breaking news
-
‘బండి సంజయ్.. బీజేపీ భావజాలం ఉంటేనే అవార్డ్ ఇస్తారా?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు కౌంటరిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న పథకాలకు ఇందిరమ్మ పేరు పెడితే తప్పేంటని ప్రశ్నించారు. అలాగే, నక్సలైట్లకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వొచ్చు కానీ.. పద్మ అవార్డులు ఇవ్వడానికి పనికి రారా? అని ప్రశ్నలు సంధించారు.కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘బండి సంజయ్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. పథకాలకు ఇందిరమ్మ పేరు పెడితే తప్పేంటి?. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తిని పద్మా అవార్డులకు ప్రతిపాదిస్తే తప్పా. నక్సలైట్ భావజాలం అయితే అవార్డులు ఇవ్వరా?. మావోయిస్టులకు ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వొచ్చు కానీ, పద్మా అవార్డులకు పనికి రారా?.లెఫ్ట్ భావజాలం ఉన్న ఈటల రాజేందర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికోసం ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంటే ఈటల కూడా బీజేపీ అధ్యక్ష పదవికి అనర్హుడా?. ఈ విషయం బండి సంజయ్ చెప్పాలి. బండి సంజయ్ వ్యాఖ్యలు గద్దర్‌ను అవమానిస్తున్నట్లు ఉన్నాయి. గతంలో ప్రగతి భవన్ ముందు గద్దర్‌ను నిలబెట్టి కేసీఆర్ అవమానిస్తే.. ఇప్పుడు పద్మా అవార్డుల విషయంలో బండి సంజయ్ అవమానిస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇదే సమయంలో బండి సంజయ్‌కు ఎంపీ చామల కిరణ్ కూడా కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఎంపీ కిరణ్ మీడియాతో మాట్లాడుతూ..‘గద్దర్ భావజాలానికి సంబంధించి బండి సంజయ్ మాట్లాడటం హాస్యాస్పదం. బీజేపీ భావజాలం ఉన్నవారికి మాత్రమే అవార్డ్ ఇస్తారా?. గద్దర్ అణగారిన వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి. బీజేపీ పాట పాడిన వారు.. బీజేపీ గొంతు పలికిన వారికి ఇకపై అన్నీ అన్నట్టు బండి సంజయ్ మాటలు ఉన్నాయి. గద్దర్‌పై బండి సంజయ్ మాట్లాడిన మాటలను విత్ డ్రా చేసుకోవాలి అని కామెంట్స్ చేశారు. మరోవైపు.. బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా గాంధీ భవన్ దగ్గర ఆయన దిష్టి బొమ్మను కాంగ్రెస్ శ్రేణులు దగ్ధం చేశాయి. ఈ సందర్బంగా గద్దర్‌పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు పలువురు కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఈ క్రమంలో గద్దర్ అభిమానులకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: గద్దర్‌కు పద్మ అవార్డుపై బండి సంజయ్ వ్యాఖ్యలు -
సీఎం రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి,తెలంగాణ భవన్ : అహనా పెళ్ళంట సినిమాలో కోటా శ్రీనివాసరావు క్యారెక్టర్ మాదిరిగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. సోమవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ..ఢీల్లి నుండి టూరిస్టులను తీసుకువచ్చి హామీలు ఇచ్చారు. బాండ్ పేపర్లతో అఫిడవిట్లు ఇచ్చి హామీలు అమలు చేస్తామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి గ్యారెంటీ కార్డులు పంచారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి జనవరి 30 వ తేదీతో 420 రోజులు అవుతుందిజనవరి 30వ తేదీన బిఆర్ఎస్ ఆధ్వర్యంలోగాంధీని స్మరిస్తూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తు కోరుతూ గాంధీకి వినతి పత్రాలు సమర్పిస్తాం. రేవంత్ రెడ్డి మంది పెళ్లిళ్లకు వెళ్లి ఫోజులు కొడుతున్నారు. అడ్డిమారి గుడ్డి దెబ్బలాగా రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర మంత్రసాని పాత్ర.రూ.40 వేల కోట్ల పెట్టుబడుల్లో ఒక్కటి రాలేదు. అందుకే ప్రజలు లక్షా 78 వేల కోట్ల పెట్టుబడులు అంటే నమ్మడం లేదు. పెట్టుబడులు తెచ్చి ఉద్యోగాలు ఇచ్చి చూపిస్తే రేవంత్ రెడ్డికి సన్మానం చేస్తాము.రేవంత్ రెడ్డికి చేతనైతే రైతు భరోసా వేసి చూపించు.రేవంత్ రెడ్డిని చూస్తే అపరిచితుడు గుర్తు వస్తున్నాడు. దమ్ముంటే హామీలు అమలు చేసి చూపించు అని రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. -
పద్మ అవార్డులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: పద్మ పురస్కారాలపై వివాదం నెలకొన్న వేళ.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతీ ఒక్కరికీ కేంద్రం అవార్డులు ఇవ్వదని, అర్హులకే మాత్రమే ఇస్తుందని అన్నారు. ఈ క్రమంలో గద్దర్(Gaddar)కు అవార్డు రాకపోవడంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలే చేశారు. పద్మ అవార్డుల విషయంలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ఆరోపణలకు దిగారు. ఈ ఆరోపణలకు బండి సంజయ్ కౌంటర్‌గా స్పందించారు. ‘‘పద్మ అవార్డులు(Padma Awards Row) స్థాయి ఉన్న వారికి ఇస్తాం. గద్దర్‌కు ఎలా ఇస్తాం? ఆయన భావజాలం ఏంటి?. బీజేపీ కార్యకర్తలను, పోలీసులను చంపిన వారికి అవార్డులు ఎలా ఇస్తాం?. మా కార్యకర్తలను చంపిన వ్యక్తులపై ఆయన పాటలు పాడారు. మరి అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఎలా ఇస్తాం?. బరాబర్ ఇవ్వం’’.. అని అన్నారాయన. పద్మ అవార్డుల జాబితాలో అర్హులకే అవార్డు లు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం మంచి పేర్లు పంపితే కేంద్రం పరిశీలిస్తుంది. ఏ పేరు పడితే ఆ పేరు పంపితే ఇవ్వరు అని బండి సంజయ్ పేర్కొన్నారు. మాకు భేషజాలు లేవుతెలంగాణ ప్రభుత్వానికి అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ(Telangana) అభివృద్ధికి సహకరిస్తుంది. తెలంగాణకు కేంద్రం గత పదకొండేళ్లలో 12 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేర్లను మార్చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆపేది లేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు పథకాలు అందేలా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.. ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం పథకాలకు పేర్లను మార్చి అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ కుటిల రాజకీయాల కారణంగా పేదలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది.. రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. పేదలకు ఇడ్లు ఇవ్వాలని ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు.. కేవలం పేరు కోసమే పాకులాడుతోంది. మండలానికి ఒక గ్రామానికి మాత్రమే పథకాలను అమలు చేయడం ఎంటి ?. మండలంలో మిగతా గ్రామాల పరిస్థితి ఎంటి ?. ప్రభుత్వం దగ్గర పైసలు లేవు.. ఉన్న పైసలు ఢిల్లీ లో కప్పం కట్టడానికే సరిపోతోంది. తెలంగాణలో 14 శాతం కమీషన్ల ప్రభుత్వం నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి. మాకు బేషజాలు లేవు.. కి కేంద్రం, రాష్ట్రం కలిస్తేనే అభివృద్ధి. రాష్ట్ర ప్రభుత్వానికి పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి నిధులు వస్తున్నాయా ?. పేరు కోసం పాకులాడి గతంలో కేసీఆర్ ఒక్క ఇళ్లు కూడా ఇవ్వలేదు. 2 లక్షల 40 వేల ఇళ్లను కేంద్రం తెలంగాణకు కేటాయిస్తే.. పేరు కోసం లబ్ధిదారులకు ఇవ్వలేదు. తెలంగాణ సెంటిమెంట్ తో లాభపడింది ఎవరనేది ప్రజలకు తెలుసు అని బండి సంజయ్ అన్నారు.ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్బండి సంజయ్ వాఖ్యలు ఈ మధ్య విడ్డూరంగా ఉన్నాయి. పథకాలకు ఇంధిరమ్మ పేరు పెడితే తప్పేంటి?. బండి వ్యాఖ్యలు గద్దర్‌ను అవమానించేలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తిని పద్మ అవార్డులకు ప్రతిపాదిస్తే తప్పా?. నక్సలైట్ భావాజాలం అయితే అవార్డులు ఇవ్వరా?. నక్సలైట్లకు ఎంపీ ,ఎమ్మెల్యే టిక్కెట్ లు ఇవ్వొచ్చు కాని అవార్డులకు పనికి రారా?. లెఫ్ట్ భావజాలం ఉన్న ఈటల బీజేపీ రాష్ట్ర అధ్యక్ష్య పదవి రేసులో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అంటే.. ఈటల ఆ పదవికి అనర్హుడా?. దీనికి బండి సంజయ్ చెప్పాలి. గతంలో ప్రగతి భవన్ ముందు గద్దర్‌ను నిలబెట్టి కేసీఆర్ అవమానిస్తే.. ఇప్పుడు పద్మా అవార్డు ల విషయంలో బండి సంజయ్ అవమానిస్తున్నారు అని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. -
రాష్ట్రాలపై కేంద్రం దండయాత్ర
బంజారాహిల్స్: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై దండయాత్ర చేయాలని చూస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. విశ్వవిద్యాలయాలపై రాష్ట్రాలకున్న అధికారాలను లాక్కొని ఆధిపత్యం చెలాయించాలని కుట్రలు చేస్తోందని... వర్సిటీల వైస్ చాన్స్లర్ల (వీసీ) నియామకాలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ద్వారా చేపట్టాలని చూస్తోందని ఆరోపించారు. ఇందుకోసం యూజీసీ మార్గదర్శకాలను మార్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఆవరణలో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.అనంతరం వర్సిటీ ఆవరణలో మొక్కలు నాటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, డిజిటల్ రిసోర్స్ సెంటర్, సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎసెన్షియల్ స్టాఫ్ క్వార్టర్స్‌కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నాల లక్ష్మయ్య, సీఎస్ శాంతికుమారి, వైస్ చాన్సలర్ ఘంటా చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ కేంద్రం తీరును తీవ్రంగా తప్పుబట్టారు. యూనివర్సిటీలపై ఆధిపత్యం కేంద్రం చేతుల్లోకి వెళితే కొందరి విషప్రచారానికి యూనివర్సిటీలు వేదికలు అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రతిపాదిత నిర్ణయాన్ని రాజ్యాంగంపై, రాష్ట్రాలపై సాంస్కృతిక దాడిగా అభివర్ణించారు. విశ్వవిద్యాలయ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్, మంత్రి పొన్నం తదితరులు రాష్ట్రాల హక్కులను గుంజుకుంటే ఎలా? ‘వర్సిటీలపై రాష్ట్రాల హక్కును కేంద్రం ఎలా తీసుకుంటుంది? ఇలాంటి విధానాలతో రాజ్యాంగం మనుగడ సాగిస్తుందా? అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోనే అధికార విభజన ఉంది. కేంద్రం ఒక్కొక్కటిగా రాష్ట్రాల హక్కులను గుంజుకుంటే ఎలా? కేంద్రం తీరు ఇలాగే ఉంటే రాష్ట్రాలన్నీ నామమాత్రం అవుతాయి. ఇలాంటి చర్యలు అనవసర వివాదాలకు దారితీస్తాయి. యూజీసీ నిబంధనల మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నా. అలా చేయకపోతే అవసరమైతే నిరసనలకు కూడా వెనుకాడం. దీనిపై ఇతర రాష్ట్రాల సీఎంలతో కలిసి యూజీసీ నిబంధనలపై పోరాడతాం. దేశంలో మళ్లీ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే చర్చ జరగడం దురదృష్టరకరం’అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. విద్యా వ్యవస్థను గాడిన పెడతాం.. నాటి ప్రధాని పీవీ నరసింహారావు సామాజిక బాధ్యతగా అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని ముందుకు తీసుకెళ్లారని సీఎం రేవంత్ చెప్పారు. ఈ విశ్వవిద్యాలయం ఉన్నది కేవలం సర్టీఫికెట్ల జారీ కోసమే కాదని.. సమాజంలో సమస్యలకు ఇక్కడి నుంచే పరిష్కారం మొదలుకావాలని పేర్కొన్నారు. విద్యాహక్కును దూరం చేసే హక్కు పాలకులకు ఎవరూ ఇవ్వలేదన్నారు. నిర్లక్ష్యానికి గురవుతున్న విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వందేళ్లలో తొలిసారి ఓయూకు దళిత వీసీని నియమించాం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా యూనివర్సిటీలను బలోపేతం చేసేందుకు సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని వీసీలను నియమించాలని సీఎం రేవంత్ చెప్పారు. వందేళ్ల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి దళిత సామాజిక వర్గానికి చెందిన విద్యావేత్తను వీసీగా నియమించామన్నారు. యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని వీసీలను ఆదేశించామన్నారు. తెలంగాణ సమాజానికి చికిత్స అందించాల్సిన బాధ్యత ప్రొఫెసర్లపై ఉందన్నారు.పదేళ్లకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తే అమలుచేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. యూనివర్సిటీలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన మంచిది కాదని, రాష్ట్రంలో యూనివర్సిటీల పునఃనిర్మాణం జరగాలన్నారు. ప్రొఫెసర్ల వయో పరిమితికి 65కు పెంచే ఆలోచన ఉందని సీఎం చెప్పారు. అంబేడ్కర్ వర్సిటీలో చదువుతున్న ప్రతి విద్యార్థికీ ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామన్నారు. 2034 వరకు ప్రభుత్వం మాదే.. మరో పదేళ్ల వరకు తమ ప్రభుత్వమే కొనసాగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉందని, 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని.. ఆయా పార్టీ లకు పదేళ్లపాటు ప్రజలు అధికారం ఇచ్చారని.. తమకు కూడా 2034 వరకు ప్రజలు అందిస్తారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. పద్మ అవార్డుల్లో అన్యాయంపై ప్రధానికి లేఖ రాస్తా.. పద్మ అవార్డుల విషయంలో కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయ«దీర్ తిరుమలరావు లాంటి ప్రముఖులను గుర్తించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రం సిఫారసు చేసిన వారికి పురస్కారాలు ఇవ్వలేదని ఆరోపించారు. ఏపీకి ఐదు అవార్డులు ఇచ్చారని, తెలంగాణకు కనీసం నాలుగు అవార్డులు ఇచ్చినా బాగుండేదన్నారు. ఈ అన్యాయంపై త్వరలోనే ప్రధానికి లేఖ రాస్తానని చెప్పారు. -
తడి బట్టలతో గుడికి రా రేవంత్.. హరీష్ రావు సవాల్
సాక్షి, సిద్ధిపేట: మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదంటూ సీఎం రేవంత్ అబద్దాలాడుతున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. ఆదివారం ఆయన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పాలకవర్గం అభినందన సభలో మాట్లాడుతూ.. ‘‘దేవుడిపై నమ్మకం ఉంటే కురుమూర్తి ఆలయానికి రేవంత్ రావాలి.. తడి బట్టలతో నువ్వు, నేను గుడిలోకి వెళ్దాం’’ అంటూ హరీష్‌రావు సవాల్ విసిరారు. టీడీపీ పదేళ్లు, కాంగ్రెస్ హయాంలో పదేళ్ల పాటు ప్రాజెక్టులను పట్టించుకోలేదు. కొడంగల్‌లో ప్రశ్నించిన పాపానికి రైతులకు బేడీలు వేయించారు. ఆనాడు ఏ దరఖాస్తు లేకుండా కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేయలేదా? అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు.‘‘11 విడతల్లో రూ.73 వేల కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. 13 లక్షల మందికి లక్ష రూపాయల చొప్పున తిప్పలు పడకుండ కళ్యాణ లక్ష్మి ఇచ్చినం. ఏ దరఖాస్తు లేకుండా 57 ఏళ్లకే ఆసరా పెన్షన్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది...ఎంత సేపు ప్రతిపక్షాలను తిట్టుడు.. కేసీఆర్‌ను తిట్టుడు తప్పా రేవంత్ రెడ్డికి పాలన చేతకాదు. అప్పుడేమో దేవుళ్ల మీద ఒట్టు పెట్టి ముక్కోటి దేవుళ్లను మోసం చేసిండు. ఈ రోజేమో గణతంత్ర దినోత్సవం సాక్షిగా అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి మళ్ళీ కొందరికే అని గణతంత్ర దినోత్సవం రోజున అంబేద్కర్‌ను కూడా మోసం చేసిండు’’ అంటూ హరీష్‌రావు ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: బండి సంజయ్ వ్యాఖ్యలపై కవిత ఫైర్ -
బండి సంజయ్ వ్యాఖ్యలపై కవిత ఫైర్
సాక్షి,హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైరయ్యారు. భారత రాజ్యాంగంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆదివారం(జనవరి26) జరిగిన సెమినార్లో కవిత మాట్లాడారు.‘నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయము అని అన్నారు. ఇది రాష్ట్రాల హక్కులను హరించడం కాదా.ఫెడరల్ స్ఫూర్తిలో కేంద్ర ప్రభుత్వానికి ఏం పని. కింద స్థాయిలో పథకాలు అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు కాదా. బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉండి మీకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వము అనే మాట మాట్లాడుతున్నారు అంటే రాజ్యాంగంలో ఉన్న ఫెడరల్ స్ఫూర్తి ఏమైనట్లు. బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల హక్కులను హరించే అధికారం వాటికి లేదు. పాకెట్ డైరీలా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. దేశమంతా తిరుగుతూ రాజ్యాంగాన్ని కాపాడాలి అని అంటున్నారు.. నేను ఆయనను తెలంగాణకు స్వాగతిస్తున్న. మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. మీరు చెబుతున్న రాజ్యాంగాన్ని ముందు తెలంగాణలో కాపాడండి.కొన్ని నెలల క్రితం ఆసిఫాబాద్‌లో మతకల్లోలాలు జరిగి వందలాది మంది నిరాశ్రయులయ్యారు.. వాళ్ల గురించి ఒక్క నాయకుడు కూడా మాట్లాడటం లేదు. ఆసిఫాబాద్ లో నెలల తరబడి ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి వాళ్లకు ఎలాంటి ఆర్థిక సహాయం గానీ నష్టపరిహారం కానీ అందలేదు... ప్రభుత్వ పెద్దలు కనీసం వాళ్లను పరామర్శించలేదు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రులు కనీసం అటు వైపు చూడలేదు. రాజ్యాంగ విలువలని తుంగలో తొక్కుతున్నారు’అని కవిత ఫైరయ్యారు.కాగా, శనివారం కరీంనగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ఇళ్లపై ఇందిరమ్మ బొమ్మ పెడితే కేంద్రం నుంచి ఇళ్లు ఇవ్వమని, ప్రధాని మోదీ ఫొటో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇదీ చదవండి: బీజేపీపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు -
కొత్త పథకాలు పెద్ద బోగస్: జగదీష్‌రెడ్డి
సాక్షి,సూర్యాపేట జిల్లా: కాంగ్రెస్ కొత్త నాలుగు పథకాల కార్యక్రమం అంతా బోగస్సేనని, ముందురోజు వరకు దరఖాస్తులు తీసుకుని తెల్లారే లబ్ధిదారుల ఎంపిక అంటున్నారని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలో ఆదివారం(జనవరి26) జగదీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘గ్రామ సభలన్నీ ఒక ప్రహాసనంగా మార్చారు. రెండు సార్లు దరఖాస్తులు తీసుకుని బుట్టదాఖలు చేసి మళ్లీ దరఖాస్తులు అంటున్నారు. పైరవీ చేసుకున్న వారికి మాత్రమే లబ్ధి చేకూరుతోంది. హామీలు ఎగ్గొట్టడానికే కాంగ్రెస్, బీజేపీలు డ్రామాలాడుతున్నాయి. ఒకరు రాష్ట్రానికి టోకరా వేస్తే మరొకరు దేశానికి టోకరా వేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు తెలంగాణ ద్రోహులే. ప్రభుత్వాన్ని నడపడం కాంగ్రెస్‌కు చేతకావడంలేదు. దోచుకోవడం కప్పం కట్టడంతోనే రేవంత్‌కు సమయం సరిపోవడంలేదు’అని జగదీష్‌రెడ్డి విమర్శించారు.కాగా ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్‌కార్డుల జారీ అనే నాలుగు కొత్త స్కీమ్‌లను సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆదివారం(జనవరి26) ప్రారంభించింది. ఈ స్కీములను కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గీలో సీఎం రేవంత్ లాంఛనంగా ప్రారంభించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే రైతు భరోసా నిధులు రైతు ఖాతాలో జమవుతాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇదీ చదవండి: అర్ధరాత్రి నుంచే రైతుభరోసా డబ్బులు ఖాతాల్లోకి -
బీజేపీపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమే లేదన్నారు. పొరపాటున బీజేపీకి తెలంగాణలో 8 ఎంపీ సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో జగ్గారెడ్డి ఆదివారం(జనవరి26) మీడియాతో మాట్లాడారు. ‘ఈ దేశంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఇంధిరమ్మ ఇల్లు కనిపిస్తుంది. ఏ ముసలి అవ్వ, ముసలి తాతను అడిగినా ఇంధిరమ్మ ఇళ్లలోనే ఉంటుంన్నాం అని చెప్తారు. ఇంధిరమ్మను చూసేందుకు మారుమూల గ్రామాల నుంచి ఎడ్లబండ్లు కట్టుకుని వచ్చేవారు. ఉనికి కోసమే బండి సంజయ్ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. ఇంధిరమ్మ పేరు పెడితే నిధులు ఇవ్వమని సంజయ్ బెదిరిస్తున్నారు. బండి సంజయ్ నీ ఊరికే వస్తా.. ఇంధిరమ్మ గురించి ఓ ముసలమ్మను అడుగుదాం.. ఏం చెప్తదో చూద్దాం. స్వాతంత్ర్య ఉధ్యమంలో నిండు గర్బినిగా ఉండగా ఇందిరమ్మ జైలుకు వెళ్లారు. విలువలతో కూడిన రాజకీయం బీజేపీ చేయడం లేదు. అటల్ బీహారీ వాజ్‌పేయి,ఎల్కే అద్వానీ గురించి మేము ఏనాడూ తప్పుగా మాట్లాడలేదు. ఇంధిరా గాంధీ చరిత్ర ఎంత చెప్పినా తక్కువే. రాజ్యాంగాన్ని నిర్మించే భాధ్యత అంబేద్కర్‌కు అప్పగించింది నెహ్రూయే. ఇంధిరాగాంధీని విమర్శించడం బండి సంజయ్ వయస్సుకు తగదు. బండి సంజయ్ క్షమాపణ చెప్పి..ఈ వివాదానికి స్వస్తి పలకాలి’అని జగ్గారెడ్డి కోరారు. -
ఎలా ఇవ్వరో మేమూ చూస్తాం: మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: బండి సంజయ్(Bandi Sanjay) ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వడం లేదని.. ఇందిరమ్మ పేరు పెడితే డబ్బులు ఇవ్వరా?.. ఎలా ఇవ్వరో తామూ చూస్తామంటూ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇందిరమ్మపై అవహేళనగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.10 నెలల కాలంలో జీఎస్టీ రూపంలో రూ.37 వేల కోట్ల రూపాయలు కేంద్రం వసూలు చేసింది. మరి కేంద్రం తెలంగాణకు ఇచ్చింది ఎంత? అంటూ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. దీన్ దయాల్ అంత్యోదయ, దీన్ దయాల్ గృహ జ్యోతి లాంటి పేర్లు పథకాలకు ఎందుకు పెట్టారు?. వీల్లేమైనా దేశం కోసం ప్రాణ త్యాగం చేశారా?. తెలంగాణ నుంచి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు ఒక్క రూపాయన్న కేంద్రం నుంచి అదనంగా తెచ్చారా?’’ అంటూ పోన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: ప్రధాని ఫొటో పెడితేనే నిధులు..కాగా, కేంద్రం ఇచ్చే నిధులతో అమలయ్యే పథకాలకు ప్రధాని ఫొటోను వాడకుంటే తామే లబ్దిదారులకు నేరుగా నిధులు ఇచ్చేలా ఆలోచన చేస్తామంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘‘కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర పథకాలకు మళ్లిస్తున్నాయి. గతంలో నేను నిలదీయడం వల్ల వరంగల్, కరీంనగర్ స్మార్ట్‌సిటీ నిధులను గత ప్రభుత్వం విడుదల చేసింది. ఇకపై కేంద్ర నిధులతో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు, అలాగే రేషన్‌కార్డులపై సీఎంతోపాటు ప్రధాని ఫొటో తప్పకుండా ఉండాల్సిందే. లేకపోతే ఆయా పథకాలకు నిధులు నిలిపివేస్తాం’ అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. -
ఇవాళ అర్ధరాత్రి నుంచే ‘రైతుభరోసా’ డబ్బులు: సీఎం రేవంత్
సాక్షి,మహబూబ్‌నగర్:గతంలో కొడంగల్ నియోజకవర్గం వివక్షకు గురైంది ఇప్పుడు రాష్ట్రం మొత్తం కొడంగల్‌వైపు చూస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం చంద్రవంచలో నాలుగు కొత్త పథకాలను ఆదివారం(జనవరి26) రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.ఈ సందరర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేస్తున్నాం. భూమికి, విత్తనానికి ఎంత సంబంధం ఉందో రైతుకు, కాంగ్రెస్‌కి అంతే అనుబంధం ఉంది. రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌దే. ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు రాజ్యం.వ్యవసాయం అంటే దండగ కాదు పండగ. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో 10 లక్షల లబ్ధి. 70 లక్షల మందికి రైతు భరోసా అందిస్తున్నాం. మొదటి ఏడాదిలోనే 50 వేల ఉద్యోగాలిచ్చాం. 13 నెలలుగా కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు.సర్పంచ్ ఊళ్లో లేకపోతే పదవి నుంచి దిగిపో అంటాం. మరి ప్రతిపక్షనేత సభకు రాకపోతే ఏమనాలి. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు, పదేళ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌కు రేషన్ కార్డులివ్వాలనిపించలేదు.పదవి లేకున్నా నా సోదరుడు తిరుపతిరెడ్డి ప్రజాసేవ చేస్తున్నాడు..ఏ పదవి లేకున్నా నా సోదరుడు తిరుపతి రెడ్డి ప్రజా సేవ చేస్తుంటే విమర్శిస్తున్నారు. వాళ్లలా కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చి మేము దోచుకోవడం లేదు. కొడంగల్ నియోజకవర్గంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా తిరుపతిరెడ్డి అందుబాటులో ఉంటారు. పదవి ఆశించకుండా ప్రజాసేవ చేస్తుంటే వాళ్లకు కడుపు మంట వస్తోంది. అందుకే వారి కడుపు మంట తగ్గడానికి ఈనో ప్యాకెట్లు పంపుతున్నాం’అని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. -
అనర్హులకు పథకాలు.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
సాక్షి,సూర్యాపేట జిల్లా: ప్రజలు ఆశించిన మేరకు ఇందిరమ్మ పాలన సాగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం(జనవరి26) సూర్యాపేట మండలం కేటీ అన్నారం గ్రామంలో ప్రజాపాలన- పథకాల ప్రారంభోత్సవంలో తుమ్మల మాట్లాడారు. ‘ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం. అర్హులైన చివరి లబ్ధిదారులకు ప్రజాపాలన పథకాలు అందిస్తాం. రేషన్ కార్డులతో సమానంగా హెల్త్ కార్డులు ఇస్తాం. అనర్హులు ఎవరైనా లబ్ధిపొందితే స్వచ్ఛందంగా వాటిని తిరిగి ఇచ్చేయాలి. అర్హుల ఎంపికలో పారదర్శకంగా వ్యవహరించాలి’అని తుమ్మల కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా జనవరి 26 నుంచి రైతుభరోసా, కొత్త రేషన్‌కార్డులు వంటి పథకాలను ప్రారంభించింది. జిల్లాల్లో మంత్రులు ఈ పథకాలను ప్రారంభించగా కొడంగల్ నియోజకవర్గం చంద్రవంచలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకాలను ప్రారంభించారు. -
బీజేపీవి రాజ్యాంగ విరుద్ద కార్యక్రమాలు: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: దేశంలో కాషాయ ఎజెండాను అమలుచేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇదే సమయంలో ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అందిస్తోందని చెప్పుకొచ్చారు.గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్లో జాతీయ పతాకాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎంపీ అనిల్ యాదవ్, మాజీ ఎంపీ హనుమంతరావు, చైర్మన్లు శివసేనారెడ్డి, చల్లా నర్సింహారెడ్డి, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. బీజేపీ దేశంలో కాషాయ ఎజెండాను అమలు చేయాలని చూస్తోంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయాలని ప్లాన్ చేస్తోంది. అందుకే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్‌లోనే అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమాన పరిచారు. ఇక్కడ కేంద్రమంత్రి బండి సంజయ్ ఇందిరమ్మ పేరు పెట్టవద్దని అంటున్నాడు. ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధ కార్యక్రమాలు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన అందిస్తుంది. తెలంగాణలో బీఆర్ఎస్ పదేళ్లు నియంత పాలన చేసింది. ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. ఈరోజు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ భరోసా కింద 12 వేల రూపాయలు, రైతు భరోసా కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. రాజ్యాంగబద్దంగా పాలన చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాము. హైదరాబాద్ మెట్రో విస్తరణ ఒక పెద్ద ముందడుగు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఎల్లప్పుడు ఉంటుంది. అందుకే జై గాంధీ, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ప్రజలంతా మద్దతు ప్రకటించాలి అని కోరారు. -
ప్రధాని ఫొటో పెడితేనే నిధులు..
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ‘కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర పథకాలకు మళ్లిస్తున్నాయి. గతంలో నేను నిలదీయడం వల్ల వరంగల్, కరీంనగర్ స్మార్ట్‌సిటీ నిధులను గత ప్రభుత్వం విడుదల చేసింది. ఇకపై కేంద్ర నిధులతో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు, అలాగే రేషన్‌కార్డులపై సీఎంతోపాటు ప్రధాని ఫొటో తప్పకుండా ఉండాల్సిందే. లేకపోతే ఆయా పథకాలకు నిధులు నిలిపివేస్తాం’అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శనివారం కరీంనగర్లో నగర మేయర్ సునీల్‌రావు, పలువురు కార్పొరేటర్లు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, కేంద్రం ఇచ్చే నిధులతో అమలయ్యే పథకాలకు ప్రధాని ఫొటోను వాడకుంటే తామే లబ్దిదారులకు నేరుగా నిధులు ఇచ్చేలా ఆలోచన చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రసంగంలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్‌రెడ్డికి గురువు కేసీఆరేనని, అందుకే.. ఆయన బాటలోనే రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ‘సీఎం రేవంత్ బీఆర్ఎస్ నేతలను తొలుత కేసులతో భయపెట్టి, ఆపై కాంగ్రెస్ అధిష్టానానికి డబ్బులు ఇవ్వగానే.. వాటిని పక్కనబెడుతున్నారు. గతంలో పెట్టిన కేసులన్నీ ఇలాగే నీరుగార్చారు’అని ధ్వజమెత్తారు. కంపెనీలు, నిధులపై శ్వేతపత్రం ప్రకటించాలి‘పార్టీలకు చందాలిచ్చిన గ్రీన్కో లాంటి సంస్థపై ఏసీబీ దాడులు చేయడం రాష్ట్రానికి నష్టం. ఫలితంగా పలు కంపెనీలు రాష్ట్రం నుంచి తరలివెళ్తున్నాయి. అసలు 2014 నుంచి రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు, నిధులు, కల్పించిన ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులిచ్చినా.. కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు ఇచి్చనా, ఏ కార్యక్రమానికీ నన్ను పిలవలేదు. బీఆర్ఎస్ పాలన మొత్తం అవినీతిమయం. సునీల్‌రావు చేరికతో రాబోయే బల్దియా ఎన్నికల్లో కరీంనగర్లో బీజేపీ విజయబావుటా ఎగరేస్తుంది’అని సంజయ్ అన్నారు. అనంతరం సునీల్‌రావు మాట్లాడుతూ.. మాజీ మంత్రి గంగుల కమలాకర్‌పై పలు ఆరోపణలు చేశారు. -
బండి సంజయ్‌పై జగ్గారెడ్డి ఫైర్
సాక్షి,హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లపై చేసిన వ్యాఖ్యలకుగాను కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఈ విషయమై జగ్గారెడ్డి శనివారం(జనవరి25) మీడియాతో మాట్లాడారు.‘బండి సంజయ్‌కి రాజకీయ అనుభవం లేకుండానే మినిస్టర్ పోస్ట్ వచ్చింది. బండి సంజయ్‌కి అనుభవం లేదు. అందుకే ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఏది పడితే అది మాట్లాడుతా అంటే కుదరదు. కొందరు నేతలు న్యూస్ బ్రేకింగ్ కోసం మాట్లాడుతున్నారు. బండి సంజయ్ బ్రేకింగ్ లీడర్.. ఆయన మాట్లాడితే తలా తోక ఉండదు. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వారి ఫోటోనే ఉంటది. మోదీ ఫోటో పెట్టకపోతే పైసలు ఇయ్యరా.బండి సంజయ్ తెలంగాణ ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. బియ్యానికి పైసలు ఇయ్యమని బండి సంజయ్ ఎలా అంటారు. ఇళ్ళ కు నిధులు ఇవ్వమని బెదిరిస్తారా...ఇంత డైరెక్ట్ గా బెదిరింపులా నిధులు ఏమైనా సీఎం రేవంత్ రెడ్డికి ఇస్తున్నారా..తెలంగాణ ప్రజలకే కదా. మోదీకి గులాం చేస్తేనే నిధులు ఇస్తారా. బండి సంజయ్ వాఖ్యలను కిషన్ రెడ్డి సమర్దిస్తారా’చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. -
బండి సంజయ్‌కి టీపీసీసీ చీఫ్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కేంద్రమంత్రి బండి సంజయ్‌కి పీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం(జనవరి25) మహేష్‌కుమార్‌గౌడ్ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘బండి సంజయ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ప్రధానమంత్రి ని గౌరవిస్తాం. ఇంధిరమ్మ త్యాగం ముందు మీరు, మీ మోదీ ఎంత. ఇంధరమ్మను బండి సంజయ్ అవమానిస్తున్నారు. బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ మాట ఇస్తే మడమ తిప్పదని రేపు నాలుగు పథకాలు ప్రారంభించి మరోసారి నిరూపించుకోబోతున్నాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పండుగ జరుపుకోవాలి. పదేళ్లలో బీఆర్ఎస్ కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇండ్లు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుతో అయినా గత పాలకులకు కనివిప్పు కలగాలి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల అనుచరులకే సంక్షేమ పథకాలు వచ్చాయి. మా ప్రభుత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలే లబ్ధిదారుల లిస్ట్‌లో పేరు లేదని ఫిర్యాదు చేస్తున్నారు. మేం ఎవరిపై కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదు. తప్పు చేస్తే మాత్రం చర్యలు తప్పవు’అని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. కాగా, ఇందిరమ్మ(Indiramma house) పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా కేంద్రం ఇవ్వదంటూ కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’(Pradhan Mantri Awas Yojana) పేరు పెడితేనే నిధులిస్తామంటూ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ఫొటోలు పెడితే రేషన్ కార్డులు ఇవ్వం.. మేమే ముద్రించి ప్రజలకు రేషన్‌కార్డులు ఇస్తామని బండి సంజయ్ చెప్పారు.కరీంనగర్లో మేయర్, కార్పొరేటర్లు బీజేపీలోకి చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి గుర్తించి బీజేపీలో చేరడం సంతోషమన్నారు బీఆర్ఎస్ హయాంలో చాలా ఇబ్బందులు పెట్టారు. రాజకీయ ఒత్తిళ్లతో బీఆర్ఎస్లో ఉన్న సునీల్‌రావు కూడా ఏం చేయలేకపోయారు. నేను హైదరాబాద్‌లో మీటింగ్‌లో గొడవ చేసిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చాక నిధులు విడుదల చేశారని బండి సంజయ్ చెప్పారు. -
ఆదిలాబాద్‌లో రైతు ఆత్మహత్య.. హరీశ్‌రావు కీలక ప్రకటన
సాక్షి,హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలానికి చెందిన రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. రైతు మామిళ్ల నర్సయ్య ఆత్మహత్యపై హరీశ్‌రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు హరీశ్‌రావు శనివారం(జనవరి25)ఒక ప్రకటన విడుదల చేశారు.‘ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే గడిచిన వారం రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. రైతుల మరణ మృదంగం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్లు? కాంగ్రెస్ పాలనలో రైతన్నకు భరోసా లేక మనోధైర్యం కోల్పోతున్నడు. అందరికి అన్నం పెట్టే అన్నదాతకు సున్నం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ. నమ్మి ఓటేసిన పాపానికి నట్టేట ముంచి, నమ్మక ద్రోహం చేస్తున్నది. రుణమాఫీ పూర్తి చేసినట్లు రంకెలేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న రైతులకు ఏమని సమాధానం చెబుతారు. రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఆత్మహత్యలు పరిష్కారం కావు, బతికుండి కొట్లాడుదాం. అధైర్య పడొద్దు, బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది’అని హరీశ్‌రావు తెలిపారు. -
ఇందిరమ్మ ఇళ్లపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: ఇందిరమ్మ(Indiramma house) పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా కేంద్రం ఇవ్వదంటూ కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’(Pradhan Mantri Awas Yojana) పేరు పెడితేనే నిధులిస్తామంటూ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ఫొటోలు పెడితే రేషన్ కార్డులు ఇవ్వం.. మేమే ముద్రించి ప్రజలకు రేషన్‌కార్డులు ఇస్తామని బండి సంజయ్ చెప్పారు.కరీంనగర్లో మేయర్, కార్పొరేటర్లు బీజేపీలోకి చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి గుర్తించి బీజేపీలో చేరడం సంతోషమన్నారు బీఆర్ఎస్ హయాంలో చాలా ఇబ్బందులు పెట్టారు. రాజకీయ ఒత్తిళ్లతో బీఆర్ఎస్లో ఉన్న సునీల్‌రావు కూడా ఏం చేయలేకపోయారు. నేను హైదరాబాద్‌లో మీటింగ్‌లో గొడవ చేసిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చాక నిధులు విడుదల చేశారు..కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి విషయంలో నన్ను పాల్గొనకుండా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తి అవినీతే తప్ప మంచి లేదు. ఇప్పుడు పెనం మీద నుంచి పొయిలో పడినట్లయింది. కేసీఆర్ బాటలోనే రేవంత్ నడుస్తుండు. డ్రగ్స్ కేసు, ఈ-ఫార్ములా కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఇలా అన్ని కేసులు పేర్లతో డైవర్షన్ తప్ప చేసిందేమీ లేదు. ఇప్పుడు దావోస్ ఇష్యూ ముందుకు తెచ్చారు...గ్రీన్కో వంటి సంస్థలపై దాడులు చేస్తే ఇవాళ తెలంగాణాకు వచ్చేందుకు భయపడుతున్నాయి. గ్రీన్కో నుంచి కాంగ్రెస్‌కు పైసలు ముట్టినై. 2014 నుంచి ఇప్పటివరకు దావోస్‌లో జరిగిన ఒప్పందాల్లో ఎన్ని పెట్టుబడులు వచ్చియో శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: వాటిజ్ దిస్...వేర్ ఈజ్ సీపీ? -
కరీంనగర్లో హీట్ పాలిటిక్స్.. మేయర్‌కు గంగుల సవాల్
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. నేడు కేంద్రమంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో ఆయన బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. తనతో పాటు మరో 10 మంది కార్పొరేటర్లను తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మేయర్‌పై మాజీ మంత్రి గంగుల కమలాకర్ సంచలన ఆరోపణలు చేశారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘మేయర్ సునీల్ రావు అత్యంత అవినీతిపరుడు. ఈ ఐదు సంవత్సరాల్లో కోట్ల రూపాయలు సంపాదించాడు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆధారాలను త్వరలో వివరాలు వెల్లడిస్తాను. అవినీతిని బయటపెడతాను అంటున్న సునీల్ రావే ఈ ఐదేళ్లు దోపిడీ చేశాడు. అతడికి పార్టీలు మారడం అలవాటు. ఆయనతో ఒక్క కార్పొరేటర్ కూడా వెళ్లడం లేదు. నాపై అవినీతి ఆరోపణలు చేశారు కదా.. ఏ విచారణకైనా సిద్ధం’ అంటూ సవాల్ విసిరారు. దీంతో, జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది.ఇదిలా ఉండగా.. పార్టీ మార్పుపై మేయర్ సునీల్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఉదయం సునీల్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నాను. బండి సంజయ్ నేతృత్వంలో అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో బీజేపీలోకి వెళ్తున్నాను. వచ్చే కార్పోరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్‌పై కాషాయ జెండా ఎగురేస్తాం. నా వెంట రెండు వేల మంది కార్యకర్తలు ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో జాయిన్ అవుతున్నారు. నేను మొదట ఏబీవీపీ కార్యకర్తనే. మాజీ ఎంపీ వినోద్ కుమార్ వల్లే నాకు మేయర్ పీఠం దక్కింది. కాంగ్రెస్‌లో చేరాలని కూడా చాలా మంది కోరారు. నన్ను మేయర్ పీఠంపై కూర్చోకుండా చాలామంది స్థానిక నాయకులు అడ్డుపడ్డారు’ అంటూ కామెంట్స్ చేశారు. -
National Voters Day: ‘ఓటు’.. ఎందుకీ తడబాటు?
ప్రతీ పౌరుడు ఓటు హక్కును ప్రాథమిక బాధ్యతగా స్వీకరించాలి. మొత్తం ఓటర్లలో కనీసం 90 శాతం మంది ఓటుహక్కును వినియోగించుకోవాలి. 90 శాతం ఓటింగ్ జరిగితే దేశం ఎప్పుడూ అభివృద్ధి పథంలో పురోగమిస్తుంది. – అబ్దుల్ కలాం, మాజీ రాష్ట్రపతి సాక్షి ప్రతినిధి, వరంగల్: భారత రాజ్యాంగంలోని 326 ఆర్టికల్ ప్రకారం 18 ఏళ్లు నిండిన జాతీయ పౌరులకు వయోజన ఓటుహక్కు(National Voters Day) కల్పించారు. కుల, మత, లింగ, ప్రాంత, ధనిక, పేద, వివక్ష లేకుండా అక్షరాస్యులకు నిరక్షరాస్యులకు సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించి.. ప్రపంచ రాజకీయ చరిత్రలో గొప్ప విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. అభివృద్ధి చెందిన దేశాల కంటే ముందే మనదేశంలో వయోజన ఓటింగ్ హక్కు కల్పించి, ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వేసింది. అయితే ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ.. అవినీతిని పారదోలే వజ్రాయుధం.. రాజ్యాంగం ప్రసాదించిన హక్కు.. ఇలా ఎన్ని విశ్లేషణలు జోడించినా.. ఓటు వేస్తున్న వారి సంఖ్య ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లేందుకు వీలుగా.. వరసలో నిలబడి ఓటు వేయడానికి ఇంకా చాలామంది ఆసక్తి చూపడం లేదు. ఓటు వేసే విషయంలో గ్రామీణ ఓటర్లు మొగ్గు చూపుతున్నా.. పట్టణ, నగర ఓటర్లే తడబడుతున్నారు. ఓటర్ల నమోదు పెరుగుతున్నా.. ఓటింగ్ శాతం మాత్రం పెరగడం లేదు. తెలంగాణలో మూడు ఎన్నికలు.. 80 శాతం చేరని వైనం..1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో 45 శాతం ఓటర్లు మాత్రమే ఓటు(Vote) హక్కును వినియోగించారు. 2019 నాటికి 17వ లోకసభ ఎన్నికల్లో 66.4 శాతం మంది ఓటు వేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడు పర్యాయాలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఏటా 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకుల ఓటు నమోదు కోసం జిల్లాల అధికార యంత్రాంగం విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఎన్నికల సమయంలోనూ ఓటింగ్ శాతం పెరిగేలా చర్యలు చేపడుతోంది. కానీ.. ఈ ఎన్నికల్లో మొత్తం ఓట్లు.. పోలైన ఓట్లు.. ఓటింగ్ శాతాలు పరిశీలిస్తే 80 శాతం చేరుకున్న దాఖలాలు లేవు. కేంద్ర ఎన్నికల సంఘం నివేదికల ప్రకారం.. తెలంగాణ ఏర్పడిన తొలి శాసనసభ (2014) ఎన్నికల్లో 2,81,65,885 మంది ఓటర్లకు 1,94,43,411 మంది (69.0 శాతం) ఓటు వేశారు. 2018లో 79.67 శాతం ఓట్లు పోల్ కాగా, 2023లో 71.37 శాతంగా నమోదైంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు భారీ వ్యత్యాసం..తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌లో భారీ వ్యత్యాసం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసినంతమంది కూడా పార్లమెంట్ ఎన్నికలకు ముందుకు రాలేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 2,81,65,885 మంది ఓటర్లకు 1,94,43,411 మంది (69.0శాతం) ఓటు వేయగా.. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 2,81,75,651 ఓట్లకు 1,94,31,99 (68.97 శాతం) ఓట్లు పోలయ్యాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 2,56,94,443 ఓట్లకు, 2,04,70,749 (79.67 శాతం) ఓట్లు పోలవగా, ఆ తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 2,80,65,876 ఓట్లకు 1,86,42,895 (66.4 శాతం) ఓట్లు పోలయ్యాయి. అలాగే 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 3,26,02,799 ఓటర్లకు 2,32,67,914 మంది ఓటర్లు (71.37 శాతం) తమ ఓటుహక్కును వినియోగించుకోగా, 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల నాటికి ఓటు న మోదు పెరిగినా 5.11 శాతం తగ్గింది. మొత్తం 3,32,16,348 మంది ఓటర్లకు 2,20,08,373 మంది (66.26 శాతం) ఓట్లేశారు.ఓటు హక్కుపై అవగాహన ఓటు హక్కు వినియోగంపై ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌కు తోడు పౌరసమాజం, యువత మహిళా సంఘాలు, స్వచ్ఛంద సామాజిక సేవా సంస్థలు చైతన్యం కలిగించాలి. అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం ఓటుహక్కు చాలా కీలకం. ఓటు హక్కు వినియోగం మీద అందరినీ మరింత చైతన్య పరచాల్సిన బాధ్యత పౌరసమాజంపై ఉంది. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా సమర్ధులైన అభ్యర్థులకు ఓటువేసేలా చూడాలి. – డాక్టర్ కేశవులు, చైర్మన్, తెలంగాణ యాంటీ కరప్షన్ ఫోరం -
ఒక్క చుక్కా తరలించలేదు
సాక్షి, హైదరాబాద్: ‘గోదావరి–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును ఏపీ నిర్మించి 200 టీఎంసీలు తరలించుకుపోతుంటే మేము మౌనంగా ఉన్నామని మాజీమంత్రి హరీశ్‌రావు పచ్చి అబద్ధాలు, అసత్యాలను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అసలా ప్రాజెక్టు నిర్మాణమే జరగలేదు. 200 టీఎంసీలు కాదుకదా ఒక్క చుక్కనీరు ఎవరూ తీసుకుపోలేదు’అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. హరీశ్‌రావు చేసిన ఆరోపణలను ఖండిస్తూ శుక్రవారం రాత్రి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు.గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుకు నిధుల కోసం ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాస్తే ఆ లేఖను ఆమె కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు పంపించారని వివరించారు. ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమైన ఈ అక్రమ ప్రాజెక్టుకు నిధులు కేటాయించొద్దని కోరుతూ తాము నిర్మలా సీతారామన్, సీఆర్ పాటిల్‌కు ఇప్పటికే కౌంటర్ లేఖలు రాశామని స్పష్టం చేశారు. ‘ఈ అంశంపై అఖిలపక్షం పెట్టాలని అడగడానికి వారెవరు ? పిలవాలో లేదో మేము నిర్ణయం తీసుకుంటాం.. అబద్ధాలు మాట్లాడి పిలవమంటే ఎలా?’అని హరీశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు కోలుకోలేని నష్టం.. ‘బీఆర్ఎస్ హయాంలో తెలంగాణకు నీటి కేటాయింపుల్లో అన్ని విధాలుగా తీవ్రమైన నష్టం జరిగింది’అని ఉత్తమ్ అన్నారు. ఆ నష్టాలను పూడ్చడానికి ప్రయత్నిస్తుంటే ఓర్వలేకనో అధికారం పోయిందనో అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రానికి కృష్ణా జలాల్లో 811 టీఎంసీల వాటా ఉండగా, తెలంగాణ ఏర్పడ్డాక 2015 జూన్ 18, 19న, అలాగే 2016 జూన్ 21, 22న కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశాలకు హాజరై తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల ఇచ్చుకోండి అని చెప్పి వచ్చారని తప్పుబట్టారు.అదే ఏడాది సెప్టెంబర్ 21న జరిగిన తొలి అపెక్స్ కౌన్సిల్‌తోపాటు ఆ తర్వాత జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి నాటి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు హాజరై తెలంగాణకు 299 టీఎంసీలు చాలని ఒప్పుకొని సంతకం పెట్టి వచ్చారన్నారు. కృష్ణా ట్రిబ్యునల్–1 ప్రాజెక్టుల వారీగా కాకుండా గంపగుత్తగా కేటాయింపులు జరిపిందని, దీని ఆధారంగా మనకు ఎక్కువ వాటా అడగాల్సింది పోయి తక్కువ వాటా అడిగారన్నారని విమర్శించారు. క్యాచ్మెంట్ ఏరియా, జనాభా, సాగుకు యోగ్యమైన భూములు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని తెలంగాణకు కృష్ణా జలాల్లో 70 శాతం, ఏపీకి 30 శాతం కేటాయింపులు జరపాలని తాము కృష్ణా ట్రిబ్యునల్–2, కేఆర్‌ఎంబీతోపాటు సుప్రీం కోర్టులో పోరాడుతున్నామన్నారు. ‘రాయలసీమ’కు బీఆర్ఎస్ సహకారం ఏపీలోని ముచ్చుమర్రి ప్రాజెక్టు సామర్థ్యం బీఆర్ఎస్ హయాంలో 3,850 నుంచి 6,738 క్యూసెక్కులకు పెరిగినా నాటి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ నిశ్శబ్దంగా ఉన్నారని ఉత్తమ్ ఆరోపించారు. నాడు ఏపీ నిర్వహించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు సాఫీగా జరిగేలా, 2020 ఆగస్టు 5న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నాటి కేసీఆర్ ప్రభుత్వం వాయిదా వేయాలని కోరిందని తప్పుబట్టారు. రోజుకు 3 టీఎంసీలను తరలించడానికి చేపట్టిన ఈ ప్రాజెక్టుతో మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తీవ్ర నష్టమన్నారు. కేసీఆర్ పాలనలోనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 44,000 నుంచి 92,000 క్యూసెక్కులకు పెరిగిందని, హెచ్ఎన్ఎస్ఎస్, మల్యాల, ముచ్చుమర్రి నుంచి గతంలో కంటే ఎక్కువ నీటిని తీసుకెళ్లడం ప్రారంభమైందన్నారు. ఉమ్మడి ఏపీలో శ్రీశైలం నుంచి రోజుకు 4.1 టీఎంసీలను తరలిస్తే గత ప్రభుత్వ హయాంలో 9.69 టీఎంసీకి పెరిగిందని ఆరోపించారు. -
రేవంత్ ‘ఐటీ ఉద్యోగి’ వ్యాఖ్యలు..కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి,రాజన్నసిరిసిల్లజిల్లా:నేను రాజకీయాల్లోకి రాకముందు ఐటీ సౌత్ ఇండియా హెడ్‌గా పనిచేసింది నిజమేనని, మరి అప్పుడు సీఎం రేవంత్ ఏం చేసేవాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. సిరిసిల్లలో కేటీఆర్ శుక్రవారం(జనవరి24) మీడియాతో మాట్లాడారు.‘ సీఎం రేవంత్‌రెడ్డివి అహంకారపూరిత మాటలు. నేను ఐటీలో ఉన్నపుడు రేవంత్ ఏం చేసిండు..? బ్రోకరిజమా, సూట్ కేసులు మోసుడా..ఇవన్నీ నేనంటే మళ్ళీ నాపై ఏడుపొకటి.ఎవరైనా బీఆర్ఎస్ను వీడితే కేసీఆర్ అన్నట్టు వారి గ్రహచారం బాగా లేకపోవడమే. నేను మళ్ళీ చెబుతున్నా.నాపై పెట్టినవి లొట్టపీసు కేసులు.లై డిటెక్టర్ పెట్టి విచారణ చేసుకోమని నేనే సవాల్ విసురుతున్నా. ప్రజాపాలన సభల్లో జనం ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.స్పష్టత లేకుండా గ్రామసభలు నిర్వహిస్తే జనం తిరగబడ్డారు.పథకాల అమలు చేతగాక కాంగ్రెస్ మంత్రులు ఇతర పార్టీలపై బురద జల్లుతున్నారు’అని కేటీఆర్ విమర్శించారు.కాగా, దావోస్ పర్యటనలో ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేటీఆర్‌ది కేవలం ఐటీ ఉద్యోగి మెంటాలిటీ అని తాను పాలసీ మేకర్నని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై ఐటీ రంగంలోని ఉద్యోగ వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయమై ఎక్స్(ట్విటర్)లో స్పందించిన కేటీఆర్ తాజాగా నేరుగా రేవంత్‌కు కౌంటర్ ఇచ్చారు. -
కౌశిక్‌రెడ్డి ప్రవర్తనపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాజకీయ ప్రవర్తనపై మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పందించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం(జనవరి24) మీడియా చిట్‌చాట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధి కార్యక్రమ సమావేశంలో కౌశిక్ రెడ్డి తీరుపై ఉత్తమ్ అసహనం వ్యక్తం చేశారు. మంత్రిని తాను స్టేజ్‌పై ఉండగానే అల్లరి చేయడం లీడర్ లక్షణం కాదన్నారు.యువ రాజకీయ నాయకుడికి అంత ఆవేశం పనికిరాదు.కౌశిక్‌రెడ్డి తన తీరు మార్చుకోకపోతే రాజకీయ భవిష్యత్తులో ఇబ్బందులు పడతాడు.తనకు కౌశిక్‌రెడ్డికి రాజకీయంగా ఎలాంటి సంబంధాలు లేవని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కాగా, ఇటీవల కరీంనగర్ డీఆర్సీ సమావేశంలో ఇంఛార్జ్ మంత్రిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వేదికపై ఉండగానే కౌశిక్‌రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌తో గొడవ పెట్టుకోవడమే కాకుండా ఆయనను నెట్టివేశారు. ఇది పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ గొడవలో కౌశిక్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేయగా అనంతరం కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. అంతకు ముందు కూడా బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి వివాదాస్పద సవాల్ విసిరి గొడవకు కారణమయ్యారు.బీఆర్ఎస్ వల్లే కృష్ణాజలాల్లో తెలంగాణకు అన్యాయం...ఉత్తమ్కుమార్కృష్ణానది జలాల వాటల్లో తెలంగాణకు అన్యాయం బీఆర్ఎస్ (BRS) వల్లే జరిగిందినీళ్ల విషయంలో ప్రభుత్వం పై హరీష్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారునీళ్ల కోసం బీఆర్ఎస కొట్లాడినట్లు హరీష్ రావు వ్యాఖ్యలు ఉన్నాయి.హరీష్ రావు-కేసీఆర్ నిర్ణయాల వల్ల ఇరిగేషన్ శాఖ కోలుకోలేని విధంగా తయారు అయింది.బనకచర్ల ప్రాజెక్టులో హరీష్ రావు అన్నట్లు 200 టీఎంసీలు తరలిపోతున్నాయి అనేది అవాస్తవం.ఏపీ ఒక లేఖ మాత్రమే రాసింది...దానికి వెంటనే కౌంటర్ లేఖ రాశాముకేసీఆర్ చేసిన తప్పిదాలను మేము సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం.నీటి వాటాల్లో తెలంగాణ 299 టీఎంసీ-512టీఎంసీకి కేసీఆర్ ఒప్పుకున్నారు.ఇప్పుడు మేము మొత్తం 811 టీఎంసీలో 70శాతం తెలంగాణాకు, 30శాతం ఏపీకి ఇవ్వాలని కోరుతున్నాం.నీళ్లను ఏపీకి అప్పగించి...ఇవ్వాళ దగుల్బాజీ మాటలు మాట్లాడుతున్నారుఘైఐఏఎస్ అధికారిని తప్పుపట్టడం కరెక్ట్ కాదు...బీఆర్ఎస్ వ్యాఖ్యలు చిల్లర రాజకీయాలే -
కరీంనగర్లో బీఆర్ఎస్కు బిగ్ షాక్
సాక్షి,కరీంనగర్: బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా భావించే కరీంనగర్లో ఆ పార్టీకి తాజాగా బిగ్ షాక్ తగలింది. ఆ పార్టీకి చెందిన కరీంనగర్ నగర మేయర్ సునీల్‌రావుతో పాటు 10 మంది కార్పొరేటర్లు కమలం తీర్థం పుచ్చుకోనున్నారు. శనివారం(జనవరి25) కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో వీరంతా బీజేపీలో చేరనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి బీఆర్ఎస్ పార్టీకి ప్రతి ఎన్నికలోనూ కరీంనగర్ ప్రజలు అండగా నిలబడ్డారు. ఉప ఎన్నికల్లోనూ పార్టీకి ఘన విజయాలు అందించారు.2023 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కరీంనగర్ ప్రజలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే గెలిపించారు. అయితే తర్వాత ఏడాది 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ పడింది. ఇక్కడి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎంపీగా బండి సంజయ్ ఘన విజయం సాధించి కేంద్ర మంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో కరీంనగర్లో పార్టీకి కీలక నేతగా ఉన్న సునీల్‌రావు బీజేపీలోకి వెళుతుండడం పార్టీ వర్గాలను కలవరపరుస్తోంది. -
కేటీఆర్ సిరిసిల్ల పర్యటనలో వివాదం
సాక్షి,రాజన్నసిరిసిల్లజిల్లా: సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం(జనవరి24) సాయంత్రం సిరిసిల్లలో కొద్దిసేపట్లో కేటీఆర్ ప్రారంభిస్తారనగా కమ్యూనిటీ హాలుకు మున్సిపల్ అధికారులు తాళం వేశారు.కేటీఆర్‌తో కమ్యూనిటీ హాల్ ప్రారంభింపచేయడానికి పాలకవర్గం సిద్ధం చేసుకుంది.అయితే ఈ ప్రారంభంపై ప్రభుత్వవిప్, వేములవాడ ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిటీ హాల్ పనులు ఇంకా పూర్తి కాలేదని,ప్రోటోకాల్ పాటించి కమ్యూనిటీ హాల్‌కు విప్ ఆది శ్రీనివాస్ పేరు వేయలేదని ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ నేతలు అడ్డుకట్ట వేశారు. అయితే శుక్రవార సిరిసిల్లలో కేటీఆర్ పర్యటించి పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సిరిసిల్లలో కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పక్క నియోజకవర్గమైన వేములవాడకు కాంగ్రెస్ విప్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.విప్ పదవిలో ఉన్న తమ నేత పేరును పక్క నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలపై రాయకపోవడం ఆది శ్రీనివాస్ వర్గీయుల ఆగ్రహానికి కారణమైనట్లు చెబుతున్నారు. -
తెలంగాణకు పెట్టుబడులు.. కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ సవాల్
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడులపై ఎప్పుడైనా సరే చర్చకు సిద్ధమంటూ మాజీ మంత్రి కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, సీఎం దావోస్ పర్యటన తెలంగాణకి ఇక ధమాకా.. పెట్టుబడుల విషయంలో తెలంగాణలో ఒక చరిత్ర నెలకొందన్నారు. కాంగ్రెస్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయని మరోసారి నిరూపితమైందని మహేష్ గౌడ్ అన్నారు.విదేశీ పెట్టుబడిదారులకు కాంగ్రెస్‌పై నమ్మకం ఉంది. రైజింగ్ 2050 నినాదం.. గేమ్ ఛేంజర్‌గా మారింది. తనకి తాను సుపర్ స్టార్‌గా చెప్పుకునే కేటీఆర్ పదేళ్లలో ఎన్ని పెట్టుబడులు తెచ్చాడు. కేసీఆర్ పదేళ్ల కాలంలో రూ.27 వేల కోట్లు మాత్రమే పెట్టుబడులు తెచ్చారు. కేసీఆర్‌కి విజన్ లేకపోవడం వల్లే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది’’ అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.