breaking news
-
ఎక్కడ తప్పు జరిగిందో నిరూపించండి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నూటికినూరు శాతం పక్కాగా నిర్వహించినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో సర్వే చేపట్టిందని, ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి, చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక శాఖకు అప్పగించి పకడ్బందీగా నిర్వహించినట్లు వివరించారు. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి సాహసం చేయలేదని, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వ్యవస్థను కుప్పకూల్చే కుట్రలో భాగంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం ప్రజాభవన్‌లో బీసీ నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. సర్వే చేపట్టిన విధానం, ఫలితాలు, బీసీల జనాభాకు సంబంధించిన అంశాలను ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌తోపాటు పలువురు బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సమగ్ర సర్వే, బీసీ జనాభా, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కేసీఆర్ ఎన్నికల కోసం వాడుకున్నారు ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేస్తామని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి సర్వే చేపట్టాం. అన్ని రంగాల్లో బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన చేయాల్సిందే. కేసీఆర్ చేసిన సకలజనుల సర్వే తప్పుల తడకగా ఉన్నందునే ఆ లెక్కలను బయటపెట్టలేదుం. వాటిని ఆయన ఎన్నికల కోసం వాడుకున్నారు.. ప్రజల కోసం వాడలేదు. ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో సర్వే ప్రక్రియ చేపట్టింది. ఇంటింటికి ఎన్యుమరేటర్లు వెళ్లి సమాచారం సేకరించారు. ఆ సమాచారాన్ని తప్పులు దొర్లకుండా ఎన్యుమరేటర్ సమక్షంలో కంప్యూటరీకరించారు. తప్పులు జరిగాయని మాట్లాడుతున్న వారు ఎక్కడ తప్పు జరిగిందో నిరూపించాలి. అర్థంలేని ఆరోపణలు పట్టించుకోవాల్సిన పనిలేదు. కేసీఆర్ చేసిన సర్వే ప్రకారం బీసీలు 51 శాతం ఉంటే.. సమగ్ర ఇంటింటి సర్వే ప్రకారం బీసీ జనాభా 56.33 శాతం ఉంది. బీసీల లెక్క తగ్గిందా? పెరిగిందా? అనే విషయాన్ని బీసీలు గమనించాలి’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఒకట్రెండు ఆధిపత్యవర్గాల కోసం... జనగణనలో కులగణన చేపట్టాలనే డిమాండ్ ఎప్పట్నుంచో ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘స్వతంత్ర భారత దేశంలో ఇప్పటివరకు కులగణన చేపట్టలేదు. ఒక్కసారి బీసీల లెక్క తెలిస్తే వాటా అడుగుతారనే ఆందోళనతో కొందరు కుట్ర చేస్తున్నారు. ప్రధానంగా బీజేపీలోని ఒకట్రెండు ఆధిపత్యకులాల కుట్రల వల్లే ఈ ప్రక్రియ జరగడంలేదు. ఎంతోకాలంగా ఉన్న డిమాండ్‌ను మనం విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. దేశంలో కులగణన చేపట్టడం ఇష్టంలేకనే బీజేపీ కులగణనపై తప్పుడు ప్రచారం చేస్తోంది. బీజేపీకి నేను విసిరే సవాల్ ఒక్కటే. జనగణనలో కులగణన చేర్చాలి. అప్పుడే ఎవరి లెక్క ఏంటో తేలుతుంది. జనగణనలో కులగణన చేర్చాలని ఈ సమావేశం వేదికగా తీర్మానం చేస్తున్నాంం. సామాజిక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి మార్చి 10లోగా తీర్మానాలు చేయండి. బీసీలు ఐకమత్యాన్ని చాటాలి. అప్పుడే రాజకీయంగా, విద్య, ఉద్యోగాల పరంగా ప్రయోజనం ఉంటుంది. బలహీన వర్గాలకు కులగణన నివేదికనే బైబిల్, భగవద్గీత, ఖురాన్. భవిష్యత్‌లో దేశంలో బీసీ రిజర్వేషన్ల గురించి చర్చించాలంటే తెలంగాణ గురించి, రేవంత్ రెడ్డి గురించి చర్చించుకునే పరిస్థితి ఉంటుంది. మోదీ రాజకీయంగా వ్యతిరేకత ఎదుర్కొనాల్సి వస్తుందనే ఈ ప్రక్రియను తప్పుబడుతున్నారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు ఉద్యోగాలు పోతాయనే భయంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సర్వే ప్రక్రియ పూర్తి చేయడంతో నా బాధ్యత పూర్తయింది. దీన్ని పట్టాలెక్కించి గమ్యం చేర్చే వరకు ముందుకు తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలదే. తప్పుడు మాటలు మాట్లాడటం కాదు.. ఏ బ్లాక్‌లో, ఏ ఇంట్లో తప్పు జరిగిందో నిరూపించాలని కేసీఆర్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి సవాల్ విసురుతున్నా’ అని రేవంత్ పేర్కొన్నారు. 2011 జనగణనలో ఎస్సీ, ఎస్టీ వివరాలే వెల్లడించారు: భట్టి చివరగా జరిగిన 2011 జనగణనలో కేవలం ఎస్సీ, ఎస్టీల వివరాలు మాత్రమే బయటపెట్టారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వివరించారు. దేశంలో తెలంగాణ ప్రభుత్వం మినహా ఇప్పటివరకు బీసీ జనగణనను శాస్త్రీయంగా తేల్చలేదు. కేసీఆర్ చేసిన సకలజనుల సర్వే అధికారికం కాదని, దానిని కేబినెట్లో పెట్టలేదని, శాసనసభలో చర్చ జరపలేదని, అందుకే అది చెల్లుబాటు కాదన్నారు. దేశంలో మొదటిసారి బీసీ జనాభాను అధికారికంగా లెక్క తేల్చి ముద్ర వేశామని, దీనిని ఆయా వర్గాల ప్రయోజనం కోసం ఎలా ముందుకు తీసుకెళ్లాలో బీసీ ప్రజా ప్రతినిధులు, సంఘాలు ఆలోచన చేయాలన్నారు. బీసీ సర్వే అధికారికంగా జరగడంతో బీఆర్ఎస్కు నష్టం కలుగుతుందని, అందుకే సర్వే బాగాలేదని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బీసీ సర్వే విజయవంతమైతే దేశవ్యాప్తంగా చేయాల్సి వస్తుందని, అందుకే బీజేపీ నేతలు నేతలు దు్రష్పచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీ కులగణనతో తెలంగాణలో సరికొత్త అధ్యాయం మొదలైందన్నారు. కులగణన సర్వేతో తెలంగాణ దేశానికి రోల్ మోడల్‌గా మారిందని చెప్పారు. బీసీలకు సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. -
‘జిల్లాకు సంబంధం లేనివాళ్లు వచ్చి ఏదో చెబితే ఏమీ కాదు’
కరీంనగర్ జిల్లా: రాబోవు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన నరేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్క్షప్తి చేశారు. 27వ తేదీన జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగునున్న తరుణంలో పొన్నం ప్రెస్ మీట్ నిర్వహించారు. జిల్లాకు సంబంధం లేని వాళ్లు వచ్చి ఏదో చెబితే ఏమీ కాదని, వారి మాటలు నమ్మవద్దని పొన్నం పేర్కొన్నారు. ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం రోజున ఎస్సారార్ కళాశాలలో సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ ఉంటుందని ఈ సందర్బంగా పొన్నం తెలియజేశారు.‘మా పెళ్లి అక్కడే ఐందన్నవాళ్లు గానీ, హిందువులమని చెప్పుకున్నవాళ్లుగానీ పట్టోంచుకోకపోతే మేం వేములవాడ అభివృద్ధి చేస్తున్నాం. అలాగే మిడ్ మానేరు నిర్వాసితులకు గత సర్కార్ పట్టించుకోకపోతే మేమే వారి పరిహారం చెల్లించాం. శాతవాహన యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ను తీసుకురావడంతో పాటు, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం . ఇప్పటికే మేం 50 శాతంతో ముందున్నాం, కరీంనగర్ లో కూడా కలుపుకుని మొత్తం 65 శాతంకు పైగా మెజార్టీ సాధిస్తామనే నమ్మకం మాకుంది. బీఆర్ఎస్ ఆర్థిక విధ్వంసానికి పాల్పడింది, బండి సంజయ్ ఈ ఆరేళ్లల్లో కరీంనగర్ పార్లమెంటుకు ఏం తెచ్చారో చెప్పాక ఓట్లు అడగండి. నేను ఫలానా చేశాను ఎంపీగా అని చెప్పగలను. రిజర్వేషన్లకు సంబంధించి చట్టం విషయంలో కేంద్రంలో చట్టబద్ధత కల్పించకపోతే వెంటపడతామంటూ సంజయ్ ను హెచ్చరిస్తున్నా. ఎన్నికల్లో ఓట్ల కోసం మతాన్ని వాడుకోవడం అలవాటు చేసుకున్నారు. కానీ, పట్టభద్రుల దగ్గర ఆ పప్పులుడకవు. గుజరాత్ లో పదిశాతం ఈబీసీలకు మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు రిజర్వేషన్లు కల్పించారో ముందు సంజయ్ చెప్పాలి. బీసీ కులగణనపై చర్చకు మేం సిద్ధమంటూ బండి సంజయ్ కి ప్రతి సవాల్ విసురుతున్నా., ఎల్అర్ఎస్ పై ఎన్నికల ముందు చెప్పినా.. తెలంగాణాలో జరిగిన ఆర్థిక విధ్వంసంతో నిర్ణయాల్లో మార్పు ఉండవచ్చు’ అని పొన్నం తెలిపారు. -
‘ఢిల్లీలో మూడుసార్లు డకౌట్ అయ్యారు.. ఇంకా ఆ పార్టీపై ప్రేమెందుకు?’
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి ఎజెండా, అవినీతి రహిత పాలనను ప్రజలు కావాలని కోరుకుంటున్నారన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్,, మోదీ పాలనతో బీజేపీ వరుస విజయాలతో దూసుకుపోతుందని ప్రశంసించారు. అదే సమయంలో కాంగ్రెస్ పై సెటైర్లు వేశారు లక్ష్మణ్. ‘అది సాధారణ ఎన్నిక అయినా, బైపోల్ అయినా బీజేపీ గెలుస్తోంది. ఢిల్లీలో కాంగ్రెస్ 3 సార్లు డక్ ఔట్ అయింది. కానీ క్రికెట్ లో 3 సార్లు డక్ ఔట్ అయితే పక్కన పెట్టేస్తారు. మరి డకౌట్ అయిన కాంగ్రెస్ పై రేవంత్ లాంటి నేతలు ఎనలేని ప్రేమ ఒలకబోయడం ఎందుకో?, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో గ్యారెంటీల పేరుతో నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు పాలన చేతకాక వాళ్ళలోనే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతయింది. అభ్యర్థులను పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఇక కాంగ్రెస్ ఎవరూ దిక్కులేక నేతలను అరువు తెచ్చుకుని బరిలోకి దింపారు. అడ్డు అదుపు లేకుండా గ్యారెంటీల పేరిట మోసం చేస్తున్న కాంగ్రెస్ కు కళ్లెం వేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ భవిష్యత్ ఓటర్లపై ఉంది.. మీరు కాపాడుకుంటారా లేదా అనేది మీ చేతుల్లోనే ఉంది. రేవంత్ గతంలో సోనియాను బలి దేవత అన్నారు.. ఇప్పుడు ఆయనకు ఆమె బంగారు దేవత అయింది. కేసీఆర్ పంథాలోనే రేవంత్ వెళ్తున్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన 5 డీఏలు రేవంత్ బాకీ పడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి వారిని మోసం చేశారు. రిటైర్డ్ అయిన టీచర్ల రిటైర్ మెంట్ బెనిఫిట్స్ కోసం కోర్టు మెట్లెక్కాల్సిన దుస్థితి తెలంగాణలో ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లడిగే హక్కు కాంగ్రెస్ కు ఎక్కడిది?, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటై.. ఒకరిపై ఒకరు.. విమర్శలతో ఇష్యూ డైవర్ట్ చేస్తున్నాయి. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే రేవంత్ ను ప్రశ్నించి సమస్యలు పరిష్కరిస్తారు. అదే కాంగ్రెస్ ను గెలిపిస్తే రేవంత్ కు ఊడిగం చేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ ఎన్నికలను ఎదుర్కోవడం కాంగ్రెస్ కు చేతకాక సర్వే పేరిట వాయిదా వేయాలని చూస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే సర్వే రిపోర్టును కాంగ్రెస్ పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. గుజరాత్ లో కాంగ్రెస్ హయాంలోనే ముస్లింలను బీసీ జాబితాలో చేర్చారు. 10 శాతం రిజర్వేషన్లు ముస్లింలకు ఇచ్చి బీసీలకు 32 శాతం మాత్రమే ఇస్తారా?, దీనిపై వదిలిపెట్టబోము.. పాలన చేతకాకపోతే దిగిపోండి.. కానీ సర్వ నాశనం చేయొద్దు. మైనారిటీ పేరిట, ఈడబ్ల్యూఎస్ పేరిట, 10 శాతం రిజర్వేషన్ల పేరిట ముస్లింలు లబ్ది పొందుతున్నారు. మైనార్టీ పేరిట అన్ని సీట్లు ముస్లింలే తీసుకుంటున్నారు కదా?, కాంగ్రెస్ ఫేక్ పార్టీ.. ఫేక్ ప్రచారాలే వారికి తెలుసు. అశోక్ నగర్ వచ్చి రాహుల్ గాంధీ ముక్కు నేలకు రాసి నిరుద్యోగ ఓట్లు అడగాలి. లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఫీజు రీయింబర్స్మెంట్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’ అని లక్ష్మణ్ విమర్శించారు. -
సీఎం రేవంత్ సవాల్‌ను స్వీకరిస్తున్నా: కిషన్‌రెడ్డి
సాక్షి, నిజామాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలు గెలుస్తామని.. సీఎం రేవంత్ సవాల్‌ను స్వీకరిస్తున్నానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హామీలు అమలుకు ప్రణాళిక, కార్యాచరణ ప్రకటిస్తే చర్చకు సిద్ధమన్నారు. ఏ ఒక్క హామీకి కనీసం కార్యచరణ కూడా లేదు. చర్చకు రమ్మనడం హాస్యాస్పదం. దేనికి చర్చకు రావాలో సీఎం రేవంత్ స్పష్టం చేయాలని కిషన్‌రెడ్డి అన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలి. బీజేపీని ఆదరించాలి. బీఆర్ఎస్ పాలనలో శాసన మండలి ప్రాధాన్యత తగ్గింది. ఎన్నికల్లో పసుపు బోర్డు ప్రభావం ఉంటుంది. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదు. రిజర్వేషన్లను స్వాగతిస్తాం. ముస్లింలను బీసీ జాబితాలో చేరిస్తే వ్యతిరేకిస్తాం. బీజేపీ తో బీఆర్ఎస్కు ఎలాంటి సంబంధాలు లేవు. కాంగ్రెస్‌తో కలిసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. గతంలో అనేక సార్లు బీఆర్ఎస్ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది. జిల్లా అధ్యక్షుల నియామకాల ప్రక్రియ తర్వాతే రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక’’ ఉంటుందని కిషన్‌రెడ్డి తెలిపారు.14 నెలల్లో కాంగ్రెస్ ప్రజలకు ఓరగబెట్టింది ఏమీ లేదు. అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు శాసన మండలి ప్రాధాన్యతను తగ్గించాయి. ప్రజా సమస్యల పోరాటానికి శాసన మండలి వేదిక. కుల గణనకు బీజేపీ వ్యతిరేకం కాదు. ముస్లింలను బీసీ లో చేర్చే కుట్ర జరుగుతుంది. దానికి వ్యతిరేకం’’ అని కిషన్‌రెడ్డి చెప్పారు. -
బీసీలపై పెద్ద కుట్ర.. బీఆర్ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ ఫైర్
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తా.. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ బీసీ నేతలదేనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన బీసీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘తప్పు తప్పు అంటూ బీఆర్ఎస్, బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నాయి.. ఎక్కడ తప్పు జరిగిందో చూపించాలంటూ ఆ పార్టీ నేతలకు సవాల్ విసిరారు.‘‘రాష్ట్ర పార్టీ నేతలకు బీసీ కులగణనపై అవగాహన చేసుకోవాలి. ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దు. బీసీలు మౌనంగా ఉంటే మీకే నష్టం. బీసీలు నిలదీస్తే.. తమ పదవులు పోతాయని బీజేపీ, బీఆర్ఎస్లో రెండు వర్గాల వారు కుట్ర చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి కొస్తే కులగణన చేస్తామని రాహుల్ గాంధీ మాటిచ్చారు. బలహీన వర్గాలు ముందుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మా నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని బీసీ కులగణన చేశాం’’ అని రేవంత్ చెప్పారు.‘‘కేసీఆర్ ఒక్క రోజులో సర్వే చేసి కాకి లెక్కలు చెప్పారు. ఆ వివరాలు బయటకు చెప్పకుండా దాచి పెట్టుకున్నారు. రాజకీయాలకు ఆ వివరాలను కేసీఆర్ వినియోగించుకున్నారు. కానీ మేము అలా చేయలేదు. ప్లానింగ్ విభాగాన్ని నోడల్ ఏజెన్సీగా పెట్టుకుని సర్వే చేశాం. కేసీఆర్ చేసిన సమగ్ర సర్వే తప్పుడు సర్వే. ఎస్సీల్లో 56 కులాలు ఉంటే 86 కులాలుగా సమగ్ర కుటుంబ సర్వేలో చూపించారు. మేము చేసిన సర్వేను కొందరు తప్పుపడుతున్నారు. ఎక్కడ తప్పు ఉందో చెప్పండి. బీఆర్ఎస్, బీజేపీ కోర్టుల్లో కేసులు వేసి కులగణన ప్రక్రియను నిర్వీర్యం చేసే ప్రమాదం ఉంటుంది. వారికి ఆ అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా సర్వే చేశాంమోదీ బీసీ అని చెప్పుకుంటారు. 2011లో కాంగ్రెస్ చేసిన బీసీ సర్వే లెక్కలు బయట పెట్టాలి. బండి సంజయ్‌కు ప్రేమ ఉంటే ఆ లెక్కలు బయట పెట్టండి. బీసీలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని బయట పెట్టడం లేదు. ప్రతీ రాష్ట్రంలో ఈ డిమాండ్ వస్తే దేశం మొత్తం చేయాల్సి వస్తుంది. బీసీల లెక్క తేలితే బీజేపీలో అధికారం చెలాయించే ఒకటి రెండు సామాజిక వర్గాలకు ఇబ్బంది అవుతుంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇప్పటి వరకు వారి వివరాలు నమోదు చేసుకోలేదు. 50 శాతం ప్రజలు, అర శాతం ఉన్న వాళ్లను ప్రశ్నిస్తారని వాళ్ల భయం. అందుకే బీసీల సర్వేకు వారు సహకరించడం లేదు. కేసిఆర్ నాలుగు కేటగిరీల్లో లెక్కలు తీస్తే మేము ఐదు కేటగిరీల్లో వివరాలు తీశాం’’ అని రేవంత్ పేర్కొన్నారు.‘‘తప్పుడు లెక్కలు అని తప్పుడు మాట్లాడొద్దు. ఎక్కడ తప్పు జరిగిందో చెప్పండి. మేము పారదర్శకంగా సర్వే చేశాం. ఇది చరిత్రలో నిలిచి పోతుంది. మేము చేసిన సర్వే దేశానికే ఆదర్శం. సర్వే లెక్కలు బయట పెట్టొద్దని నా మీద కొందరు ఒత్తిడి కూడా తెచ్చారు. అయినా నేను పట్టించుకోలేదు. మన లెక్కలు తప్పని కొందరు తప్పుడు ప్రచారం చేస్తే మన వాళ్ళు మౌనంగా ఉండటం సరికాదు. రాహుల్ గాంధీ బీసీ కులగణనకు డిమాండ్ చేస్తే మోదీకి నష్టం. మోదీ పదవి పోతే బండి సంజయ్, కిషన్ రెడ్డి పదవులు పోతాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, బండి సంజయ్, కిషన్ రెడ్డి సర్వే తప్పు అనడం కాదు. ఎక్కడ తప్పు ఉందో చూపించండి. ఇదంతా బీసీలపై జరుగుతున్న పెద్ద కుట్ర. సర్వే లెక్కల ప్రకారం ఎలా న్యాయం చేయాలని నేను ఆలోచిస్తున్నా’’సెకండ్ ఫేజ్ సర్వే పూర్తి అయిన తర్వాత దీనికి చట్టబద్ధత కల్పిస్తాం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు జనాభా లెక్కలలోనే లేరు. వారి ఇంటి ముందు మేలుకొలుపు డప్పు కొట్టండి. లెక్కలు చెప్పకుండా ఫామ్ హౌస్ లో పన్నోడు మంచోడు. మీ లెక్కలు తీసిన నేను మంచోడిని కాదా. మీరు కూడా నన్ను విలన్‌గా చూస్తే ఎలా?. అసెంబ్లీలో సర్వేకు చట్టబద్ధత కల్పించే వరకే నా బాధ్యత.. దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక బీసీల మీదే ఉంది. బీజేపీకి నా డిమాండ్. కేంద్రం చేసే జనగణనలో కుల గణన చేయండి. నేను చెప్పిన లెక్కలు తప్పని తేల్చండి. మార్చి 10 వరకు అన్ని కుల సంఘాల సమావేశాలు పెట్టుకోండి. తీర్మానాలు చేయండి. బీసీల లెక్కలు మోదీ వద్దంటున్నారు కాబట్టే.. బండి సంజయ్ వద్దు అంటున్నారు.‘‘మనం చేసిన సర్వేకు ప్రజామోదం కూడా ముఖ్యం. అన్ని సామాజిక వర్గాల సమావేశాలు పెట్టీ తీర్మానాలు చేయండి. యూనివర్సిటీల్లో విద్యార్థులు సెమినార్ లు నిర్వహించండి. బలహీన వర్గాలకు ఇదే భగవద్గీత, ఇదే ఖురాన్, ఇదే బైబిల్. ఇంతకంటే మించిన పాలసీ డాక్యుమెంట్ ఏది లేదు.’’ అని రేవంత్ పేర్కొన్నారు. -
గులాబీ బాస్.. ఇంక వ్యూహం మార్చాల్సిందేనా?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ సెంటిమెంట్‌తో మరోసారి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ ప్రధాన కార్యాలయంలో సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆయన తన తొమ్మిదిన్నరేళ్ల పదవీకాలంలో చేసిన అభివృద్దిని ప్రస్తావిస్తూనే, తన సహజశైలిలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అయితే తాము అధికారంలో ఉండగా జరిగిన తప్పులను సమీక్షించుకునేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్లు కనిపించలేదు. ప్రత్యేకించి.. పార్లమెంటు ఎన్నికల ఫలితాలను తేలికగా తీసుకుంటున్న అభిప్రాయం కలుగుతుంది. శాసనమండలి ఎన్నికలలో పోటీ చేయడం లేదంటే అర్థం చేసుకోవచ్చు కాని లోక్‌సభ ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడం బీఆర్ఎస్(BRS)కు పెద్ద షాకే. పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంత ఘోరమైన ఫలితాన్ని చవిచూడలేదు. ఈ పరిస్థితి ఎందుకు అనేదానిపై ఆయన దృష్టి పెట్టారో, లేదో తెలియదు. కేసీఆర్(KCR) పార్టీ కంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కే ఎక్కువగా పరిమితమవుతున్నారు అని పార్టీ భావిస్తోంది. బీఆర్ఎస్ శ్రేణులు సైతం ఆయనను కలవాలంటే అంత దూరం వెళ్లాల్సి వస్తోంది. కేసీఆర్ కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు తారక రామారావు, మాజీ మంత్రి హరీష్ రావులు యాక్టివ్ గా ఉండడం బాగానే ఉన్నా.. ప్రధాన నాయకుడిగా కేసీఆర్ కూడా అందుబాటులో ఉండవలసిన అవసరముంది. తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్ అని చెప్పుకున్నా.. తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ టీఆర్ఎస్ నుంచి పేరు మారిన బీఆర్ఎస్ అని ప్రకటించినా.. పార్టీకి కొత్తగా వచ్చేదేమీ ఉండదు. తొమ్మిదిన్నరేళ్లపాటు సీఎంగా ఉన్న కేసీఆర్ పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిన మాట నిజం. ప్రత్యేకించి హైదరాబాద్ అభివృద్దిలో విశేష కృషి ఉంది. అందువల్లే హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో బీఆర్ఎస్ పూర్తి మెజార్టీని సాధించింది. తెలంగాణ రూరల్ ప్రాంతంలో మాత్రం పార్టీ బాగా దెబ్బతింది. ఫలితంగా అనూహ్యమైన ఓటమిని చవిచూడవలసి వచ్చింది. ఇందుకు.. కాంగ్రెస్ ప్రకటించిన హామీల ప్రభావం కొంత ఉండవచ్చు. కాని అదే టైమ్ లో కెసిఆర్ యాటిట్యూడ్ , అభ్యర్థుల ఎంపికలో లోటుపాట్లు, మొదలైన కారణాల వల్ల కూడా పార్టీకి నష్టం జరిగింది. శాసనసభ ఎన్నికలలో 38 సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్లోక్ సభ ఎన్నికలలో దారుణ పరాజయం ఎదుర్కొనప్పటికీ.. ఇప్పుడిప్పుడే మళ్లీ కోలుకుంటున్న మాట వాస్తవం. కాంగ్రెస్ పార్టీ తప్పులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి.. ఇందుకు ఉపకరిస్తున్నాయి. కాంగ్రెస్ వాగ్దానాల అమలుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. అవి అలవి కావడం లేదు. ఈ అంశాల ఆధారంగా బీఆర్ఎస్లో జోష్ నింపడానికి కేసీఆర్ యత్నించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పటిష్ట నిర్మాణం చేసి అటు పార్టీ విజయాన్ని, ఇటు తెలంగాణ ప్రజల శాశ్వత విజయం కోసం సమాంతరంగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతవరకు బాగానే ఉంది. కానీ.. కేసీఆర్ కేవలం ప్రసంగం చేసి తిరిగి ఫామ్ హౌస్‌కే పరిమితమైతే అంత ఉపయోగపడకపోవచ్చు. ఈ విషయాన్ని పక్కనబెడితే కేసీఆర్ ఉపన్యాసంలో కొన్ని ఆశ్చర్యకర విషయాలను ప్రస్తావించారు. తద్వారా తెలంగాణ ఫీలింగ్‌ను పెంచడం ద్వారా రాజకీయం చేయడం అంత తేలిక కాకపోవచ్చు. కేసీఆర్‌తో పోటీగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) కూడా దానిని రెచ్చగొట్టగలరు. ఆ విషయాన్ని ఆయన మర్చిపోరాదు. తామే రాష్ట్రాన్ని సాధించామని చెప్పుకోవడం వరకు ఓకే. దానిని జనం నమ్ముతారు కూడా. కాని చరిత్రను తనకు అనుకూలంగా మలచుకుని మాట్లాడుతున్న వైనం ఎంతవరకు ప్రయోజనమన్నది ప్రశ్న. కేసీఆర్ ఏమన్నారో చూడండి.. 'తెలంగాణ సామాజిక, చారిత్రక అవసరాల దృష్ట్యా.. తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ , తెలంగాణ రాజకీయ అస్తిత్వ పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తన చారిత్రక బాధ్యతను నిర్వర్తించిన తెలంగాణ ప్రజల పార్టీ బీఆర్ఎస్" అన్నారు. 'తెలంగాణ కన్నీళ్లు తెలిసిన పార్టీగా.. తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను చైతన్య పరుస్తూ, తెలంగాణ అస్థిత్వ పటిష్టతకు కృషి చేస్తూ, గత గాయాల నుంచి కోలుకున్న తెలంగాణను, తిరిగి అవే కష్టాల పాలు కాకుండా, గత దోపిడీ వలసవాదుల బారిన పడకుండా, తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయం అందించే దిశగా సమస్త పార్టీ శ్రేణులు కృషి చేయాలి" అని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి పదంలో తెలంగాణ సెంటిమెంట్ ను చొప్పించడానికి కేసీఆర్ ప్రయత్నం చేశారు. ఇదే ప్రసంగంలో ఆయన ఒక మాట అన్నారు. ఇటీవలి పార్లమెంటు ఎన్నికల ఓటమి గురించి మాట్లాడుతూ రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని, కొత్తతరంలో తెలంగాణ సోయి లేనందునే పార్లమెంటు ఎన్నికలలో ఓడిపోయామని చెప్పారు. ఇందులో వాస్తవం ఉందా? లేదా? అనేదాని కన్నా, ఆయన ఉద్దేశం అర్థమవుతూనే ఉంది. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రేకెత్తించడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలన్నదే ఆయన లక్ష్యం అనే విమర్శలకు ఆస్కారం ఇస్తున్నారు. తన పదవీకాలంలో ఎప్పుడైనా ఒకసారి సెంటిమెంట్ గురించి మాట్లాడినా, సాధ్యమైనంత వరకు ఏ రాష్ట్రం నుంచి వచ్చిన వారైనా తెలంగాణ ప్రజలగానే చూడాలని అనేవారు. అది ఆయనకు కలిసి వచ్చింది కూడా. అందువల్లే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్ చుట్టుపక్కల నివసిస్తున్న వారిలో మెజార్టీ బీఆర్ఎస్కే మద్దతు ఇచ్చారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో ఆనాటి టీఆర్ఎస్ ఉనికే పెద్దగా లేదన్నది వాస్తవం. కాని అధికారంలోకి వచ్చాక ఎలాంటి గొడవలు లేకుండా, ఉద్యమం వివాదాలు కనిపించకుండా కేసీఆర్ ప్రభుత్వం సాగింది. కనుకే వారి మన్ననలు పొందగలిగారు. అయితే.. నిజాం సంస్థానాన్ని ఆనాటి కేంద్ర ప్రభుత్వం సర్దార్ పటేల్ నేతృత్వంలో భారత్‌లో విలీనం చేయడానికి చేపట్టిన సైనిక చర్య గురించి కేసీఆర్ మాట్లాడిన తీరు అంత సబబు కాదేమో!. కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి తెలంగాణకు ద్రోహం చేసిందని వాదించడానికి ఈ అంశాన్ని ఎంపిక చేసుకున్నారు. 'దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణకు రాలేదని, తెలంగాణ ఇంకా నిజాం పాలనలో ఉంటే భారత మిలటరీ సైనిక ఆక్రమణకు పాల్పడిందని కేసీఆర్ వివరించారు. భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యతో 20-30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, వీరిలో కొంత మంది రజాకార్లు ఉన్నా మరికొంత మంది సామాన్యులు, కమ్యూనిస్టులు కూడా ఉన్నారని, మాజీ హోంమంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డి తండ్రి వంటివారు ఎందరో మరణించారని గుర్తు చేశారు. సాయుధ పోరాటం తర్వాత తెలంగాణను ఆంధ్రాలో అన్యాయంగా విలీనం చేయడం వల్ల యువత, ప్రజల్లో అలజడి పెరిగిందని తెలిపారు. ‘ఆత్మగౌరవ పోరాటాలు చేసిండ్రు. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్’ వంటి అనేక ఉద్యమాలు మొదలైనయి." అంటూ మాట్లాడారని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే.. కాంగ్రెస్ పార్టీని విమర్శించదలచుకుంటే ప్రస్తుత పరిణామాలలో చాలా దొరుకుతాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎన్నైనా విమర్శలు చేయవచ్చు. కాని భారత మిలటరీ సైనిక ఆక్రమణలకు పాల్పడిందని అనడం చరిత్రాత్మకంగా ఎంత వరకు కరెక్టు? ఆనాడు భారత మిలటరీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రజలు స్వాగతం పలికిన సన్నివేశాలు కూడా ఉన్నాయన్న సంగతి మర్చిపోకూడదు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రులను విమర్శించడానికి, అప్పట్లో తెలంగాణలో పెద్దగా అభివృద్ది సాగలేదని చెప్పడానికి కేసీఆర్ యత్నించినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో.. ఇప్పుడు సమైక్య రాష్ట్ర ఊసు అంత అవసరమా?. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కేసీఆర్ గళమెత్తారు. ఎన్డీయే రూపంలో చంద్రబాబు తిరిగి తెలంగాణ రాజకీయాలలోకి వస్తున్నారన్న సంశయాన్ని ఆయన వ్యక్తం చేశారు. విశేషం ఏమిటంటే 2018లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు తెలుగుదేశంతో స్నేహం చేసి ఓటమి చవి చూసింది. ఏపీలో 2024లో బీజేపీ, జనసేనలతో కూటమి కట్టి టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2024 లోక్ సభ ఎన్నికలలో బీజేపీతో భాగస్వామిగా ఉన్నప్పటికీ తెలంగాణలో టీడీపీ పోటీ చేయలేదు. తెలంగాణ వరకు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ కూడా అంతగా ఇష్టపడకపోవచ్చు. కాని రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చంద్రబాబు(Chandrababu)కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నది అందరి భావన. అందువల్ల తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి ఏమి అవుతుందన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేం. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబును విమర్శించి, జాతీయ పార్టీ అయిన బీజేపీ జోలికి కేసీఆర్ పెద్దగా వెళ్లినట్లు కనబడదు. దీనిపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయవచ్చు. ఇక ఫిరాయింపులు, ఉప ఎన్నికల గురించి కేసీఆర్ బాగానే మాట్లాడారు. కాని ఆయన కూడా తను అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయింపులను పెద్ద ఎత్తునే ప్రోత్సహించారు. దానివల్ల పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూనే.. తెలంగాణ సెంటిమెంట్ ను ఉపయోగించడానికి పాత తరం వ్యూహరచన చేస్తున్నట్లుగా ఉంది. కాని కేసీఆర్ చెబుతున్నట్లే కాలం మారింది. తరం మారింది. దానికి తగినట్లుగా ఆయన వ్యూహం మార్చుకోరా? అనేదే ప్రశ్న.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అట్లాస్ నివేదిక ఇచ్చిన భట్టికి ధన్యవాదాలు.. రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, తెలంగాణ భవన్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దివాళాకోరు మాటలు మాట్లాడే సీఎం దేశం ఎక్కడా ఉండరు అంటూ ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 15 నెలలుగా ఒక్కటే మాట చెబుతున్నారు. రేవంత్ మాట మాట్లాడే ముందు ఒక్కసారి భట్టి విక్రమార్క నివేదికను చూడాలని హితవు పలికారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ అట్లాస్ నివేదిక ఇచ్చిన భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు. ప్రస్తుతం తెలంగాణ అట్లాస్ నివేదికను నెట్ నుంచి తొలగించారు. రేవంత్ రెడ్డి అబద్ధాలను నివేదికలో భట్టి విక్రమార్క ఉతికి ఆరేశారు. ఆ నివేదికలో తెలంగాణ దేశంలో తలసరి ఆదాయంలో నెంబర్ వన్ అని చెప్పింది. కేసీఆర్ హయంలో సంపద ఎలా పెరిగిందో నివేదికలో ఉంది. భారత దేశానికి బువ్వ పెడుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. జీఎస్డీపీలో తెలంగాణ రాష్ట్రం పదేళ్లలో గుజరాత్‌ను కూడా దాటింది. గత పదేళ్లలో తెలంగాణ ఆదాయం, సంపద పెరిగిందన్నారు. కేసీఆర్ పాలనపై సొల్లు వాగుడు వాగిన కాంగ్రెస్ నేతలు తెలంగాణ అట్లాస్ ఇప్పటికైనా చూడాలి. జీవ సంపదలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ అని నివేదికలో ఉంది. విద్యుత్ వినియోగం కూడా కేసీఆర్ ప్రభుత్వ హయంలోనే పెరిగింది. బీఆర్ఎస్ పాలనలోనే ఫ్యాక్టరీల సంఖ్య గణనీయంగా పెరిగింది. కేసీఆర్ హయాంలో అభివృద్ధి జరిగినట్టు కాంగ్రెస్ ప్రభుత్వ నివేదికనే చెబుతోంది. అప్పులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలకు వ్యతిరేకంగా నివేదిక ఉంది. అన్ని వివరాలు ఆ నివేదికలో ఉన్నాయి. ఆధారాలు ఉన్నప్పటికీ రేవంత్ మాత్రం మాట మార్చడం లేదంటూ మండిపడ్డారు. పది నెలల్లో తెలంగాణ అప్పులపై కట్టిన వడ్డీ 22వేల 56కోట్లు. నెలకు కడుతుంది 2,200 కోట్లు. ఇది నివేదికలో ఉంది. కానీ ఆరువేల కోట్లకు పైగా నెలకు అప్పులకు వడ్డీ కడుతున్నట్టు రేవంత్ మాట్లాడుతున్నారు. రేవంత్ బూతులు మాట్లాడం మానేయాలి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. విజ్ఞత లేని రేవంత్.. తెలంగాణను క్యాన్సర్ రోగితో పోల్చారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరవాత లక్ష మంది రేషన్ కార్డులు తొలగించినట్టు నివేదికలో ఉందన్నారు. కాంగ్రెస్ హయంలో తెలంగాణ చేతికి చిప్ప వచ్చే పరిస్థితి వచ్చింది. రాబడి కంటే ఖర్చు ఎక్కువ చేస్తోంది. ఈ డబ్బు ఎక్కడికి పోతుంది?. ఎందుకు అప్పులు చేస్తున్నారు?. ముఖ్యమంత్రి రేవంత్‌వి తుగ్లక్ నిర్ణయాలు.. హైడ్రాతో రియల్ ఎస్టేట్ పడిపోయింది. కాళేశ్వరం ఎండ పెట్టడం వల్ల రాష్ట్రంలో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ఒక దివ్యమైన రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం మారుస్తోంది. కాంగ్రెస్ పార్టీది దిక్కుమాలిన, సిగ్గుమాలిన పాలన. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ విధిస్తున్నారు. నేను చెప్పిన విషయాలు అబద్ధం అని చెబితే ఏం చేయడానికి అయిన నేను సిద్ధం’ అని సవాల్ విసిరారు. -
ప్రజాభవన్‌లో బీసీ నేతలతో సమావేశమైన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని బీసీ సంఘాలు, ఇతర ముఖ్య నేతలతో ప్రజా భవన్లో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్, కాంగ్రెస్ సీనియర్ బీసీ నాయకులు, బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, సెక్రటరీలు హాజరయ్యారు.ఈ సమావేశం సందర్భంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ల చట్టం కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు, తీర్మానం చేయడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, బీసీల సంక్షేమానికి అమలుచేస్తున్న కార్యక్రమాలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. -
రేవంత్ జుట్టు చంద్రబాబు చేతిలో ఉంది: కవిత
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జుట్టు చంద్ర బాబు చేతిలో ఉంది.. చంద్రబాబు జుట్టు ప్రధాని మోదీ చేతిలో ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఉండటం తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమమంలో పసుపు బోర్డును ఏదో నామమాత్రంగా ఏర్పాటు చేశారని ఆరోపించారు.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు నిజామాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ..‘కవిత విషయంలో మాట్లాడవద్దని రేవంత్‌కు సుపప్రీంకోర్టు చీవాట్లు పెట్టినా ఆయన మారలేదు. మరోసారి కోర్టు చీవాట్లు పెట్టాలేమో. ఇక, ప్రజాభవన్‌లో చంద్రబాబు, రేవంత్ భేటీ అయిన తర్వాతే ఆంధ్రకు నీటి తరలింపు జరుగుతోంది. రేవంత్ రెడ్డి జుట్టు చంద్రబాబు చేతిలోనే ఉంది. ఇదే సమయంలో చంద్రబాబు జుట్టు ఢిల్లీలో ఉన్న ప్రధాని మోదీ చేతిలో ఉంది. చంద్రబాబు ప్రతిపాదనపై సీఎం రేవంత్.. కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం తెలంగాణ ప్రజల దురదృష్టమని అన్నారు.ఇదే సమయంలో పసుపు బోర్డు ఏర్పాటుపై కవిత స్పందిస్తూ..‘పసుపు రైతుల పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది. పసుపు ధర రోజురోజుకూ పతనం అవుతోంది. 15వేల మద్దతు ధర ఇస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయి. వ్యాపారులు సిండికేట్ అయి పసుపు రైతులను దగా చేస్తున్నారు. దీనిపై మార్చి ఒకటో తేదీ వరకు డెడ్‌లైన్ విధిస్తున్నాం. పసుపు క్వింటాలుకు పదిహేను వేల ధర ఇవ్వకుంటే రైతులతో కలిసి కలెక్టరేటును ముట్టడిస్తాం. పసుపు బోర్డు నామమాత్రంగా ఏర్పాటు చేశారు. పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేయిస్తే రైతులకు న్యాయం జరుగుతుంది. పసుపు క్వింటాల్‌కు 12వేలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ నేతలు నిలబెట్టుకోవాలి. 12వేల కంటే ధర తక్కువగా వస్తే బోనస్ రూపంలో రైతులకు చెల్లించాలి’ అని డిమాండ్ చేశారు. -
కోదండరెడ్డి.. ఉచిత సలహాలిచ్చి చేతులు దులుపుకున్నారా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. అసమర్థ కాంగ్రెస్ సర్కారు తెచ్చిన కరువు అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కళ్లముందు ఎండిపోతున్న పంటలను కాపాడుకోలేక రైతులు విలవిలలాడుతుంటే.. బోర్లు వేసి ఆర్థికంగా నష్టపోవద్దని ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకోవడం విడ్డూరం అంటూ కేటీఆర్ కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్(KTR) ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్, కాంగ్రెస్ నేత కోదండరెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ.. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. ముందుచూపు లేని ముఖ్యమంత్రి చేతకానితనం వల్ల వచ్చిన కరువు. అసమర్థ కాంగ్రెస్ సర్కారు తెచ్చిన కరువు.తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ఏడాదికాలంగా ఎండబెట్టి.. రిజర్వాయర్లు పండబెట్టడం వల్లే రాష్ట్రంలో భూగర్భజలాలు అడుగంటిపోయాయన్నది వాస్తవం. పదేళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువులు, కుంటలు నిండుకుండలను తలపించేలా నిర్వహణ చేయడం వల్లే తెలంగాణ వ్యాప్తంగా ఏనాడూ భూగర్భజలాలు పడిపోలేదు. కానీ, కాంగ్రెస్ సర్కారు చేతకానితనం వల్ల ఏడాది కాలంలోనే భూగర్భజలాలు పాతాళానికి పడిపోయి సమైక్యరాష్ట్రం నాటి దుస్థితి నెలకొంది.రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ గా ఉంటూ ఉన్న వాస్తవాలు చెప్పాల్సింది పోయి.. వాటిని కప్పిపుచ్చి ఫిబ్రవరిలోనే ఎండలు ముదరడం వల్ల భూగర్భజలాలు పడిపోయాయనడం దారుణం. కళ్లముందు ఎండిపోతున్న పంటలను కాపాడుకోలేక రైతులు విలవిలలాడుతుంటే.. బోర్లు వేసి ఆర్థికంగా నష్టపోవద్దని ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకోవడం మరో విడ్డూరం.అసలు ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో, దీని నుంచి గట్టేందుకు ఏం చేయాలో ఆలోచించకుండా పూర్తిగా చేతులెత్తేయడం అన్నదాతలను వంచించడమే. ఎండుతున్న పంటలను కాపాడాల్సిన ప్రభుత్వం తన బాధ్యతను మరిచి, మా వల్ల కాదని కాదు.. మీరే కాపాడుకోండని జారుకోవడం క్షమించరాని నేరం. మీ తప్పులను కప్పి పుచ్చుకునేందుకు కరువు కాటకాలు రావడం సహజం అన్నట్టుగా మాట్లాడి, కాంగ్రెస్ సృష్టించిన ఈ సాగునీటి సంక్షోభం నుంచి తప్పించుకోలేరు.ఇప్పటికే వ్యవసాయరంగం గురించి కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి నిర్వాకం వల్ల రాష్ట్రంలో 430 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాంగ్రెస్ సర్కారు చేసిన మోసానికి రుణమాఫీ కాక, పెట్టుబడి సాయం రాక లక్షలాది మంది రైతులు అప్పులపాలై అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు పంటలకు సాగునీటి వసతి లేకపోవడంతో బోర్లు వేసినా చుక్కనీరు రాక మరింత ఆర్థికంగా చితికిపోతున్నారు.ఈ విపత్కర పరిస్థితుల్లో తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉన్న రాష్ట్ర రైతాంగంలో భరోసా నింపాల్సిన పాలకులే అస్త్రసన్యాసం చేసిన సందర్భం దేశ చరిత్రలోనే లేదు. పదేళ్లపాటు సంతోషంగా సాగిన సాగును కన్నీటి సేద్యం చేసినందుకు రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి.రాజకీయ కక్షతో నిర్లక్ష్యం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన మరమ్మత్తులను వెంటనే పూర్తిచేసి రివర్స్ పంపింగ్ ద్వారా యుద్ధప్రాతిపదికన రిజర్వాయర్లు, చెరువులు, కాల్వలు నింపి ఎండిపోయే దశలో ఉన్న పంటలను కాపాడాలి. లేకపోతే రాష్ట్ర రైతులు కాంగ్రెస్ పార్టీని, ఈ ముఖ్యమంత్రిని ఎప్పటికీ క్షమించరు. జై కిసాన్.. జై తెలంగాణ’ అంటూ కామెంట్స్ చేశారు. కొదండరెడ్డి గారు.. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. ముందుచూపు లేని ముఖ్యమంత్రి..చేతకానితనం వల్ల వచ్చిన కరువు.. అసమర్థ కాంగ్రెస్ సర్కారు తెచ్చిన కరువు.. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ఏడాదికాలంగా ఎండబెట్టి.. రిజర్వాయర్లు పండబెట్టడం వల్లే రాష్ట్రంలో భూగర్భజలాలు… https://t.co/A2AFrxhMza— KTR (@KTRBRS) February 22, 2025 -
‘కారు’ ఇక పరుగు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఆవిర్భవించిన భారత్ రాష్ట్ర సమితి ఈ ఏడాది ఏప్రిల్ 27 నాటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏడాది పొడవునా పార్టీ రజతోత్సవాల నిర్వహణకు సన్నద్ధమవుతోంది. మరోవైపు సంస్థాగత నిర్మాణంతో పాటు ప్రజా సమస్యలపై ఉద్యమించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ క్రమంలోనే పార్టీ కీలక నేతల మధ్య పని విభజన ద్వారా అన్ని వర్గాల ప్రజలకు చేరువ కావడంపై దృష్టి సారించింది. ఉద్యమకాలంలో కలిసి నడిచిన శక్తులకు తిరిగి దగ్గర కావాలని నిర్ణయించింది.తెలంగాణ అస్తిత్వాన్ని మరోసారి గుర్తు చేస్తూ పార్టీ భావజాలాన్ని వ్యాపింపజేయాలనే అభిప్రాయంతో ఉంది. తద్వారా కొత్త తరాన్ని ఆకర్షించే ఎత్తుగడలకు పదును పెడుతోంది. ఈ నెల 19న జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి భేటీలో పార్టీ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. కీలక నేతలకు ముఖ్య బాధ్యతలు పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడంతో పాటు అన్ని స్థాయిల్లో యంత్రాంగాన్ని సమన్వయం చేసేందుకు కీలక నేతల నడుమ పని విభజన చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీ రామారావుకు క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలు, వాటి అమలు బాధ్యతను అప్పగించనున్నారు. ఇప్పటికే ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన రైతు ధర్నాల్లో పాల్గొన్న కేటీఆర్.. ప్రభుత్వ వైఫల్యాలపై భవిష్యత్తులో జరిగే ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు నేతృత్వం వహించనున్నారు.సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావుకు పార్టీ సంస్థాగత నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. ఏప్రిల్ 10న ప్రారంభమయ్యే పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు గ్రామ, వార్డు, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీల కూర్పు, పార్టీ శిక్షణ కార్యక్రమాలు తదితరాలను హరీశ్ పర్యవేక్షిస్తారు. పార్టీ రజతోత్సవాల నిర్వహణ బాధ్యతలను కూడా హరీశ్‌రావుకే అప్పగించనున్నట్లు సమాచారం. అనుబంధ సంఘాలపై కవిత దృష్టి ఇప్పటికే బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు సంబంధించిన అంశాలపై దృష్టి కేంద్రీకరించి పనిచేస్తున్న ఎమ్మెల్సీ కవిత.. పార్టీ అనుబంధ సంఘాలను బలోపేతం చేసే దిశగా ఇప్పటికే కార్యాచరణ అమలు చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్లు, కులగణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వంటి అంశాలపై కవిత వరుస సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉద్యమ శక్తుల ఏకీకరణ.. యువతకు చేరువ ఉద్యమ కాలంలో పార్టీతో కలిసి వచ్చిన వ్యక్తులు, శక్తులకు తిరిగి దగ్గర కావాలనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 27 నుంచి ఏడాది పొడవునా సాగే పార్టీ రజతోత్సవాల్లో ఉద్యమంలో కలిసి వచ్చిన కవులు, కళాకారులు, రచయితలు, వివిధ జేఏసీల్లో క్రియాశీలంగా పనిచేసిన వారితో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తద్వారా తెలంగాణ అస్తిత్వాన్ని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేయడంతో పాటు కొత్త తరానికి తెలంగాణ నేపథ్యం, రాష్ట్ర సాధన ఉద్యమం తదితరాలను పరిచయం చేయాలని, పార్టీ భావజాలాన్ని వ్యాపింపజేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.మరోవైపు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ పాత్ర, పదేళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధికి చేసిన కృషిని గుర్తు చేసేలా కార్యక్రమాలు రూపొందించనున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో పుట్టిన పసికందులు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్న యువతగా ఎదిగారు. వారిలో తెలంగాణ అస్తిత్వ స్ఫూర్తిని రగిలించేలా సదస్సులు, సమావేశాలు, సభలు నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ కార్యక్రమాలకు రూపకల్పన బాధ్యతను పార్టీలోని కొందరు ముఖ్య నేతలకు అప్పగించనున్నారు. కార్యాచరణ రూపకల్పనకు కోర్ గ్రూప్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చలు, ప్రణాళికల రూపకల్పనకు సుమారు 25 నుంచి 30 మంది సీనియర్ నేతలతో కోర్ గ్రూప్ ఏర్పాటు చేయాలని అధినేత భావిస్తున్నారు. ఈ గ్రూప్‌లో ఉద్యమ కాలం నుంచి పార్టీలో పనిచేసిన నేతలతో పాటు వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన సీనియర్లకు చోటు కలి్పస్తారు. ఎర్రవల్లి నివాసంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రంలో భోజనశాల, పార్కింగ్ తదితర వసతుల కల్పన పూర్తయిన తర్వాత మినీ సభలను తలపించేలా ఈ సమావేశాలు జరగనున్నాయి. -
దమ్ముంటేరండి!
2014 ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన హామీలు, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటి అమలుపై చర్చకు సిద్ధమా? అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా నాతో చర్చకు రావాలి. మీ బంట్లు, బంట్రోతులను ఎవరిని పంపుతారో తేల్చుకోండి. ప్రధాని నరేంద్ర మోదీ స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనం తెచ్చి ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారు. వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో.. ఇందిరమ్మ ఇళ్లు(Indiramma Houses) ఉన్న గ్రామాల్లో మేం పోటీ చేస్తాం, డబుల్ బెడ్రూం ఇళ్లు ఉన్న గ్రామాల్లో మాత్రమే బీఆర్ఎస్ పోటీ చేయాలి. ఈ సవాల్‌ను స్వీకరించే దమ్ముందా?సాక్షి, నాగర్‌కర్నూల్/ నారాయణపేట: దేశంలో 12 ఏళ్ల మోదీ పాలన, రాష్ట్రంలో పదేళ్ల కేసీఆర్ పాలన.. 12 నెలల కాంగ్రెస్ పాలనపై తనతో బహిరంగ చర్చకు రావాలని బీజేపీ, బీఆర్ఎస్లకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సవాల్ విసిరారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు.. ఎవరు వస్తారో, ఎక్కడికి వస్తారో చెప్పాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతు అయిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దుస్థితిలో ఉందని సీఎం విమర్శించారు.శుక్రవారం నారాయణపేట జిల్లా అప్పక్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సీఎం రేవంత్ భూమి పూజ నిర్వహించారు. అనంతరం మెడికల్ కళాశాల, నర్సింగ్, పారామెడికల్ కళాశాలలకు ప్రారంబోత్సవం చేశారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా పెట్రోల్ బంక్ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ‘ప్రజా పాలన– ప్రగతి బాట’ బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు.సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే... రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలనలో ఎన్నో పనులు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఎప్పుడో బ్రిటిష్ కాలమైన 1931లో చేసిన కులగణన తప్ప ఈనాటికీ ఎవరూ లెక్క చెప్పలేదు. బీసీలు చైతన్యం అవుతున్నారు. తమ లెక్క చెప్పాలని అంటున్నారు. దేశంలో మొదటిసారి ప్రతి కులం లెక్క తీసేందుకు కులగణన చేపట్టి ఆదర్శంగా నిలిచాం. 30ఏళ్లుగా పీటముడి పడిన ఎస్సీ వర్గీకరణకు పరిష్కారం చూపాం.ఏడాదిలోనే సాధించిన ఈ విజయాలు కేసీఆర్ కళ్లకు కనబడటం లేదా? ప్రభుత్వం ఏర్పడి 12 నెలలు కాకముందే దిగిపోవాలని చూస్తున్నారు. కళ్లలో నిప్పులు, కడుపులో కత్తులు పెట్టుకొని మన మధ్యనే పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు. తాను కొడితే గట్టిగా వేరేలా ఉంటుందని కేసీఆర్ అంటున్నారు. ఆయన కొట్టాల్సి వస్తే ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీలు చేసిన కొడుకును, ఢిల్లీలో లిక్కర్ దందా చేసిన బిడ్డను, కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లు మింగిన అల్లుడిని కొడితే వాళ్లకు బుద్ధి వస్తుంది. కేసీఆర్ ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేదు.. పాలమూరు నుంచి కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించినా ఈ ప్రాంతంలో ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేదు. పదేళ్లలో ప్రాజెక్టులు పూర్తిచేసే అవకాశం ఉన్నా ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చిన పాపం బీఆర్ఎస్దే. అప్పుడే పూర్తిచేసి ఉంటే ఇప్పుడు చంద్రబాబుతో పంచాయతీ ఎందుకు వచ్చేది? పోతిరెడ్డిపాడు ద్వారా జగన్ ఏపీకి 40వేల క్యూసెక్కులు తరలించుకుపోతుంటే కేసీఆర్ ఊడిగం చేశారు. ఆనాడు మంత్రిగా ఉన్నది హరీశ్‌రావు కాదా? జగన్‌తో కలసి ప్రగతిభవన్‌లో రాయలసీమ ప్రాజెక్టుకు పథకం పన్నింది ద్రోహం కాదా? రాయలసీమ ప్రాజెక్టు పూర్తయితే రోజుకు 10 టీఎంసీల చొప్పున నెల రోజుల్లోనే శ్రీశైలం ఖాళీ అవుతుంది. మహిళలకు ఏడాదికి రెండు చీరలు.. దేశంలోనే మొట్టమొదటిసారిగా నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు ప్రారంభించాం. ఇందిరా మహిళా శక్తి, అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మహిళల చేతికి పర్యవేక్షణ, మహిళా సమాఖ్యల ఆధ్యర్యంలో 600 బస్సుల కొనుగోలు, పావలా– జీరో వడ్డీ రుణాలతో మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నాం. రాష్ట్రంలోని మహిళా సంఘాల మహిళలకు ఏడాదికి 2 నాణ్యమైన చీరలు అందిస్తాం. పరిశ్రమల ఏర్పాటుతో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయమైన పరిహారం ఇచ్చే బాధ్యత నాది.ఉద్ధండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల సమస్యకు పరిష్కారం చూపుతాం’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు పరి్ణకారెడ్డి, వాకిటి శ్రీహరి, జి.మధుసూదన్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, జనంపల్లి అనిరు«ద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్కు మళ్లీ అధికారం కల: మంత్రులు రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నది కలగానే మిగులుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాలేదని అలాంటిది ఏడాది పాలనలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని చెప్పారు. రాష్ట్రంలో కులగణనతోపాటు ఎస్సీ వర్గీకరణకు పరిష్కారం చూపి చరిత్రలో నిలిచామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సామాజిక న్యాయం అందిస్తూ అసమానతలను తొలగిస్తామన్నారు. నిన్నేం అంటలేను అక్కా.. – సీఎం రేవంత్, ఎంపీ డీకే అరుణ మధ్య సరదా సంభాషణ నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగారం గేటు వద్ద మహిళా సమాఖ్య ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకు ప్రారంబోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, బీజేపీ నాయకురాలు, ఎంపీ డీకే అరుణ మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను ఒకచోటుకు చేర్చి, మహిళా శక్తిని చాటుతూ నిధులు ఇవ్వాలని ప్రధాని మోదీని కోరతామని సీఎం రేవంత్ పేర్కొనగా.. ఎంపీ డీకే అరుణ కలుగజేసుకుని కేంద్రం ఇప్పటికే నిధులను ఇస్తోందని చెప్పారు.దీనిపై సీఎం స్పందిస్తూ.. ‘కేంద్రం ఇస్తుంది. ఇవ్వాలి. మిమ్మల్ని ఏమీ అనడం లేదు అక్కా. ప్రజలకు సేవ చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. మీకు ఇక్కడ తల్లి గారిల్లు, అక్కడ అత్త గారిల్లు, పిల్లల కోసం ఎవరేం ఇచ్చినా వద్దు అనలేం. అవసరమైనప్పుడు అందరం ఒక్క తాటిపై నిలబడాలి..’’ అని పేర్కొన్నారు. -
‘రాష్ట్రంలో కోటిమంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేయడమే మా లక్ష్యం’
సాక్షి,హైదరాబాద్ : ‘తెలంగాణలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేయడమే తన లక్ష్యం’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నారాయణపేట జిల్లా అప్పక్‌పల్లిలో రేవంత్ రెడ్డి మహిళా సమాఖ్య పెట్రోల్ బంకును ప్రారంభించారు.అనంతరం,ఆయన మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వం మహిళా సంఘాల్ని పట్టించుకోలేదు. మహిళా సంఘాల్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. మహిళలు ఆత్మగౌరవంతో బతకాలని ఏడాదికి రెండు చీరలు ఇస్తున్నాం. గతంలో మామూలు చీరలు ఇచ్చేవారు. ఇప్పుడు ఖరీదైన చీరలు ఇస్తున్నాం. అంబానీ, అదానీలు పోటీపడే సోలార్ ప్రాజెక్ట్‌లలో మహిళలను ప్రోత్సహిస్తాం. మహిళలు వ్యాపారంలో వేగంగా ఎదిగేలా వారిని ప్రోత్సహిస్తున్నాం. దేశంలోనే తొలిసారి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్‌ను ఏర్పాటు చేసుకోవడం సంతోషం. ఈ ప్రభుత్వంలో మహిళలకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. మహిళలు ఆత్మగౌరవంతో బ్రతుకుతారని మా ప్రభుత్వం ప్రగాఢంగా నమ్ముతోంది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత మహిళా స్వయం సహాయక సంఘాలను పునరుద్ధరించాం. రాష్ట్రంలో మహిళా శక్తి 67 లక్షల మంది తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. అన్ని రంగాల్లో మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.. 600 ఆర్టీసీ బస్సులకూ యజమానులను చేశాం.వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నాం. మహిళా స్వయం సహాయక ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి శిల్పారామం వద్ద స్టాల్స్ ఏర్పాటు చేసి ఇచ్చాం. త్వరలోనే మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి రెండు చీరలు కానుకగా ఇవ్వనున్నాం. సొంత ఆడబిడ్డలకు అందించినట్లు నాణ్యమైన చీరలను అందించనున్నాం .రూరల్, అర్బన్ అనే తేడా లేదు. తెలంగాణలో మహిళలంతా ఒక్కటే.. అవసరమైతే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుందాం. ఎంపీ డీకే అరుణ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరుతున్నా.రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహిళల అభివృద్ధికి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టండి. నిధులు మేం ఇస్తాం..నిర్వహణ మీరు చేయండి. గుడిని ఎంత పవిత్రంగా నిర్వహించుకుంటామో బడులను కూడా అలాగే నిర్వహించుకోవాలి’ అని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. -
ఎల్ఆర్ఎస్ పేరుతో 50కోట్ల దోపిడీకి కాంగ్రెస్ ప్లాన్: బండి సంజయ్
సాక్షి, పెద్దపల్లి: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని డబ్బులు వసూలు చేస్తారా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే కేంద్ర బడ్జెట్‌పై చర్చకు రావాలని సవాల్ విసిరారు.ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి బండి సంజయ్ నేడు పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఎల్ఆర్ఎస్ పేరుతో రూ.50వేల కోట్ల దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తారా?. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీ ఇదే(ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని కాంగ్రెస్ నేతలు మాట్లాడిన వీడియో). ఇప్పుడు ఎందుకు మాట మార్చుతున్నారు?. కాంగ్రెస్ పార్టీ బర్త్, డెత్ రెగ్యులరైజేషన్ స్కీంలను కూడా ప్రవేశపెడతారేమో అంటూ ఎద్దేవా చేశారు.ఇదే సమయంలో కేంద్ర బడ్జెట్‌పై దమ్ముంటే బహిరంగ చర్చకు రండి. మీకు చేతనైతే బీసీ రిజర్వేషన్లపై టెన్ జనపథ్ ఎదుట ధర్నా చేయండి. కాంగ్రెస్ నమ్మక ద్రోహానికి, బీజేపీ పోరాటాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 27న మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలతోపాటు వరంగల్- ఖమ్మం- నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. -
అసలు ఇంతకీ తప్పు ఎవరిది?
ఐఏఎస్, ఐపీఎస్, అఖిలభారత సర్వీసు అధికారుల తీరుతెన్నులపై తెలంగాణ ముఖ్యమంత్రి ఆసక్తికరమైన అంశాన్ని లేవనెత్తారు. అధికారులు తమతో తప్పులు చేయించరాదని, నిస్పక్షపాతంగా ఉండాలని రేవంత్ రెడ్డి అనడం ఆహ్వానించదగ్గ పరిణామం. యాదృచ్ఛికమైన అంశం ఇంకోటి ఉందిక్కడ. రేవంత్‌రెడ్డికి రాజకీయ గురువుగా భావించే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి ఈ విషయంలో పూర్తి వ్యతిరేకం!. రెడ్‌బుక్ పేరుతో ఇప్పటికే ఏపీలో అరాచకం సృష్టిస్తున్న ఆయన తమది రాజకీయ పాలనేనని మొహమాటం లేకుండా పచ్చిగా... బహిరంగంగానే మాట్లాడుతుంటారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ రాసిన పుస్తకావిష్కరణ సభలో రేవంత్ అఖిలభారత సర్వీసు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాజకీయ నేతలు ఒక తప్పు చేయాలంటే.. అధికారులు మూడు తప్పులు చేద్దామంటున్నారని వ్యాఖ్యానించారు. తద్వారా రాజకీయ నేతలు అధికారులతో తప్పులు చేయిస్తున్నారని చెప్పకనే చెప్పినట్లయింది. ఆ పాయింట్ ఆధారంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ తదితరులు విమర్శలు చేశారు. విత్తు ముందా? చెట్టు ముందా? అన్నట్లు నేతల కారణంగా అధికారులు తప్పులు చేస్తున్నారా? లేక అధికారులు నేతలతో తప్పులు చేయిస్తున్నారా? చర్చనీయాంశం. నిజానికి ఇది రెండువైపుల నుంచి జరుగుతున్న తప్పే. రాజకీయ నేతలు అధికారంలోకి వచ్చేంత వరకూ ఒకలా.. ఆ తరువాత అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఇంకోలా ప్రవర్తిస్తున్నారన్న విమర్శ ఉంది. ఎన్నికల్లో గెలుపునకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి.. అధికారం దక్కితే పెట్టిన ఖర్చును ఎలాగోలా చక్రవడ్డీలతో రాబట్టుకోవాలని నేతలు యత్నిస్తూంటారు. ఈ క్రమంలో అధికారులు తమ మాట వినేలా చేసుకునేందుకు నేతలు అన్ని పన్నాగాలు పన్నుతూంటారు. చెప్పినట్లు వినని అధికారిని శంకరగిరి మాన్యాలు పట్టించేందుకూ వెనుకాడరు. ఇదిలా ఉంటే ఇంకోవైపు కొందరు అధికారులు ముఖ్యమంత్రిని తెగ పొగుడుతూంటే.. కొందరు మంత్రులతో గిల్లికజ్జాలకు దిగుతుంటారు. ముఖ్యమంత్రి, మంత్రి ఎవరైనా సమర్థులైన అధికారులను విసృ్తత ప్రజా ప్రయోజనాల కోసం వాడుకోగలుగుతున్నారా? అంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. రాజకీయ నేతల్లో మాదిరిగానే అధికార యంత్రాంగంలోనూ రాజకీయాలు, వర్గాలు ఉన్నాయన్నది నిజం. ఉత్తరాది, దక్షిణాది, కులం, ఒకే రాష్ట్రంలోని ప్రాంతం వంటి అంశాల ఆధారంగా అధికారులు ఒకరినొకరు విభేదించుకున్న సందర్భాలు బోలెడు. అఖిలభారత సర్వీసు అధికారులంటే పదవుల్లో ఉన్నవారు చాలా గౌరవం ఇచ్చేవారు. అధికారులు కూడా ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతో వచ్చిన వారే ఎక్కువగా ఉండేవారు. కాని రాను, రాను నేతల్లో, అధికారుల్లోనూ మార్పు వచ్చింది. జనాన్ని నేతలు కరప్ట్ చేస్తున్నారా? లేక జనమే నేతలు కరప్ట్ అయ్యేలా చేస్తున్నారా? అంటే సమాధానం వెతుక్కోవాల్సిన పరిస్థితి. దురదృష్టవశాత్తు అధికారులతోపాటు న్యాయ వ్యవస్థలోనూ సమాజంలోని అన్ని అవలక్షణాలు వచ్చి చేరుతూందన్న బాధ చాలామందిలో ఉంది. అది వేరే విషయం. ఒకప్పుడు ముఖ్యమంత్రులుగా ఉన్నవారు నిబంధనల ప్రకారమే నిర్ణయాలు చేయాలని చెప్పేవారు. కానీ ఆ తర్వాత కాలంలో ప్రజల ఆకాంక్షలలో మార్పులు రావడం వల్ల ,వారిలో స్వార్ధచింతన పెరగడం వల్ల నిబంధనలు ఎలా ఉన్నాయన్నది ముఖ్యంకాదు.. అవసరమైతే వాటిని మార్చండి.. మేము చెప్పే పనులు చేయండి అని ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. దాంతో అధికారుల్లోనూ మార్పులు వచ్చాయి. పలువురు అధికారులు తమ సంగతేమిటి? అనే ఆలోచనకు వస్తున్నారు. ఉమ్మడి ఏపీలో కొందరు ముఖ్యమంత్రుల అనుభవాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి. ఒకప్పుడు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసే సీనియర్ అధికారుల సంఖ్య పరిమితంగా ఉండేది. కానీ రాను, రాను సీఎం ఆఫీసులోనే అధికారం కేంద్రీకృతమవుతోంది. దాంతో తమకు కావల్సిన అధికారులనే వీరు నియమించుకుంటున్నారు. ఎస్వీ ప్రసాద్ వంటి అధికారులు కొద్ది మంది మాత్రం పార్టీ, ముఖ్యమంత్రి ఎవరన్న దానితో సంబంధం లేకుండా పలువురు సీఎంల వద్ద కీలకమైన బాధ్యతలలో ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి మారితే ఆయన పేషీలోని అధికారులు, సీఎస్ పోస్టులో ఉన్నవారు సైతం తిరిగి పోస్టు కోసం ఇబ్బంది పడవలసి వస్తోంది. ఆ విషయంలో రేవంత్ ప్రభుత్వం కొంత బెటర్ అని చెప్పాలి. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న సీఎస్ శాంతికుమారినే కొనసాగించారు. కానీ.. ఏపీలో మాత్రం అప్పటి ముఖ్యమంత్రి జగన్ వద్ద పనిచేసిన అధికారులను చంద్రబాబు ప్రభుత్వం పక్కనపెట్టింది. సీఎస్ జవహర్ రెడ్డి వంటి సీనియర్ అధికారుల పట్ల కూడా అవమానకర తీరులో వ్యవహరించింది. అంతెందుకు! రేవంత్ ఐసీఎస్‌లకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధించారన్న ఆరోపణ ఒక్కటి లేదు. కానీ చంద్రబాబు గత హయాంలో జరిగిన స్కామ్‌లపై విచారించారన్న కారణంగా కొందరు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌లను ఇలా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికార యంత్రాంగాన్ని కులపరంగా కూడా చీల్చే యత్నం కనిపించదు. ఏపీలో మాత్రం కులం ఆధారంగా పోస్టింగ్‌లు, పార్టీ ఆధారంగా నియామకాలు జరుగుతున్న తీరు తీవ్ర విమర్శలకు గురి అవుతోంది. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఒకరు ఒక కుల సమావేశంలో పాల్గొని గత ముఖ్యమంత్రి జగన్ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకోడానికి ఆ కులం వారంతా పనిచేయాలని పిలుపు ఇచ్చారు. అలాంటి అధికారికి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు పెద్ద పీట వేసి ఒక పెద్ద పదవి కూడా ఇచ్చేశారు. దీనిని బట్టే ఆ ప్రభుత్వ వ్యవహార శైలి అర్థమవుతుంది. ఆ అధికారి తన సర్వీసులో ఏ రకంగా వ్యవహరించింది చెప్పకనే చెబుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌ల ప్రభుత్వం రెడ్‌బుక్ పేరుతో అరాచకాలకు పాల్పడుతుంటే ఐపీఎస్ అధికారులు వారికి మద్దతు ఇస్తున్నారు. కేసులు పెట్డడంలోనూ వివక్ష చూపుతున్నారు. చివరికి కొందరు ఐపీఎస్‌లే ముందస్తు బెయిల్ తెచ్చుకోవలసి వచ్చింది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఏపీతో పోల్చితే తెలంగాణలో ఈ గొడవ తక్కువ. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులకు స్వేచ్చ ఉండేది. వారు తమ అభిప్రాయాలు చెబితే వాటిని విని అవసరమైతే నిర్ణయాలలో మార్పు చేసుకునే వారు. ఒకవేళ అధికారులతో విభేధిస్తే, ‘‘మీరు మీ అభిప్రాయాలు రాయండి.. దానిపై నా అభిప్రాయం నేను రాస్తాను..’’ అని చెప్పేవారట. తద్వారా అధికారులకు ఇబ్బంది లేకుండా చూసేవారని ఒక రిటైర్డ్ అధికారి చెప్పారు. అయినప్పటికీ కాంగ్రెస్, టీడీపీలు కలిసి వైఎస్ కుమారుడు జగన్ పై అక్రమ కేసులు బనాయించే ప్రక్రియలో భాగంగా కొంతమంది ఐఎఎస్ అధికారులను కూడా ఇరికించారు. ఉదాహరణకు బీపీ ఆచార్య అనే ఐఏఎస్ అధికారి ప్రస్తుతం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాన్ని అభివృద్ది చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తిని జగన్ కేసులో ఇరికించి జైలులో పెట్టారు. ఆ తర్వాత కాలంలో ఆయనపై కేసును కోర్టు కొట్టివేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తీసుకున్న నిర్ణయాల విషయంలో అధికార యంత్రాంగం తలొగ్గక తప్పలేదని అంటారు. దాని ఫలితంగా ఇప్పుడు ఆ ప్రాజెక్టు పై ఏర్పడిన విచారణ కమిషన్ ను ఎదుర్కోవలసి వస్తోంది.ఇదే టైమ్‌లో ఇంకో సంగతి చెప్పాలి. కొంతమంది అధికారులు తమ తరపున ఏజెంట్లను పెట్టుకుని అక్రమ సంపాదనకు పాల్పడుతుంటారన్న ఆరోపణలు కూడా వినిపిస్తుంటాయి. అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లడం లేదని రేవంత్ అంటున్నారు. అది రాజకీయ నేతలకు కూడా వర్తిస్తుంది. ఇక్కడ సమస్య ఏమిటంటే నిధుల వినియోగంలో ఉండే ప్రాధాన్యత క్రమాలు కూడా ముఖ్యం అని భావించాలి. డబ్బులు లేకుండా జనంలోకి వెళ్ళినా వారితో తిట్లు తినడం తప్ప పెద్ద ఉపయోగం ఉండదు. ఉదాహరణకు.. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. వాటిని అమలు చేసే బాధ్యత అధికారులు ఏ రకంగా తీసుకోగలుగుతారు?. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మధ్య అధికారులు ఇన్నోవేటివ్ ఆలోచనలు చేయాలని పదే,పదే చెబుతున్నారు. ఆ ఇన్నోవేటివ్ పద్దతి ఏమిటో చెప్పకుండా డైలాగులు చెబితే ఏమి ప్రయోజనం? అని కొందరు వ్యాఖ్యానించారు.పైగా చంద్రబాబు ఈ మధ్య ఏమి మాట్లాడుతున్నారో తెలియడం లేదు. గంటల తరబడి సమీక్షలు పెట్టడం వల్ల అధికారులకు విసుగు వస్తోందని ఆయన అనుకూల మీడియానే పేర్కొందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జగన్ టైంలో స్పందన కార్యక్రమం పెట్టి అనేక ఫిర్యాదుల పరిష్కారానికి ప్రయత్నించారు. అలాగే వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య క్లినిక్.. ఇలాంటి కొత్త వ్యవస్థలు తీసుకు వస్తే వాటిని విధ్వంసం చేసే పనిలో చంద్రబాబు సర్కార్ ఉంది. మరి ఆ వ్యవస్థలను తీసుకురావడం కోసం పనిచేసిన అధికారులది తప్పవుతుందా? లేక ఇప్పుడు విధ్వంసంలో భాగస్వాములవుతున్న అధికారులది తప్పు అవుతుందా?. ఏది ఏమైనా నిబద్దత కలిగిన అధికారులకు ప్రోత్సాహం ఉంటుందని రేవంత్ చెప్పడం బాగానే ఉంది. కాని ముందుగా రాజకీయ నేతలలో ఆ నిబద్దత ఉంటే ఆటోమేటిక్ గా అధికార యంత్రాంగం కూడా చాలా వరకు సర్దుకుంటుందని చెప్పాలి.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బీఆర్ఎస్ పాలనలోనే ‘కృష్ణా’లో అన్యాయం: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది ముమ్మాటికీ గత బీఆర్ఎస్ పాలనలోనే అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కృష్ణా జలాలను ఏపీ పాలకులు దోచుకుపోతుంటే అందుకు సహకరించిన బీఆర్ఎస్ పాలకులు.. ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుచేసేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో ఉన్న 811 టీఎంసీల వాటాలను ఏపీ, తెలంగాణకు పంపిణీ చేసేందుకు 2015 జూన్ 18, 19 తేదీల్లో కేంద్ర జలశక్తి శాఖ సమావేశం నిర్వహించగా, ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులను అంగీకరిస్తూ సంతకాలు చేశారని ఆయన గత బీఆర్ఎస్ పాలకులపై మండిపడ్డారు. 2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సైతం ఈ అన్యాయానికి సమ్మతి తెలిపారని ఆరోపించారు. కేంద్ర జలశక్తి శాఖ, అపెక్స్ కౌన్సిల్, కృష్ణా బోర్డు 2020 వరకు నిర్వహించిన అన్ని సమావేశాల్లో గత ప్రభుత్వం ఈ కేటాయింపులను అంగీకరించి రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందన్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలసి గురువారం జలసౌధలో విలేకరుల సమావేశం నిర్వహించి కృష్ణా జలాల విషయంలో ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు చేసిన ఆరోపణలను ఉత్తమ్ తిప్పికొట్టారు. బీఆర్ఎస్ పాలనలో కృష్ణా జలాల విషయంలో జరిగిన వరుస అన్యాయాల క్రమాన్ని తేదీలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 2019–22 మధ్యలో ఏపీ ఏటా వరుసగా 653 టీఎంసీలు, 629 టీఎంసీలు, 621 టీఎంసీలను తరలించుకుపోయినా, గత పాలకులు చూస్తుండిపోయారన్నారు. ఏపీని అడ్డుకుంటామని కేంద్రం హామీ ఇచ్చింది.. ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోవడంపై తాను ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి ఫిర్యాదు చేయగా, ఏపీని అడ్డుకోవడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. సీతారామ ప్రాజెక్టుకి ఇప్పటికే తాము 67 టీఎంసీల కేటాయింపులను సాధించామని, నెలాఖరులోగా ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతులిస్తామని కేంద్ర మంత్రి మరో హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జీరో వడ్డీ, 50 ఏళ్ల కాలపరిమితితో రుణాలు ఇచ్చేందుకు సంసిద్ధత తెలిపారని వివరించారు. సాగర్‌ను ఏపీకి అప్పగించారు.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని ఏపీ ప్రభుత్వం 2023లో 44 వేల క్యూసెక్కుల నుంచి 92,600 క్యూసెక్కులకు పెంచుకోగా, బీఆర్ఎస్ పాలకులు దానికి సహకరించారని ఉత్తమ్ ఆరోపించారు. అలాగే వెలిగొండ, ఇతర ప్రాజెక్టులను ఏపీ పూర్తిచేసుకునేందుకు కూడా సహకరించారన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాత్రి 2023 నవంబర్ 29న ఏపీ ప్రభుత్వం 400–500 మంది సాయుధ పోలీసులతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు సగభాగాన్ని ఆక్రమించుకోగా, కృష్ణా బోర్డు అనుమతి లేకుండా 5,000 క్యూసెక్కులను విడుదల చేసుకున్నారని, అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు దీనిని చేష్టలుడిగి చూశారని ధ్వజమెత్తారు. అన్యాయం చేసింది వారే.. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసింది హరీశ్‌రావు, కేసీఆర్, మాజీ ఈఎన్సీ మురళీధర్రావే అని, వారికి ఉరేసినా తప్పులేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. వారిది దొంగల తెలివి అని, ప్రశ్నించిన వారిని హత్యలు చేశారని ఆరోపించారు. -
కృష్ణా జలాలపై సర్కార్ మొద్దునిద్ర: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నది జలాలను అక్రమంగా తరలిస్తున్నా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ సాగు, తాగునీటి ప్రయోజనాలకు నష్టం కలుగుతున్నా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయని, వేసవిలో తాగునీటి సమస్య తీవ్రమయ్యే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జైపాల్ యాదవ్‌తో కలసి మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ గురించి పట్టింపులేని ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి జరిగే నష్టం ఏమిటో తెలుస్తోందన్నారు. రోజుకు 10 వేల క్యూసెక్కులు అక్రమంగా తరలింపు‘నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి ఏపీ ప్రభుత్వం మూడు నెలలుగా రోజుకు 10 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని అక్రమంగా తరలిస్తోంది. గడచిన 25 రోజుల్లో 60 టీఎంసీల నీటిని తరలించారు. కృష్ణా జలాల్లో ఏపీ తాత్కాలిక వాటా 512 టీఎంసీలు కాగా ఇప్పటికే 657 టీఎంసీలు తరలించింది. తెలంగాణకు రావాల్సిన వాటా 343 టీఎంసీలు కాగా 220 టీఎంసీలు మాత్రమే వాడుకుంది. ఏపీకి మిగిలింది కేవలం 9 టీఎంసీలు కాగా తెలంగాణకు మరో 123 టీఎంసీల వాటా రావాలి. కానీ శ్రీశైలం, సాగర్‌లో అందుబాటులో ఉన్న నీరు వంద టీఎంసీలు మాత్రమే. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి అన్యాయాన్ని అడ్డుకోవాలి’అని హరీశ్ అన్నారు.సాగర్‌ను అధీనంలోకి తీసుకోవాలి‘సీఆర్పీఎఫ్ బలగాలను ఉపసంహరించుకుని సాగర్ ప్రాజెక్టును తెలంగాణ అధీనంలోకి తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఏపీ ఇష్టారాజ్యంగా నీళ్లు తరలిస్తున్నా చంద్రబాబును అడిగే ధైర్యం లేదు, కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము లేదు’అని హరీశ్‌రావు మండిపడ్డారు. ‘సాగర్ ఎడమ కాలువ, ఏఎంఆర్ ఎస్సెల్బీసీ కింద సుమారు 9 లక్షల ఎకరాలకు 35 టీఎంసీల మేర నీరు కావాలి. ఖమ్మం, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, హైదరాబాద్ తాగునీరు నాగార్జున సాగర్‌పై ఆధారపడి ఉంది. ఏపీ జలదోపిడీపై కేఆర్ఎంబీ, జలశక్తి మంత్రి కార్యాలయాల ముందు ధర్నాకు సిద్ధం, ఢిల్లీకి అఖిలపక్షం తీసుకెళ్లాలి. ఉమ్మడి ప్రాజెక్టులపై త్రిసభ్య కమిటీ సమావేశం కోసం డిమాండ్ చేయాలి. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి’అని హరీశ్‌రావు విమర్శించారు. వెంటనే సాగర్ కుడి కాల్వకు నీటి విడుదలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. -
‘ఎస్సీ వర్గీకరణలో సీఎం రేవంత్ పాత్ర ఏమీ లేదు’
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కల్వకుంట్ల కవిత నివాసంలో గురువారం దళిత బంధు సాధన సమితి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ ఎస్సీ వర్గీకరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదు. వర్గీకరణ విషయంలో ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదు. సుప్రీం కోర్టు తీర్పు వల్ల వర్గీకరణకు బాటలు పడ్డాయి. షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికను బయటపెట్టి.. వెంటనే వర్గీకరణ చేయాలి. దళితుల మధ్య పంచాయతీ పెట్టవద్దు... ఎవరికీ అన్యాయం జరగకుండా వర్గీకరణ ఉండాలి. ఎస్సీ వర్గీకరణ పేరు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మరో మోసం చేశారు. వర్గీకరణకు, ఉద్యోగాల కల్పనకు ముఖ్యమంత్రి లింక్ పెడుతున్నారు.వర్గీకరణ వంకతో జాబు క్యాలెండర్ అమలును నిలిపివేయవద్దు. కోర్టు తీర్పు వచ్చి 6 నెలలు గడిచినా ఆలూలేదు చూలు లేదన్నట్లుగా ఉంది. రేవంత్ రెడ్డి మాటలు చెబితే నమ్మరని ఢిల్లీ నుంచి ప్రియాంగా గాంధీని తీసుకొచ్చి హామీ ఇప్పించారు. దళిత కుటుంబాలకు రూ. 10 లక్షలకు బదులు 12 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. ముఖ్యమంత్రికి ప్రభుత్వాన్ని నడపడం చేతకావడం లేదు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన సీఎం రేవంత్ రెడ్డి..రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశారుఇప్పటికే కేసీఆర్ మంజూరు చేసిన దళిత బంధు నిధులను విడుదల చేయాలి. ధైర్యం ఉంటే 18 వేల దళిత కుటుంబాలకు దళిత బంధు డబ్బులను డిమాండ్ చేయాలి. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందే ఈ డబ్బులు విడుదల చేయాలి. ఎస్సీలకు బడ్జెట్ లో 33 వేల కోట్లు కేటాయించి... కేవలం 9800 కోట్లే ఖర్చు చేశారు. ముందుచూపుతో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు కేసీఆర్ చట్టబద్ధత కల్పించాలి. రేవంత్ రెడ్డిది మనసున్న ప్రభుత్వం కాదు.. మానవత్వం లేదు. రేవంత్ రెడ్డి ఆలోచన చిన్నది ... చూపు పెద్దవాళ్లపైనే ఉంది. అందుకే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి పూలదండ కూడా వేయలేదు. అంబేద్కర్ ఆయన వారసులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారు. అంబేద్కర్ జయంతిలోపు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి కేబినెట్ మొత్తం వెళ్లి పూలదండలు వేయాలి. లేదంటే ప్రభుత్వం మూసివేసిన గేట్లను బద్దలుకొట్టి మేమే అంబేద్కర్ ను గౌరవించుకుంటాం. అంబేద్కర్ ని గౌరవించని ముఖ్యమంత్రి... మన ఆకలిని అర్థం చేసుకుంటారా ? , అట్టడుగు వర్గాల వారిని వేలు పట్టుకొని ముందుకు నడిపించాలన్నది కేసీఆర్ ఆలోచన. పేదలు, అణగారిన వర్గాల కోసం పనిచేయాలని కేసీఆర్ ఎప్పుడూ అంటున్నారు. దళితులను ధనవంతులను చేయాలన్న ఉద్ధేశంతో దళిత బంధును ప్రవేశపెట్టారు. ఎన్నికల కోసం... రానున్న తరాల కోసం కేసీఆర్ ఆలోచిస్తారు. అన్ని వర్గాలకు ఆత్మబంధువు అంబేద్కర్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ప్రత్యేక తెలంగాణ సాధ్యమైంది రెండు మూడేళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుంది’ అని కవిత స్పష్టం చేశారు. -
‘మాకు అన్ని వర్గాల మద్దతు ఉంది’
భువనగిరి: రాబోవు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఉపాధ్యాయులు అండగా ఉన్నారన్నారు కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రజలకిచ్చిన హామీలను విస్మరించిందని, అన్ని వర్గాలను రేవంత్ సర్కార్ మోసం చేసిందని కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్బీఆర్ఎస్ లు నాటకాలు ఆడుతున్నాయన్న కిషన్ రెడ్డి.. ఆ రెండు పార్టీలకు ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగే ధైర్యం లేదన్నారు. బీజేపీకి అన్ని వర్గాల మద్దతు ఉందని భువనగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.కాగా, వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మొత్తం 23 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా19 మంది చివరకు బరిలో ఉన్నారు. ఈ నెల 3న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా 10వ తేదీ వరకూ ానామినేషన్ల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 27న పోలింగ్ఈ నెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. సాయంత్రం ఓటింగ్ ముగిసే సమయంలో క్యూ లైన్లో ఉన్న వారికి టోకెన్ నంబర్లను ఇచ్చి, ఓటింగ్ వేసే ఏర్పాట్లు చేస్తున్నారు. -
భూపాలపల్లి లింగమూర్తి కేసుపై రాజకీయ దుమారం..
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అవినీతిని ప్రశ్నించినందుకే సామాజిక కార్యకర్త రాజలింగమూర్తిని హత్యచేశారని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణలో బీఆర్ఎస్ హత్యా రాజకీయాలకు తెర లేపింది. లింగమూర్తి హత్య వెనుక గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజలింగమూర్తి హత్యపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘బీఆర్ఎస్ హయాం నుంచి తెలంగాణలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ అవినీతిని ప్రశ్నించినందుకు లింగమూర్తిని చంపేశారు. కాళేశ్వరం అవినీతిపై రాజలింగం అనేక కేసులు వేసి పోరాడుతున్నారు. కేసీఆర్, హరీష్ రావుపై రాజలింగం కేసులు వేశాడు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కుట్రలు చేస్తోంది. అడ్వకేట్ సంజీవరెడ్డి మృతి అనేక అనుమానాలు ఉన్నాయి.బీఆర్ఎస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి చంపించారని లింగమూర్తి భార్య చెబుతున్నారు. కేసీఆర్, హరీష్ రావుపై కేసు వేసినందుకే చంపేశారని లింగమూర్తి కూతురు అంటున్నారు. గండ్ర వెంకట రమణారెడ్డిని పోలీసుల ముందు లొంగిపోవాలని కేసీఆర్ ఆదేశించాలి. అవినీతి బయటపడుతుందనే హత్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలోనే నడిరోడ్డుపై వామన్ రావు దంపతులను హత్య చేశారు. నిందితుడు ఎవరో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలిసినా ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. లగచర్ల దాడి సూత్రదారుడితో కేటీఆర్ 72 సార్లు మాట్లాడారు. బీఆర్ఎస్ నేతల రాజకీయం ఇలా ఉంటుంది.హరీష్ రావుకు అసలు మానవత్వం ఉందా?. కృష్ణా నీటిని ఏపీకి ఎక్కువ దోచిపెట్టిందే బీఆర్ఎస్. ఈ ఘటనను డైవర్ట్ చేయడానికే ఇలా మాట్లాడుతున్నారు. 15 నెలలుగా బయటకు రాని కేసీఆర్‌కు కాంగ్రెస్ గ్రాఫ్ గురించి ఏం తెలుసు?. ఎవరిని అడిగి కాంగ్రెస్ గ్రాఫ్ గురించి చెప్తున్నారు. హత్యా రాజకీయాలకు పాల్పడుతూ.. కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిందని చెబుతున్నారా?. బీఆర్ఎస్ హత్యలు చేయడం తప్ప ఇంకా ఏం చేయగలదు?. ఈ హత్యను సీరియస్‌గా తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. సీబీసీఐడీతో విచారణ జరపాలని సీఎంను కోరుతాను. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి దోషులను శిక్షించాలి. ఈ కేసును న్యాయమూర్తి సుమోటోగా తీసుకోవాలి.గండ్ర కౌంటర్.. మరోవైపు.. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కౌంటరిచ్చారు. తాజాగా గండ్ర మీడియాతో మాట్లాడుతూ.. లింగమూర్తి హత్యను మాకు చుట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఏ ఆధారాలతో మాపై నిందలు వేస్తున్నారు. బీఆర్ఎస్ హత్యా రాజకీయాలను ప్రోత్సహించదు. ఈ విషయంపై కోర్టులోనే మేం చట్టపరంగా ఎదుర్కొంటాం. భూ వివాదాలతోనే హత్య జరిగిందని స్థానిక పోలీసులు చెబుతున్నారు. లింగమూర్తి హత్యకు నాకు, బీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. -
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు.. మూడు బిల్లులకు ఆమోదం!
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు, ఎస్సీల వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీలోపు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక భేటీలో బీసీలకు స్థానిక సంస్థలతోపాటు విద్య, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను, ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రతిపాదించనుంది.అసెంబ్లీలో చర్చ అనంతరం ఈ బిల్లులను ఆమోదిస్తారు. ఆపై వీటి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. ఎస్సీల వర్గీకరణకు సంబంధించి ఏకసభ్య కమిషన్ గడువు పొడిగించిన నేపథ్యంలో ఆ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా బిల్లును రూపొందించనున్నారు. ఈ బిల్లు అసెంబ్లీ ఆమోదం అనంతరం చట్టంగా రూపాంతరం చెందనుంది. దీంతోపాటు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను కూడా అసెంబ్లీలో పెట్టి ఆమోదం తీసుకోనుంది. ఈ మూడు బిల్లుల ముసాయిదా రూపకల్పనలో సంబంధిత అధికారులు నిమగ్నమయ్యారని సమాచారం. త్వరలోనే జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మూడు ముసాయిదా చట్టాలకు తుదిరూపు లభించనుంది.బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల మూడోవారంలో!2025–26 ఆర్థిక సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం బడ్జెట్ సమావేశాలను వచ్చే నెల మూడో వారంలో నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఏడాది మార్చి 31లోపు బడ్జెట్‌కు అసెంబ్లీ ఆమోదం తప్పనిసరి కావడంతో మూడో వారంలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. -
తెలంగాణ కాంగ్రెస్‌లో ట్విస్ట్.. మేడమ్ వచ్చాకే భర్తీ!
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ కార్యవర్గ ప్రకటన తాత్కాలికంగా వాయిదా పడినట్లు తెలిసింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్గా తమిళనాడుకు చెందిన సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ నియమితులైన నేపథ్యంలో ఆమె రాష్ట్రానికి వచ్చి బాధ్యతలు స్వీకరించిన తర్వాతే ఈ ప్రకటన ఉంటుందని గాంధీభవన్ వర్గాల సమాచారం.వాస్తవానికి పీసీసీ కార్యవర్గాన్ని ఇప్పటికే ప్రకటించాల్సి ఉంది. గత నెలలో కేసీ వేణుగోపాల్ హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్షలో వీలున్నంత త్వరగా పీసీసీ పదవులు భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో కూడా రెండుమూడు రోజుల్లో కార్యవర్గాన్ని ప్రకటిస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రకటించారు. అయితే, ఈ జాబితా ఖరారవుతున్న సమయంలోనే రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ని మార్చటంతో జాబితా ప్రకటనను వాయిదా వేశారని తెలుస్తోంది. కాగా, మీనాక్షి నటరాజన్ ఈ నెల 23న రాష్ట్రానికి వస్తారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.ఉపాధ్యక్షుల జాబితా లీక్..పీసీసీ ఉపాధ్యక్షులుగా ఎంపికచేసినవారి జాబితా లీకైంది. మొత్తం 8 మందిని ఈ జాబితాలో ఫైనల్ చేశారని, అందులో ఐదుగురు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారేనని చర్చ జరుగుతోంది. మాజీ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు ఎస్.వేణుగోపాలా చారి, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, నాయిని రాజేందర్‌రెడ్డి, ఫిరోజ్‌ఖాన్, ఫహీం ఖురేషీ, నీలం మధు, టి.కుమార్‌రావును పార్టీ ఉపాధ్యక్షులుగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. లీకైన ఈ జాబితాలో ఒక్క బీసీ వ్యక్తి పేరు మాత్రమే ఉండటంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. -
కాంగ్రెస్ గ్రాఫ్ డౌన్: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ వేగంగా పడిపోతోంది. ప్రభుత్వంపై ప్రజల్లో ఇంత త్వరగా వ్యతిరేకత వస్తుందని అనుకోలేదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టులో గట్టిగా కొట్లాడుతున్నాం. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీ యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని జనం కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ విషయాన్ని నేను గమనిస్తున్నా. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ పేరిట మళ్లీ ఏదో ఒక రూపంలో తెలంగాణలో అడుగు పెడుతానంటున్నడు. తెలంగాణ మళ్లీ వలసవాద కుట్రలకు బలికావొద్దు..’ అని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ భవన్లో బుధవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, బీఆర్ఎస్ ప్రస్థానం, సంస్థాగత నిర్మాణం, పార్టీ రజతోత్సవాల నిర్వహణ, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తదితర అంశాలపై మాట్లాడారు. సీఎంకు పాలనపై పట్టు లేదని తేలిపోయింది ‘తెలంగాణ ప్రజలకు నచ్చి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు. అధికారంలో వచ్చినా కాంగ్రెస్‌కు అచ్చి రాలేదు. మంత్రివర్గానికి, సీఎంకు నడుమ సమన్వయం లేదు. ఐఏఎస్, ఐపీఎస్‌లు అవినీతికి పాల్పడుతున్నారని సీఎం చెప్పడం ద్వారా ఆయనకు పాలనపై పట్టు లేదని తేలిపోయింది. మనం ఏటా రూ.15 వేల కోట్ల ఆదాయం పెంచుకుంటూ వచ్చి ప్రజలకు కావాల్సినవి సమకూర్చాం. కానీ గడిచిన మూడు త్రైమాసికాల్లో రూ.12 వేల కోట్ల ఆదాయాన్ని రాష్ట్రం కోల్పోయింది. ఆర్థికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేసి ఖజానాను ఎలా నింపాలో వారికి తెలియడం లేదు..’ అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ ‘తెలంగాణ సమాజం సామాజిక, చారిత్రక అవసరాల కోసం తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ పార్టీ. అలా పురుడు పోసుకున్న బిడ్డను నలిపివేయాలని ఎన్నో కుట్రలు సాగాయి. గతం గాయాల నుంచి కోలుకుంటున్న మనం తిరిగి వలసవాద పాలకుల చేతిలో పడితే తెలంగాణ కోలుకోకుండా ఆగమయ్యే ప్రమాదముంది. తెలంగాణకు రాజకీయ అస్తిత్వం, రక్షణ కవచం బీఆర్ఎస్ పార్టీనే. తెలంగాణకు శాశ్వత న్యాయం జరగాలంటే ప్రజలను తిరిగి చైతన్యం చేయాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉంది..’ అని బీఆర్ఎస్ అధినేత చెప్పారు. తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. చిత్రంలో కేటీఆర్, హరీశ్‌రావు, కవిత ఇతర ముఖ్య నేతలు 7 నెలల పాటు సంస్థాగత నిర్మాణం ‘ఏప్రిల్ 10 నుంచి అక్టోబర్ వరకు పార్టీ సంస్థాగత నిర్మాణంపై పనిచేయాలి. ఏప్రిల్ 10న పార్టీ ప్రతినిధుల సభ, అదే నెల 27న బహిరంగ సభ నిర్వహిస్తాం. దీనికి సంబంధించి సబ్ కమిటీ బాధ్యతలు హరీశ్‌రావుకు అప్పగిస్తున్నాం. ఏప్రిల్ 10 నుంచి సభ్యత్వ నమోదుతో పాటు గ్రామ, వార్డు, పట్టణ, మండల, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల ఏర్పాటు జరుగుతుంది. అక్టోబర్‌లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. సంస్థాగత శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రకటిస్తాం. త్వరలో 30 మందికి పైగా కీలక నేతలతో భేటీ జరిపి అన్ని అంశాలపైనా స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తాం. సోషల్ మీడియా సహా పార్టీ అనుబంధ కమిటీలను బలోపేతం చేస్తాం..’ అని కేసీఆర్ తెలిపారు. కొత్త తరంలో తెలంగాణ సోయి లేనందుకే ఓటమి ‘రాజకీయ పార్టీలకు అధికారమే పరమావధి. కానీ బీఆర్ఎస్కు తెలంగాణ ప్రయోజనాలే ప్రాధాన్యత. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కొత్త తరంలో తెలంగాణ సోయి లేనందునే పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయాం. కొత్త తరానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ నేపథ్యం, బీఆర్ఎస్ పోషించిన పాత్రను వివరించాలి. తెలంగాణ చరిత్రను అర్ధం చేసుకుంటే గుండె బరువెక్కుతుంది. భారతదేశంలో విలీనం తర్వాత కూడా తెలంగాణ ఒక రాష్ట్రంగా తన రాజకీయ అస్తిత్వాన్ని చాటుకోలేక పోయింది. రాజకీయంగా తెలంగాణ నాయకత్వాన్ని విస్మరించి కాంగ్రెస్ అడుగడుగునా కుట్రపూరిత రాజకీయాలు చేసింది. వలసాంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణను అన్ని విధాల నాశనం చేశారు. తెలంగాణలో నెత్తురు ఏరులై పారిన సందర్భంలో నా ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైంది. తెలంగాణ జాతి ప్రస్థానంలో తలెత్తిన గాయాలు బాధలను పూర్తిగా తొలగిపోయే విధంగా, స్వేచ్ఛావాయువులు పీల్చుకునే విధంగా తెలంగాణ తనకు తాను నిలబడాలనే ఆకాంక్షతో పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ. సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పార్టీ యంత్రాంగంతో పాటు కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, వివిధ వర్గాలను కలుపుకోవాలి. తెలంగాణ ఉద్యమ తరహాలో పార్టీ రజతోత్సవ వేడుకలు ఏడాది పొడవునా నిర్వహించాలి. తెలంగాణ చరిత్ర, బీఆర్ఎస్ ప్రస్థానాన్ని వివరించే డాక్యుమెంటరీలకు రూపకల్పన జరగాలి..’ అని మాజీ సీఎం ఆదేశించారు. అభిప్రాయాలు వెల్లడించిన నేతలు సుమారు నాలుగున్నర గంటల పాటు సాగిన సమావేశంలో పార్టీ నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు కేసీఆర్ అవకాశం ఇచ్చారు. పలువురు మాజీ మంత్రులతో పాటు సీనియర్, జూనియర్ నాయకులు 29 మంది మాట్లాడారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, యువతతో పాటు వివిధ వర్గాలకు చేరువ కావాల్సిన అవసరం, పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు. కొందరు మాజీ ఎమ్మెల్యేలు క్షేత్ర స్థాయిలో చురుగ్గా పనిచేయాలనే ఆభిప్రాయం వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, పార్టీ నేతలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తాతా మధు, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, రాకేశ్‌రెడ్డి, రాజా వరప్రసాద్, మూల విజయారెడ్డి, దాసరి ఉష, సత్య తదితరులు ప్రసంగించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు హరీశ్‌రావు సహా మాజీ మంత్రులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు, తదితర నేతలు హాజరయ్యారు. -
తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్సే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్సేనని.. ప్రజా పోరాటంలో బీఆర్ఎస్ వెనక్కి తగ్గదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల సాధనకు బీఆర్ఎస్ ఒక్కటే మార్గమన్నారు. ‘‘తెలంగాణ అస్థిత్వం, పరిరక్షణే మాకు ముఖ్యం. ప్రజల అస్తిత్వం కోసం పనిచేయాలని సమావేశం నిర్ణయించింది. కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయింది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.విస్తృత స్థాయి సమావేశంలో 30 మంది వారి అభిప్రాయాలు చెప్పారు. తెలంగాణ ప్రజల పండుగగా బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించాలని కేసీఆర్ సూచించారు. ఏడాది పాటు సిల్వర్ జూబ్లీ వేడుకలు జరపాలని కేసీఆర్ నిర్ణయించారు. సిల్వర్ జూబ్లీ వేడుకలకు వారం రోజుల్లో కమిటీలు ప్రకటిస్తాం. అందరిని భాగ స్వామ్యం చేస్తూ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తాం.ఏప్రిల్ రెండో వారంలో ప్రతినిధుల సమావేశం ఉంటుంది. ఏప్రిల్ 27న బహిరంగ సభ నిర్వహిస్తాం. పార్టీ సభ్యత్వ సమోదు కార్య క్రమం. పార్టీ నేతలకు శిక్షణ తరగతులు చేపడతాం. త్వరలోనే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలతో పాటు అధ్యక్షలను ఎంపిక చేస్తాం. 2026 ఏప్రిల్ వరకు సిల్వర్ జూబ్లీ వేడుకలతో పాటు, ప్రజా పోరాటాలు చేస్తాం. రేవంత్ రెడ్డిని వాళ్ల కేబినెట్ మంత్రులే పట్టించుకోవడం లేదు. 42 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారో రేవంత్ చెప్పాలి’’ అని కేటీఆర్ నిలదీశారు. -
మరో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఇది పక్కా..
సాక్షి,హైదరాబాద్ : బీఆర్ఎస్ శ్రేణులు వాస్తవాలు మాట్లాడుతుంటే.. అవి జీర్ణించుకోలేని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.కేసీఆర్ అధ్యక్షతన బుధవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పార్టీ పని అయిపోయిందంటూ వ్యతిరేక ప్రచారం చేసిన బీఆర్ఎస్ నేతలపైన కేసీఆర్ మండిపడ్డారు.‘ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందగానే పార్టీ పని అయిపోందని మన పార్టీ నేతలే ప్రచారం చేశారు. అందుకే 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంతో పార్టీ మారారు. ఇలాంటి ప్రచారం చేయడం సరైంది కాదు. ఇది ఖండించ దగ్గ విషయం’ అని సీరియస్ టోన్‌తో అన్నారాయన. అయితే.. ఇప్పటికీ మించి పోయింది ఏమీ లేదని.. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ కోసం అంతా కష్టపడాలని సూచించారు.కేసీఆర్ చేసిన ఆ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ‘కేసీఆర్‌కు ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో రెండు హామీలను అమలు చేసాం. పంట బోనస్ , రైతు భరోసా పెంపు , 55 వేల ఉద్యోగాలు, డీఎస్సీ పోస్టింగులు ఇలా చెప్పుకుంటే పోతే అనేకం చేశాం. ఇంకా చేస్తాం. కేసీఆర్ వ్యాఖ్యల్లో అసహనం తప్ప మరొకటి కనబడటం లేదు. అధికారం దరిదాపుల్లో కనబడక పోవడంతోనే కేసీఆర్‌లో అసహనం ఎక్కువై ఇలా మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తారు... ఇది పక్కా. ఆర్థిక విధ్వంసం తర్వాత కూడా పాత పథకాలను ఒక్కటి కూడా రద్దు చేయకుండా ,మేము ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. కేంద్రం ఇంకా సహకరిస్తే.. మరింత అభివృద్ధి చేస్తాం. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కేసీఆర్ కలిసి రావాలి. తమిళనాడు తరహాలో రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని రాజకీయ పక్షాలు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీ వెళ్తాం. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ కలసి రావాల్సిందేనని డిమాండ్ చేశారు పొన్నం ప్రభాకర్.