం అంటే తెలంగాణను విమర్శించడమే అవుతుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
అది నినాదం కాదు.. కేసీఆర్ ప్రభుత్వ విధానం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: దశాబ్దాల కాంగ్రెస్ పాలనతో వ్యవసాయ రంగం వెన్నువిరిగిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వ్యవసాయం దండగ కాదు పండగ అని చాటిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుబంధును రాజకీయం చేసి రైతుభరోసా అంటూ భ్రమలు కల్పించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. ‘రైతే రాజు నినాదం కాదు.. కేసీఆర్ ప్రభుత్వ విధానంఅడగకుండానే రైతుబంధు అడగకుండానే రైతుబీమాఅడగకుండానే సాగునీళ్లుఅడగకుండానే ఉచితంగా 24 గంటల కరంటుఅడగకుండానే 100 శాతం పంటల కొనుగోళ్లుదశాబ్దాల కాంగ్రెస్ పాలనతో వ్యవసాయ రంగం వెన్నువిరిగిబతుకుదెరువు కోసం వలసబాట పట్టిన అన్నదాతలలో ఆత్మవిశ్వాసం నింపివ్యవసాయం దండగ కాదు పండగ అని చాటిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదికరోనా విపత్తులోనూ కర్షకులకు బాసటగా నిలిచిన చరిత్ర కేసీఆర్ గారిదిప్రతి ఊరికీ వెళ్లి పంటలు కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్ గారిదిరైతుబంధును రాజకీయం చేసి రైతుభరోసా అంటూ భ్రమలు కల్పించిరైతు బీమాను మాయం చేసి.. 24 గంటల ఉచిత విద్యుత్తును ప్రశ్నార్థకం చేసి.. పంటల కొనుగోళ్లకు పాతరవేసి.. సాగునీళ్లను సాగనంపిఅన్నదాతల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి రైతును రహదారుల పైకి లాగినమీరా.. రైతుల గురించి మాట్లాడేది!రైతుభరోసాకు ఎగనామం పెట్టి రుణమాఫీ పేరుతో కనికట్టు చేసినా మీరా .. రైతుల గురించి మాట్లాడేది !ఇల్లిల్లూ తిరిగి అబద్దపు హామీలు ఇచ్చి నాడు ఓట్లు అడుక్కున్న చరిత్ర మీదిఅధికారం దక్కాక ఇల్లిల్లూ తిరిగి ఎమ్మెల్యేలను అడుక్కుని, కొనుక్కున్న చరిత్ర మీదిరైతులు ఎప్పుడూ .. ఆశపడతారు తప్ప అడుక్కోరుసమయం రాక పోదు మీకు గుణపాఠం చెప్పక పోరుజాగో తెలంగాణ జాగో’ అంటూ కామెంట్స్ చేశారు. -
సర్కారును ఎలా ఎదుర్కొందాం?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శాసనసభాపక్షం కీలక భేటీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 8న (ఆదివారం) మధ్యాహ్నం ఒంటి గంటకు జరిగే ఈ భేటీకి రావాల్సిందిగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొందరు ముఖ్య నేతలను ఆహ్వానించనున్నారు.అసెంబ్లీ ఉభయ సభల్లో లేవనెత్తాల్సిన అంశాలపై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత హాజరుకావాలంటూ సీఎం రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలపై ఈ భేటీ సందర్భంగా కేసీఆర్ తన మనోగతాన్ని వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. 9న జరిగే శాసనసభ బీఏసీ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించే ఎజెండాలోని అంశాలను బట్టి కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యేదీ, లేనిదీ స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అలా గొంతు నొక్కితే ఎలా?ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తమ గొంతునొక్కారని బీఆర్ఎస్ ఆరోపించింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనూ అదే రకమైన పరిస్థితి తలెత్తితే ఎలా ఎదుర్కోవాలన్న వ్యూహంపైనా బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. 9న కొత్త రూపుతో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో.. శుక్రవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. ఎర్రవల్లి నివాసంలో జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై కేసీఆర్ సూచనలు చేసినట్టు సమాచారం.9న ‘తెలంగాణ తల్లి’ విగ్రహావిష్కరణఏడాది పాలన విజయోత్సవాల్లో భాగంగా సచివాలయంలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరించనుంది. అయితే తెలంగాణ తల్లి విగ్రహం రూపు మార్చడాన్ని వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ అదే రోజున పోటీ కార్యక్రమానికి సిద్ధమైంది. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఉద్యమకాలంలో రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు సన్నాహాలు చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇక పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సుదీర్ఘ లేఖ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.ఇక రేవంత్ ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలను ఎత్తిచూపుతూ శనివారం చార్జిషీటు విడుదల చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. మాజీ మంత్రి హరీశ్‌రావుకు ఈ చార్జిషీటు బాధ్యత అప్పగించినట్టు తెలిసింది. మరోవైపు అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్‌ను ఆహ్వానిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రభుత్వపరంగా ఎలాంటి ఆహ్వానం అందలేదని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
తండ్రీ కొడుకులు తప్ప ఆ పార్టీలో ఎవరూ మిగలరు
సాక్షి, హైదరాబాద్: తండ్రీకొడుకులు తప్ప బీఆర్ఎస్లో ఎవరూ మిగలరని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బి. మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు. సోని యా గాంధీ లేనిదే తెలంగాణ లేదని, అధికారం పో యినా కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదని అన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, ఎమ్మెల్సీలు ఆమేర్అలీ ఖాన్, బల్మూరి వెంకట్, టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్స్ చైర్మన్ సామా రామ్మోహన్‌రెడ్డి, అధికార ప్రతినిధి బైకాని లింగం యాదవ్‌లతో కలసి ఆయన మాట్లాడుతూ సోనియా గాంధీ జన్మదినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈనెల 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని, ఈ పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో పయనిస్తోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో పదేళ్ల కాలంలో 50 వేల ఉద్యోగాలిస్తే, తాము ఏడాదిలోనే ఇచ్చామని చెప్పారు.రాజీవ్ గాంధీ గురించి విమర్శించే అర్హత కేటీఆర్‌కు లేదని అన్నారు. రాజీవ్ కుటుంబం దేశం కోసం అనేక త్యాగాలు చేసిందని, తెలంగాణ కోసం కేటీఆర్, ఆయన కుటుంబం ఏం త్యాగాలు చేసిందని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేస్తామని కేటీఆర్ అంటున్నారని, అసలు బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందా? అని ప్రశ్నించారు. ప్రజలు మళ్లీ గెలిపిస్తారని కేటీఆర్ పగటి కలలు కంటున్నారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉంటే బీఆర్ఎస్ హయాంలో రూపొందించిన విగ్రహం దొరసానిలా ఉందన్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌లో బంధించి.. కేటీఆర్, హరీశ్‌రావులు పిల్ల చేష్టలు చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వాడిన భాష సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని, చట్టం ఎవరికీ చుట్టం కాదని, శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తే ఎవరినీ సహించేది లేదని హెచ్చరించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పదేళ్లలో తెలంగాణకు చేసిన మేలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. -
మూడు రోజులు.. అట్టహాసంగా..
సాక్షి, హైదరాబాద్: ఈనెల 9వ తేదీతో ముగియ నున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా చివరి మూడు రోజుల పాటు గ్రాండ్ ఫినాలే పేరుతో అట్టహాసంగా వేడుకలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల్లో భాగంగా ఈనెల 7వ తేదీ శనివారం ఉదయం హైదరాబాద్‌లో హోంశాఖ ఆధ్వర్యంలో విపత్తు స్పందన దళాన్ని ప్రారంభిస్తారు. పోలీస్ బ్యాండ్‌తో పాటు ఆయుధాలను ప్రదర్శించనున్నారు. నేరాల నియంత్రణ, యాంటీ డ్రగ్స్ క్యాంపెయినింగ్ స్టాళ్లను ప్రారంభిస్తారు. అదే సమయంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అత్యవసర స్పందన వాహనాలను కూడా ప్రారంభించనున్నారు.అనంతరం సాయంత్రం గ్రాండ్ ఫినాలే కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. మూడు రోజుల పాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా మిరుమిట్లు గొలిపేలా వీధిలైట్లు, ట్యాంక్‌బండ్ సమీపంలో థాంక్యూ సెల్ఫీ పాయింట్లు, ఫుడ్ స్టాల్స్, హస్తకళల స్టాళ్లు, ఆర్ట్ గ్యాలరీలు ఏర్పాటు చేయనున్నారు. ఫ్లాష్ మాబ్షోలు, కల్చరల్ షోలు, మ్యూజిక్ ఫెస్టివల్స్, ప్రముఖులతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మున్సిపల్‌శాఖ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు ఈ గ్రాండ్ ఫినాలే వేడుకలను సమన్వయం చేయనున్నాయి. రెండోరోజు 8వ తేదీ ఆదివారం పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో కృత్రిమ మేధస్సుకు సంబంధించిన 7 స్టార్టప్‌లను ప్రారంభించనున్నారు. అదేవిధంగా 130 కొత్త మీ సేవ కేంద్రాలు ప్రారంభిస్తారు.అదే రోజు 15 పరిశ్రమ లతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనుంది. ఏఐ సిటీలో మౌలికసదుపాయాల కల్పనకు, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తారు. ఇక, చివరి రోజు 9వ తేదీ సోమవారం ఉదయం అసెంబ్లీలో ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత సాయంత్రం సెక్రటేరియెట్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరిస్తారు. లక్ష మంది స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళా సభ్యుల సమక్షంలో ఈ ఆవిష్కరణ జరగనుంది. అనంతరం సభలో సీఎం రేవంత్ ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా నెక్లెస్‌రోడ్డులో బాణసంచా కాల్చడంతో పాటు డ్రోన్‌షో, సాంస్కృతిక కార్యక్రమాలు, గ్రాండ్ కార్నివాల్ నిర్వహించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. -
వెలమలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. వెలమలపై భౌతిక దాడులు చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఖబడ్దార్ వెలమల్లారా అంటూ హెచ్చరించారు. కుట్రలు చేసే వెలమల వీపులు విమానాలు మోగుతాయంటూ వార్నింగ్ ఇచ్చారు.వెలమ సామాజికవర్గాన్ని అసభ్య పదజాలంతో దూషించిన వీర్లపల్లి శంకర్‌పై దోమలగూడ పోలీస్ స్టేషన్లో ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం పద్దతి కాదన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలను వెలమ సంఘం ఖండిస్తోందని.. ఆయన వ్యాఖ్యలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వాడిన భాషతో వెలమ సామాజికవర్గ అందరి మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. -
లగచర్ల ఘటన.. పట్నం నరేందర్ రెడ్డికి మరో షాక్!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి మరో షాక్ తగిలింది. నరేందర్ రెడ్డికి కొడంగల్ కోర్టు పోలీసు కస్టడీ విధించడంతో ఆయనను పోలీసులు విచారించనున్నారు. లగచర్ల దాడి కేసులో నరేందర్ రెడ్డిని రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు కోర్టు అనుమతినిచ్చింది.వివరాల ప్రకారం..లగచర్ల దాడి కేసులో విచారణ చేసేందుకు పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని ఇటీవల పోలీసులు కొడంగల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈనేపథ్యంలో పోలీసుల పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరిపింది. అనంతరం, నరేందర్ రెడ్డిని రెండు రోజుల పోలీసు కస్టడీకీ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శనివారం ఉదయం నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలు నుంచి వికారాబాద్‌కు తరలించనున్నారు. అక్కడే రెండు రోజుల పాటు పోలీసులు ఆయన్ను ప్రశ్నించనున్నారు. అయితే, న్యాయవాది సమక్షంలోనే ఈ విచారణ జరపాలని పోలీసులను ఆదేశించింది. ప్రస్తుతం నరేందర్ రెడ్డి.. చర్లపల్లి జైలులో ఉన్నారు. -
అప్పులు మీరు చేస్తే.. వడ్డీలు మేము కడుతున్నాం: భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అప్పులు కట్టడానికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అతలాకుతలం చేసిందంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్ని ఇబ్బందులున్నా.. ప్రభుత్వాన్ని సక్రమ మార్గంలో నడిపిస్తున్నామని చెప్పుకొచ్చారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ..‘గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేసింది. మేము 54వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. బీఆర్ఎస్ పాలనలో పదేళ్లలో రూ.7లక్షల కోట్లు అప్పులు చేశారు. అప్పులు కట్టడానికి కూడా అప్పులు చేయాలల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు రూ.64వేల కోట్లు అప్పులు చెల్లించాం.అప్పులు మీరు చేస్తే.. వడ్డీలు మేము కడుతున్నాం. శాలరీలు, పెన్షన్ల కోసం రూ.60 కోట్లు ఖర్చు చేశాం. అధిక పన్నులు వేయకుండానే ప్రతీ పైసా అర్థవంతంగా ఖర్చు చేస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి మంత్రులంతా కృషి చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అతలాకుతలం చేసింది. ఎన్ని ఇబ్బందులున్నా.. ప్రభుత్వాన్ని సక్రమ మార్గంలో నడిపిస్తున్నాం. విద్యుత్‌పై భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికబద్దంగా ముందుకెళ్తున్నాం. మేము అధికారంలోకి రాగానే ఆర్థిక వ్యవస్థపై వైట్ పేపర్ ప్రకటించాం’ అని చెప్పుకొచ్చారు. -
కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగాం: మంత్రి పొన్నం
సాక్షి,హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వ విజయోత్సవాల్లో భాగంగా సెక్రటేరియట్లో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించనుంది.ప్రభుత్వం తరపున ఆహ్వాన ప్రతికను అందించేందుకు ఇప్పటికే కేసీఆర్ అపాయింట్మెంట్ కోరినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేసీఆర్‌తో పాటు బీజేపీ కేంద్ర మంత్రులు ప్రభుత్వం తరపున ఆహ్వానాన్ని అందించేందుకు వారి సమయం కోరినట్లు మంత్రి పొన్నం చెప్పారు.కాగా,సెక్రటేరియట్లో తెలంగాణతల్లి విగ్రహ ఏర్పాటు స్థలంపై బీఆర్ఎస్ తొలినుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. నిజానికి రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన చోట తెలంగాణతల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణతల్లి విగ్రహంలో చేసిన మార్పులపైనా బీఆర్ఎస్ గుర్రుగా ఉంది.