breaking news
-
‘నేను బీఆర్ఎస్లోనే ఉన్నా’.. పోలీసుల్ని ఆశ్రయించిన ఎమ్మెల్యే
సాక్షి,హైదరాబాద్: తాను పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే ఉన్నానంటూ ఆ పార్టీ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (Bandla Krishnamohan Reddy) జోగులాంబ గద్వాల టౌన్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ నెల 11న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగులాంబ గద్వాల టౌన్ పోలీసులకు ఓ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో తాను పార్టీ మారానని, అనుమతి అనుమతి లేకుండా తన ఫోటోను కొందరు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలపై ఉపయోగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని, తన ప్రతిష్టకు భంగం కలిగేలా తన ఫొటోలతో ఫ్లెక్సీలు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
నిర్మాత కేదార్ మరణంపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,ఢిల్లీ : టాలీవుడ్ నిర్మాత కేదార్ సెలగంశెట్టి (Kedar Selagamsetty) మరణంపై సీఎం రేవంత్‌రెడ్డి (cm revanth reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబాయ్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిజినెస్ పార్ట్నర్ ఫ్రెండ్ కేదార్ చనిపోవడం వెనక మిస్టరీ ఏమిటి? అంటూ ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ దానిపైన ఎందుకు విచారణ కోరడం లేదు? రాడిసన్ కేసులో కేదార్ నిందితుడుగా ఉన్నారని రేవంత్ అన్నారు.‘‘కేసులతో సంబంధం ఉన్నవారు వరుసగా చనిపోవడం వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి? ముందు సంజీవరెడ్డి, తర్వాత రాజలింగం, ఇప్పుడు కేదార్.. వారి మరణాల వెనకాల మిస్టరీ ఉంది. దీనిపైన కేటీఆర్ ఎందుకు విచారణ కోరలేదు ఫిర్యాదులు వస్తే దర్యాప్తు చేస్తాం’’ అని రేవంత్ చెప్పారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన అధికారిక నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి .. ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జరిగిన మీడియా చిట్‌చాట్‌లో రేవంత్ మాట్లాడారు.ప్రధాని మోదీతో సీఎం రేవంత్ చర్చప్రధాని మోదీతో ఐదు అంశాలపై చర్చించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో తెలిపారు. ప్రధానంగా హైదరాబాద్ మెట్రో రైల్ పేజ్ 2 విస్తరణ, దక్షిణభాగానికి రీజినల్ రింగ్ రోడ్డు అనుమతి, రీజినల్ రింగ్ రైల్వే ఏర్పాటు, మూసి పునరుజ్జీవన ప్రాజెక్టుకు ఆర్ధిక సహాయం, మూసి గోదావరి లింకు కోసం ఆర్థిక సహాయం, రాష్ట్రంలో పెరిగిన పట్టణాలు, ఇతర అవసరాల దృష్ట్యా తెలంగాణకు అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని పీఎం మోదీని కోరినట్లు చెప్పారు. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరాఇక శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (slbc) సొరంగ మార్గంలో ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. సొరంగంలో గల్లంతైన ఎనిమిది మందిని కాపాడే చర్యలు గురించి ఆరా తీసినట్లు రేవంత్ చిట్‌చాట్‌లో చెప్పారు. 11 శాఖలు సమన్వయంతో రెస్క్ ఆపరేషన్స్ చేస్తున్నామని, సొరంగంలో గల్లంతైన ఎనిమిది మందిని కాపాడే చర్యలు కొనసాగిస్తూనే.. ప్రమాదానికి కారణాలేంటి, దీని నుంచి ఎలా బయటపడాలనే కోణంలో ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోందని బదులిచ్చామన్నారు. -
ప్రధాని మోదీతో రేవంత్ భేటీ.. మెట్రో, ఆర్ఆర్ఆర్పై చర్చ
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సమావేశం ముగిసింది. సుమారు గంటన్నర పాటుగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ సహా మంత్రి శ్రీధర్ బాబు, చీఫ్ సెక్రటరీ శాంత కుమారి, తెలంగాణ డీజీపీ జితేందర్ కూడా పాల్గొన్నారు. ప్రధాని మోదీతో సమావేశం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. మెట్రో ఫేజ్-2 లైన్ ఎయిర్పోర్ట్ పొడిగింపు, దానికి కావాల్సిన ఆర్థిక సహాయం అనుమతులు, మూసీ నది సుందరీకరణ నిధులు, కేంద్రం నుంచి వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు, తెలంగాణకు ఐటీఐఆర్, ఐఐఎం, రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులు, ఆర్థిక సహాయం గురించి చర్చించినట్టు తెలుస్తోంది. -
రేవంత్‌కు నిద్రలోనూ కేసీఆర్ గుర్తుకొస్తున్నారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నిద్రలో కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్తుకొస్తున్నారని, ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అవుతానని ఆయన కలలో కూడా ఊహించుకోలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఎద్దేవా చేశారు. 36 పర్యాయాలు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్.. కనీసం మంత్రివర్గ విస్తరణ చేసుకోలేకపోతున్నాడని, కీలక శాఖలకు మంత్రులను కూడా నియమించుకోలేని అసమర్థుడిగా మిగిలిపోయాడని అన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఆధ్వర్యంలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకుడు మల్కిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డితోపాటు పలువురు కార్యకర్తలు మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘48 గంటల్లో ఏడుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా సీఎం రేవంత్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు. ఎస్ఎల్బీసీ ప్రమాదంలో 8 మంది కారి్మకులు చిక్కుకున్నా ఢిల్లీ పర్యటనకు వెళ్లాడు. వ్యవసాయరంగంలో మోగుతున్న చావుడప్పునకు చేతకాని రేవంత్ రెడ్డి పాలనే ప్రధాన కారణం. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి’అని అన్నారు. కాళేశ్వరంపై విష బీజాలు ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ నేతలు తెలంగాణ ప్రజల మనసుల్లో విష బీజాలు నాటారు. సుంకిశాల రిటైనింగ్ వాల్, ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలినా, ఖమ్మం పెద్దవాగు బ్రిడ్జి కొట్టుకుపోయినా బీజేపీ నాయకులు మాట్లాడటం లేదు. రేవంత్ ప్రభుత్వానికి ప్రధాని మోదీ రక్షణ కవచంలా పనిచేస్తున్నారు. ఈ ప్రమాదాలపై జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ (ఎన్డీఎస్ఏ) ఎందుకు మౌనంగా ఉంది. తెలంగాణలో రాహుల్, రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని సాక్షాత్తు ప్రధాని ఆరోపించినా ఇప్పటిదాకా బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేసీఆర్‌ను నిత్యం విమర్శించే రేవంత్‌రెడ్డి బీజేపీపై చిన్న విమర్శ కూడా చేయడం లేదు. ఎమ్మెల్యే కడియం శ్రీహరికి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలి. 14 నెలల కాలంలో రూ.1.50లక్షల కోట్లు అప్పు చేసిన రేవంత్ ఢిల్లీకి పంపుతున్న మూటలతో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారు. త్వరలో సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బీఆర్ఎస్లో చేరతారు’అని కేటీఆర్ అన్నారు. ప్రమాదంపై జ్యుడీషియల్ కమిషన్ ఎస్ఎల్బీసీ ప్రమాదంలో జ్యుడీషియల్ కమిషన్ వేయాలని కేటీఆర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ‘ప్రమాద ఘటనకు బాధ్యులైన వారిపై విచారణ జరపాలి. ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదంతో ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం జరిగింది. ఈ ప్రమాదాలపై హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రభుత్వం న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. ఆర్మీ, ఇతర సంస్థల సహాయంతో సొరంగంలో చిక్కుకున్న వారిని వెంటనే వెనక్కి తీసుకువచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి’అని కేటీఆర్ చెప్పారు. -
భారత్, పాక్ మ్యాచ్‌తో ఏం సంబంధం?
కరీంనగర్ కార్పొరేషన్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు, దుబాయిలో జరిగిన భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌కు సంబంధం ఏమిటని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రశ్నించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ దిగజారుడు రాజకీయం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌పై భారత్ విజయం సాధిస్తే ప్రతి భారతీయుడు సంతోషపడ్డాడని, కానీ అదేదో బీజేపీయే మ్యాచ్‌ను గెలిపించినట్లు దానికీ, ఎమ్మెల్సీ ఎన్నికలకు ముడిపెట్టడం సిగ్గుచేటన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆయన మాట్లాడారు.ఎన్నిక ఏదైనా హిందూ.. ముస్లిం, భారత్..పాకిస్తాన్ ముచ్చట తీయకుండా బీజేపీ ఓటడగదని విమర్శించారు. 2014లో శ్రీరాముడి పేరిట అధికారంలోకి వచి్చన బీజేపీ చేసిందేమీ లేదని, తర్వాత రెండుసార్లు దేవుడి పేరునే వాడుకుందని ధ్వజమెత్తారు. బీజేపీకి లాభం చేసేందుకే బీఆర్ఎస్ పోటీలో లేదన్నారు. బీసీలను అణగదొక్కే బీజేపీ ఒక వైపు, రెడ్డి సీఎంగా ఉన్నా బీసీలకు న్యాయం చేసే కాంగ్రెస్ మరోవైపు ఉన్నాయని, పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. సంజయ్‌ది అవగాహనా రాహిత్యం దేశంలో అన్ని ధరలు పెరిగాయని, పేదలకు మోదీ ప్రభుత్వం ఏం న్యాయం చేసిందో సంజయ్ చెప్పాలన్నారు. ఈ ఫార్ములా రేసు కేసులో ఒక పక్క విచారణ జరుగుతుంటే, కేటీఆర్‌కు నోటీసు కూడా ఇవ్వలేదని అనడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్‌పై ఎందుకు సీబీఐ విచారణ జరిపించకూడదని ప్రశ్నించారు. సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనని 3.1 శాతం కుటుంబాలు కూడా వివరాలు నమోదు చేసుకోవాలని, 28వ తేదీ వరకు కేసీఆర్, హరీశ్‌లాంటి వారికి కూడా అవకాశం ఇచ్చామని చెప్పారు. -
మాది భారత్.. కాంగ్రెస్‌ది పాక్ టీం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘బీజేపీ భారత జట్టు.. ఎంఐఎంతో అంటకాగే కాంగ్రెస్ పాకిస్తాన్ జట్టు. ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండియా గెలవాలనుకుంటే బీజేపీకి ఓటెయ్యాలి. పాకిస్తాన్ గెలవాలనుకుంటే కాంగ్రెస్‌కు ఓటెయ్యాలి. బీసీ కులగణనకు మేం వ్యతిరేకం కాదు. కానీ అందులో ముస్లింలను చేర్చడాన్ని అంగీకరించం. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటే. అందుకే ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోళ్లు, ఫార్ములా–ఈ రేసు కేసుల్లో అవినీతి జరిగిందని చెబుతున్నా.. సీఎం కనీసం వారికి నోటీసులైనా ఇచ్చే సాహసం చేయడం లేదు..’అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. మంగళవారం కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్‌పై దమ్ముంటే సీబీఐ విచారణ కోరండి ⇒ ‘దూదేకుల కులాలకు రిజర్వేషన్లను మేం ఏనాడూ అభ్యంతర పెట్టలేదు. కానీ ముస్లింలందరినీ బీసీల్లో చేర్చి బిల్లు పంపితే ఎందుకు ఆమోదించాలి? 60 లక్షల మంది బీసీల జనాభా ఎట్లా తగ్గిందో సమాధానం చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టులో పిటిషన్ వేసి సీబీఐ విచారణ జరిపించాలని కోరితే అడ్వకేట్ జనరల్ ఒప్పుకోని విషయం నిజం కాదా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రభాకర్‌రావు, శ్రవణ్ విదేశాలకు పారిపోయారు. మీరు విదేశాలకు పంపిస్తే..మేం పట్టుకురావాలా? మేం లిక్కర్ కేసులో కవితను జైల్లో వేశాం. ట్యాపింగ్ కేసులో మీకు దమ్ముంటే సీబీఐ విచారణ కోరండి. దోషులందరినీ అరెస్టు చేసి బొక్కలో వేస్తాం..’అని సంజయ్ అన్నారు. బీసీ సమాజాన్ని సీఎం అవమానించాడు ⇒ ‘పేదరికం ఆధారంగా రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇస్తుంది.. ఆదాయాన్ని బట్టి కాదు. యూపీఏ పదేళ్ల పాలనలో 2.94 కోట్ల ఉద్యోగాలిస్తే, పదేళ్లలో మోదీ 17.19 కోట్ల కొలువులిచ్చారు. తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం పాత్రపై చర్చకు సిద్ధమా అని సవాలు విసిరితే, తోకముడిచి పారిపోయారు. ప్రధాని మోదీని పెద్ద బీసీ, నన్ను చిన్న బీసీ అంటూ సీఎం బీసీ సమాజాన్ని అవమానించాడు. కాంగ్రెస్ అగ్రనేత అల్లుడి కోసం రూ.15 వేల కోట్ల ఖర్చయ్యే మూసీ ప్రక్షాళనను రూ.1.5 లక్షల కోట్లకు పెంచి కమీషన్లు దొబ్బాలనుకుంటే కేంద్రం ఎందుకు సహకరించాలి?..’అని కేంద్రమంత్రి ప్రశ్నించారు. ఓడిపోతే ముక్కు నేలకు రాస్తారా? ఆరు గ్యారంటీలు సహా మేనిఫెస్టో హామీలన్నీ అమలు చేశారని భావిస్తే కాంగ్రెస్ పార్టీకే ఓటెయ్యాలని, సమస్యలపై నిరంతరం పోరాడుతూ సర్కార్ మెడలు వంచేది బీజేపీ అనుకుంటే తమకు మద్దతివ్వాలని సంజయ్ కోరారు. ‘కాంగ్రెస్ పాలన బాగుందనుకుంటే మీ 14 నెలల పాలనపై ఎమ్మెల్సీ ఎన్నికలను రెఫరెండంగా తీసుకుందామా? కాంగ్రెస్ ఓడిపోతే ముక్కు నేలకు రాసి సీఎం పదవి నుంచి తప్పుకుంటారా?..’అని నిలదీశారు. దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. -
కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి ఉంటే కాంగ్రెస్ సగం ఖాళీ అయ్యేది
సాక్షి, హైదరాబాద్: తమ నాయకుడు కేసీఆర్ అంగీకరించి ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి సగం మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయేవారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 36 పర్యాయాలు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రాష్ట్రానికి సాధించిందేమీ లేదని, ప్రైవేటు కార్లలో ఒంటరిగా వెళ్లి అక్కడ ఎవరితో భేటీ అవుతున్నారో చెప్పాలన్నారు. హరీశ్‌రావు మంగళవారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడారు. ‘మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు కోసం కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి చేత రూ.90 కోట్లు ఖర్చు పెట్టించి ఆ పార్టీ ఎమ్మెల్యేలు డబ్బులు నొక్కేశారని ప్రణాళిక సంఘం అధ్యక్షుడు, కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి చెప్పారు. ప్రతీ చిన్న విషయానికి స్పందించే సీబీఐ, ఈడీ, ఐటీ విభాగాలు దీనిపై ఎందుకు విచారణ జరపడం లేదు. కాంగ్రెస్, బీజేపీ నడుమ బంధానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి.ఎల్ఆర్ఎస్ను పేదల రక్తం తాగే స్కీమ్‌గా ప్రతిపక్షంలో ఉన్నపుడు జనాలను రెచ్చగొట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీతక్క, ఎమ్మెల్సీ కోదండరాం గొంతు ఎందుకు మూగబోయింది. ఎల్ఆర్ఎస్ వసూళ్ల కోసం ౖఆషాడం సేల్, దీపావళి బొనాంజా మాదిరిగా డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు.డిస్కౌంట్ల పేరిట మోసం చేస్తున్న రేవంత్ జనం దృష్టిలో ‘మిస్ కౌంట్’గా మిగిలిపోతారు. ఢిల్లీ కాంగ్రెస్‌ను సాకేందుకు గల్లీ కాంగ్రెస్ ప్రజలను బాదుతోంది. ఢిల్లీకి ఎప్పటికప్పుడు కప్పం కట్టించేందుకు కాంగ్రెస్ కొత్త వైస్రాయ్ను నియమించింది’ అని హరీశ్‌రావు చెప్పారు.హౌస్ అరెస్టులు చేయకుండా చూడాల్సిన బాధ్యత ‘పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కిలోమీటర్ సొరంగం కూడా తవ్వలేదని మంత్రి ఉత్తమ్ అబద్ధాలు చెప్తున్నాడు. అనేక సాంకేతిక సమస్యలు ఎదురైనా 12 కిలోమీటర్లు తవ్వడంతో పాటు డిండి, పెండ్లిమర్రి రిజర్వాయర్ పనులు 90శాతం మేర పూర్తి చేశాం. గురువారం మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ నేతలతో కలిసి ఎస్ఎల్బీసీని సందర్శిస్తాం. పోలీ సులు హౌస్ అరెస్టులు చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీయేతర అభ్య ర్థుల్లో మంచి వారిని చూసి ఎన్నుకోవాలని పిలుపునిస్తున్నాం. వానాకాలం రైతుబంధు, రెండు లక్షల ఉద్యోగాలు, కళ్యాణలక్ష్మి లో తులం బంగారం, నిరుద్యోగ భృతి, పీఆర్సీ, డీఏ పెండింగ్ బకాయిలు వచ్చాయని భావిస్తేనే కాంగ్రెస్‌కు ఓటేయండి లేదంటే ఆ పార్టీ అభ్యర్థులను ఓడించండి. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండిచేయి చూపి, మెడికల్ కాలేజీల స్థాపనలో అన్యా యం చేసిన బీజేపీని ఓడించాలి’ అని హరీశ్‌రావు చెప్పారు. -
‘అప్పుడు సీబీఐ దర్యాప్తు అంటూ హోరెత్తించారు.. ఇప్పుడు ఆ ఊసే లేదే’
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అవగాహన లేకుండా మాట్లాడి ప్రతిష్ట దెబ్బతీస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి రాకముందు చాలా అంశాలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేసిన రేవంత్.. అధికారంలోకి వచ్చాక సీబీఐ డిమాండ్ అనే మాటే ఎత్తడం లేదన్నారు. అధికారంలోకి రాగానే ఆయన వైఖరి మారిందన్నారు కిషన్ రెడ్డి. అప్పుడు సీబీఐ దర్యాప్తు అంటూ హోరిత్తించారు.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు.‘బీజేపీ నేతలు, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. సినిమా నటులు, జడ్జీలు, మీడియా ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. సీబీఐ దర్యాప్తు చేస్తే మేం నిగ్గు తేలుస్తాం. మూసీ ప్రక్షాళనకు మేం ఎక్కడ అడ్డుకుంటున్నాం. మూసీ ప్రక్షాళన కు మేం వ్యతిరేకం కాదురేవంత్ మెట్రో నిర్మాణం చేస్తే మేం ఎందుకు అడ్డుకుంటాం. లేనిపోని ఆరోపణలు చేసి దిగజారి రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వద్ద మార్కులు వూయించుకోవడానికి కేంద్ర మంత్రులను, మోదీని తిడుతున్నారు. రీజినల్ రింగ్ రోడ్డు ను తెలంగాణకు అదనంగా తెచ్చింది మేమే. రాజకీయాలకు అతీతంగా కృష్ణా జలాల తరలింపును అడ్డుకోవాలి’ అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. -
బండి సంజయ్ పై కాంగ్రెస్ ఫిర్యాదు
హైదరాబాద్: ‘ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటు వేయండి.. పాకిస్తాన్ గెలవాలంటే కాంగ్రెస్‌కు ఓటేయ్యండి’ అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘాని(సీఈసీ)కి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్. ఈ మేరకు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఫిర్యాదులో జత చేసింది కాంగ్రెస్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వాతావరణాన్ని చెడగొట్టే విధంగా బండి సంజయ్ కామెంట్స్ ఉన్నాయని పేర్కొంది. కాంగ్రెస్ ను పాకిస్తాన్ పోలుస్తూ కామెంట్స్ చేయడాన్ని ప్రధానంగా పేర్కొంది. బండి సంజయ్ పై , బీజేపీపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది కాంగ్రెస్. కాగా, ఈరోజు(మంగళవారం) కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్ని ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ గా అభివర్ణించారు బండి సంజయ్, ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటేయ్యాలని, పాకిస్తాన్ గెలవాలంటే కాంగ్రెస్ కు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఇంకా బండి సంజయ్ ఏమన్నారంటే.. బీఆర్ఎస్ కులగణనకు అనుకూలం. బీఆర్ఎస్ 51 శాతం బీసీ జనాభా, కాంగ్రెస్ చేస్తే 46 శాతం లెక్క.. ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు..?. 12 శాతం ముస్లిం జనాభాకు, 10 శాతం రిజర్వేషన్ ఇస్తే.. 80 శాతం లాభం వారికే జరుగుతుంది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్, కారు రేస్ కేసుల్లో సీబీఐ విచారణ ఎందుకు కోరట్లేదు. సీబీఐ విచారణ కోరండి, మేము అరెస్టు చేస్తాం. ప్రభాకర్ రావు పారిపోయేందుకు సహకరించింది కాంగ్రెస్ పార్టీనే. కారు రేస్‌లో కేటీఆర్ హస్తం ఉందని కేబినెట్ మంత్రులు అన్నారు. మరి కేటీఆర్ కు ఎందుకు నోటీసు ఎందుకు ఇస్తలేరు?’’ అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు అక్రమాలు విచారణ ఎందుకు బయట పెట్టడం లేదు..?. కేసీఆర్‌కు నోటీసు ఇచ్చే ధైర్యం కాంగ్రెస్‌కు లేదు. జన్వాడ ఫార్మ్ హౌస్ ఎందుకు కూల్చట్లేదు?. సీఎం రేవంత్ అరెస్టు అయింది.. జైల్లో ఉంది.. జన్వాడ కేసులోనే.. బీఅర్ఎస్, కాంగ్రెస్‌ది చీకటి ఒప్పందం. 15 వేల కోట్ల రూపాయలే మూసీ ప్రక్షాళన అంచనా. రాబర్ట్ వాద్రా కళ్లలో ఆనందం కోసమే రేవంత్ రెడ్డి తాపత్రయం. అధి నాయకురాలు అల్లుడి ఆనందం కోసం మూసీ ప్రక్షాళన అంచనా లక్ష కోట్లకు పెంచింది సీఎం రేవంతే. నోటిఫికేషన్ ఇచ్చింది కేవలం 20 వేల ఉద్యోగాల కోసమైతే.. 51 వేల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు ఎలా చెబుతున్నారు..?’’ అని బండి సంజయ్ నిలదీశారు. -
పాక్ గెలవాలంటే కాంగ్రెస్‌కు ఓటేయ్యండి: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్ జిల్లా: ‘ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటు వేయండి.. పాకిస్తాన్ గెలవాలంటే కాంగ్రెస్‌కు ఓటేయ్యండి’ అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ గెలిచి నిరుద్యోగ, ఉద్యోగ సమస్యలు తీర్చుతున్నాం. అల్ఫోర్స్ వార్షికోత్సవ సభలాగా నిన్నటి సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ ఉంది’’ అంటూ ఎద్దేవా చేశారు.‘‘బీఆర్ఎస్ కులగణనకు అనుకూలం. బీఆర్ఎస్ 51 శాతం బీసీ జనాభా, కాంగ్రెస్ చేస్తే 46 శాతం లెక్క.. ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు..?. 12 శాతం ముస్లిం జనాభాకు, 10 శాతం రిజర్వేషన్ ఇస్తే.. 80 శాతం లాభం వారికే జరుగుతుంది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్, కారు రేస్ కేసుల్లో సీబీఐ విచారణ ఎందుకు కోరట్లేదు. సీబీఐ విచారణ కోరండి, మేము అరెస్టు చేస్తాం. ప్రభాకర్ రావు పారిపోయేందుకు సహకరించింది కాంగ్రెస్ పార్టీనే. కారు రేస్‌లో కేటీఆర్ హస్తం ఉందని కేబినెట్ మంత్రులు అన్నారు. మరి కేటీఆర్ కు ఎందుకు నోటీసు ఎందుకు ఇస్తలేరు?’’ అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు అక్రమాలు విచారణ ఎందుకు బయట పెట్టడం లేదు..?. కేసీఆర్‌కు నోటీసు ఇచ్చే ధైర్యం కాంగ్రెస్‌కు లేదు. జన్వాడ ఫార్మ్ హౌస్ ఎందుకు కూల్చట్లేదు?. సీఎం రేవంత్ అరెస్టు అయింది.. జైల్లో ఉంది.. జన్వాడ కేసులోనే.. బీఅర్ఎస్, కాంగ్రెస్‌ది చీకటి ఒప్పందం. 15 వేల కోట్ల రూపాయలే మూసీ ప్రక్షాళన అంచనా. రాబర్ట్ వాద్రా కళ్లలో ఆనందం కోసమే రేవంత్ రెడ్డి తాపత్రయం. అధి నాయకురాలు అల్లుడి ఆనందం కోసం మూసీ ప్రక్షాళన అంచనా లక్ష కోట్లకు పెంచింది సీఎం రేవంతే. నోటిఫికేషన్ ఇచ్చింది కేవలం 20 వేల ఉద్యోగాల కోసమైతే.. 51 వేల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు ఎలా చెబుతున్నారు..?’’ అని బండి సంజయ్ నిలదీశారు. -
రీజనబుల్ టైం అంటే మూడు నెలలే..! సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ వాదన
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల(Telangana Defected MLAs) వ్యవహారంపై సుప్రీం కోర్టు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన తమ పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ పార్టీ వేర్వేరుగా రెండు పిటిషన్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా.. రీజనబుల్ టైం అంటే ఎంతో కచ్చితంగా చెప్పాలంటూ తెలంగాణ స్పీకర్‌ను కోరింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యల కోసం రీజనబుల్ టైం కోసం స్పీకర్ ఎదురు చూస్తున్నారని అసెంబ్లీ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి మరోసారి సుప్రీం కోర్టుకు తెలిపారు. అయితే.. సుప్రీంకోర్టు గత తీర్పుల ప్రకారం రీజనబుల్ టైమ్ అంటే మూడు నెలలు మాత్రమేనని బీఆర్ఎస్ వాదించింది. ఈ నేపథ్యంలో ఆ రీజనబుల్ టైం ఎంతో చెప్పాలంటూ కోర్టు తెలంగాణ స్పీకర్‌ను ప్రశ్నిస్తూ.. విచారణ వాయిదా వేసింది. మార్చి 4వ తేదీన బీఆర్ఎస్ పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం మరోసారి విచారించనుంది.ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు సహా 10 మంది విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయడం లేదంటూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్ వేశారు. అలాగే.. ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అమలు చేయడం లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లను కలిపి ద్విసభ్య ధర్మాసనం విచారిస్తోంది.ఆ పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా తెలంగాణ స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ సుప్రీం కోర్టును అభ్యర్థిస్తోంది. ఈ క్రమంలో గత వాదనల్లో.. తెలంగాణ స్పీకర్(Telangana Speaker) తీరుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తగిన సమయం.. సరైన సమయం.. అంటూ స్పీకర్ చెబుతూ కాలయాపన చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర తరహాలో ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసేదాకా ఆగుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్లపై పూర్తి వాదనలు విన్నాకే ‘ఆ సరైన సమయం’పై తామే ఓ నిర్ణయం తీసుకుంటామని, అవసరమైతే స్పీకర్‌కు సూచనలు చేయడానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడనుందా అనే ఆసక్తి నెలకొంది.నిబంధనల ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారని గత విచారణలో అసెంబ్లీ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు. అయితే సుప్రీం కోర్టు జోక్యం తర్వాతే స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయ్యాయని బీఆర్ఎస్ అంటోంది. -
కోహ్లీకి దీటుగా కేసీఆర్ రికార్టు
సాక్షి, హైదరాబాద్: వన్డేల్లో 14 వేల పరుగులు సాధించి విరాట్ కోహ్లి రికార్డు సృష్టిస్తే, 14 నెలలుగా అసెంబ్లీకి రాకుండా మాజీ సీఎం కేసీఆర్ కూడా రికార్డు సృష్టించారని దేవాదాయ, అటవీ శాఖమంత్రి కొండా సురేఖ ఎద్దేవా చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించడం హర్షణీయం. ఈ విజయాన్ని అందరం టీవీల్లో చూసి సంబురపడ్డాం. క్రికెట్లో అది విరాట్ కోహ్లి పర్వం అయితే, ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడం దేశ రాజకీయ చరిత్రలో పెద్ద రికార్డే కదా? ఇది కేసీఆర్ విరాట పర్వం’ అని ఆ ప్రకటనలో సురేఖ వెల్లడించారు. ఆధార్ లేకుంటే వైద్యానికి నిరాకరిస్తున్నారా?సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఆధార్ లేకుంటే వైద్యానికి నిరాకరిస్తున్నారా? అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వివరాలు తెలుసుకొని చెప్పాలని స్పెషల్ జీపీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఓయూలో ఆధార్ లేకుంటే వైద్యం చేయట్లేదంటూ న్యాయవాది బైరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ రేణక యారా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఆకాశ్ బాగ్లేకర్ వాదిస్తూ ప్రభుత్వాస్పత్రిలో వైద్యానికి ఆధార్ తప్పనిసరి అనడం చట్టవిరుద్ధమన్నారు. ఆధార్ అడగకుండా వైద్యం అందించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కాగా, ఆధార్ లేకున్నా వైద్యం అందిస్తున్నామని స్పెషల్ జీపీ రాహుల్ పేర్కొన్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. అప్పుడు ఆ కేసు ఎలా ముందుకెళ్లదో తామూ చూస్తామని సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్‌పై చర్యలు తీసుకోని అసమర్థుడు రేవంత్ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన అసమర్థతను బీజేపీపైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, తాము ఎక్కడ కుమ్మక్కు అయ్యామో నిరూపించాలన్నారు. ఈ కేసును రేవంత్ వదిలిపెట్టినా.. బీజేపీ వదిలిపెట్టదని స్పష్టం చేశారు. సోమవారం రాత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీగా హైకోర్టులో కేసు వేయడమే కాకుండా, ఈ కేసును సీబీఐకు అప్పగించాలని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నారు. అయితే బీఆర్ఎస్తో రేవంత్ కుమ్మక్కై ఈ కేసును నిర్వీర్యం చేశారని ఆరోపించారు. రేవంత్ మాటల్లో ఓటమి భయం కనిపిస్తోంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మూడుచోట్లా గెలిచే అవకాశాలుండగా, పోటీచేసిన ఆ ఒక్కసీటులోనూ ఓటమి భయంతో ఒత్తిడికి గురై రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి వచ్చారన్నారు. ‘రేవంత్ ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఆయన మాటల్లో ఓటమి భయం కనిపిస్తోంది.పోలింగ్‌కు ముందే సీఎం ఓటమిని ఒప్పుకున్నారు. రిటైరైన ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల, నిరుద్యోగులకు ఏం చేశారో రేవంత్‌రెడ్డి చెప్పాలి’అని నిలదీశారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అనుకూలమే బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అనుకూలమని, ఎక్కడా తాము ఈ రిజర్వేషన్లను వ్యతిరేకించలేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘ముస్లింలను బీసీల్లో చేర్చడం బరాబర్ తప్పే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీ కోటాలో అధికమంది కార్పోరేటర్లుగా ముస్లింలు వచ్చే అవకాశం ఉంది. దీంతో బీసీలకు అన్యాయం జరుగుతుంది. నాకు నైతిక విలువలున్నాయి. రేవంత్ మాదిరిగా పార్టీలు మారలేదు. గంటకో మాట మాట్లాడలేదు. దయ్యం అని పిలిచిన సోనియాను దేవత అని పొగడలేదు’అని ఓ ప్రశ్నకు కిషన్‌రెడ్డి సమాధానమిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి హెచ్చరించారు. డీఏలు, జీపీఎఫ్, పెండింగ్ బకాయిలు చెల్లించకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను రోడ్డున పడేస్తారా అని నిలదీశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి సోమవారం కిషన్‌రెడ్డి బహిరంగలేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులను మళ్లీ మోసగించేందుకు సిద్ధమవ్వడం సిగ్గుచేటని కిషన్‌రెడ్డి విమర్శించారు. -
బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదు.. బీజేపీని బొంద పెట్టాలి
సాక్షి ప్రతినిధులు నిజామాబాద్/కరీంనగర్/మంచిర్యాల: ‘లోక్‌సభ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్ధిని నిలబెట్టలేని బీఆర్ఎస్ రాష్ట్రంలో ఉప ఎన్నికలొస్తే గెలుస్తుందట. అధికారంలో ఉన్న పదేళ్లలో చాలామంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడంతో పాటు కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితకు, టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్‌కు మంత్రి పదవులిచ్చినప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయి? బీఆర్ఎస్ది గతమే.. భవిష్యత్తు లేదు. పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీని బొంద పెడితేనే.. తెలంగాణ ప్రాజెక్టులకు నిధులు వస్తాయి. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ అభ్యర్ధిని ఓడించండంటున్న పట్టభద్రులైన కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత తాము ఎవరికి ఓటేస్తరో పట్టభద్రులకు సమాధానం చెప్పాలి..’ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. సోమవారం నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల నస్పూర్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం, సంకల్ప సభల్లో ఆయన మాట్లాడారు. కేటీఆర్ బీజేపీ నేతల కాళ్లు పట్టుకుంటున్నారు.. ‘బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో నిధుల కోసం ఢిల్లీ వెళ్లకుండా.. కేటీఆర్ ఇప్పుడు ఢిల్లీ వెళ్లి చీకట్లో బీజేపీ నేతల కాళ్లు పట్టుకుంటున్నారు. నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లాలంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న మాతో కలిసి రావాలి. కానీ చీకటి బేరాలు కుదుర్చుకునేందుకు ఢిల్లీ వెళుతున్నారు. బీఆర్ఎస్ బీజేపీలు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయి. అందుకే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధిని పెట్టలేదు. బండి సంజయ్ ద్వారా బేరాలు కుదుర్చుకున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్కు అభ్యర్థి లేకున్నా ఓడించాలంటున్నారంటే, దాని వెనుక మతలబు ఏంటో చెప్పాలి. బీజేపీతో చీకటి ఒప్పందంలో భాగంగా.. అరెస్టుల నుంచి తప్పించుకోవడానికే బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పకుందని ప్రజలు గమనించాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులను అమెరికాలో దాచిపెట్టారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ వారిని ఎప్పుడు అరెస్టు చేస్తారో చెప్పాలి. ఫార్ములా ఈ రేస్, గొర్రెల స్కామ్ కాగితాలను ఈడీ పట్టుకుపోయింది. కేటీఆర్, హరీశ్‌రావు ఢిల్లీ వెళ్లి కాళ్లు పట్టుకోగానే బండి సంజయ్ కేసులు నీరు గారుస్తున్నారు..’ అని సీఎం మండిపడ్డారు. కుల గణన సర్వే మోదీ ఎందుకు చేయలేదు? ‘కులగణనపై బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ భావోద్వేగాలు రెచ్చగొట్టేలా వీధినాటకాలు అడుతున్నారు. అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం ఉపకులాలకు రిజర్వేషన్లు అమలవుతున్న మాట వాస్తవం కాదా? బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేని బీజేపీవి చావు తెలివితేటలు. మతం పేరుతో ప్రతిసారీ విద్వేషాలు రెచ్చగొడితే ఎవరూ నమ్మరు. కులగణన సర్వేను మోదీ ప్రభుత్వం ఎందుకు చేయలేదు? చేయకపోగా ఇప్పుడు వండిన అన్నంలో ఉప్పు వేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది. బలహీనవర్గాలకు అన్యాయం చేయాలని చూస్తోంది. మేము వందేళ్ల సమస్యను పరిష్కరించాం. మంద కృష్ణమాదిగను కౌగిలించుకున్న మోదీ సమస్య పరిష్కరించలేదు. మా ప్రభుత్వమే ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేసింది. 100 ఏళ్ల కింద తెల్లోళ్లు చేసిన తరువాత నేను కులగణన చేసి లెక్క తేల్చిన ఘనత నాది. నా లెక్కలు తప్పయితే మేమంతా ముక్కు భూమికి రాస్తాం. బీజేపీకి దమ్ముంటే..జనగణనలో కులగణనలో చేయాలి..’ అని రేవంత్ సవాల్ విసిరారు. తెలంగాణకు శకునిలా కిషన్‌రెడ్డి ‘కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణకు శకునిలా మారాడు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, రీజినల్ రింగ్ రోడ్డు ఇతర ప్రాజెక్టులకు నిధులు రాకుండా అడ్డుకుంటున్నాడు. కాశీలో గంగ, ఢిల్లీలో యమున, గుజరాత్లో సబర్మతి నదులను ప్రక్షాళన చేస్తున్న బీజేపీ హైదరాబాద్‌లో మూసీ ప్రక్షాళనకు మాత్రం అడ్డుపడుతోంది..’ అని ముఖ్యమంత్రి విమర్శించారు. మేము చేసిన మంచిని చూసి ఓటేయండి ‘పదేళ్లు కేసీఆర్, 12 ఏళ్లు మోదీ చేయలేని పనిని మేం చేశాం. ఏడాదిలో 56 వేల కొలువులు ఇచ్చాం. రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం. టీచర్లకు పదోన్నతులు, బదిలీలు చేపట్టాం. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలతో బాధలు దూరం చేశాం. యువతలో నైపుణ్యం పెంచాలన్న సంకల్పంతో ఐటీఐలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేసి వేలాది మందికి శిక్షణ ఇస్తున్నాం. స్కిల్స్ వర్సిటీ ప్రారంభించాం. వరికి రూ.500 బోనస్, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఉచిత సిలిండర్ ఇస్తున్నాం. మేము చెప్పేవి అబద్ధాలైతే మాకు ఓటేయొద్దు. భావోద్వేగాలకు, అబద్ధాలకు ఆవేశపడి నిర్ణయం తీసుకోవద్దు. మేము చేసిన మంచిని చూసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా అభ్యర్థి నరేందర్‌రెడ్డిని గెలిపించండి..’ అని రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశాల్లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, డాక్టర్ భూపతిరెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం వినోద్, గడ్డం వివేక్, వెడ్మ బొజ్జు, శ్రీగణేశ్, గండ్ర సత్యనారాయణరావు, అభ్యర్థి నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘సూటిగా కేసీఆర్‌ను అడుగుతున్నా మీ ఓట్లెవ్వరికని..?’
కరీంనగర్ జిల్లా: కరీంనగర్ సభను సక్సెస్ చేసి కరీంనగర్ కాంగ్రెస్ కు కంచుకోట అని నిరూపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు. ‘కరీంనగర్ జిల్లాకు దేశంలోనే ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోనే మూడో ఆర్థికశక్తిగా ఎదగడానికి ఘనత వహించిన పీవీ ఇక్కడివారు. అలాంటివారెందరికో కరీంనగర్ వేదిక. కరీంనగర్ చైతన్యవంతమైన వేదిక ఆనాడు ఆరు పార్లమెంట్, 42 అసెంబ్లీ స్థానాల్లో కేవలం మంథని, సంగారెడ్డిల్లో మాత్రమే మనకు శాసనసభ్యులుండె. అయినా, జీవన్ రెడ్డిని పట్టభద్రులు గెలిపించారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించాలని బీఆర్ఎస్ కోరుతుంది కదా మరి ఎవరిని వాళ్ళు గెలిపించాలని కోరుతున్నారో సమాధానం చెప్పాలి. సూటిగా కేసీఆర్ ను అడుగుతున్నా మీ ఓట్లెవ్వరికని..?, ఢిల్లీ కాళ్ళ ముందు బీఆర్ఎస్ నాయకులు సాగిలపడ్డారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేని బీఅర్ఎస్ ఉప ఎన్నికలు వేస్తే గెలుస్తామంటోంది. మీ నీతేంది, జాతేందని అడుగుతున్నా . ఈ 14 నెలల్లో మేం టీచర్స్ బదిలీలు, గ్రాడ్యుయేట్స్ కు ఉద్యోగాలు కల్పించకపోతే మాకు ఓటు వేయకండని నేనే చెబుతున్నా. పదకొండు వేల మంది ఉపాధ్యాయులకు ఓట్లెయకుంటే మీరు ఓటెయ్యొద్దని చెబుతున్నా . కేసీఆర్ జీతాలు కూడా ఇవ్వకుండా అడుక్కునేలా చేశాడు ఇవాళ మీ జీతాలు సమయానికి వేస్తున్నాం కదా ఆలోచించి ఓటేయండని కోరుతున్నా. ఐటీఐలను టాటాలతో కలిసి ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేశాం. క్రీడాకారులను ప్రోత్సహించేందుకే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొచ్చాం. 60 ఎకరాల్లో 600 కోట్ల కార్పస్ ఫండ్ తో నాణ్యమైన విద్య కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీసుకొచ్చాం . ఇవన్నీ విప్లవాత్మక నిర్ణయాలు . ఇవన్నీ చూసి ఆలోచించి మాకు ఓటేయండి. నిఖిత్ జరీన్, సిరాజ్ వంటివారిని ప్రోత్సహిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా..?, బీఆర్ఎస్ సీటును గుంజుకున్నామనే బీఆర్ఎస్ అక్కసు. బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయి. ప్రభుత్వానికి తెల్వకుండా ఢిల్లీలో కేటీఆర్, హరీష్ రావు నిధులడుగుతున్నామని చెప్పడమేంటి..?, బీఆర్ఎస్ రైతుబంధులో ఇచ్చిన దానికంటే తాలుతప్ప పేరిట ధాన్యం కోత పెట్టి పంచుకుందెక్కువ. పదేళ్లలో నువ్వు చేసిన దుర్మార్గాలు, 12 ఏళ్ల మోడీ నిర్లక్ష్యం పక్కనబెట్టి మమ్మల్ని ఓడగొట్టాలా?, సందెట్లో సడేమియా అన్నట్టు సంజయ్ బయల్దేరిండు. మా పొన్నం తెలంగాణా కోసం కొట్లాడిండు. ఈ సంజయ్ ఏం తెచ్చిండు..? చిల్లిగవ్వ తేలే.ఏం తేలేకపోయినా పర్లేదు.. పెద్ద బీసీ మోదీ, చిన్న బీసీ సంజయ్ బీసీ లెక్కలైనా తేల్చారా కనీసం?, కేసీఆర్ లెక్కలు నమ్మి కిషన్ రెడ్డి, బండి సంజయ్ అవే చిలుకపలుకులు పలుకుతున్నారు 1979లోనే మండల్ కమిషన్ 29 ముస్లింలలోని తెగలను బీసీల్లో కలిపింది. బండికి అవగాహన లేకుంటే వారి అధికారులను కనుక్కోవాలని చెబుతున్నా. మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీల్లో ముస్లింలను చేర్చలేదా.. మోదీ ఆ విషయాలు చెప్పలేదా..?, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వి చావు తెలివితేటలు. మతం పేరిట రెచ్చగొడితే రెచ్చిపోయే సమాజం కాదు తెలంగాణా. బండి సంజయ్ ని ఓర్వలేక అధ్యక్షుడి సీటు గుంజుకుండు. బండారు దత్తాత్రేయను పక్కకు జరిపి తాను సీటెక్కిండు. నేను పీసీసీ ప్రెసిడెంట్ గా పక్కకు జరిగి ఓ బీసీ అయిన మహేష్ గౌడ్ కు సీటు అప్పజెప్పినా. మోదీ కౌగిలిలో మందకృష్ణ నలిగిపోయిండు. ఈ ఎమ్మెల్సీ సీటు పోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయేదేముండదు. కానీ, దీనివెనుక బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర ఉంది’ అని రేవంత్ మండిపడ్డారు. -
సొంత పార్టీ నేతలపై అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : సొంత పార్టీ నేతలపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘గెలిచే టైంలో నాకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు. దానం నాగేందర్‌కు ఇచ్చినందుకే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందన్నారు’ నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ భజనగాళ్లు ఇవ్వలేదు. లాలూప్రసాద్.. సోనియాకు చెప్పి ఇప్పించారు. పదవి ఇవ్వొద్దని ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జగ్గారెడ్డి అడ్డు తగిలారు. నేను కేంద్రమంత్రి కాకుండా కొందరు అడ్డుకున్నారు. గెలిచే టైమ్‌లో నాకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు. పక్క పార్టీ నుంచి తెచ్చి దానం నాగేందర్‌కు ఎంపీ టికెట్ ఇచ్చారు. జీవన్‌రెడ్డి ఓడినా టికెట్ ఎందుకు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక భజన సంఘాలు వచ్చి చేరాయాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
‘కాంగ్రెస్ ప్రభుత్వం పీపీపీ మోడ్‌లో నడుస్తోంది’
మహబూబాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పీపీపీ మోడ్ లో నడుస్తోందంటూ విమర్శలు గుప్తించారు. పీపీపీ అంటే ఫోబియా, పాలిటిక్స్, పర్సంటేజ్ అంటూ వ్యాఖ్యానించారు కవిత. ముఖ్యమంత్రి రేవంత్ కు కేసీఆర్ ఫోబియా పట్టుకుందని, మైక్ పట్టగానే కేసీఆర్ ను తిట్టడం మించి ఇంకో ఆలోచన రేవంత్ కు రాదని ఎద్దేవా చేశారు కవిత.‘ప్రజా సమస్యలు, రైతుల కష్టాలు వదిలేసి ఎన్నికల ప్రచారానికి నిజామాబాద్ వెళ్లారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని 10 పర్సెంట్ సర్కార్ అని పిలుస్తున్నారు అందరు. పలాన చోట పర్సెంటేజీ ఇస్తే పని చేస్తున్నారని కొంత మంది చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రజా పాలన జరగడం లేదు. మహిళలకు 2500 ఇవ్వలేదు కానీ ఇచ్చేశామని పక్క రాష్ట్రంలో ప్రకటనలు ఇస్తున్నారు. పీఆర్ స్టంట్ల మీద ఉన్న సోయి ప్రజలకు పనిచేయడంలో లేదు. ఉచిత బస్సు ప్రయాణం మంచిదే కానీ మహిళల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా చేయవద్దు. బస్సుల సంఖ్య పెంచాలి... అప్పుడే మహిళలతో పాటు అందరికీ సీట్లు దొరుకుతాయి. అటో డ్రైవర్లకు ఏడాదికి రూ 12 వేలు ఇవ్వాలి. బీఆర్ఎస్ మొదలుపెట్టిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. కేవలం రాజకీయం తప్పా పరిపాలనపై రేవంత్ సర్కారుకు దృష్టి లేదు. మిర్చి రైతులు కన్నీరు పెట్టే పరిస్థితి ఏర్పండింది. ఏపీలో ఇదే పరిస్థితి ఏర్పడితే మద్ధతు ధర కోసం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నారు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోయి లేదు. ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోతే దాన్ని సందర్శించే సోయి లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ప్రజలకు ఏం చేశారని ప్రచారం చేయడానికి ?, రైతు రుణమాఫీ ఎవరికీ పూర్తిగా కాలేదు. రైతు భరోసా గ్రామాల్లో చాలా మందికి రాలేదు. రుణ మాఫీ పేరిట రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. క్వింటాలు మిర్చికి రూ 25 వేల మద్ధతు ధర కల్పించాలి. వరదలు వచ్చినప్పుడు చేస్తామన్న సాయాన్ని ప్రభుత్వం చేయలేదు. వరద బాధితులకు ఇళ్లు ఇస్తామని సీఎం రేవంత్ ఇవ్వలేదు. వరదలొచ్చినా, కన్నీళ్లిచ్చినా, కష్టాలొచ్చినా అండగా ఉండేది గులాబీ జెండానే. కేసీఆర్ హయాంలో మహబూబాబాద్ జిల్లా అభివృద్ధి చెందింది. కేసీఆర్ హయాంలో మంజూరైన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలి’ అని కవిత డిమాండ్ చేశారు. -
మళ్లీ గట్టు దాటి.. తీన్మార్ మల్లన్న హాట్ కామెంట్స్
కరీంనగర్, సాక్షి: అధికార కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) రగడ కొనసాగుతోంది. ఒకవైపు నవీన్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలనే గొంతుకలు పెరుగుతున్న వేళ.. ఆయన మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చినా కూడా తగ్గేదేలే అంటున్నారు. తాజాగా..ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం(MLC Election Campaign) లో కాంగ్రెస్‌ది, తనది వేర్వేరు దారన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డికి మద్ధతుగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందంతో ఇవాళ కరీంనగర్లో సభకు హాజరవుతున్నారు. అయితే అంతకంటే ముందే.. అదే కరీంనగర్(Karimnagar) వేదికగా బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ హాజరైన బీసీ జేఏసీ మీటింగ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ప్రత్యక్షం కావడం, తాజా పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ‘‘జానారెడ్డి కళ్లల్లో ఆనందం కోసం చిన్నారెడ్డి నాకు షోకాజ్ నోటీస్ పంపించారు. నేను ఈ బీసీ జేఏసీ సమావేశానికి వస్తే ఓ పార్టీ అభ్యర్థి బాధపడుతున్నారు. మరి అదే అభ్యర్థి.. నాకు షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు?’’ అని ఎమ్మెల్సీ నవీన్ నిలదీశారు... రాహుల్ గాంధీ స్పిరిట్‌తోనే బీసీ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్నా. కానీ, నేను ఇలా చేయడం కాంగ్రెస్ లో మరి కొన్ని వర్గాలకు నచ్చడం లేదు. మీకు పడకపోతే నేను బీసీ ఉద్యమాన్ని ఆపుతానా?.. ఇస్సా, ఇజ్జత్, హుకూమత్ కోసమే బీసీ ఉద్యమమం అంటూ తీన్మార్ మల్లన్న హాట్ కామెంట్స్ చేశారు. -
సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy)కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల పాలనపై కిషన్‌కెడ్డి(Kishan Reddy) లేఖ రాశారు. ‘14 నెలల మీ పాలన అసంతృప్తిగా ఉంది. డీఏలు, జీపీఎఫ్, పెండింగ్ బకాయిలు చెల్లించకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను రోడ్డున పడేస్తారా?, రిటైర్మెంట్ బెన్ ఫిట్స్ కూడా చెల్లించకుండా మానసిక క్షోభకు గురిచేయడం ఎంత వరకు న్యాయం?, ఉద్యోగులకు రోటీన్ గా చెల్లించాల్సిన బిల్లుల్లో కూడా సీలింగ్ పెట్టడం సిగ్గు చేటు, నిజాయితీగా పనిచేసే ఉద్యోగులకు మీరు ఏ సందేశం ఇస్తున్నట్లు?, కళాశాలల యాజమాన్యాలపట్ల మీ తీరు దుర్మార్గం, ఏళ్ల తరబడి ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకుండా వేధిస్తున్నారు. కాలేజీల యాజమాన్యాలు బిచ్చమెత్తుకునే దుస్థితి దాపురించింది. ఏప్రిల్, మే నెలలో బకాయిలు చెల్లిస్తామని కాలేజీ యాజమాన్యాలను మళ్లీ మభ్యపెట్టడం ఎంత వరకు కరెక్ట్?, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కేందుకు మళ్లీ మోసపూరిత హామీలకు సిద్ధమవడం సిగ్గు చేటు, నిరుద్యోగ భృతి ఆశ చూపి 14 నెలలుగా రూ.56 వేల బకాయిపడి యువతను దగా చేశారు. మీలో ఏమాత్రం నిజాయితీ ఉన్నా యుద్ద ప్రాతిపదికన బకాయిలు విడుదల చేయండి. ఈరోజే రూ.7500 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్మును కాలేజీ యాజమాన్యాల ఖాతాల్లో జమ చేయండి. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలన్నీ ఈరోజే విడుదల చేయండి. యువత అకౌంట్లలో 14 నెలల బకాయి కలిపి రూ.56 వేల నిరుద్యోగ భృతి జమ చేయాలి. ఇవన్నీ యుద్ద ప్రాతిపదికన విడుదల చేసిన తరువాతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడగాలి. దగా హామీలు, మోసపు మాటలతో మభ్యపెడితే మోసపోయేందుకు పట్టభద్రులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ వర్గాలు సిద్ధంగా లేవు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’ కిషన్‌రెడ్డి హెచ్చరించారు. -
తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి: ఎంపీ లక్ష్మణ్
సాక్షి, నల్లగొండ : తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని ఆసక్తికర కామెంట్స్ చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ముఖ్యమంత్రి రేవంత్ నీ పని అయిపోయింది.. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. రాష్ర్టంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ముడిపడినవి అంటూ చెప్పుకొచ్చారు.నల్లగొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘తుమ్మితే ఊడిపోయే ముక్కులా తెలంగాణ, హిమాచల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. రేవంత్ నీ పని అయిపోయింది. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. 14 నెలలుగా విద్యార్థుల నుంచి పదవి విరమణ చేసిన ఉద్యోగుల వరకు రేవంత్ ప్రభుత్వం వారిని రాచి రంపాన పెడుతోంది.రాష్ర్టంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ముడిపడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసే ధైర్యమే లేదు. వందేళ్ల కాంగ్రెస్ పార్టీకి దిక్కు మొక్కు లేకుండా పోయింది. బీఆర్ఎస్ గత చరిత్రలా మిగిలిపోయింది. బీఆర్ఎస్ 25 ఏళ్ల ఉత్సవాలు జరుపుకుంటూ అభ్యర్థినే నిలబెట్టలేకపోయింది. సమస్యలపై బరిగీసి కొట్లాడే పార్టీ బీజేపీ మాత్రమే.సంఘాల పేరుతో పోటీ చేస్తున్న వ్యక్తులకు రేవంత్‌తో పోట్లాడే దమ్ముందా అనేది ఆలోచించుకోవాలి. 317 జీవోపై పోరాడి జైలుకు పోయింది బీజేపీ నేతలు మాత్రమే. ఆనాడు ఏ ఒక్క టీచర్ ఎమ్మెల్సీ కూడా దీనిపై మాట్లాడలేదు. పదవీ విరమణ తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. రేవంత్ పాలనపై పట్టులేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టాయి. కేసీఆర్ చిప్పచేతికి ఇస్తే దాని పట్టుకుని ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు రేవంత్’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
ఎన్నికలే ముఖ్యమా రేవంత్.. SLBC వద్దకెళ్లే తీరక లేదా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎస్ఎల్బీసీ(SLBC) టన్నెల్ ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ క్రమంలో సహాయక చర్యలు కొనసాగుతున్న తీరుపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా? అని ప్రశ్నించారు. సహాయక చర్యలు కొల్లికి రాకముందే వారు బతికుండే అవకాశమే లేదనడం సర్కార్ చేతులెత్తేసిన తీరును నిదర్శనం అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై కేటీఆర్(KTR) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా కేటీఆర్..‘టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది ఆచూకీ తెలియని ఈ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలడం దిగజారుడు రాజకీయమే. రాష్ట్ర ముఖ్యమంత్రికే జరిగిన ఘోర దుర్ఘటనపై సీరియస్‌నెస్ లేకపోతే, ఇక అధికార యంత్రాంగానికి ఎక్కడ ఉంటుంది?. రెస్క్యూ ఆపరేషన్ ఎలా ముందుకు సాగుతుంది?.ఓట్ల వేటలో జిల్లాలకు జిల్లాలు చుట్టి వచ్చేందుకు ముఖ్యమంత్రికి సమయం ఉంది కానీ.. ఒక్కసారి క్షతగాత్రుల ఆర్తనాదాలతో మిన్నంటుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్‌కు వెళ్లే సమయం లేదా?. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా?. ప్రజాపాలన అంటే నోట్ల వేట.. ఓట్ల వేట మాత్రమేనా?. ఓవైపు సహాయక చర్యలు కొలిక్కి రాకముందే, ఇరుక్కున వారు బతికుండే అవకాశం కనిపించడం లేదని సర్కారు చేతులెత్తేస్తున్న తీరు, మరోవైపు సహాయక చర్యలను పర్యవేక్షించి, బాధితుల కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మరిచి ఎన్నికలే మా తొలి ఎజెండా అనే ముఖ్యమంత్రి!! సర్కారుకు కనీస మానవత్వం కూడా లేదా?.రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు, ఎనిమిది మందిని బలిపీఠం ఎక్కించి గ్రాడ్యుయేట్స్‌కు గాలం వేసేందుకు సిద్ధమైన సీఎంను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి వాత పెడతారు. జై తెలంగాణ అంటూ’ కామెంట్స్ చేశారు.SLBC టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది ఆచూకీ తెలియని ఈ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగితేలడం దిగజారుడు రాజకీయమే.. రాష్ట్ర ముఖ్యమంత్రికే జరిగిన ఘోర దుర్ఘటనపై సీరియస్ నెస్ లేకపోతే, ఇక అధికార యంత్రాంగానికి ఎక్కడ ఉంటది ? రెస్క్యూ ఆపరేషన్ ఎలా…— KTR (@KTRBRS) February 24, 2025 -
రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్
సాక్షి,హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఆగంతకుల నుంచి సోమవారం(ఫిబ్రవరి 24) మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ రోజు కాకపోతే రేపైనా నీ తల నరికేస్తామని ఆగంతకులు తనను బెదిరించినట్లు రాజాసింగ్ తెలిపారు. రెండు గుర్తు తెలియని ఫోన్ నంబర్ల నుంచి బెదిరింపులు వచ్చినట్లు చెప్పారు.గతంలోనూ రాజాసింగ్‌కు పాకిస్తాన్,ఆఫ్ఘనిస్తాన్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులపై అప్పట్లో రాజాసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను గుర్తించి పట్టుకున్నారు. రాజాసింగ్‌కు హత్యకు కుట్రపన్నినట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. -
పాలకులే మారారు..పాలన కాదు
కైలాస్‌నగర్: రాష్ట్రంలో పాలకులు మాత్రమే మారారు.. పాలన తీరు ఏ మాత్రం మారలేదని కేంద్ర గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. అప్పులు, ఆర్థిక దోపిడీలో కేసీఆర్, రేవంత్‌రెడ్డి ఇద్దరూ ఇద్దరే అని విమర్శించారు. ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలన తీరుపై ధ్వజమెత్తారు.బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ మాటలు కోటలు దాటగా, కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి మాటలు సచివాలయ గేటు కూడా దాటడం లేదని ఎద్దేవా చేశారు. వందరోజుల్లో అమలు చేస్తామని ప్రకటించిన ఆరు గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీల్లో ఏ ఒక్కటీ అమలు కాకపోవడంతో రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్నారు. హామీలను ఎప్పటి వరకు అమలు చేస్తారనే కార్యాచరణ కూడా ప్రభుత్వం వద్ద లేదని చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన అభయహస్తం మొండిహస్తంగా మారిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్, రేవంత్‌రెడ్డి తమ అసమర్థపాలనతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి, రాష్ట్ర భవిష్యత్‌ను అంధకారం చేశారని ఆరోపించారు. 14 నెలల పాలనలోనే ఈ ప్రభుత్వం ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీల్లో 20 శాతం కూడా అమలు చేయని అసమర్థ సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీ పాలనపై బహిరంగచర్చకు రావాలని అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మోదీ పాలనను విమర్శించే అర్హత రేవంత్, రాహుల్‌గాంధీలకు లేదని చెప్పారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామనే ప్రభుత్వ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. అయితే దీనిని అమలు చేయకుండా కేంద్రంపై నెపం మోపేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు వాస్తవాలను గ్రహించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. -
ఉప ఎన్నికల్లో గెలుపు మాదే.. తెలంగాణలో బైపోల్స్ ఖాయం
సాక్షి, సిద్దిపేట జిల్లా: తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి తలసాని శశ్రీనివాస్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మేరకే పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానంలో ఉప ఎన్నికలు రావడం ఖాయం. ఆ ఎన్నికల్లో గెలుపు తమదేనని జోస్యం చెప్పారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో కొమురవెల్లి మల్లన్న క్షేత్రం వద్ద అన్ని ఏర్పాట్లు చేశాం.త్రాగు నీరు,వసతి గదులు,బంగారు కిరీటం వంటి అనేక విధాలుగా మల్లన్న ఆలయం అభివృద్ధి చేశాం. కేసీఆర్ హయాంలో మల్లన్న ఆలయాన్ని అభివృద్ధి చేశారు కాబట్టే గతంలో సుమారు ఐదు కోట్లు ఉన్న ఆదాయం .. ఇప్పుడు గణనీయంగా సుమారు 20కోట్లకు పైగా చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14నెలలు అవుతున్న రైతులు, సబ్బండ వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు,420హామీలను ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క గ్యారెంటీని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హనీమూన్ పిరియడ్ అయిపోయింది. ఇకపై ప్రజల ఇబ్బందులపై శ్రద్ధ చూపాలి.కులగణనపై ఏ కుల సంఘాల నాయకులు సంతృప్తి లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం మబ్బే పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ విధానాలను అన్ని గమనిస్తున్నారు. రాష్ట్ర జనాభా 4కోట్లకు పైగా జనాభా ఉంటే ప్రభుత్వం 3కోట్ల 70లక్షలుగా చూపిస్తుంది. కులగణనపై హడావిడిగా అసెంబ్లీలో చేయాల్సి తీర్మానం చేయాల్సిన అవసరం లేదు.గతంలోనే మాజీ సిఎం కేసీఆర్ అసెంబ్లీలో కులగణనపై తీర్మానం ప్రవేశ పెట్టారు. మేడిగడ్డలో చిన్న సమస్య వస్తే భూతద్దంలో పెట్టీ చూపించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎల్బిసి సొరంగం ఘటనపై ఎవరు భాధ్యత వహిస్తారు. నోరు ఉందిగా అని ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. కేసీఆర్ దూరదృష్టి తోనే ప్రాజెక్టులను నిర్మించి రైతులకు అండగా నిలబడ్డారు.అన్నివర్గాల ప్రజలను కదిలిస్తే ఏ ప్రభుత్వం ప్రజలకోసం పనిచేసింది వాళ్ళే చెబుతారు. న్యాయస్థానం తీర్పు మేరకే పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానంలో ఉప ఎన్నికలు రావడం ఖాయం,ఆ ఎన్నికల్లో గెలుపు తమదేనని జోస్యం చెప్పారు. -
దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీయించారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దివ్యంగా ఉన్న రాష్ట్రం 15 నెలల కాంగ్రెస్ పాలనలో దివాలా తీసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థతతో రాష్ట్ర ఆర్థికలోటు గరిష్ట స్థాయికి చేరిందని విమర్శించారు. తిక్క నిర్ణయాలు, హైడ్రా లాంటి దిక్కుమాలిన విధానాలతో రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయిందని దుయ్యబట్టారు. తన చేతగానితనంతో కేవలం ఒక్క ఏడాదిలోనే అన్ని రంగాలనూ సీఎం చావుదెబ్బ కొట్టాడని వ్యాఖ్యానించారు. శనివారం తెలంగాణ భవన్లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, డాక్టర్ మెతుకు ఆనంద్, పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై ఒక ఎజెండా ప్రకారం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. తల్లి లాంటి రాష్ట్రాన్ని కేన్సర్‌తో పోల్చిన దుర్మార్గుడు రేవంత్‌రెడ్డి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసుకోకుండా ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ పరువు తీస్తున్నాడు. రేవంత్‌రెడ్డి అబద్ధాలను బట్టబయలు చేస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్‌ను విడుదల చేశారు. సీఎం చెబుతున్న అబద్ధాలను తిప్పికొడుతూ సమగ్ర నివేదిక ద్వారా వాస్తవాలు బయట పెట్టారు. మాజీ సీఎం కేసీఆర్‌కు మంచిపేరు వస్తుందనే భయంతో వెబ్సైట్ నుంచి ఈ నివేదికను ప్రభుత్వం తొలగించింది’అని కేటీఆర్ ఆరోపించారు. ఆరు గ్యారంటీలు అమలు చేసిన చోటే కాంగ్రెస్ పోటీ చేయాలి సీఎం రేవంత్ రంకెలు వేయడం మాని పాలనపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని కేటీఆర్ హితవు పలికారు. ఆరు గ్యారంటీలు అమలు చేసిన చోటే కాంగ్రెస్ పోటీ చేసి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామన్న చోటే సీఎం ఓట్లు అడగాలని సూచించారు. ‘రాబోయే రోజుల్లో రేవంత్ ఆడబిడ్డల పుస్తెల తాడు కూడా ఎత్తుకుపోతాడు. కేంద్ర మంత్రి బండి సంజయ్ రక్షణలో రేవంత్ ఉన్నాడు. రేవంత్, బండి సంజయ్‌ను ఆర్ఎస్ బ్రదర్స్ అనుకుంటున్నారు. బిల్డర్ల నుంచి చదరపు అడుగుకు రూ.150 వసూలు చేస్తున్న రేవంత్ ప్రభుత్వం ‘ఆర్ఆర్ టాక్స్’విధిస్తోందని గతంలో ప్రధాని ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎందుకు కాపాడుతోందో చెప్పాలి. బీజేపీలో చేరేందుకు రేవంత్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారా? సుంకిశాల ప్రమాదంలో రేవంత్ ఎవరిని కాపాడుతున్నారో తెలుసు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం డిమాండ్ చేస్తే ఉద్యోగం పోతుందని సీఎం భయపడుతున్నాడు. కృష్ణా జలాల దోపిడీ జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును అసెంబ్లీ వేదికగా ఎండగడతాం. తెలంగాణను ఎవరు తక్కువ చేసి దూషించినా అదే స్థాయిలో సమాధానం ఇస్తాం’అని కేటీఆర్ స్పష్టం చేశారు.