breaking news
-
‘ఆ మాటలు మేము చెప్పం..’
హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) తరహా ‘బంగారు తెలంగాణ’ అనే మాటలు తాము చెప్పమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy Venkat Reddy). ఈరోజు(మంగళవారం) సాక్షి టీవీతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడారు. ‘నాల్గో తేదీన క్యాబినెట్ సమావేశం ఉంది. క్యాబినెట్ సమావేశంలో రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటుంది. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసమే ప్రజా ప్రభుత్వం పని చేస్తుంది. సంక్రాంతికి రైతు భరోసా(Rythu Bharosa)నిధులు రైతులకు అందిస్తున్నాం, రైతులకు, తెలంగాణ ప్రజలకు ఇప్పటికే చేయాల్సింది చాలా చేశాం. రాబోయే ఐదేళ్లు మరింత కష్టపడి పనిచేస్తాం. ఆరువేల కోట్ల రూపాయలు పెట్టి ఔటర్ రింగ్ రోడ్డు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కడితే.. ఏడు వేల కోట్లకు కేసీఆర్ అమ్ముకున్నాడు. డ్రగ్స్ నిర్మూలన కోసం సాక్షి నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమానికి అభినందనలు’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. -
అప్పటి వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దు : హైకోర్టు
సాక్షి,హైదరాబాద్ : ఫార్ములా-ఈ రేసు వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు ప్రకటించే వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం ఉదయం కేటీఆర్ తరుఫు న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు విన్న కోర్టు మధ్యాహ్నం నుంచి ఏసీబీ తరుఫు వాదనల్ని వింటోంది.ఏసీబీ తరుఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు ప్రారంభించారుఈ కార్ రేసు కేసు విచారణ పురోగతి ఏంటని.. ఏజీ సుదర్శన్‌రెడ్డిని ప్రశ్నించిన జస్టిస్ లక్ష్మణ్ఫిర్యాదుదారు స్టేట్మెంట్ రికార్డ్ పూర్తైందన్న ఏజీఏసీబీ విచారణ కొనసాగుతోందని తెలిపిన ఏజీనగదు బదిలీ పై ప్రోజీర్ ఫాల్ కాలేదన్న ఏసీబీ తరుపు వాదనలుబిజినెస్ రూల్స్ కాపీ అడిగిన న్యాయమూర్తిరూల్స్ కాపీని అందించిన ఏసీబీ న్యాయవాదిఈడీ సైతం నోటీసులు జారీ చేసిందని తెలిపిన ఏసీబీ న్యాయవాది FEO తో అగ్రిమెంట్ చేసుకున్నారు .. కానీ దాని ద్వారా ఎలా లాభాలు వస్తాయో చెప్పలేదు .. AG సుదర్శన్ రెడ్డిమూడు దఫాలుగా నగదు బదిలీ చేశారు55 కోట్లు ఎలాంటి అనుమతులు లేకుండా FEO కి బదిలీ చేశారుఏసీబీ దర్యాప్తు ఎక్కడ వరకు వచ్చింది - హైకోర్టుఈ కేసులో ఎంత మంది స్టేట్మెంట్ రికార్డ్ చేశారు - హైకోర్టుఇప్పటి వరకు ఫిర్యాదు దారుడు దాన కిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశామన్న ప్రభుత్వ తరుఫు న్యాయ వాదిఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఎలాంటి ఆధారాలు సేకరించారని ప్రశ్నించిన న్యాయస్థానంకేసు విచారణ కొనసాగుతుంది .. విచారణ దశలో అన్ని ఆధారాలు బయట పడుతాయన్న ప్రభుత్వ తరుఫు న్యాయ వాదికేటీఆర్ తరుపున న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు ప్రారంభంఅవినీతి జరిగిందని ఏసీబీ అధికారులు సెక్షన్లు పెట్టారు ఎక్కడ, ఎలా జరిగిందో మాత్రం పేర్కొనలేదులబ్ధి చేకూర్చినట్లు చెబుతున్న సంస్థపై కేసు పెట్టలేదుబిజినెస్ రూల్స్ ఉల్లంఘన అని చెబుతున్నారు..ప్రతి ఉల్లంఘన క్రిమినల్ నేరం కిందకు రాదన్న దవేదర్యాప్తు ప్రారంభ దశలోనే ఉందన్న ఏజీఫిర్యాదుదారు స్టేట్మెంట్ రికార్డు చేశాంవిచారణలో నిందితులను చేరవచ్చు.. తొలగించవచ్చుఆ అధికారం దర్యాప్తు సంస్థలకు ఉంటుందిబిజినెస్ రూల్స్‌ను ఉల్లంఘించి నగదు బదిలీ చేశారుపారెన్ కరెన్సీలో చెల్లింపులు నిబంధనలకు విరుద్ధమన్న ఏజీ3 గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగిన వాదనలుకేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు పూర్తి..తీర్పు రీజర్వ్ చేసిన హైకోర్టు.తీర్పు ప్రకటించే వరకు కేటీఆర్ అరెస్ట్ చెయ్యొద్దన్న హైకోర్టుఏసీబీ దర్యాప్తు చేయోచ్చు తీర్పు వెలువరించే వరకు... కేటీఆర్ అరెస్టు వద్దుమధ్యంతర ఉత్తర్వులను పొడిగించిన హైకోర్టుఫార్పులా ఈ కార్ రేసింగ్ కేసుపై ముగిసిన వాదనలుతీర్పు రిజర్వు చేసిన జస్టిస్ కె.లక్ష్మణ్క్వాష్ పిటిషన్‌పై ముగిసిన కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు..మధ్యాహ్నం లంచ్ బబ్రేక్ తర్వాత ఏసీబీ న్యాయవాది వాదనలు కేటీఆర్ న్యాయవాది దవే వాదనలుకేటీఆర్ ఈ కేసులో లబ్ధి పొందినట్లు ఎఫ్ఐఆర్లో ఎక్కడా లేదుఈ కేసులో అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు వర్తించవుఫార్ములా- ఈ రేసుల సీజన్ 10 నిర్వహణ కోసం మంత్రిగా కేటీఆర్ అనుమతులిచ్చారుకొత్తగా వచ్చిన బీఎన్ఎస్ చట్టం కాకుండా ఐపీసీ సెక్షన్లు ఎందుకున్నాయని ప్రశ్నించిన హైకోర్టు14 నెలల క్రితం నేరం జరిగింది కాబట్టి పాత చట్టం ప్రకారం కేసు నమోదు చేశారని తెలిపిన కేటీఆర్ తరఫున న్యాయవాది దవేఐపీసీ 409పై కొనసాగుతున్న వాదనలుకేటీఆర్ ఎఫ్ఈవోతో జరిగిన ఒప్పందం ఎలాంటి లాభం పొందలేదుఅసలు ఈ కేసులో ఐపీసీ 409 సెక్షన్ వర్తించదు.. ఆధారాలు కూడా లేవుఫార్ములా ఈ రేసుల ఆపరేషన్స్ ఎఫ్ఈఓ చేసినందున వాళ్లను ఎందుకు ఎఫ్ఐఆర్లో చేర్చలేదుఈ కేసులో నిందితుడు కేటీఆర్ చేర్చినప్పుడు ఎఫ్ఈఓను కూడా చేర్చాలి కదాఎఫ్ఈఓతో అగ్రీమెంట్ పై సంతకం చేసింది అరవింద్ కుమార్ కేటీఆర్ కాదుఫార్ములా-ఈ కేసు: కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై విచారణ ప్రారంభంహైకోర్టులో ప్రారంభమైన కేటీఆర్ పిటిషన్‌పై విచారణ కేటీఆర్ తరపున వాదనలు వినిపిస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ దవేనేటితో ముగియనున్న కేటీఆర్ నాట్ టు అరెస్టు గడువు ఫార్ములా-ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హైకోర్టు ఇచ్చిన ఊరట ‘నాట్ టు అరెస్ట్’ గడువు మంగళవారం(డిసెంబర్31)తో ముగియనుంది. కేసును హైకోర్టు నేడు తిరిగి విచారించనుంది. ఎఫ్ఐఆర్ కొట్టేయాలంటూ కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ పై ఏసీబీ ఇప్పటికే కౌంటర్ దాఖలుచేసింది. కేటీఆర్ పిటిషన్‌కు విచారణార్హత లేదని ఏసీబీ కౌంటర్లో పేర్కొంది.కేటీఆర్ ఆదేశాలతోనే ఎఫ్ఈఓ కంపెనీకి నిధుల బదిలీ జరిగిందని తెలిపింది. అన్ని అనుమతులు తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదుచేశామని పేర్కొంది. విచారణ ప్రాధమిక దశలో ఉన్నందున బెయిల్, క్వాష్ ఊరట ఇవ్వొద్దని ఏసీబీ కోర్టును కోరింది. ఏసీబీ కౌంటర్‌పై హైకోర్టులో కేటీఆర్ కౌంటర్ అఫిడవిట్ దాఖలుచేశారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని తెలిపారు.మంత్రిగా నిధుల బదిలీ మంత్రిగా తనకు సంబంధం లేని వ్యవహారమని పేర్కొన్నారు. విదేశీ సంస్థలకు నిధుల బదిలీ అనుమతి బ్యాంక్‌కు చెందిన అంశమని తెలిపారు. రాజకీయ కక్ష సాదింపుతో తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు. కాగా, ఈడీ సైతం ఈ కేసులో కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. జనవరి 7న కేటీఆర్ విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో కోరింది. -
ఏంటా రహస్యం?.. అసెంబ్లీలో మల్లు సోదరుల గుసగుసలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క.. ఆయన సోదరుడు, నాగర్‌కర్నూల్ లోక్‌సభ సభ్యుడు మల్లు రవి గుసగుసలాడుకున్నారు. అసెంబ్లీ లాబీల్లోని భట్టి చాంబర్‌కు మల్లురవి రాగా, ఆ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుతో పాటు ఇతరులు భట్టి చాంబర్లోనే ఉన్నారు. దీంతో తన సోదరుడితో రహస్యంగా మాట్లాడి మల్లు రవి వెళ్లిపోయారు.అయితే, అసెంబ్లీలో ఈ అన్నదమ్ములు ఎందుకు గుసగుసలాడారా అన్న విషయంపై ‘సాక్షి’ ఆరా తీయగా, రహస్యమేమీ లేదని ఎంపీ మల్లురవి చెప్పారు. అసెంబ్లీ ఆమోదం పొందిన మన్మోహన్సింగ్ సంతాప తీర్మానం ఇప్పించాలని, దానిపై తెలంగాణ ఎంపీల సంతకాలు పెట్టించి రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రికి ఇస్తానని భట్టికి చెప్పానని ఆయన వెల్లడించారు.ఇదీ చదవండి: హుస్సేన్ సాగర్ చుట్టూ నో ఎంట్రీ... హద్దు మీరితే అంతే -
మన్మోహన్‌కు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం దేశ సర్వోన్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి రాష్ట్ర శాసనసభ తరఫున విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ఆర్థికవేత్త అయిన మన్మోహన్సింగ్.. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా, ఆర్బీఐ గవర్నర్‌గా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా వివిధ హోదాల్లో దేశానికి విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. మన్మోహన్‌కు నివాళి అర్పించేందుకు సోమవారం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి మాట్లాడారు. మాజీ ప్రధాని కుటుంబ సభ్యులకు సభ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. సభలో రేవంత్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్. 1991–96 మధ్య మన పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిగా భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించారు. ఆర్థిక స్థితిగతుల దశదిశను మార్చిన సంస్కరణల అమల్లో కీలక పాత్ర పోషించారు. ఆ పునాదులతోనే నేడు భారతదేశం ప్రపంచంతో పోటీపడుతోంది. ఆయన దార్శనికత, కృషిని అంతా స్మరించుకోవాలి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మన్మోహన్ విగ్రహం మన్మోహన్సింగ్ దేశానికి, ప్రత్యేకంగా తెలంగాణకు చేసిన సేవలకు శాసనసభ అపార కృతజ్ఞతలు తెలియజేస్తోంది. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆయనకు రుణపడి ఉన్నారు. తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ ఇచ్చిన మాటను పార్లమెంటరీ ప్రక్రియలో నెరవేర్చిన గొప్ప నేత మన్మోహన్. రాజ్యసభలో రాజ్యాంగ సవరణపై వచ్చిన చర్చలో తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోతుందన్న గందరగోళ పరిస్థితి ఏర్పడినప్పుడు మన్మోహన్ వ్యూహాత్మకంగా ప్రకటన చేయడంతోనే తెలంగాణ ఏర్పడింది. నాటి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ఆయనతో మాట్లాడి సమన్వయపర్చారు. రాష్ట్రానికి పురుడు పోసిన డాక్టర్‌గా, తెలంగాణ బిల్లును ఉభయ సభల్లో ఆమోదింప జేసిన సారథిగా ఆయనను తెలంగాణ సమాజం ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటుంది. తెలంగాణ ప్రజల తరఫున రాజకీయాలు, పార్టీలకు అతీతంగా కృతజ్ఞతలు తెలపడమే కాకుండా ఘన నివాళి అర్పించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు సోనియాకు ఎంత రుణపడి ఉంటారో మన్మోహన్‌కూ అంతే రుణపడి ఉంటారు. గొప్ప ఆర్థికవేత్త అయిన మన్మోహన్సింగ్ విగ్రహాన్ని హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆవిష్కరించుకుందాం. ఆయన వర్ధంతి, జయంతి కార్యక్రమాలు చేసుకుందాం. తెలంగాణ పట్ల ప్రత్యేక అభిమానం.. నేను మన్మోహన్ మరణవార్త తెలిసి హుటాహుటిన ఢిల్లీ వెళ్లి ఆయన కుటుంబాన్ని కలిసి తెలంగాణ సీఎంగా పరిచయం చేసుకున్నాను. మన్మోహన్ సతీమణి నాతో మాట్లాడారు. ‘మన్మోహన్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇచ్చారు. ఆయనకు తెలంగాణ పట్ల ప్రత్యేక అభిమానం ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి, ఆయన ఆశీస్సులు మీకు ఉంటాయి.’ అని ఆమె చెప్పారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన మన్మోహన్.. తన కుటుంబాన్ని అత్యంత నిరాడంబరంగా నడిపించారు. ఆయనను కోల్పోవడం వారి కుటుంబానికే కాదు యావత్ దేశానికి, ప్రపంచానికి తీరని లోటు. మౌనంగా ఉంటారని, మౌన ముని అని, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని రకరకాలుగా విమర్శించినా సహనాన్ని కోల్పోకుండా పనినే ధ్యాసగా, జీవిత లక్ష్యంగా చేసుకున్న గొప్ప వ్యక్తి మన్మోహన్. నేను, ఉత్తమ్, కోమటిరెడ్డి ఎంపీలుగా ఉన్నప్పుడు పార్లమెంట్లో ధర్నా చేస్తుంటే.. మన్మోహన్ కూడా మా మధ్య కూర్చుని నిరసన తెలిపారు. మాకు జీవితకాలం గుర్తుండిపోయే ఘటన అది. గొప్ప మానవతావాదం చూపారు ఉపాధి హామీ, సమాచార హక్కు, విద్యా హక్కు, ఆహార భద్రత వంటి నిర్ణయాలతో మన్మోహన్ చరిత్ర సృష్టించారు. గతంలో ప్రభుత్వాలు యజమానులతో సంబంధం లేకుండా భూములను తీసుకునేవి. కానీ కేవలం భూమి కోల్పోయేవారికే కాకుండా కులవృత్తులు, చేతువృత్తులపై ఆధారపడిన వారు, ఇళ్లు లేనివారికి సహాయ పునరావాసం అందేలా 2013లో భూసేకరణ చట్టం తెచ్చి గొప్ప మానవతావాదం చూపించారు. 2006లో అటవీ హక్కుల చట్టాన్ని తీసుకురావడంతో ఆదివాసులు, గిరిజనులకు పోడుభూములకు పట్టాలు ఇవ్వగలుగుతున్నాం. గొప్ప పరిపాలన అందించడానికి అంబేడ్కర్ రాజ్యాంగం ఇచ్చి పునాదులు వేయగా.. ఆ స్ఫూర్తితో మన్మోహన్ చట్టాలు తెచ్చి ప్రజలకు మేలు చేశారు..’’ అని సీఎం రేవంత్ కొనియాడారు. -
మన్మోహన్ చిరస్థాయిగా నిలిచిపోతారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉన్నంతకాలం మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పేరు నిలిచిపోతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంట్లో అవసరమైన బలం లేకున్నా ప్రతిపక్షాలను ఒప్పించి నాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాం«దీ, ప్రధాని మన్మోహన్ తెలంగాణ బిల్లును ఆమోదింపజేశారని గుర్తు చేసుకున్నారు. సోమవారం శాసనసభ ప్రత్యేక సమావేశంలో మన్మోహన్‌కు నివాళి అర్పిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చలో భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క తదితరులు మాట్లాడారు. రుణమాఫీకి స్ఫూర్తినిచ్చారు: భట్టి చర్చలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘‘ఎందరో పుట్టి మాయం అవుతారు. కొందరు మాత్రమే ఈ భూమిపై మానవీయ పరిమళాలు వెదజల్లుతారు. అందులో మన్మోహన్ ఒకరు. దేశంలో తొలిసారిగా రైతు రుణమాఫీ చేసిన ప్రధాని ఆయనే. నేడు రాష్ట్రంలో రూ.2 లక్షల రుణమాఫీ అమలుకు స్ఫూర్తి ప్రదాత ఆయనే. దేశ ఆర్థిక, సామాజిక స్థితులను అర్థం చేసుకొని సమాచార హక్కు, అటవీ హక్కు, భూసేకరణ, ఉపాధి హామీ వంటి చట్టాలను తీసుకువచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడగా... ఉపాధి హామీతో దేశ ప్రజలు ఆర్థిక మాంద్యం బారిన పడకుండా కాపాడగలిగారు..’’అని పేర్కొన్నారు. అణు ఒప్పందం చేసుకున్న ధీశాలి: ఉత్తమ్ దేశానికి రైతు వెన్నెముక అయితే.. దేశ రైతాంగానికి మాజీ ప్రధాని మన్మోహన్ వెన్నెముకగా నిలిచారనని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. యావత్ దేశ రైతాంగానికి ఏకకాలంలో ఋణమాఫీ చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవడంతోపాటు ప్రతిపక్షాలు వ్యతిరేకించినా ఉభయసభల్లో బిల్లు పెట్టి ఆమోదింపజేసుకున్న ధీశాలి మన్మోహన్ అని కొనియాడారు. తన రాజకీయ గురువు పీవీ నరసింహారావు జన్మదిన వేడుకలను సంవత్సరం పొడవునా నిర్వహించాలని తమకు సూచించి గురుభక్తిని చాటుకున్నారని చెప్పారు. 114 ప్రెస్మీట్స్ పెట్టినా మౌన ప్రధానిగా విమర్శలు: శ్రీధర్‌బాబు మన్మోహన్ ప్రధానిగా మీడియా, విపక్షాల నుంచి నిరంతరం విమర్శలను ఎదుర్కొన్నారని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తు చేసుకున్నారు. ఆయన 114 ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడినా.. అన్యాయంగా మౌన ప్రధాని అని విమర్శించారని పేర్కొన్నారు. తెలుగు బిడ్డ పీవీ నాయకత్వంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ తీసుకొచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలే నేడు దేశ ప్రగతికి దోహదపడుతున్నాయని చెప్పారు. మన్మోహన్‌కు గుర్తుగా పార్కు: కోమటిరెడ్డి విగ్రహం ఏర్పాటు మాత్రమే కాకుండా మన్మోహన్ సింగ్‌కు గుర్తుగా మంచి పార్కును రూపొందించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. పార్లమెంటు ఎదుట ఎంపీలుగా తాము ధర్నాలో ఉండగా, తమ మధ్య కూర్చుకుని మద్దతు తెలపటాన్ని ఎన్నటికీ మరువలేమన్నారు. ఆయన వల్లే దేశ సుస్థిర ఆర్థిక పురోగతి: దామోదర రాజనర్సింహ దేశం స్థిరమైన ఆర్థిక పురోగతిని సాధించటంలో ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలే ప్రధాన కారణమని మంత్రి దామోదర రాజనర్సింహ కొనియాడారు. రాబోయే తరాలు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన గొప్ప వ్యవహార శైలి మన్మోహన్సింగ్దని పేర్కొన్నారు. దేశమంతా మాట్లాడుకునేలా చేశారు: మంత్రి పొన్నం మన్మోహన్సింగ్ ఎక్కువగా మాట్లాడరని అంతా అంటారని, కానీ తాను చేసిన కార్యక్రమాలపై ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేసిన గొప్ప వ్యక్తి ఆయన అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రపంచంలో మరే రాజకీయ నేత సాహసించని రీతిలో ఆయన సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. ఆయన మాట్లాడితే ప్రపంచమంతా వింటుంది: సీతక్క విద్యకు ఒకేసారి రూ.70 వేల కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించటమే కాకుండా దేశవ్యాప్తంగా 30 వేల పాఠశాలలను ఏర్పాటు చేశారని మన్మోహన్‌ను మంత్రి సీతక్క కొనియాడారు. మన్మోహన్ మాట్లాడితే ప్రపంచమంతా వింటుందని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా గొప్పగా చెప్పారని గుర్తు చేశారు. -
‘పవన్‌కు రేవంత్ ఏ విషయంలో గొప్పగా కనబడ్డారో?’
సాక్షి,కరీంనగర్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశంసిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు.పవన్‌కు రేవంత్ ఏ విషయంలో గొప్పగా కనబడ్డారో?. ఆరు గ్యారెంటీలను పక్కదారి పట్టించేందుకే.. అల్లు అర్జున్‌పై పవన్ వ్యాఖ్యలు చేశాడు. అల్లు అర్జున్, రేవంత్‌రెడ్డికి మధ్య ఎక్కడో చెడింది. 14 శాతం కమిషన్ వద్ద చెడిందేమో?’ అని బండి సంజయ్ సెటైర్లు వేశారు.కరీంనగర్ జిల్లా మాజీ సర్పంచులతో కలిసి బండి సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘సర్పంచుల బతుకులు నిర్వీర్యం కావాడానికి బీఅర్ఎస్, కాంగ్రెస్ కారణం. బకాయిలు మొత్తం చెల్లిస్తానంటే జెండాలు పక్కనబెట్టి కాంగ్రెస్ పార్టీకి సర్పంచులు మద్దతు ఇచ్చారు. గ్రామాలు కేంద్ర ప్రభుత్వం నిధులతోనే అభివృద్ధి చెందాయి. సర్పంచులు అప్పులపాలై ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. మాజీ సర్పంచులు బ్రతుకుదెరువు కొసం దుబాయ్ పోయే పరిస్థితి వచ్చింది. రూ.1300 కోట్ల సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చెయ్యాలి. గ్రామపంచాయతి ఎన్నికల్లో జెండాలు ప్రక్కన బెట్టి కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే కాంగ్రెస్ పార్టీకి బుద్ది వస్తుంది.’‘14% శాతం కమీషన్ల మీద ఈ ప్రభుత్వం నడుస్తోంది. ముగ్గురు మంత్రులు కమిషన్లు వసూలు చేస్తున్నారు. సచివాలయం, మంత్రుల పేషీలు కమీషన్లకి అడ్డాగా మారాయి. ఇక్కడి కమీషన్లతో ఢిల్లీలో కప్పం కడుతున్నారు. ఇప్పుడున్న మంత్రులందరికి ముఖ్యమంత్రి కావాలని ఉంది. ఢిల్లీకి డబ్బులు పంపడం వల్లనే సీఎం పదవి నిలబడుతుంది’ అని ఆరోపించారు. -
KTR: కేసులకు భయపడేదే లేదు
సాక్షి, తెలంగాణ భవన్: ఫార్ములా ఈ-కారు రేసు కేసులో విచారణకు రావాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ తరుణంలో కేసులకు భయపడేది లేదంటూ ఫార్ములా ఈ-కారు రేసింగ్ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ktr) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కేటీఆర్ సోమవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ క్యాడర్లో విశ్వాసం, ఆత్మస్థైర్యం కనిపిస్తోంది. కేసులకు భయపడేది లేదు. ఏసీబీ కేసులో బలం లేదని రేవంత్‌కు కూడా తెలుసు. నేను మాట మార్చలేదు.. చెప్పినదానికే కట్టుబడి ఉన్నా.ఈ కార్ రేసుకు మంత్రి హోదాలో నేనే డబ్బులు కట్టమన్నా. ప్రొసీజర్ ప్రకారం జరగకపోతే .. ఈసీ,ఆర్బీఐ దగ్గరకు ప్రభుత్వం ఎందుకు పోలేదు?.డబ్బులు ముట్టిన వారిపై కేసులు ఎందుకు పెట్టలేదు?’అని ప్రశ్నించారు. ఎప్పుడు బయటకు రావాలో కేసీఆర్‌కు తెలుసుఎప్పుడు బయటకు రావాలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు తెలుసు. 24ఏళ్ళు కేసీఆర్ కష్టపడ్డారు. కాస్త రెస్ట్ తీసుకుంటున్నారు. తెలంగాణ బిడ్డ పీవీపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతుంది. ఢిల్లీలో పీవీకి మెమోరియల్ కట్టాలని అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేయరు? మరణంలో కూడా పీవీని కాంగ్రెస్ గౌరవించలేదు. పీవీకి గౌరవం దక్కేవరకు రాజ్యసభలో బీఆర్ఎస్ కొట్లాడుతుంది. రేవంత్‌కు బీజేపీ ఎంపీలు రక్షణ కవచంగా మారారు. అమృత్, సివిల్ సప్లై స్కాంలో కేంద్రం ఎందుకు విచారణ జరపదు. రాష్ట్ర ప్రభుత్వ కుంభకోణాలకు కేంద్రం సహకరిస్తుంది. 2025లో బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక, సంస్థాగత కమిటీ వేస్తాం. లోకల్ బాడీస్‌లో బీఆర్ఎస్ సత్తా చూపిస్తాం’అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో కీలక పరిణామంతెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫార్ములా ఈ-కారు రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్‌కు తాజాగా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో జనవరి ఏడో తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈడీ.. కేటీఆర్ సహా అరవింద్ కుమార్‌కు సైతం నోటీసులు ఇచ్చింది.వివరాల ప్రకారం.. ఫార్ములా ఈ-కారు రేసు కేసుకు సంబంధించి తాజాగా కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ సందర్భంగా వచ్చే నెల ఏడో తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇదే సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. వీరిని జనవరి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది. ఇక, ఫార్ములా ఈ-కారు రేసు కేసును ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద ఈడీ విచారణ జరుపుతోంది. ఫెమా నిబంధనలను ఉల్లఘించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. FEOకు 55 కోట్లు నగదు బదిలీ, ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కారు రేస్ కేటీఆర్.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ నమోదు చేసు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఈ నెల 21న కేటీఆర్.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్‌పై ఇప్పటికే విచారణ చేపట్టిన ధర్మాసనం కేటీఆర్‌ను ఈనెల 30 వరకు ఆరెస్ట్ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణను కొనసాగించవచ్చని హైకోర్టు పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ, పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్‌లకు నోటీసులు జారీ చేసింది. -
మన్మోహన్ సింగ్‌కు తెలంగాణ అసెంబ్లీ నివాళి
హైదరాబాద్, సాక్షి: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తెలంగాణ అసెంబ్లీ నివాళి అర్పించింది. ఏడు రోజుల సంతాప దినాల నిర్వహణలో భాగంగా.. ఇవాళ(డిసెంబర్ 30) ప్రత్యేక సెషన్ నిర్వహించింది. సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ ఆ తీర్మానానికి మద్దతు ప్రకటించారు. అలాగే మన్మోహన్‌కు దేశఅత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలనే తీర్మానానికి సైతం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ప్రజలకు మన్మోహన్‌కు రుణపడి ఉంటారు. 60 ఏళ్ల తెలంగాణ కల సాకారం ఆయనను తెలంగాణ సమాజం గుండెల్లో పెట్టుకుంటుంది. తెలంగాణ అంటే మన్మోహన్‌కు ప్రత్యేక అభిమానం ఉండేదని ఆయన సతీమణి తెలిపారు. ఆయన కుటుంబం చాలా నిరాడంబరంగా ఉంటుంది. గొప్ప విలువలతో తన కుటుంబాన్ని నడిపించారు. మన్మోహన్ పరిపాలనతోనే మనం గొప్ప ఆర్థిక శక్తిగా నిలబడగలిగాం. మన్మోహన్‌తో తెలంగాణకు ఉన్న బంధం ఎప్పటికీ మరవలేం. ప్రజలంతా గుర్తు పెట్టుకునే విధంగా మన్మోహన్ విగ్రహం ఏర్పాటు చేస్తాం. ప్రజలకు ఉపయోగపడే సంస్కరణల్లో ఆయన వెనకడుగు వేయలేదు. భూసేకరణ చట్ట సవరణ ద్వారా కోట్లాది మందికి లబ్ధి చేకూర్చారు. భూసేకరణ చట్టం-2013 ద్వారా చేతి వృత్తులు, కుల వృత్తుల వారు లబ్దిపొందారు. మన్మోహన్ చేసిన కృషిని అందరూ గుర్తుంచుకోవాలి. పోడు భూములకు కూడా పట్టాలు ఇవ్వగలుగుతున్నామంటే అది ఆయన చలువే. అంబేద్కర్ స్పూర్తితో పరిపాలన చేశారు. మన్మోహన్ గొప్ప ఆర్థికవేత్త, తత్వవేత్త, మానవతావాది. ఐటీ రంగాన్ని శాసించగలుగుతున్నామంటూ ఆయన సంస్కరణలే కారణం అని చెప్పుకొచ్చారు.ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. పనే ధ్యాసగా పనిచేశారు. బ్యూరోక్రాట్‌గా వివిధ దశల్లో పనిచేసి మన్మోహన్ దేశ ప్రధాని అయ్యారు. నీతి, నిజాయితీతో మన్మోహన్‌తో పోటీ పడేవారు లేరు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. తన పనే లక్ష్యంగా మన్మోహన్ ముందుకు సాగారు. మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి. 👉డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్.. ప్రతీ ఒక్కరి కోసం ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చారు. దేశ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పాలన అందించారు. మన్మోహన్ సంస్కరణలతో అనేక కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయి. సమాచార హక్కు చట్టాన్ని 2005లో తీసుకువచ్చారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం దేశ గతినే మార్చేసింది. ఆర్థిక మాంద్యం బారినపడకుండా ఉపాధి హామీ పథకం కాపాడింది. దేశ సామాజిక పరిస్థితులను అవగాహన చేసుకుని చట్టాలు చేశారు. ప్రతీ ఒక్కరి కోసం ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చారు. దశాబ్దాలుగా కొట్లాడుతున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు. విపక్షాలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేలా చేశారు. మన్మోహన్ మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. మన్మోహన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. అసామాన్యమైన మహా మనిషి మన్మోహన్. దేశం కోసం ఆయన కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా ప్రపంచ దేశాల్లో నిలబెట్టారు. మన్మోహన్ భారత్‌లో పుట్టినందుకు గర్వపడుతున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాం. 👉 కేటీఆర్ కామెంట్స్..మన్మోహన్ సింగ్ నిబద్ధతతోనే తెలంగాణ ఏర్పడింది. సీఎం రేవంత్ ప్రతిపాదనను స్వాగతిస్తున్నాం. మన్మోహన్ తెలివితేటలను గుర్తించింది మన తెలంగాణ బిడ్డ పీవీనే. ఎన్నో సంస్కరణలు చేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్. ఎన్ని రకాలుగా ఆయన్ని అవమానించినా మౌనంగా భరించారు. అయినా అవన్నీ పంటి కింద బిగబట్టి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన వ్యక్తి. పీవీ నర్సింహారావు తెలంగాణ బిడ్డ. ఢిల్లీలో మెమోరియల్ లేదు. అక్కడ మెమోరియల్ ఏర్పాటు చేయాలని శాసన సభ తీర్మానం చేయాలి.రాజకీయాలతో సంబంధం లేని ఆర్థిక వేత్తగా ఉన్న మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రపంచం అంతా దేశం వైపు చూసే విధంగా మన్మోహన్ సింగ్ ఆర్థిక నిర్ణయాలు ఉన్నాయి. లాయల్టీకి నిలువుటద్దంగా నిలిచిన గొప్ప మహనీయుడు మన్మోహన్ సింగ్. కేసీఆర్‌కు షిప్పింగ్ పోర్టుపోలియో ఇస్తే డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేయగానే కేసీఆర్ తెలంగాణ కోసం అది త్యాగం చేశారు. తెలంగాణ ఏర్పాటు మన్మోహన్ సింగ్ నాయకత్వంలో జరిగింది. తెలంగాణ డెలిగేషన్ తీసుకొని మన్మోహన్ సింగ్‌ను కలిశాం. 5 నిమిషాలు కాదు, ఎక్కువ సమయం కావాలని అడిగాం. సమస్య తీవ్రత తెలుసుకొని గంటన్నర సమయం ఇచ్చారు. ఓబీసీ అంశాలపై బలహీన వర్గాల డెలిగేషన్ ఢిల్లీ వెళ్లి కలిసింది.మన్మోహన్ సింగ్‌కు జరిగిన గౌరవ వీడ్కోలు.. మన పీవీ నరసింహారావుకు దక్కలేదు. ఢిల్లీలో అందరి ప్రధాన మంత్రులకు ఘాట్స్ ఉన్నాయి. పీవీకి తప్ప. పీవీకి ఢిల్లీలో స్మారకం ఏర్పాటు చేసేలా సభలో తీర్మానం పెట్టాలని కోరుతున్నాం. మన్మోహన్ సింగ్ విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేసినా మేమంతా వస్తాం.👉మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..దేశాభివృద్ధికి మన్మోహన్ సింగ్ అనేక గొప్ప విధానాలు తెచ్చారు. సాధారణ స్థాయి నుంచి ఉన్నతస్థాయికి ఎదిగారు. మన్మోహన్సింగ్ను ఆర్థికమంత్రిగా పీవీ నరసింహారావు ఎంపిక చేశారు. గ్రామీణ పేదలకు పని కల్పించే ఉపాధి హామీ పథకం తెచ్చారు. బీజేపీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కామెంట్స్..పీవీ నరసింహారావు గురించి సభలో గుర్తు చేస్తున్నారు.పీవీని పదేళ్లు పట్టించుకోకపోతే.. బీజేపీ పీవీకి భారతరత్న ఇచ్చింది.పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పీవీకి భారత రత్న ఇవ్వలేదు.మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేంద్ర ప్రభుత్వం వారం రోజులు సంతాప దినాలు ప్రకటిస్తే..రాహుల్ గాంధీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం వియత్నాం వెళ్లారట!రాజకీయాలకు అతీతంగా మన్మోహన్ సింగ్‌కు సంతాపం ప్రకటించాలి.మన్మోహన్‌కు దక్కిన గౌరవంతో పాటు అవమానం గుర్తు చేస్తున్నాం.సంతాప సభలో రాజకీయాలు ఎందుకు?. సభలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్..ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ.మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్..సంతాప తీర్మానం రోజు దాని గురించే మాట్లాడాలి.నిజంగా ఆర్ఎస్ఎస్ నేతలు కూడా మహేశ్వర్ రెడ్డి లాగా మాట్లాడరు.మధ్యలో వెళ్లిన మహేష్ రెడ్డి చించుకుంటూ మాట్లాడుతున్నారు.రాహుల్ గాంధీ ఎటు వెళ్లారు అన్నది ఇక్కడ చర్చ కాదు.సంతాప తీర్మానం గురించి మాత్రమే మాట్లాడితే బాగుంటుందిఏలేటి మహేశ్వర్ రెడ్డి కామెంట్స్..కాంగ్రెస్ పార్టీ ఎందుకు మధ్యలో కలగజేసుకుంటుంది.దేశం అంతా మన్మోహన్ సింగ్ గురించి వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటన చేసి జరుపుతుంటే..రాహుల్ గాంధీ వేడుకల కోసం వియత్నం వెళ్లలేదా?కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్‌ను అవమానించినట్లు కాదా ?మన్మోహన్ సింగ్ విగ్రహం గురించి మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ.. పీవీకి కూడా విగ్రహం పెడితే బాగుండు.కూనంనేని కామెంట్స్..దేశ గతి, గమనాన్ని మన్మోహన్ మార్చారు. మన్మోహన్‌కు నివాళి అర్పించే కార్యక్రమంలో రాజకీయాలు తగదు.సంతాప సభల్లో వేరే అంశాలను జోడించడం ఇంతకు ముందెన్నడూ చూడలేదునివాళి కార్యక్రమంలో ఇలా చేయడం వల్ల మన్మోహన్ ఆత్మ క్షోభిస్తుందినివాళి కార్యక్రమంలో ఆయన గొప్పతనాన్ని చెప్పాలినిజాయతీ, నిబంద్ధతకు నిలువుటద్దం మన్మోహన్ సింగ్. హరీష్ రావు కౌంటర్..కేసీఆర్ గురించి మాట్లాడుకోవాలంటే ఆయనకు సభ ఏం గౌరవం ఇచ్చింది.సభ సభ లాగా జరగడం లేదుపీఏసీ చైర్మన్ మీకు నచ్చినట్లు ఇచ్చుకున్నారు.కేసీఆర్‌ను అడిగి పీఏసీ చైర్మన్ ఇచ్చారా?తెలంగాణ కోసం కేసీఆర్ రెండున్నర ఏళ్ల పాటు ఉన్న కేంద్ర పదవిని వదిలేశారు.శాసనసభ్యుల అనర్హత పై మీరు నిర్ణయం తీసుకున్నారా?ఆ లెక్కన వస్తే మేము చాలా మాట్లాడగలుగుతాం.కానీ ఇప్పుడు మన్మోహన్‌కు మాత్రమే పరిమితమవుతున్నాం. స్పీకర్ కామెంట్స్..కేసీఆర్ ప్రస్తావన రాగానే కలగజేసుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ప్రత్యేక సమావేశాల కోసం కేసీఆర్‌కు స్వయంగా నేనే కాల్ చేశాను.అసెంబ్లీ సమావేశానికి రావాలని కేసీఆర్‌ను స్వయంగా ఆహ్వానించాను.కానీ, ఆయన రాలేదుహరీష్ రావు కామెంట్స్..మన్మోహన్ సింగ్ పెద్దల సభలో 33 ఏళ్లు ఉన్నారుఈరోజు శాసనసభతో పాటు పెద్దల సభ, మండలి కూడా సమావేశమై నివాళి అర్పిస్తే బాగుండేది.శాసన మండలిలో మన్మోహన్‌కు నివాళి అర్పిస్తే మరింత గౌరవంగా ఉండేదిశాసన మండలి సభ్యులు సైతం సంతాపం తెలిపేందుకు అడుగుతున్నారు.నెక్లెస్ రోడ్డుకు పీవీ పేరు పెట్టాం. పీవీ ఘాట్ ఏర్పాటు చేశాం.స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ పేరు పెట్టాలి.మన్మోహన్‌కు భారతరత్న ఇవ్వాలి.దేశం ఆర్థికంగా బలోపేతం కావాడానికి మన్మోహన్, పీవీ కృషి ఎంతో ఉంది.కేసీఆర్ నాయకత్వంలో పీవీకి భారతరత్న ఇవ్వాలని ఇదే అసెంబ్లీలో తీర్మానం చేశాం.కేంద్రం కూడా స్పందించి పీవీకి భారతరత్న ఇచ్చింది.మన్మోహన్‌ను మౌన ముని అని అంటారుమన్మోహన్పై చిన్న అవినీతి మరక కూడా లేదు.ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా చెరగని ముద్ర వేశారు.ఏఐసీసీ మీటింగ్‌లో మన్మోహన్ కంట తడి పెట్టారు.కాంగ్రెస్ ఓటమికి సంస్కరణలే కారణమని ఏఐసీసీలో చర్చించినా మన్మోహన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.మన్మోహన్ తెచ్చిన ఆర్డినెన్స్‌ను రాహుల్ చించేసినా ప్రధానిగా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కేసీఆర్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫోన్..👉నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నామని సభకు రావాలని కేసీఆర్‌కు తెలిపిన స్పీకర్. మరోవైపు.. అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి దూరంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. -
బాబు శిష్యుడు కాబట్టే.. విగ్రహం రూపు మార్చారు
నిజామాబాద్ నాగారం: ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి.. అందుకే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే తెలంగాణ తల్లి ఉండకూడదన్న ఉద్దేశంతో విగ్ర హం రూపు రేఖలు మార్చేశారు. కాంగ్రెస్ తల్లి విగ్రహాలను సెక్ర టేరియట్‌లో ఉంచారు. ఇక మ నం ఆమెనే కొలవాలట’ అంటూ ఎమ్మెల్సీ కవిత ధ్వజమె త్తారు. ‘తెలంగాణ తల్లి మాదిరా.. కాంగ్రెస్ తల్లి మీదిరా’ అంటూ నినదించారు. లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి విడుదలైన తర్వాత తొలిసారి ఆదివారం నిజామా బాద్ పర్యటనకు వచ్చిన కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఆమె పట్టణంలోని సుభాష్‌నగర్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ, తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను మాయం చేసి తెలంగాణ ఆడబిడ్డలను రేవంత్‌రెడ్డి అవమానించాడన్నారు.గురుకులాలను నడపడం కూడా ప్రభుత్వానికి చేతకావడం లేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే 57 మంది పిల్లలు చనిపోయారని తెలి పారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటి వరకు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకే ఉద్యోగాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తే బీజేపీ కేసులు పెడుతోందని, ఇక రాష్ట్రంలో అక్రమ కేసుల గురించి చెప్పనవసరం లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేశ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల మరణ మృదంగం.. సర్కార్‌కి పట్టింపు లేదా?: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: పోలీసుల మరణ మృదంగం.. ప్రభుత్వానికి పట్టింపు లేదా? అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మండిపడ్డారు. ఎక్స్ వేదికగా రేవంత్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘ములుగు జిల్లాలో ఎస్ఐ, సిద్ధిపేటలో కానిస్టేబుల్ కుటుంబం, కామారెడ్డిలో ఎస్ఐ, కానిస్టేబుల్, ఈ రోజు సిరిసిల్లలో కానిస్టేబుల్ కుటుంబం, మెదక్ కుల్చారంలో హెడ్ కానిస్టేబుల్.. వీరంతా స్వల్ప కాలంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ పోలీసులు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే వరసగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శాంతి భద్రతలు పరిరక్షించవలసిన రక్షకుల జీవితాలకే రక్షణ కరువైంది.’’ అని హరీష్‌రావు ట్వీట్ చేశారు.పని ఒత్తిళ్లు, పెండింగ్ హామీలను తీర్చడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పోలీసులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ ఆత్మహత్యలపై నిజానిజాలు వెలుగులోకి రావడానికి శాఖాపరమైన దర్యాప్తు చేయాలని డీజీపీని కోరుతున్నా. పోలీసుల్లో ఆత్మహత్యల ఆలోచనలు రాకుండా సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని హరీష్‌రావు పేర్కొన్నారు.ఇదీ చదవండి: తెలంగాణలో పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ‘‘పోలీస్ మిత్రులారా.. సమస్యలు ఏవైనప్పటికీ ఆత్మహత్యలు పరిష్కారం కాదు. ఎంతో కష్టపడి ఈ ఉద్యోగాలు సాధించారు. మీ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకండి. విలువైన జీవితాలను కోల్పోకండి. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన మీరు ఆత్మస్థైర్యంతో విధులు నిర్వహిస్తేనే సమాజానికి భద్రత.’’ అంటూ హరీష్‌రావు సూచించారు.పోలీసుల మరణ మృదంగం.. ప్రభుత్వానికి పట్టింపు లేదా ? ములుగు జిల్లాలో ఎస్సై, సిద్దిపేటలో కానిస్టేబుల్ కుటుంబం, కామారెడ్డిలో ఎస్సై , కానిస్టేబుల్, ఈ రోజు సిరిసిల్లలో కానిస్టేబుల్ కుటుంబం, మెదక్ కుల్చారంలో హెడ్ కానిస్టేబుల్... వీరంతా స్వల్ప కాలంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ పోలీసులు.…— Harish Rao Thanneeru (@BRSHarish) December 29, 2024 -
తులం బంగారం ఇచ్చారా?.. కాంగ్రెస్ నేతలను నిలదీయండి: కవిత
సాక్షి, నిజామాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎదుర్కోలేక కేటీఆర్, తనపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అయితే, తాము భయపడే వాళ్లం కాదు.. భయపెట్టే రకం అంటూ హెచ్చరించారు. ఇదే సమయంలో అభివృద్ధి చేయలేక తమపై కేసులు పెడుతున్నారని కామెంట్స్ చేశారు.ఎమ్మెల్సీ కవిత ఆదివారం నిజామాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో సమావేశవహయ్యారు. అనంతరం కవిత మాట్లాడుతూ..‘దేశంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. కేసీఆర్‌ను ఎదుర్కోలేక కేటీఆర్, నాపై కేసులు పెడుతున్నారు. అయినా భయపడేది లేదు. నేను, కేటీఆర్ ఏ తప్పు చేయలేదు. మాపై కేసులు పెట్టినా, ఇంకా ఎవరి మీద అయినా అక్రమ కేసులు బనాయించినా.. నిప్పు కణికల్లాగా బయటకు వస్తాం.పరిస్థితి ఎలా ఉందంటే.. కేంద్రాన్ని ఎదురించినా కేసు.. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిదన్నా కేసు. సీఎం పేరు మర్చిపోతే కేసు.. హీరో పేరు మర్చిపోతే కేసు. రైతులు భూమి ఇవ్వకపోతే కేసు. సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు పెడితే కేసులే.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల గురించి ఏం మాట్లాడినా కేసులే పెడుతున్నారు. అయినా మేము భయపడేది లేదు.. గట్టిగా నిలబడతాం. పోరాటం మాకేమీ కొత్త కాదు..ఎవరికైనా స్కూటీలు వచ్చాయా?. తులం బంగారం వచ్చిందా.. మహాలక్ష్మి వచ్చిందా?. ఎన్నెన్నో హామీలు ఇచ్చారు.. బీరాలు పలికారు. హామీలు నెరవేరాయా?. కాంగ్రెస్ వాళ్లను నిలదీయండి.. ప్రశ్నించండి. రుణమాఫీ అన్నారు.. పూర్తిగా చేయలేదు.. ఇందిరమ్మ ఇండ్లు అన్నారు.. దరఖాస్తులు చెత్త కుప్పలో పడేశారు. 57 మంది పిల్లలు గురుకులాల్లో చనిపోయారు. ఇంకా ఎంత మందిని పొట్టన పెట్టుకుంటారు. నిరుద్యోగులు మహిళలు ఉద్యోగులు విద్యార్థులు అందరినీ కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ పోలీసుల రాజ్యం నడుస్తోంది. ఇటు నుంచి సూర్యుడు అటు ఉదయించినా నిజామాబాద్‌లో రాబోయే రోజుల్లో గులాబీ జెండానే ఎగురుతుంది. రాబోయే లోకల్ ఎలక్షన్, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ ఎగరడం ఖాయం’ అంటూ కామెంట్స్ చేశారు. -
బీసీ రిజర్వేషన్లు పెంచాకే ‘స్థానిక’ ఎన్నికలు జరపాలి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికలను జరగనివ్వబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీని అమలు చేయకుంటే ఉద్యమిస్తామన్నారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్‌తో జనవరి 3న ఇందిరాపార్కు వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కవిత ప్రకటించారు. 40కి పైగా బీసీ సంఘాల నాయకులతో శుక్రవారం కవిత తన నివాసంలో భేటీ అయ్యారు.బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై ఆమె బీసీ సంఘాల నాయకులతో చర్చించారు. అనంతరం సమావేశంలో చర్చించిన అంశాలను మీడియాతో పంచుకున్నారు. ‘స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపు అంశంపై స్పష్టత ఇవ్వడం లేదు’అని కవిత పేర్కొన్నారు.జనవరి 3న సినిమా చూపిస్తాం ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్‌తో మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు జరుపుతాం. బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక సమర్పణ, బీసీల జనాభా సంఖ్యను వెల్లడించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. బీసీల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక పథకాల అమలును కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. మొత్తంగా బీసీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రశ్నిస్తూ, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్‌తో జనవరి 3న జరిపే సభ ద్వారా ప్రభుత్వానికి సినిమా చూపిస్తాం’అని కవిత ప్రకటించారు. -
దీని వెనుక ఏదో మతలబు ఉంది: ఎంపీ లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ను ఆర్ఆర్ఆర్(రీజినల్ రింగ్ రోడ్డు) బాధితులు ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కలిశారు. తమ సమస్యను ఎంపీ దృష్టికి బాధితులు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు తీసుకురావాలని గత ప్రభుత్వాన్ని రైతులు కోరారని.. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల పేదలు, రైతులు నష్టపోయారని పేర్కొన్నారు.‘‘కొన్ని ప్రాంతాల్లో ఆర్ఆర్ఆర్ దూరాన్ని కుదించడంలో మతలబు ఉంది. హెచ్ఎండీఏకు అవతల ఆర్ఆర్ఆర్ నిర్మాణం జరగాలి. అశాస్త్రీయ అలైన్మెంట్ ద్వారా నష్టం జరుగుతుంది. అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ రోజు ఎంపీగా ఉన్నవారు ఈ రోజు మంత్రులుగా కొనసాగుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నీరు గార్చుతున్నారనే దానికి ఇదే నిదర్శనం’’ అని లక్ష్మణ్ చెప్పారు.ఇప్పటికే కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు నితిన్ గడ్కారీ దృష్టికి తీసుకెళ్లారు, పేదవాళ్ల భూములు లాక్కోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. పేదలకు అండగా బీజేపీ ఉంటుంది. అన్యాయంగా భూములు లాక్కుంటే ఎంతటి పోరాటానికి అయిన బీజేపీ వెనకాడదు’’ అని ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. -
కేటీఆర్‌కు ఊరట వద్దు: ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ కౌంటర్
సాక్షి,హైదరాబాద్:ఫార్ములా-ఈ కార్ రేసుల(formula-e race) కేసులో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) హైకోర్టులో శుక్రవారం(డిసెంబర్27) కౌంటర్ ధాఖలు చేసింది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Ktr)కు ఇచ్చిన ఊరట (నాట్ టు అరెస్ట్) ఆదేశాలను ఎత్తివేయాలని ఏసీబీ తన కౌంటర్లో కోర్టును కోరింది.ఏసీబీ(Acb) వేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని కేటీఆర్ తరపు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మంగళవారం(డిసెంబర్31)కి కోర్టు వాయిదా వేసింది.కాగా ఫార్ములా-ఈ కార్ రేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేయగాకే కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు కేటీఆర్‌ను ఈ కేసులో 31 దాకా అరెస్టు చేయవద్దని ఏసీబీకి ఆదేశాలిచ్చింది. 31న జరిగే విచారణలో ఏం జరగనుందనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఇదీ చదవండి: చంద్రబాబుకు ఒక రూల్.. కేటీఆర్‌కు మరొకటా -
రేవంత్‌ను కలిసిన సినీ పెద్దలు.. రాజీ కుదిరినట్టేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమ పెద్దలు జరిపిన భేటీ పెద్దగా ఫలితమిచ్చినట్లు లేదు. బెనిఫిట్ షోలతోపాటు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి రేవంత్ రెడ్డి తన వాదనకు కట్టుబడి ఉండటంతో సినీ రంగం పెద్దలకు పాలుపోని పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని, టిక్కెట్ ధరలు విచ్చలవిడిగా పెంచుకోవడమూ సాధ్యం కాదని సీఎం కుండబద్ధలు కొట్టారు. పైగా తెలంగాణలో ఏర్పాటు చేయనున్న గురుకులాల కోసం సినిమా పరిశ్రమ నుంచి ఒక శాతం సెస్ వసూలు చేస్తామని కూడా సీఎం స్పష్టం చేయడంతో వారు నిస్సహాయులై, నిట్టూర్పులతో సమావేశం నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం ఒక మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం మాత్రం కొంత ఉపశమనమిచ్చే అంశం. ఈ ఉప సంఘం ద్వారా సినీ నిర్మాతలకు, ప్రభుత్వానికి మధ్య రాజీకి ప్రయత్నమేదైనా జరుగుతుందా? అల్లూ అర్జున్ విషయంలో ఏదైనా రాజీ కుదిరిందా? లేదా? అన్నది వేచి చూడాల్సిన అంశాలు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉండగా కూడా సినీ పరిశ్రమతో సత్సంబంధాల కోసం గట్టి ప్రయత్నమే జరిగింది. వైఎస్ జగన్.. సీనీ రంగ ప్రముఖులందరినీ సాదరంగా ఆహ్వానించి, గౌరవించారు. పరిశ్రమను ఆంధ్రకు తరలించాలని, ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలిస్తామని హామీ కూడా ఇచ్చారు. కానీ ఈ విషయంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియాలు దుష్ప్రచారం చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు కూడా అబద్దపు ఆరోపణలు చేశారు. మురళీ మోహన్ వంటి వారు ఎల్లో మీడియాతో మాట్లాడుతూ తమ కార్లను వైఎస్ జగన్ ఇంటి గుమ్మం వరకు రానివ్వలేదని తప్పుడు మాటలు మాట్లాడారు.చిన్న సినిమాలకూ రక్షణ ఉండాలని, ఏపీలో 30 శాతం షూటింగ్ చేయాలని, పెట్టుబడి వంద కోట్లు ఉంటే జీఎస్టీ వివరాలు ఇచ్చి ప్రోత్సాహాలు తీసుకుని, ధరలు కూడా పెంచుకోవచ్చని జగన్ చెబితే ఎల్లో మీడియా నానా రకాల అసత్యాలు ప్రచారం చేసింది. వైఎస్ జగన్‌కు కక్ష అని అన్నారు. టీడీపీ అనుకూల పత్రిక యజమాని జగన్‌కు సినిమా వాళ్లంటే పడదా అన్న ప్రశ్న వేస్తే ఖండించాల్సిన మురళీ మోహన్ సమర్థిస్తూ మాట్లాడారు. ఇప్పుడు అదే మురళీ మోహన్ తెలంగాణ సీఎంతో సమావేశమైనప్పటికీ తమ డిమాండ్లు నెరవేర్చాలని కనీసం గట్టిగా అడగనైనా అడగలేకపోయారు. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోతే గిట్టుబాటు కాదని మాత్రం గొంతు పెగల్చగలిగారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు వంటి వారు కూడా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ తదితర అంశాల గురించి మాట్లాడారే తప్ప అసలు సమస్యను మాత్రం వివరించలేకపోయారు.ఇక, అల్లు అర్జున్‌పై కేసు విషయానికి వస్తే.. ముఖ్యమంత్రి ఈ చర్యను గట్టిగా సమర్థించుకున్నారు. అయినా సరే.. ఆయన తప్పు లేదని చెప్పే సాహసం సినీ రంగ పెద్దలకు లేకపోయింది. ఆస్తులు, వ్యాపారాలన్నీ హైదరాబాద్‌లోనే ఉండటంతో వాళ్లు ఏమీ మాట్లాడలేకపోయారని, చివరకు బౌన్సర్లతో సమస్యలేమి వస్తాయని కూడా అడగలేకపోయారని అనిపిస్తోంది. రేవంత్ ఒక విషయం తేల్చి చెప్పారు. అల్లు అర్జున్‌పై తనకు కోపం ఏమీ లేదంటూనే.. ఆయన ఏదో ఫంక్షన్లో తన పేరు మరచిపోయినందుకు కేసు పెట్టానన్న ప్రచారాన్ని సినీ ప్రముఖులు ఖండించకపోవడాన్ని మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఈగో ఇక్కడే దెబ్బతిందన్న విషయాన్ని ఆయన కూడా నిర్దారించారన్నమాట.బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపణలను సినిమా వాళ్లు ఖండించలేదని కూడా ఆయన బాధపడ్డారు. ఒకవేళ అలాంటి రాజకీయ అంశాలలో జోక్యం చేసుకుంటే ఇతర పార్టీలకు ఆగ్రహం రావచ్చు. అయినా ఆ మాట చెప్పలేకపోయారు. సినిమా పరిశ్రమకు కూడా సామాజిక బాధ్యత ఉంటుందని, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు మద్దతివ్వాలని రేవంత్ కోరడం తప్పు కాదు కానీ అలాంటి సినిమాలు తీస్తే వచ్చే నష్టాన్ని భరించేదెవరు. అలాగే ముఖ్యమంత్రి పిలుపు మేరకు అంతర్జాతీయ స్థాయి సినిమాలు తీయాలన్నా భారీ పెట్టుబడులు అవసరమవుతాయి. ప్రేక్షకులకు థియేటర్లకు రావడమే గగనమైన ఈ కాలంలో విడుదలైన వారం రోజుల్లో పెట్టుబడులు రాబట్టుకోలేకపోతే వారి పరిస్థితి ఏమిటి? ఈ విషయాలన్నీ రేవంత్‌కు తెలియనివి కావు. కానీ శాసనసభలో బెనిఫిట్ షోలు, ధరల పెంపు లేవని ఖరాఖండిగా చెప్పిన నేపథ్యంలో వాటికే ఆయన కట్టుబడి ఉన్నారు.ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ హయాంలో టిక్కెట్ల పెంపుపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే పవన్ ఒంటి కాలుపై లేచిన విషయాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. అప్పట్లో మాదిరిగా సీఎంకు, టిక్కెట్ల ధరలతో సంబంధం ఏమిటని ఇప్పుడు కూడా ప్రశ్నించి ఉండాలి కదా? పది రోజులుగా కిక్కురుమంటే ఒట్టు!. బహుశా ఇక్కడ చంద్రబాబు డైరెక్షన్ అక్కరకు రాలేదనుకుంటా. లేదా రేవంత్ ఇచ్చిన షాక్‌కు దిమ్మతిరిగి ఉండాలి. జగన్ సినీనటుడు చిరంజీవిని ఇంటికి పిలిచి విందు ఇచ్చి పంపిస్తే.. ఇదే పవన్ కళ్యాణ్, చంద్రబాబులు.. ‘చిరంజీవితో దండం పెట్టించుకుంటారా’ అని ప్రశ్నించారు. అబద్ధమని వారికీ తెలుసు. చిరంజీవి ఈ మధ్యే రేవంత్‌ను కలిసినప్పుడు కూడా రెండు చేతులతో నమస్కారం చేశారు. విశేషం ఏమిటంటే.. చిరంజీవితోపాటు బాలకృష్ణ, మహేష్ బాబు, ప్రభాస్ వంటి వారు కూడా రేవంత్ భేటీకి రాలేదు. బెనిఫిట్ షోలకు అనుమతించడం లేదు కనుక, వారు హాజరైతే అది అసౌకర్యంగా ఉంటుందని, అందువల్లే రాలేదని కొందరు చెబుతున్నారు.తెలంగాణ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ది సంస్థ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు సమావేశం తర్వాత అసలు బెనిఫిట్ షోలు, టిక్కెట్ల ధరల పెంపులు చిన్న విషయాలని, చర్చించలేదని, చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి మాట్లాడామని వివరణ ఇచ్చారంటేనే రేవంత్‌ను ఏదో రకంగా ప్రసన్నం చేసుకోవడానికి ఈ సమావేశం జరిగిందని అర్థం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే నిర్దిష్ట ఎజెండా లేకుండా వీరంతా భేటీ అయ్యారన్నమాట. అయితే, బయట మాత్రం రేవంత్.. సినీ పరిశ్రమను తన దారిలోకి తెచ్చుకున్నారని ప్రచారం జరుగుతోంది. అలాంటిదేదీ లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నా, చూడడానికి మాత్రం అది నిజమే అనిపించకమానదు.చెరువును ఆక్రమించుకున్నారన్న ఆరోపణలపై హైడ్రా తన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేసిన తరువాత కూడా ప్రముఖ నటుడు నాగార్జున సైతం రేవంత్‌కు శాలువ కప్పడం ఆషామాషీగా జరిగే వ్యవహారం కాదన్నది వీరి విశ్లేషణ. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండ సురేఖపై నాగార్జున పరవు నష్టం దావా అయితే వేయగలిగారు కానీ.. కాంగ్రెస్ పార్టీ ఆమెను పల్లెత్తు మాట కూడా అనలేదు. మందలించినట్లు కూడా లేదు. అయినా కూడా నాగార్జున సీఎంను కలిసి మాట కలపాల్సిన సందర్భం వచ్చిందన్నమాట.సినీ నటులకు రాజకీయ సంబంధాలు ఎందుకు అని రేవంత్ ప్రశ్నించడం విడ్డూరమే. రేవంత్‌కు నిజంగానే తెలియవని అనుకోవాలా?. సినీ నటుడే స్థాపించిన పార్టీ నుంచే ఆయన వచ్చారు కదా?. పైగా సినీ నటులను అడ్డం పెట్టుకుని రాజకీయం నడిపిన పార్టీలోనే ఆయనా ఉన్నారు. మురళీ మోహన్ లాంటి వారు టీడీపీ తరఫున ప్రచారం చేశారు.. ఎంపీ అయ్యారు. ఇతర పార్టీల విషయానికి వస్తే కృష్ణ.. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. చిరంజీవి సొంతంగా పార్టీ పెట్టారు. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. జనసేనతో పవన్ కళ్యాణ్ కూడా రాజకీయం చేస్తున్నారు...నాగబాబు జనసేన నేతగా ఉంటూ చంద్రబాబు కేబినెట్లో చేరడానికి సిద్దం అవుతున్నారు. వీరు రాజకీయాలలో ఎలాంటి పాత్ర అయినా పోషించవచ్చు. కానీ, అల్లు అర్జున్ మాత్రం వైఎస్సార్సీపీ నేత రవిచంద్ర కిషోర్‌ను నంద్యాలలో కలవడం పెద్ద తప్పు అట. ఇలాంటి విషయాలలో సినీ పరిశ్రమ ఒక మాట మీద ఉండదు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అన్న సూత్రం అందరికీ వర్తిస్తుంది. పెద్ద సినీ నిర్మాతలు నిజంగానే భయపడ్డారా? లేక ప్రస్తుతానికి నటిస్తున్నారా? రేవంత్ కోపం తగ్గాక తమ డిమాండ్లను నెరవేర్చుకుంటారా? లేక రేవంత్ ప్రభుత్వంపై పోరుబాటకు దిగుతారా? అన్నది తేలడానికి మరికొంత సమయం పడుతుంది. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్. రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కాంగ్రెస్ ఏడో గ్యారంటీగా ఎమర్జెన్సీ
సాక్షి, హైదరాబాద్: రేవంత్ పాలనలో ఇందిరమ్మ రాజ్యం పేరిట ఇచ్చిన ఆరు గ్యారంటీలను అటకెక్కించి.. ఏడో గ్యారంటీగా ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అరెస్టు చేయడం దుర్మార్గమని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కేటీఆర్ ఖండించారు. అసెంబ్లీ ఎన్నికల్లో దళిత, బహుజన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం బీఆర్ఎస్ తరఫున ప్రశ్నిస్తున్నందున ఎర్రోళ్ల శ్రీనివాస్‌పై కక్షతో అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు.ప్రజల్లో వెల్లువెత్తుతున్న ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకోలేక నిర్బంధం, అణచివేతతో బీఆర్ఎస్ గొంతునొక్కేందుకు రేవంత్ ప్రయతి్నస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కనీసం నోటీసు ఇవ్వకుండా గురువారం తెల్లవారు జామున పోలీసులు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇంటికి వెళ్లి భయభ్రాంతులకు గురి చేశారని ధ్వజమెత్తారు. తప్పుడు కేసులతో రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టాలనే విష సంస్కృతికి చరమగీతం పాడాలన్నారు. ఇందిరమ్మ రాజ్యమా? పోలీస్ రాజ్యమా? : హరీశ్‌రావు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన పేరిట డబ్బా కొడుతూ, సీఎం రేవంత్ రాక్షస పాలన కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేస్తూ సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ పిట్ట బెదిరింపులు, అక్రమ కేసులకు భయపడేది లేదని, తెలంగాణ సమాజమే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెపుతుందని హరీశ్‌రావు హెచ్చరించారు. మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, మేడే రాజీవ్ సాగర్, డాక్టర్ వాసుదేవరెడ్డి తదితరులు వేర్వేరు ప్రకటనల్లో ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టును ఖండించారు. -
అందుకే రాజకీయాలు మాట్లాడాల్సి వస్తోంది.. రేవంత్‌కు హరీష్‌రావు సూటి ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్: సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ నేతల బృందం పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ గాయపడిన శ్రీతేజ్‌ను కేసీఆర్ సూచనతో బీఆర్ఎస్ నేతలం పరామర్శించామని తెలిపారు.‘‘శ్రీతేజ్ కోలుకుంటున్నారు.. వైద్యానికి స్పందిస్తున్నాడు. స్పర్శ కూడా మెరుగైందని డాక్టర్లు చెబుతున్నారు. భగవంతుడి దీవెనలతో శ్రీతేజ్ కోలుకుని మళ్లీ మామూలు మనిషిలా బయటకు రావాలని కోరుకుంటున్నాం. కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం భాస్కర్ రావు నేతృత్వంలో శ్రీతేజ్‌కు మంచి వైద్యాన్ని అందిస్తోంది. తొక్కిసలాటలో మరణించిన రేవతికి మా ప్రగాఢ సానుభూతి. తాను మరణిస్తున్నా కొడుకు శ్రీ తేజ్‌ను రక్షించుకోవడానికి రేవతి పడ్డ తపన మనం చూశాo. రేవతి అందరి మనసును కరిగేలా చేసింది’’ అని హరీష్‌రావు పేర్కొన్నారు.‘‘ఇక్కడ రాజకీయాలు మాట్లాడే సందర్భం కాదు. ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ నెపాన్ని నెడుతున్నపుడు రాజకీయాలు మాట్లాడలేక ఉండని పరిస్థితి. సంధ్య థియేటర్ ఘటన జరిగిన పది రోజులకు సీఎం, మంత్రులు స్పందించారు. గురుకులాల్లో చనిపోతున్న పిల్లల కుటుంబాలను రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గం ఎందుకు పరామర్శించలేదు. గురుకులాల పిల్లల మాతృ మూర్తుల శోకాన్ని సీఎం ఎందుకు గుర్తించడం లేదు. చట్టం అందరికీ సమానమే అంటున్న సీఎం రేవంత్ కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు..సాయిరెడ్డి రాసిన ఆత్మహత్య లేఖలో ఉన్న తన సోదరులపై రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోరు?. రేవంత్ రెడ్డి సోదరులను కనీసం పోలీస్ స్టేషన్‌కు కూడా పిలవరా?. సినీ ఇండస్ట్రీ రాష్ట్ర ప్రభుత్వం చర్చల గురించి రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో అందరికీ తెలుసు.. ప్రేమానురాగాలతో మనసులు గెలవాలి కానీ భయాందోళనలు సృష్టించి కాదు. రాష్ట్రానికి మంచి జరిగితే అందరం హర్షించాలి’’ అని హరీష్‌రావు చెప్పారు. -
చంద్రబాబుకు ఒక రూల్.. కేటీఆర్‌కు మరొకటా?
బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్‌పై ఈ ఫార్ములా రేస్ విషయంలో తెలంగాణ ఏసీబీ ఇట్టా కేసు నమోదు చేసిందో లేదో, వెంటనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగిపోయింది. కేటీఆర్‌పై కేసు కూడా పెట్టేసిందట. ఇది ఆశ్చర్యంగానే ఉంది. అందులో ఏమైనా మెటీరియల్ ,ఆధారాలు ఉంటే కేసు పెట్టారంటే అర్ధం చేసుకోవచ్చు. అందులో ఏమి జరిగిందో పరిశీలించకుండానే,ఇది రాజకీయ కేసు అని తెలిసి కూడా ఈడీ తెరపైకి వచ్చిందంటే సహజంగానే అనుమానాలు వస్తాయి. పోనీ అన్ని కేసుల్లోను ఇంతే వేగంగా ఈడీ వస్తుంటే ఫర్వాలేదు. కాని కొందరు నేతల విషయంలో అసలు వారి జోలికే వెళ్లదు. అంటే కేంద్రంలోని ప్రభుత్వ పెద్దల సూచనల మేరకే ఎవరిపై కేసులు పెట్టాలో, ఎవరిపై పెట్టకూడదో ఈడీ,సీబీఐ వంటి సంస్థలు నిర్ణయించుకుంటాయన్న విమర్శలకు ఈ పరిణామం ఊతం ఇస్తుంది. కేటీఆర్‌పై అనూహ్యమైన రీతిలో స్పందించిన ఈడీ, అదే ఏపీలో గతంలో చంద్రబాబుపై వచ్చిన కేసుల విషయంలో ఎందుకు స్పందించలేదన్నది పలువురి ప్రశ్నగా ఉంది. తెలంగాణలో రాజకీయంగా బలపడాలన్న ఉద్దేశంతో ఉన్న బీజేపీ వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ను వీక్ చేయడానికి చేస్తున్న ప్లాన్ లో ఇవన్ని భాగమా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. పార్లమెంటులో సైతం ఈడీ,సీబీఐ అనుసరిస్తున్న పద్దతుల గురించి విపక్ష సభ్యులు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. ఈడీ,సీబీఐలను ఆయా నేతలపైకి ఉసికల్పడం, వారు భయపడి బీజేపీలోకి రాగానే కేసులు మూలపడడం జరిగిపోతోందన్నది వారి విమర్శ. దీనినే వాషింగ్ మిషన్ ట్రీట్ మెంట్ అంటే బీజేపీలో చేరగానే పరిశుభ్రం అయిపోతున్నారని ఎద్దేవ చేస్తుంటారు. దానికి తగినట్లుగానే ఏపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరగానే వారిలో ఇద్దరిపై ఉన్న బ్యాంకు రుణాల ఎగవేత కేసులు చప్పబడిపోయాయని అంటారు.మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ పై ఈ ఫార్ములా రేస్ విషయంలో తెలంగాణ ఏసీబీ ఇట్టా కేసు నమోదు చేసిందో లేదో, వెంటనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగిపోయింది.కేటీఆర్ పై కేసు కూడా పెట్టేసిందట. ఇది ఆశ్చర్యంగానే ఉంది. అందులో ఏమైనా మెటీరియల్ ,ఆధారాలు ఉంటే కేసు పెట్టారంటే అర్ధం చేసుకోవచ్చు. అందులో ఏమి జరిగిందో పరిశీలించకుండానే,ఇది రాజకీయ కేసు అని తెలిసి కూడా ఈడీ తెరపైకి వచ్చిందంటే సహజంగానే అనుమానాలు వస్తాయి. పోనీ అన్ని కేసుల్లోను ఇంతే వేగంగా ఈడీ వస్తుంటే ఫర్వాలేదు. కాని కొందరు నేతల విషయంలో అసలు వారి జోలికే వెళ్లదు. అంటే కేంద్రంలోని ప్రభుత్వ పెద్దల సూచనల మేరకే ఎవరిపై కేసులు పెట్టాలో, ఎవరిపై పెట్టకూడదో ఈడీ,సీబీఐ వంటి సంస్థలు నిర్ణయించుకుంటాయన్న విమర్శలకు ఈ పరిణామం ఊతం ఇస్తుంది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించగానే, ఎన్‌సిపి చీలిక వర్గం నేత అజిత్ పవార్ కు క్లీన్ చిట్ వచ్చేసిందని చెబుతారుఇప్పుడు తెలంగాణలో ఈ ఫార్ములా కేసులో కూడా అలాగే బీజేపీ వ్యవహరిస్తోందా? అన్నదానికి అప్పుడే అవునని చెప్పలేకపోయినా, ఈడీ వాయు వేగంతో వ్యవహరించిన తీరుపై డౌట్లు వస్తాయి.హైదరాబాద్ లో ఈ ఫార్ములా రేస్ నిర్వహణకు సంబంధించి ఆ సంస్థకు సుమారు 55 కోట్ల మేర నిధులు విడుదల చేయడం తప్పన్నది ప్రభుత్వ వాదన.ఇందులో నిధుల దుర్వినియోగం జరిగిందన్నది ఏసీబీ కేసు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసులో ఇంకేదో ఉందని, 600 కోట్ల అవినీతి అని కొత్త విషయం శాసనసభలో చెప్పారు. ఆ విషయం ఫార్ములా రేస్ సంస్థవారే వెల్లడించారని,కేటీఆర్ రహస్య ఒప్పందాలు చేసుకున్నారని,ఆయన చెవిలో చెప్పారట.ఇందులో నిజం ఉందో లేదో కాని,వినడానికి మాత్రం నమ్మశక్యంగా లేదనిపిస్తుంది. ఎందుకంటే తన ఆధ్వర్యంలోని ఏసీబీ 55 కోట్లు నిధుల దుర్వినియోగం అని చెబుతుంటే, ఏకంగా ముఖ్యమంత్రి అది 600 కోట్లు అని అనడం కేవలం ప్రచారం కోసమే అన్న విమర్శలకు ఆస్కారం ఇచ్చినట్లయింది.దీనిపై కేటీఆర్ హైకోర్టుకు వెళ్లారు.అక్కడ వారు ఈ నెలాఖరువరకు అరెస్టు చేయవద్దని, అయితే కేసు దర్యాప్తు చేసుకోవచ్చని తీర్పు ఇచ్చారు.అది వేరే సంగతి. ఈ దశలో ఈడీ రంగ ప్రవేశం చేసింది. ఏసీబీకి లేఖ రాయడం, కేటీఆర్ ,ఇద్దరు అధికారులపై కేసు నమోదు చేయడం జరిగిపోయింది.ఇది ఏసీబీ కేసు ఆధారంగానే జరిగింది.ఇదంతా రేవంత్ రెడ్డి, బీజేపీ కుమ్మక్కు వల్లేనని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.కేటీఆర్ పై కేసు పెట్టడానికి గవర్నర్ ఓకే చేసిన తర్వాత వేగంగా ఈ పరిణామాలు సంభవించాయి.కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి కేటీఆర్ వెళితే ఈ కేసులో గవర్నర్ అనుమతి రాకుండా చేసుకోవడానికే అని కాంగ్రెస్ ప్రచారం చేసింది. తీరా చూస్తే గవర్నర్ పర్మిషన్ ఇవ్వడమే కాదు.. ఈడీ కూడా వచ్చేసింది.ఇప్పుడు కాంగ్రెస్,బీజేపీ కుమ్మక్కయ్యాయని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కేసు నేపధ్యం ఇలా ఉంటే గతంలో జరిగిన కొన్ని విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. 2019 లో చంద్రబాబు ప్రభుత్వంఓడిపోయిన తర్వాత కొద్ది నెలలకు ఆదాయపన్ను శాఖ అధికారులు చంద్రబాబు పిఎస్ ఇంటిపై దాడి చేసి పలు అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నట్లు ప్రకటించారు. ఏకంగా రెండువేల కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగాయని సిబిటిడి సాధికారికంగా పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత ఇప్పటికి ఐదేళ్లు అయినా ఆ వ్యవహారంపై అతీగతీ లేదు.అంటే ప్రధానమంత్రినో,హోం మంత్రినో, ఆర్ధిక మంత్రినో మేనేజ్ చేసుకుంటే ఎలాంటి కేసు అయినా విచారణ లేకుండా ఆగిపోతుందా అని సామాన్యుడు ఎవరికైనా సందేహం వస్తే ఏమి చెప్పగలం.దేశంలో చట్టాలు కొందరికి చుట్టాలు అన్న నానుడిని నిజం చేసినట్లే కదా? గతంలో జగన్ ప్రభుత్వ టైమ్ లో అమరావతి భూములలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, దానిపై సీబీఐ దర్యాప్తు చేయాలని ప్రభుత్వమే కేంద్రానికి లేఖ రాసింది.దానిని పట్టించుకోలేదు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నిధులు 350 కోట్లు దుర్వినియోగం అయ్యాయని, ఈ నిధులలో సింహభాగం షెల్ కంపెనీలకు, చివరికి టిడిపి బ్యాంక్ ఖాతాకు చేరాయని అప్పట్లో సిఐడి ఆధార సహితంగా చూపుతూ ఈడీకి కూడా తెలియచేసింది. నిజానికి తొలుత ఈ కేసును జిఎస్టి అదికారులు గుర్తించారు.దానిని ఈడీ టేకప్ చేసి కొందరిని అరెస్టు కూడా చేసింది. తీగ లాగితే డొంక కదిలినట్లు అది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు వెళ్లింది.ఆయన ప్రమేయంతోనే రూల్స్ తో నిమిత్తం లేకుండా నిధులు విడుదల అయ్యాయని అభియోగం చేసింది.ఈ కేసులో చంద్రబాబును సిఐడి రిమాండ్ కు తీసుకుంది.ఏభైమూడు రోజుల పాటు జైలులో ఉండి ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పై బయటకు వచ్చారు.ఆ తర్వాత పరిణామాలలో బీజేపీకి చంద్రబాబు దగ్గరయ్యారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలతో భేటీ కాగలిగారు.బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.అంతే! ఈడీ ఈ కేసులో వేరేవారి ఆస్తులు జప్తు చేసింది తప్ప , చంద్రబాబు ఊసే ఎత్తలేదు. చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇవ్వలేదని కేంద్రం చెబుతున్నా,కేసు ఎందుకు ముందుకు కదలడం లేదన్నదానికి జవాబు దొరకదు.ఇప్పుడు చంద్రబాబు అదికారంలోకి రాగానే ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి అన్ని వ్యూహాలను పన్నుతున్నారన్న వార్తలు వస్తున్నాయి.ఆ కేసులను నీరుకార్చడానికి ఢిల్లీ నుంచి తమ లాయర్ సిద్దార్ధ్ లూధ్రాను రంగంలోకి తెచ్చి, ఏకంగా పోలీసు ఉన్నతాధికారులనే ఆయన వద్దకు పంపి సమాలోచనలు జరిపించారట.ఈ క్రమంలోనే గతంలో ఈ కేసులు పెట్టిన సిఐడి అదికారులపై కక్ష సాధింపు చర్యలకు దిగారు.వారిప వేర్వేరు కేసులు పెట్టి , సస్పెండ్ చేస్తున్నారు.ఇది మంచి పరిణామం అవుతుందా?అన్నది చర్చ. ఒకవేళ ఈ ప్రభుత్వం మారి భవిష్యత్తులో కొత్త ప్రభుత్వం వస్తే అప్పుడు ఇదే ట్రెండ్ కొనసాగితే, ఇప్పుడు ఈప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహించారని అనేక మంది పోలీసు లేదా,ఇతర శాఖల అధికారులపై చర్యలు ఉండవా?అంటే కచ్చితంగా ఉంటాయని చెప్పాలి. రాజకీయాలలో టిట్ ఫర్ టాట్ అన్నది ఒక నానుడి. కాని ఈలోగా వ్యవస్థకు జరగాల్సి డామేజి జరిగిపోతుంది. అంతేకాదు.ఏకంగా ఏపీలో అయితే చంద్రబాబు కేసులు ఉన్న ఒక న్యాయమూర్తి ఇంటి వద్ద ఇంటెలెజెన్స్ అదికారులు కొందరు నిఘా పెట్టారట.ఈ విషయాన్ని ఆ జడ్జిగారే స్వయంగా కోర్టులో పోలీస అధికారులను ప్రశ్నించారు.ఇది చాలా సంచలన విషయం. అయినా ఎల్లో మీడియా ఇలాంటివాటిని కప్పిపెడుతోంది.గతంలో జయలలితపై కేసులు వచ్చాయి. అంతలో ఆమె ముఖ్యమమంత్రి అయ్యారు.తదుపరి ఆ కేసులను కర్నాటక రాష్ట్ర హైకోర్టుకు బదలీ చేశారు.చంద్రబాబు పై ఉన్న కేసులను సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిల్ కూడా పడింది. కాని అది ఇంకా విచారణకు వచ్చినట్లు లేదు.పెద్ద నాయకులపై అవినీతి కేసులు వచ్చినప్పుడు నిష్పక్షపాతంగా విచారణ జరిగేలా వ్యవస్థలు తయారు కాకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా మారుతుంది. తమకు ఇష్టం లేని నేతలపై కేసులు పెట్టడం, తమకు సరెండర్ అయిపోతే వాటిని పక్కనవేయడం, లేదా వారి మెడపై కత్తిమాదిరి వేలాడదీసినట్లు ఉంచడం.. ఇవి ఆయా వ్యవస్థల జవాబుదారితనాన్ని దెబ్బతీస్తాయి. గతంలో వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారని ఆయనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టింది చూశాం. ఆ విషయాన్ని అప్పటి బీజేపీ నేత సుష్మ స్వరాజ్ పార్లమెంటులోనే వెల్లడించారు. ఇప్పుడు బీజేపీ కూడా అదే మాదిరి వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు కేసుల విషయంలో ఈడీ, సీబీఐ, ఆదాయపన్ను శాఖ ఎందుకు స్పందించలేదు? కేటీఆర్ కేసులోనే ఈడీ ఎందుకు అతిగా రియాక్ట్ అయింది? తాజాగా కాకినాడ సీపోర్టు షేర్ల బదలాయింపు విషయంలో కూడా ఈడీ ఇలాగే వేగంగా స్పందించడం గమనార్హం. ఈడీ తన బాద్యత నిర్వహిస్తే తప్పుకాదు. కాని కొందరి విషయంలోనే చేస్తే అది సంస్థ నిష్పక్షపాతం పై మరక పడుతుంది. పలుకుబడి, పరపతితో పాటు, మేనేజ్ మెంట్ స్కిల్ లేకపోతే నేతలకు ఇలాంటి చిక్కులు వస్తాయా?-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
లోక్‌సభ ఎన్నికల్లో.. సత్తా చాటిన బీజేపీ.. పత్తాలేని బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో లోక్‌సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో జాతీయస్థాయిలో హేమాహేమీలైన పలువురు నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ కోసం ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాం«దీలు సైతం గ్రేటర్లో ప్రచార షోలు నిర్వహించారు. మహా నగర పరిధిలోని నాలుగింట మూడు స్థానాల్లో గెలిచి బీజేపీ తన హవా చాటుకుంది. హైదరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన మాధవీలత పాతబస్తీలో ప్రచారంతో ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందారు. ఎప్పటిలాగే హైదరాబాద్ ఎంపీగా ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ (ఐదోసారి) గెలవగా, సికింద్రాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి జి.కిషన్‌రెడ్డి సిట్టింగ్ సీటును నిలుపుకున్నారు. మరోమారు కేంద్రమంత్రి అయ్యారు. దేశంలోనే అత్యధిక ఓట్లున్న మల్కాజిగిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ గెలుపొందారు. చేవెళ్ల నుంచి అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపొందారు. రిక్త ‘హస్తం’ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి సిట్టింగ్ స్థానాన్ని తిరిగి గెలవలేకపోయింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించిన ఆ నియోజకవర్గంలో తిరిగి కాంగ్రెస్ జెండా ఎగరలేదు. చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ల నుంచి పోటీ చేసిన ఆపార్టీ అభ్యర్థులు గడ్డం రంజిత్‌రెడ్డి, సునీతా మహేందర్‌రెడ్డి, దానం నాగేందర్‌లు సైతం ఓటమి పాలయ్యారు. వాడిన గులాబీ.. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటును కూడా దక్కించుకోలేకపోయింది. సికింద్రాబాద్ స్థానానికి సీనియర్ ఎమ్మెల్యే పద్మారావును బరిలో దింపినా ఫలితం లేకుండా పోయింది. మల్కాజిగిరి నుంచి పోటీ చేసిన రాగిడి లక్ష్మారెడ్డి, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్యేలుగానే మిగిలారు.. కిషన్‌రెడ్డిని ఎదుర్కొనేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలను బరిలో దింపినా బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు సికింద్రాబాద్‌లో గెలవలేకపోయాయి. పార్టీ మారి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన దానం నాగేందర్, బీఆర్ఎస్ నుంచి నిలబడ్డ పద్మారావులు గెలవలేకపోయారు. కాంగ్రెస్ ఖాతాలో కంటోన్మెంట్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ నుంచి ఆమె సోదరి నివేదిత, బీజేపీ నుంచి బరిలో నిలిచిన వంశీ తిలక్ గెలవలేకపోయారు. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన శ్రీగణేశ్ గెలిచారు. -
కాంగ్రెస్ పిట్ట బెదిరింపులకు భయపడేది లేదు: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ.. రాక్షస పాలన కొనసాగిస్తున్నారని కాంగ్రెస్‌పై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇది ఇందిరమ్మ రాజ్యమా? లేక పోలీస్ రాజ్యమా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించడంపైనే రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారని ఆరోపించారు.మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా..‘ఇందిరమ్మ రాజ్యమా? పోలీస్ రాజ్యమా?. అడిగితే అరెస్టులు.. ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే బెదిరింపులు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. ఉదయాన్నే పోలీసులు ఇంటి వద్దకు వచ్చి అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గం. కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి నోటీసు లేకుండా అరెస్ట్ చేయడం పూర్తిగా అప్రజాస్వామికం.ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నారు. సెలవు రోజుల్లో కావాలని మా నేతలను అరెస్ట్ చేస్తూ, సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారు. హోం మంత్రిగా శాంతి భద్రతల నిర్వహణలో విఫలమైన రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించడంపైనే దృష్టి పెట్టారు. ఈ పైశాచిక ఆనందం ఎక్కువ కాలం నిలవదు. సీఎం రేవంత్ రెడ్డి, మీ పిట్ట బెదిరింపులు, అక్రమ కేసులకు భయపడే వారు మేము కాదని గుర్తుంచుకోండి. తెలంగాణ సమాజమే మీకు తగిన బుద్ధి చెబుతుంది అంటూ కామెంట్స్ చేశారు. ఇందిరమ్మ రాజ్యమా? పోలీస్ రాజ్యమా?అడిగితే అరెస్టులు..ప్రశ్నిస్తే కేసులు..నిలదీస్తే బెదిరింపులు...బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.ఉదయాన్నే పోలీసులు ఇంటి వద్దకు వచ్చి…— Harish Rao Thanneeru (@BRSHarish) December 26, 2024 -
’రేవంత్ సర్కార్ మహిళల్ని నమ్మించి మోసం చేసింది‘
సాక్షి,హైదరాబాద్ : రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలను నమ్మించి మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరల పంపిణీ ఎగిరిపోయాయని ఆమె ఎద్దెవా చేశారు.మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని సీఎం ప్రకటిస్తారని మహిళలకు ఆశించారు. కళ్యాణ లక్ష్మీతో పాటు తులం బంగారం ఇస్తామని ప్రకటన చేస్తారని ఊహించారు. కానీ ప్రభుత్వం ఎటువంటి ఆలోచన చేయడం లేదు. రాష్ట్రంలోని ఒక్కో ఆడబిడ్డకు ప్రభుత్వం రూ. 30 వేలు బాకీ పడింది. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీ ఇవ్వలేదు. తక్షణమే స్కూటీల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని కవిత డిమాండ్ చేశారు.రాష్ట్రంలో 40 శాతం నేరాలు పెరిగాయి. నేరాల పెరుగుదల.. ప్రభుత్వం మహిళల పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యానికి నిదర్శనం. మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేసే సోయి ప్రభుత్వానికి లేదు. మహిళలు చూస్తూ ఊరుకోబోరు.. కచ్చితంగా ప్రశ్నిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధును ఎగ్గొట్టింది. తక్షణమే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలి. రైతు భరోసా కింద అర్హులను తగ్గించే ప్రయత్నం చేయవద్దు. కేంద్ర ప్రభుత్వపు నిబంధలను అమలు చేస్తే 30 శాతం రైతులకు కూడా రైతు భరోసా రాదని కవిత పేర్కొన్నారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి పోలీసుల నోటీసులు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మాసబ్ టాంక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 2024, డిసెంబర్ 27వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని ఫిర్యాదు చేసేందుకు కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషకు వెళ్లారు. ఆ సమయంలో బంజారాహిల్స్ సీఐ బయటకు వెళ్తుండగా కౌశిక్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు సీఐని అడ్డగించి తమ ఫిర్యాదులో తీసుకోవాలని బలవంతం చేశారు.ఈ ఘటనపై బంజారాహిల్స్ సీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ ఫిర్యాదు మేరకు పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్‌పై కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం అతడికి బెయిల్ ఇచ్చింది. అయితే కౌశిక్ రెడ్డి బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారని ఈ కేసు దర్యాప్తు చేస్తోన్న మాసబ్ ట్యాంక్ పోలీసులు బుధవారం (డిసెంబర్ 25) కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 27వ తేదీ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. -
సంక్షోభం.. సినీ రంగానికా? రాజకీయానికా?
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప -2 విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన విషయం చిలికి,చిలికి గాలివానగా మార్చడానికి రాజకీయ నేతలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది. సినీ పరిశ్రమపైనే తీవ్ర ప్రభావం చూపించేలా పరిస్థితులు ఏర్పడుతుండడం దురదృష్టకరం. వేలాది మందికి ఆధారంగా ఉన్న ఈ పరిశ్రమ ఇప్పుడు సంక్షోభంలో పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రత్యేకించి.. కొత్త సంవత్సరంలో సంక్రాంతి(Sankranti) సందర్భంగా విడుదల కావల్సి ఉన్న సినిమాలపై ఈ ఉదంతం.. పరిణామాల ప్రభావం పడుతుందని నిర్మాతలు భయపడుతున్నారు. దానికి కారణం వీరిలో కొందరు భారీ వ్యయంతో సినిమాలు తీయగా, ప్రభుత్వం ఇకపై బెనిఫిట్ షో లు, టిక్కెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతించం అని ప్రకటించడమే అని చెబుతున్నారు. వినోద మాద్యమ రంగంలో వచ్చిన అనేక మార్పుల ప్రభావం ఆ పరిశ్రమను అతలాకుతలం చేస్తోందని చెప్పవచ్చు. ఆ దశలో అల్లు అర్జున్ ఘటన వ్యవహారాన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) సీరియస్ గా తీసుకుంటున్నారు. ఒక రకంగా ఇది రేవంత్ ఈగో సమస్యగా మారినట్లుగా ఉంది. శాసనసభలో ఆయన మాట్లాడుతూ సినీ పరిశ్రమ ప్రముఖులను తప్పుపట్టారు. అర్జున్ ఒక రాత్రి జైలులో ఉండి ఇంటికి వస్తే సినీ ప్రముఖులు, ఇతరులు క్యూ కట్టి పరామర్శిస్తారా అని ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. తొక్కిసాటలో తీవ్రంగా గాయపడ్డ బాలుడు ఆస్పత్రిలో ఉంటే ఎందుకు పరామర్శించ లేదని ఆయన అన్నారు. నిజమే!ఆ బాలుడిని పరామర్శించాలని చెప్పడం తప్పు లేదు.కాని ఆ కారణంగా అర్జున్ ఇంటి వద్దకు వెళ్లడం తప్పన్నట్లుగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం అంత సముచితంగా లేదు.పైగా కాలు పోయిందా?చేయి పోయిందా? కిడ్నీ పోయిందా?ఏమి జరిగిందని అర్జున్ వద్దకు వెళ్లారని ప్రశ్నించడం మరీ తప్పు అని చెప్పకతప్పదు. తమకు సంబంధించిన వ్యక్తి తప్పు చేసినా, చేయకపోయినా, ఏదైనా ఇబ్బందిలో ఉన్నాడని తెలిసినప్పుడు ఆయన సన్నిహితులు,అదే రంగానికి చెందినవారు వెళ్లి పలకరించి వస్తుంటారు.అంతెందుకు! ఓటుకు నోటు కేసులో రేవంత్ అరెస్టు అయి బెయిల్ పై జైలు నుంచి విడుదల అయినప్పుడు జైలువద్దకు వచ్చినవారితో కలిసి ఆయన ర్యాలీనే తీశారు కదా అని కొందరు గుర్తు చేస్తున్నారు. అల్లు అర్జున్ పై పలువురు కాంగ్రెస్ నేతలు కూడా విమర్శలు చేసి పశ్చాత్తాప్తం ప్రకటించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నోరు పారేసుకోవడం తీవ్ర అభ్యంతరకరం. అల్లు అర్జున్ ఆంధ్రా వెళ్లిపోవాలట..! ఒళ్లు దగ్గరపెట్టుకుని వ్యాపారాలు చేయాలట!. ఇలాంటి వ్యాఖ్యలను రేవంత్ సమర్దిస్తారా? సమర్దించరు. ఎందుకంటే స్వయానా ఆయన అల్లుడు ఆంధ్రకు చెందినవారన్న సంగతి తెలిసిందే. ఈ మాత్రం సోయ లేకుండా భూపాల్ రెడ్డి వంటి వారు వ్యర్ద ప్రసంగాలు చేస్తే అది కాంగ్రెస్ కు మరింత చేటు తెస్తుంది. మంత్రి సీతక్క అయితే.. పుష్ప సినిమాకుగానూ అర్జున్ కు ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడం ఏమిటి? అని ప్రశ్నించారు. అది తప్పయితే.. రేవంత్ ప్రభుత్వం ఆ సినిమాకు బెనిఫిట్ షోలు, ధరల పెంపుదలకు ఎందుకు అనుమతి ఇచ్చింది?. ఆ మాటకు వస్తే నక్సల్స్ కు సానుభూతిగా కొన్ని సినిమాలు వచ్చాయి.వాటిలో కొన్నిటికి అవార్డులు కూడా లభించాయి. కాని నక్సల్స్ ను ఏ ప్రభుత్వం అయినా అంగీకరిస్తుందా?. సీతక్క(Seethakka) ఎందుకు ఆ భావజాలం నుంచి బయటకు వచ్చారు?. ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడితే సరిపోదని గుర్తించాలి. ఇదే టైంలో.. 👉బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు డీకే అరుణ, రఘునందన్ తదితరులు అల్లు అర్జున్ ను కాంగ్రెస్ టార్గెట్ చేసిందని ధ్వజమెత్తారు. సినీ పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం దెబ్బ తీస్తోందని,పగ పట్టినట్లు వ్యవహరిస్తోందని కూడా వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్ కూడా ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నా.. బీజేపీ వాళ్లే దీనిని బాగా సీరియస్‌గా తీసుకున్నట్లు కస్తోంది. తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బిజెపి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి యత్నిస్తోంది. భవిష్యత్తులో అల్లు కుటుంబాన్ని తమ పార్టీలోకి తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తారా అనేది చూడాలి. ఇక.. అర్జున్ పై కాంగ్రెస్ కాక తగ్గించకపోతే.. ఆ దిశగా అడుగులు పడ్డా ఆశ్చర్యం ఉండదని కొందరు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన ప్రకటనకు అర్జున్ దానికి సమాధానం ఇవ్వడం ప్రభుత్వానికి మంటపుట్టించింది. అది అర్జున్ కు ఉన్న స్వేచ్చ అని ప్రభుత్వం భావించలేదు. పోలీసు ఉన్నతాధికారులంతా రంగంలో దిగి అర్జున్ ఏదో ఘోరమైన నేరం చేశారని చెప్పడానికి యత్నించారు. లేకుంటే ఈ కేసులో పదివేల వీడియోలు సేకరించవలసినంత అవసరం ఏముంది?. ఎక్కడో చోట అర్జున్ తప్పు దొరకకపోదా? అని వెతికారన్నమాట. దీనిని ప్రభుత్వ పెద్దలు వ్యక్తిగత ప్రతిష్టగా భావించారన్నమాట!. ఇదే సందర్భంలో.. 👉పోలీసులు సంధ్య థియేటర్ వద్ద అర్జున్ కు స్వాగతం చెప్పిన రీతిలో వ్యవహరించిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఒక సస్పెండెడ్ పోలీస్ అధికారి అయితే మరీ రెచ్చిపోయి ఆంధ్ర-తెలంగాణ అంశాన్ని తెరపైకి తేవడం, అర్జున్ నటన గురించి వ్యాఖ్యలు చేయడం, సినీ పరిశ్రమవారికి ఇచ్చిన భూముల ప్రస్తావన తేవడం, ఏకంగా తాటతీస్తాం,తోలు తీస్తాం అని హెచ్చరించడం శోచనీయంగా ఉంది. అర్జున్ కు పోలీసులు నోటీసు ఇచ్చి మూడున్నర గంటలు విచారించడం కూడా వేధింపులో భాగమే అనే అభిప్రాయం కలుగుతుంది. పైగా అర్జున్ ‘‘అలా జవాబిచ్చారు..ఇలా సమాధానం ఇచ్చారు..’’ అంటూ లీకులు ఇచ్చిన తీరు కూడా దీనిని ధృవపరుస్తుంది. ఏపీలో రెడ్ బుక్(Red Book) రాజ్యాంగం మాదిరి తెలంగాణలో కూడా పోలీసులు ప్రజల తోలు తీసే రాజ్యాంగం వచ్చిందేమో తెలియదు.మరో వైపు కొందరు ఓయూ జేఏసీ పేరుతో అర్జున్ ఇంటిపై దాడి చేయడం మరింత దారుణం. పేరుకు జేఏసీ అయినా.. అక్కడకు వెళ్లినవారంతా కాంగ్రెస్ వారేనని సోషల్ మీడియాలో ఆధార సహితంగా వీడియోలు వచ్చాయి. దీనిని ఖండించి , ఏకోన్ముఖంగా నిరసన చెప్పవలసిన సినిమా పరిశ్రమ పెద్దలు జడిసిపోయి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రేవంత్ శాసనసభలో చేసిన విమర్శలతో వీరంతా భయపడ్డారని వేరే చెప్పనవసరం లేదు. అందుకే.. 👉అర్జున్ ఇంటిపై దాడి చేసినవారు అరాచకంగా రాళ్లు వేసి,పూలకుండీలు మొదలైనవాటిని ధ్వంసం చేసినా ఇంటిలో పనిచేసేవారిపై దౌర్జన్యానికి దిగినా సినీ ప్రముఖులు మాత్రం నోరు మెదపలేదు. అర్జున్ కు ,ఆయన తండ్రి అరవింద్ కు సంఘీబావం తెలపలేదు. ఇది పరిశ్రమ బలహీనతగా ఉంది. రేవంత్ కూడా అర్జున్ ఇంటిపై దాడిని నేరుగా ఖండించకుండా, సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని ఖండిస్తున్నానని ప్రకటన ఇవ్వడం ద్వారా ఆయనలో ఇంకా కోపం తగ్గలేదని చెప్పకనే చెప్పారనుకోవాలి.. ఇదే సందర్భంలో సడన్ గా బెనిఫిట్ షో లు రద్దు చేస్తామని సీఎం చెప్పడం సినీ పరిశ్రమ ప్రముఖులలో గుబులు రేపుతోంది. వచ్చే నెలలో మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మరో ప్రముఖ నటుడు వెంకటేష్ తదితరుల సినిమాలు విడుదల కావల్సి ఉంది. వీటిలో ఒక సినిమాకు ఐదువందల కోట్ల రూపాయలకు పైగా వ్యయం అయిందట!. అలాగే మరో సినిమాకు 150 కోట్లు ఖర్చు పెట్టారట!. ఈ భారీ బడ్జెట్ సినిమాలకు స్పెషల్ షో లు, ధరల పెంపు,బెనిఫిట్ షో లు వంటివి లేకపోతే.. సత్వరమే వారు పెట్టిన పెట్టుబడి రావడం కష్టం అయిపోతుంది. 👉ప్రముఖ నిర్మాత ,తెలంగాణ చలనచిత్రాభివృద్ది సంస్థ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన దిల్ రాజు తనకు ఉన్న సన్నిహిత సంబంధాలతో రేవంత్ ను ఒప్పించి మళ్లీ బెనిఫిట్ షో లు, ధరల పెంపుదలకు సానుకూలంగా నిర్ణయాలు తీసుకువస్తారన్న ఆశతో ఉన్నారట!. అందుకే ఇప్పుడు అర్జున్ తప్పుచేసినా, చేయకపోయినా.. ఆ ఘటన జోలికి వెళ్లకపోవడం బెటర్ అని భావిస్తున్నారట!. ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టిక్కెట్ ధరల గురించి చర్చించి, షూటింగ్ లు కూడా జరిపేలా షరతులు పెడితే.. ఇంకేముంది సినిమావారిపై దాడి చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ వంటివారు కాని, ఇటు ఎల్లో మీడియా కాని ఇప్పుడు నోరు మెదపడం లేదు. మెగాస్టార్ చిరంజీవి దంపతులను జగన్ సాదరంగా ఆహ్వానించి విందు ఇచ్చి పంపితే, ఆయనకు ఏదో అవమానం జరిగిందంటూ కూడా దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు స్వయానా చిరంజీవి మేనల్లుడు ఇంటిపైనే దాడి జరిగితే పవన్ కల్యాణ్‌తో సహా ఎవరూ నోరు విప్పడం లేదు. ఎందుకంటే.. పవన్ సినిమాలు కూడా భారీ బడ్జెట్ తోనే ఉంటాయి కాబట్టి.👉నిజంగానే రేవంత్ తననిర్ణయానికి కట్టుబడి ఉంటే ఒకరకంగా ప్రయోజనం, మరో రకంగా నష్టం వాటిల్లవచ్చు. నిర్మాతలు చిన్న బడ్జెట్ తో సినిమాలు తీయడానికి సిద్దం అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు సినిమా టిక్కెట్ల ధరలు కూడా పెంచాలని కోరవలసిన అవసరం ఉండదు. కానీ అగ్ర నిర్మాతలు ఇందుకు అంగీకరించకపోవచ్చు. ఒకవేళ ఇది ముదిరితే సినీ పెద్దలు రేవంత్ ప్రభుత్వంపై ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదులు చేయవచ్చు!. అంతేకాక తాము ఇక్కడ షూటింగ్ లు చేయలేమని,వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతున్నామని ప్రకటించినా, రేవంత్ ప్రభుత్వానికి తీవ్ర నష్టం ఏర్పడుతుంది. అందువల్ల పరిశ్రమకు ఇబ్బంది రాకుండా, అలాగే ప్రేక్షకులకు సౌలభ్యంగా రాజీ కుదుర్చుకోవడం మంచిదని చెప్పాలి.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Allu Arjun Issue:‘సూపర్స్టార్లా ఫీలైపోతున్న రేవంత్’
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన.. నటుడు అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ పోలీసులు(Telangana Police) వ్యవహరిస్తున్న తీరును రాజకీయ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అనుమతి లేకుండా ర్యాలీగా రావడం ముమ్మాటికీ తప్పేనని.. చట్టం తన పని తాను చేసుకుపోతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం మరింత దుమారాన్ని రేపింది. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ను ఇబ్బంది పెడుతోందని ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో మరో గొంతుక ఇప్పుడు రేవంత్‌కు వ్యతిరేకంగా వినిపించింది. అల్లు అర్జున్ వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తనను తాను ఓ సూపర్స్టార్లా ఫీలవుతున్నారని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మండిపడ్డారు. ‘‘తెలంగాణలో ఎవరు సూపర్ స్టార్ అనే విషయంలో ఆయన(రేవంత్ రెడ్డి ) పోటీ పడుతున్నారనుకుంటా. అల్లు అర్జున్ కంటే తానే సూపర్‌స్టార్‌నని ఆయన చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో నటిస్తున్నారు. తెలంగాణలో ఆయనే ఇప్పుడు మెయిన్ యాక్టర్. అల్లు అర్జున్ నివాసంపై రాళ్లు విసిరి రచ్చ చేసిన వాళ్లలో ఇద్దరు ముగ్గురు ఆయన (రేవంత్ రెడ్డి ) నియోజకవర్గానికి చెందిన వాళ్లే. ఇది రాజకీయ దురుద్దేశంతో జరిగిన దాడేనని స్పష్టం అవుతోంది. .. అలాంటి ఘటన జరగకుండా ఉండాల్సింది. ఒక నిండుప్రాణం పోవాలని అల్లు అర్జున్ (Allu Arjun) కూడా అనుకోరు కదా. ఒకరిని బలిపశువు చేయడం, వేధించడం ముమ్మాటికీ తప్పే’’ అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నామలై అన్నారు. #WATCH | Chennai: Tamil Nadu BJP president K Annamalai says, " I think he (Revanth Reddy) is trying to compete regarding who is the superstar in Telangana, he trying to show he is superstar than Allu Arjun...right now also he is acting in Congress, he is the main actor in… pic.twitter.com/zjqPDj5BCY— ANI (@ANI) December 24, 2024 ఇదీ చదవండి: అల్లు అర్జున్ను ఆనాడు అడ్డుకుని ఉంటే.. -
‘అల్లు అర్జున్ను ఆరోజు ఎందుకు అడ్డుకోలేదు?’
హైదరాబాద్, సాక్షి: సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో నటుడు అల్లు అర్జున్(Allu Arjun) విచారణ వేళ.. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అల్లు అర్జున్ను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారాయన. సాక్షితో ఆయన మాట్లాడుతూ..‘‘రేవతి కుటుంబం పట్ల అందరికీ సానుభూతి ఉంది. పేదలైనా.. పెద్దలైనా వారికి మేం అండగా ఉంటాం. అల్లు అర్జున్ విషయంలో కాంగ్రెస్ చేసేది ముమ్మాటికీ రాజకీయమే. అసెంబ్లీలో తన దోస్తుతో(ఎంఐఎం అక్బరుద్దీన్‌ను ఉద్దేశించి..) ప్రశ్న అడిగించుకోని కాంగ్రెస్ రాజకీయం చేసింది. అలాంటప్పుడు.. మొదటి రోజే ఎందుకు కాంగ్రెస్ (Congress party) నేతలు రేవతి కుటుంబాన్ని పరామర్శించలేదు?..ముమ్మాటికీ పోలీసుల వైఫల్యం కారణంగానే ఘటన జరిగింది. అసలు అనుమతి లేదన్నప్పుడు అల్లు అర్జున్ ను ఇంటి నుంచి ఎందుకు బయటకు రానిచ్చారు. ఇంటి వద్దే ఆయన్ని బారికేడ్లు వేసి ఎందుకు అడ్డుకోలేదు?. థియేటర్ వద్ద యూనిఫాం లో ఉన్న పోలీసులు ఉన్నారు కదా!. సంధ్య థియేటర్ గేట్లు మూసివేసి హీరో వెహికిల్ ను టోయింగ్ ఎందుకు చేయలేదు?. కేవలం అల్లు అర్జున్ అరెస్ట్‌తో వచ్చిన బద్నాంను తప్పించుకునేందుకే ఇంతా చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ కక్ష గట్టి సాధిస్తోంది ’’ అని అన్నారాయన. ఇదిలా ఉంటే బీజేపీ అల్లు అర్జున్‌కు అండగా ఉంటుందని ఆ పార్టీ కీలక నేత బండి సంజయ్ (Bandi Sanjay) ఇంతకు ముందే ప్రకటించారు. అంబేద్కర్ ఇష్యూపై..కాంగ్రెస్ కు అంబేద్కర్ పేరును తీసే అర్హత లేదని రఘునందన్ చెబుతున్నారు. ‘‘తెలంగాణలో 125 అడుగుల విగ్రహానికి కనీసం దండ వేయలేదు రేవంత్ ప్రభుత్వం. అంతపెద్ద విగ్రహానికి గేటుకు తాళం వేసిన రోజే కాంగ్రెస్ చెంపలు వేసుకొని క్షమాపణలు చెప్పాలి. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ కు కనీసం భారతరత్న ఇవ్వలేదు కాంగ్రెస్. అంబేద్కర్ ను అన్ని రకాలుగా కాంగ్రెస్సే అవమానించింది. హాస్టళ్లలో ఫుడ్ తిని విద్యార్థులు చనిపోతున్నారు. దాన్ని డైవర్ట్ చేసేందుకు సీఎం సైతం ఆందోళనల్లో పాల్గొంటున్నారు అని రఘునందన్ మండిపడ్డారు.