breaking news
-
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. అప్డేట్స్
MLC Election Counting Updates..కరీంనగర్ జిల్లా :కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్న బిజెపిటీచర్స్ ఓట్ల లెక్కింపు పూర్తి.భారీ మెజారిటీతో బిజెపి అభ్యర్థి మల్క కొమురయ్య విజయం.అధికారికంగా ఇంకా ప్రకటించని అధికారులు.కరీంనగర్ జిల్లా:కరీంనగర్ టీచర్ MLC మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపుకాసేపట్లో అధికారిక ప్రకటనవరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్ నల్లగొండ జిల్లా :కౌంటింగ్ హాల్ వద్ద మీడియాతో యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డిగెలుపోటములు సహాజంఓటమిని అంగీకరిస్తున్నాగెలిచిన అభ్యర్థి ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడాలని సూచిస్తున్నఓడిపోయినందుకు బాధపడటం లేదుఉపాధ్యాయులు రెండోసారి నన్ను గెలిపించాలని అనుకోలేదేమోప్రచారం ఉధృతంగా చేసినా నేను ఎందుకు ఓడిపోయానో ఉపాధ్యాయులకు తెలుసు. దాని గురించి ఇప్పుడు మాట్లాడాలని అనుకోవడం లేదు.వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :కొనసాగుతున్న ఎలిమినేషన్ ప్రక్రియ18 రౌండ్ ఫలితాలుటీ పీఆర్టీయూ అభ్యర్థి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఎలిమినేట్మరికాసేపట్లో యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియవరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :కొనసాగుతున్న 17వ రౌండ్ ఎలిమినేషన్ ప్రక్రియస్వతంత్ర అభ్యర్థి పూల రవీందర్ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభంసుందర్ రాజుకు వచ్చిన (3115) ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తోన్న అధికారులువరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :కొనసాగుతున్న ఎలిమినేషన్ ప్రక్రియతొలి స్థానంలో ఉన్న పీఆర్టీయూ అభ్యర్థి టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి విజయానికి ఇంకా 4149 ఓట్లు అవసరంరెండో స్థానంలో ఉన్న యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డికి 6162 ఓట్లు అవసరంవరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :15 రౌండ్ ఫలితాలుబీజేపీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి ఎలిమినేట్వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :16 రౌండ్ ఫలితాలుబీజేపీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి ఎలిమినేట్సరోత్తం రెడ్డి ఎలిమినేషన్ తర్వాతశ్రీపాల్ రెడ్డి- 7673అలుగుబెల్లి నర్సిరెడ్డి- 5660హర్షవర్ధన్ రెడ్డి- 5309పూల రవీందర్- 3992కరీంనగర్ :టీచర్స్ కోటా ఎమ్మెల్సీలో ముందంజలో ఉన్న బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్యసంబరాలకు సిద్దమవుతున్న బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్యమొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపు దిశగా కొమరయ్యకరీంనగర్: కొనసాగుతున్న టీచర్ ఎమ్మెల్సీ టేబుల్ కౌంటింగ్.మొదటి 14 వేల ఓట్ల లెక్కింపు సాగుతుండగా.. లీడ్ లో కొనసాగుతున్న బిజెపి అభ్యర్థి మల్క కొమురయ్యవిక్టరీ సింబల్ చూపిస్తూ కౌంటింగ్ ఆలోచించి బయటికి వచ్చిన మల్క కొమురయ్యవరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :ప్రారంభమైన 16వ రౌండ్ ఎలిమినేషన్ ప్రక్రియబీజేపీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభంసరోత్తం రెడ్డికి వచ్చిన (2289) ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తోన్న అధికారులువరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా:15 రౌండ్ ఫలితాలుస్వతంత్ర అభ్యర్థి సుందర్ రాజు(2040 ఓట్లు) ఎలిమినేట్15వ రౌండ్ తర్వాత ఓట్ల వివరాలుశ్రీపాల్ రెడ్డి- 6916అలుగుబెల్లి నర్సిరెడ్డి- 5205హర్షవర్ధన్ రెడ్డి- 4799పూల రవీందర్- 3617పులి సరోత్తం రెడ్డి-2645వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :కొనసాగుతున్న 15వ రౌండ్ ఎలిమినేషన్ ప్రక్రియస్వతంత్ర అభ్యర్థి సుందర్ రాజు ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభంసుందర్ రాజుకు వచ్చిన (2040) ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తోన్న అధికారులువరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :పన్నెండో అభ్యర్థి బాబు రావు( 128 ఓట్లు) ఎలిమినేట్వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :కొనసాగుతున్న 13 వ రౌండ్ ఎలిమినేషన్ ప్రక్రియకొలిపాక వెంకటస్వామి (421 ఓట్లు) ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తోన్న అధికారులువరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :ముగిసిన నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుచెల్లుబాటు అయిన ఓట్లు- 23,641చెల్లని ఓట్లు- 494గెలుపు కోటా- 11822 గా నిర్ధారణ12 రౌండ్లు ముగిసిన తర్వాత వచ్చిన ఓట్లుశ్రీపాల్ రెడ్డి- 6105అలుగుబెల్లి నర్సిరెడ్డి- 4884హర్షవర్ధన్ రెడ్డి- 4502పూల రవీందర్- 3202పులి సరోత్తం రెడ్డి- 2337సుందర్ రాజు-2091వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :14 రౌండ్ ఫలితాలుకొలిపాక వెంకటస్వామి (421 ఓట్లు) ఎలిమినేట్14వ రౌండ్ తర్వాత ఓట్ల వివరాలుశ్రీపాల్ రెడ్డి- 6165అలుగుబెల్లి నర్సిరెడ్డి- 4946హర్షవర్ధన్ రెడ్డి- 4596పూల రవీందర్- 3249పులి సరోత్తం రెడ్డి- 2394సుందర్ రాజు-2141వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా: ప్రారంభమైన ఎలిమినేషన్ ప్రక్రియతొమ్మిదో అభ్యర్థి తాటికొండ రాజయ్య( 36 ఓట్లు) ఎలిమినేట్వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :ఏడో అభ్యర్థి పన్నాల గోపాల్ రెడ్డి(24 ఓట్లు) ఎలిమినేట్వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా : ఎనిమిదో అభ్యర్థి కైలాసం( 26 ఓట్లు) ఎలిమినేట్వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా: ప్రారంభమైన ఎలిమినేషన్ ప్రక్రియఎవరికీ గెలుపు కోటా రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తోన్న అధికారులుచలిక చంద్ర శేఖర్ 1 ఓటు, కంటే సాయన్న. 4 ఓట్లు, బంక రాజు 7 ఓట్లు, పురుషోత్తం రెడ్డి 11, లింగడి వెంకటేశ్వర్లు 15, అర్వ స్వాతి 19 ఎలిమినేటర్కరీంనగర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ఆలస్యంగా పట్టభద్రుల కౌంటింగ్ ప్రక్రియనేటి రాత్రి వరకు కొనసాగనున్న బ్యాలెట్ పేపర్ల బెండల్స్ కట్టడం ప్రక్రియవ్యాలీడ్ ఇన్ వ్యాలిడ్ ఓట్ల పరిశీలనకు రాత్రి వరకు సమయం పట్టే అవకాశంరాత్రి వరకు ఎమ్మెల్సీ ఓట్లు కట్టలు కట్టి సపరేషన్ ప్రక్రియఅర్ధరాత్రి దాటిన తర్వాతే పట్టభద్రుల అసలు ఓట్ల లెక్కింపుచెల్లని ఓట్లు ఎక్కువగా పోల్ కావడంతో అభ్యర్థుల్లో ఆందోళనచెల్లని ఓట్లతో ప్రధాన పార్టీల అభ్యర్థులకే నష్టం అంటున్న ప్రసన్న హరికృష్ణగెలుపు ధీమా వ్యక్తం చేసిన ప్రసన్న హరికృష్ణటీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ బండెల్స్ కట్టడం పూర్తివరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్నల్లగొండ జిల్లాముగిసిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుమొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక లీడ్ లో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డిరెండో స్థానంలో యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డిమూడో స్థానంలో టీ పీఆర్టీయూ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డినాలుగో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి పూల రవీందర్ఐదో స్థానంలో బీజేపీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డికాసేపట్లో చెల్లని ఓట్లను తొలగించి గెలుపుకు కావాల్సిన కోటాను ప్రకటించనున్న అధికారులువరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లామరికాసేపట్లో ముగియనున్న మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుఇప్పటి వరకు పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి ముందంజమొదటి ప్రాధాన్యత ఓట్లలో అత్యధికంగా శ్రీపాల్ రెడ్డికి నమోదుఆ తర్వాత యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డిమూడోస్థానంలో బీజేపీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డిరెండో ప్రాధాన్యత ఓట్లతోనే విజేత ఎవరనేది తెలిసే అవకాశంమొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక చెల్లని ఓట్లను తొలగించి గెలుపు కోటాను నిర్ణయించనున్న అధికారులువరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా..మరికాసేపట్లో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం.ముగిసిన బ్యాలెట్ పత్రాల కట్టలు కట్టే ప్రక్రియ25 టేబుళ్లపై ఓట్ల లెక్కింపుటేబుల్ కు 40 కట్టల కేటాయింపుఒక్కో కట్టలో 25 ఓట్లుఒక్కో టేబుల్ కు 1000 ఓట్ల కేటాయింపుమిగిలిన ఓట్లు చివరి టేబుల్ కు కేటాయింపుమధ్యాహ్నం మూడు గంటల వరకే ముగియనున్న మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుచెల్లని ఓట్లను తొలగించి గెలుపుకు కావాల్సిన కోటాను నిర్ణయించనున్న అధికారులుమొత్తం పోలైన ఓట్లు- 24139👉ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కరీంనగర్, నల్లగొండలలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు సాయంత్రంలోగా వెల్లడికానున్నాయి. పట్టుభద్రుల ఓట్ల లెక్కింపు ఫలితం రావడానికి రెండు రోజుల సమయం పట్టే అవకాశముంది. 👉కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్–మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతోంది. దీనికోసం మొత్తం 35 టేబుళ్లు వినియోగించనున్నారు. ఇందులో 21 పట్టభద్రుల ఓట్ల కోసం, 14 టేబుళ్లు ఉపాధ్యాయుల ఓట్లు కోసం కేటాయించారు. 👉ఒక్కో టేబుల్ వద్ద నలుగురు సిబ్బంది విధులు నిర్వర్తించనుండగా, ఇందులో ఒక మైక్రో అబ్జర్వర్, ఒక సూపర్వైజర్, ఇద్దరు లెక్కింపు అసిస్టెంట్లు ఉన్నారు. 👉గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో 3.55 లక్షల ఓట్లు, టీచర్ నియోజకవర్గంలో 27,088 ఓట్లు ఉన్నాయి. 👉ఈ క్రమంలో టీచర్ల లెక్కింపు సాయంత్రానికి వెలువడే అవకాశాలు ఉండగా.. గ్రాడ్యుయేట్ మాత్రం మరునాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. గ్రాడ్యుయేట్ స్థానంలో 56 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, టీచర్ ఎమ్మెల్సీ బరిలో 15 మంది తలపడుతున్నారు. 👉వరంగల్–ఖమ్మం–నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్జాలబావి సమీపంలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 19 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 24,139 మంది ఓట్లు పోలయ్యాయి. -
అప్పుడు లేని తపన ఇప్పుడెందుకు?: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ సీఎం రేవంత్, మంత్రులు కూడా ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రధాని మోదీ.. సీఎంతో ఫోన్లో మాట్లాడారు. కేంద్రం కూడా బృందాలు పంపి సహకరిస్తుంది. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. రిస్క్ అని తెలిసి కూడా అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు’’ అని జగ్గారెడ్డి అన్నారు.ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ద్వారా నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య శాశ్వతంగా పోవాలని మంచి నీళ్లు ఇచ్చేందుకు దీనిని వైఎస్ చేపట్టారు. ఫ్లోరైడ్‌తో నల్గొండలో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వైఎస్ గుర్తించి.. శ్రీశైలం నీళ్ళు నల్గొండ ప్రజలకు ఇవ్వాలని భావించారు. రూ.1925 కోట్లతో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం జరిగింది. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎస్ఎల్బీసీ పూర్తి కావాల్సి ఉండే.. కానీ కాలేదు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేయాలని మంచి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే నల్గొండలో 4 నుంచి 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఘటనను ప్రతిపక్షాలు రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. కనీస అవగాహన ఉండాలి. ప్రభుత్వం తన బాధ్యత నిర్వర్తిస్తుంది.’’ అని జగ్గారెడ్డి తెలిపారు.‘‘హరీష్‌రావు ఆర్థిక మంత్రిగా.. ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఎందుకు పూర్తి చేయలేదు? అప్పుడు లేని తపన ఇప్పుడు ఎందుకు?. హరీష్‌రావు ముసలి కన్నీరు కారుస్తున్నారు. కొండగట్టు బస్సు ప్రమాదం జరిగితే.. అప్పటి సీఎం కేసీఆర్ ఎందుకు వెళ్లలేదు. హరీష్‌రావు గొంతు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం జవాబుదారీ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంది. బీజేపీ క్రమశిక్షణ లేని పార్టీ. కిషన్ రెడ్డి బీసీలను అణచివేస్తుందని ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు’’ అని జగ్గారెడ్డి గుర్తు చేశారు. -
సమస్య మోదీ కాదు.. కిషన్‌రెడ్డి: సీఎం రేవంత్
సాక్షి, వనపర్తి: బీఆర్ఎస్, బీజేపీ నేతల తప్పుడు మాటలు నమ్మొద్దని.. ఆ పార్టీలు కలిసి కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. వనపర్తిలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇందిరమ్మ ప్రభుత్వంలో ఒకేసారి రూ.21 వేల కోట్లు రుణమాఫీ చేశాం. 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. పథకాలు అమలు చేయడం లేదని ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీ నేతలకు వాతలు పెట్టాలి’’ అంటూ వ్యాఖ్యానించారు.ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. రైతు భరోసా డబ్బులు బ్యాంక్ అకౌంట్లలో జమ చేశామని సీఎం పేర్కొన్నారు.కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘రాష్ట్రానికి సమస్య మోదీ కాదు.. కిషన్‌రెడ్డి’ అంటూ రేవంత్ ధ్వజమెత్తారు. తెలంగాణపై కిషన్‌రెడ్డి పగబట్టారు. ఆయనకు ఎందుకంత అక్కసు?. ఖట్టర్ సమీక్షకు హాజరుకాని కిషన్‌రెడ్డి.. మెట్రోకు సహకరిస్తున్నారంటే నమ్మాలా?. కిషన్‌రెడ్డి బెదిరింపులకు భయపడేది లేదు. ఎస్ఎల్బీసీ ప్రమాదానికి గత ప్రభుత్వమే కారణం. పాలమూరు బిడ్డ సీఎం అయితే ఓర్వలేకపోతున్నారు.’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. -
‘SLBC దగ్గరకు వెళ్లేందుకు సీఎంకు టైం లేదు’
హైదరాబాద్: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అక్కడకు వెళ్లే టైం లేదని విమర్శించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన రఘునందన్ రావు.. గత ఎనిమిది రోజులుగా సీఎం రేవంత్.. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలిని సందర్భించే తీరిక లేదన్నారు. తెలంగాణలో పాలన పడకేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాక ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ లేకుండా రేవంత్ ఢిల్లీ వెళ్లి వచ్చారు.. రేవంత్ ఒకవేళ కలిస్తే ఒక్క ఫోటో కూడా ఎందుకు విడుదల చేయలేదు. పేరుకే పీసీసీ అధ్యక్ష పదవి బీసీకి ఇచ్చారు. సీఎం పదవి బీసీలకు ఇవ్వాలని అధిష్టానానికి లేఖ రాయాలని పీసీసీ చీఫ్ గా ఉన్న మహేస్ కుమార్ గౌడ్ కు సూచిస్తున్నా. జీహెచ్ఎంసీలో ఒక అధికారికి ఐదేళ్లుగా డిప్యూటేషన్ మీద పని చేస్తున్నారు. ఇక మున్సిపల్ పాలనపై సీఎం రేవంత్ కు పట్టులేదు. మమునూరు ఎయిర్ పోర్ట్ గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదు. గద్వాల ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ లో తన ఫోటో కాంగ్రెస్ ఫ్లెక్సీలో వేస్తున్నారని ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలు తిరిగి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. కిషన్ రెడ్డి సౌమ్యుడు.. ఆయన గురించి మాట్లాడే హక్కు రేవంత్ కు లేదు. ఆరు మంత్రి పదవులు భర్తీ చేసుకోలేని పరిస్థితి రేవంత్‌ది‘త్రిభాషా సిద్ధాంతానికి పునాదులు వేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా రేవంత్ మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఉర్దూ భాష ఎందుకు రాస్తున్నారు. 90 శాతం జనాలకు ఉర్దూ రాకపోయినా ఎందుకు బోర్డులపై రాస్తున్నారు. ఎవరికి భయపడి ఉర్దూ భాష రాస్తున్నారు. అసెంబ్లీలో అక్బరుద్దీన్ అనుమతి తీసుకొని రేవంత్ తెలుగులో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పార్లమెంట్ లో ఏ భాషలో మాట్లాడతారు. వ్యక్తిగత విమర్శలపై మేం మాట్లాడగలం . సిద్ధాంతం మీద, ప్రజా సమస్యలపై చర్చకు సిద్దం. వేదిక, సమయం చెప్పాలని సీఎం రేవంత్ కు సవాల్ విసురుతున్నా. కేటీఆర్ మీద ఏసీబీ కేసు పెట్టింది.. ఇక్కడ కేంద్రానికి ఏం సంబంధం.. రేవంత్ ను ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం మరిచిపోయినట్లున్నారు. కేసీఆర్ ను అరెస్ట్ చేయడానికి రేవంత్ భయపడుతున్నారు’ అంటూ రఘునందన్ రావు మండిపడ్డారు. -
అందుకే నాపై విమర్శలు.. రేవంత్‌కు కిషన్‌రెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: పద్నాలుగు నెలల్లో ఆరు గ్యారంటీలు అమలు అయ్యాయా? అంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని దుయ్యబట్టారు. శనివారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అనేక రకాల హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆరు గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీల అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. గతేడాది డిసెంబర్‌లోపు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఏవి?. ఇళ్లులేని వారందరికీ రూ.5 లక్షలు, ఇంటి స్థలం ఇస్తామన్నారు.. ఏమైంది?’’ అంటూ కిషన్‌రెడ్డి నిలదీశారు.‘‘బాధ్యతలు, హామీలను విస్మరించి సీఎం గాలి మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ గెలిపించి మోసపోయామని ప్రజలు అనుకుంటున్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయలేక సీఎం రేవంత్‌రెడ్డి నాపై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలే సీఎం అసహనానికి కారణం. రేవంత్‌రెడ్డి తప్పుడు ఆరోపణలను ఖండిస్తున్నాం. నేను బెదిరింపు రాజకీయాలు చేస్తున్నానన్నది అవాస్తవం. సీఎం రేవంత్ దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారు’’ అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. -
రేవంత్ చేసింది చెబితే చెవుల్లోంచి రక్తం కారుతుంది: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ రైజింగ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారని, కానీ నేరాల్లో.. అప్పుల్లో ఆ రైజింగ్ కనిపిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఎద్దేవా చేశారు. శనివారం బీఆర్ఎస్ చేరికల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై, రేవంత్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీకి కొత్త ఇంచార్జి వస్తే సమావేశం పెట్టారు. ఆ మీటింగ్‌లో సీఎం రేవంత్ మూడు ఆణిముత్యాల్లాంటి మాటలు చెప్పారు. మంచి మైకులో చెప్పాలని.. చెడు చెవిలో చెప్పాలని ఆయన అన్నారు. మైక్‌లో చెప్పడానికి రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన మంచి ఏం లేదు. ఆయన చేసిన చెడు చెబితే చెవుల నుంచి రక్తం కారుతుంది. జనం కాంగ్రెస్‌ను.. రేవంత్‌ను తిట్టుకుంటున్నారు అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ కొత్త ఇంచార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) నా బ్యాగులు మోయవద్దని అంటున్నారు. కానీ, ఆమె వాస్తవాలు తెలుసుకోవాలి. మీ పక్కన కూర్చున్న రేవంత్ రెడ్డి బ్యాగులు మోసి ఇక్కడికి వచ్చారు. రేవంత్ రెడ్డికి టింగ్,టింగ్ అంటే నచ్చదు. అందుకే రేవంత్ రెడ్డి టకీ,టకీ మని పైసలు పడతాయని అన్నారు. మరి ఇప్పటి వరకు ఎవరికైనా టకీ,టకీ మని పైసలు పడ్డాయా?. పదిశాతం ఖర్చు పెడితే శ్రీశైలం జలాలు చేవెళ్లకు వచ్చేవి కానీ రేవంత్ రెడ్డికి ఇష్టం లేక చేయడం లేదు. కమీషన్లు రావనే ఉదేశ్యంతోనే పాలమూరు, రంగారెడ్డి పూర్తి చేయడం లేదు. మూసీ వలన జరిగే లాభం ఎంత. కమీషన్ల కోసమే మూసీ అనే రంగుల సినిమా చూపుతున్నారు. మూసీతో 50-70 వేల కోట్లు కమీషన్లు తీసుకొని ఢిల్లీకి మూటలు పంపి సీఎం కుర్చీని కాపాడుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారు. నీళ్లు పాతాలానికి వెళ్లాయి నిధులు ఢిల్లీకి పోతున్నాయి.తెలంగాణ రైజింగ్(Telangana Rising) అని రేవంత్ రెడ్డి అంటున్నారు. కానీ, ఆ రైజింగ్ క్రైమ్ రేట్లో, అప్పుల్లో కనిపిస్తోంది. ఆత్మహత్యల్లో రైజింగ్, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యల్లో రైజింగ్. గురుకుల పాఠశాలల విద్యార్థుల మరణాల్లో రైజింగ్. కేసీఆర్ అప్పులు తెచ్చి మరీ ఆస్తులు సృష్టించారు. మరి ఈ ఏడాదిలో లక్షా 50 వేల కోట్ల రూపాయలు అప్పు చేసి రేవంత్ ఏం సాధించారు?.రేవంత్ రెడ్డి హైడ్రా పెట్టింది నా కోసమే. అధికారంలోకి వచ్చి 15 నెలల తర్వాత ఇంకా కేసీఆర్ ను తిట్టుకుంటా బ్రతుకుతావా?. అన్ని చూసుకోకుండా ఆగం,ఆగంగా కమీషన్ల కోసం SLBC పనులు ప్రారంభించారు. ఎనిమిది మంది చిక్కుకుంటే.. సహాయక చర్యల పేరుతో మంత్రులు చాపల కూరలు తింటున్నారుకేసీఆర్(KCR) మన ఇంట్లో పెద్ద మనిషి,బాపు లాంటోడు కాబట్టే ప్రజలు గుర్తు తెచ్చుకుంటున్నారు. కేసీఆర్ దళంలోకి.. గులాబీ వనంలోకి కార్తీక్ రెడ్డి(karthik Reddy)ని ఆహ్వానిస్తున్నాం. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయి. త్వరలోనే కార్తీక్ ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో అడుగుపెడతారు. కేసీఆర్ కు తెలంగాణపై ఉండే ప్రేమ కాంగ్రెస్,బీజేపీకి ఒక్క శాతం అయినా వుంటుందా?. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచి ఏం చేసింది?. ఒక్క రూపాయి ఇవ్వని బీజేపీ నేతలు ఓట్లు ఎట్లా అడుగుతారు?. దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతారా?. మనల్ని మనం ఓడించి.. మంది ముందు దరఖాస్తు పెట్టే పరిస్థితి వచ్చింది. పంచాయతీ ఎన్నికలు అయినా పార్లమెంట్ ఎన్నికలు అయినా ఎగరాల్సింది గులాబీ జెండానే. కాంగ్రెస్ వాళ్లు ఓట్ల కోసం వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు.. జాగ్రత్త’’ అని కేటీఆర్ అన్నారు.ఇదీ చదవండి: మామునూర్ ఎయిర్‌పోర్టు క్రెడిట్ కోసం ఢిష్యూం.. ఢిష్యూం -
వరంగల్‌లో ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ
సాక్షి, మామునూర్: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య మరోసారి ఘర్షణ చోటుచేసుకుంది. వరంగల్ జిల్లాలో మామునూరు విమానాశ్రయం వద్ద ఇరు వర్గాల నేతల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో జై మోదీ అని బీజేపీ కార్యకర్తలు.. జై కాంగ్రెస్ అంటూ హస్తం పార్టీ నినాదాలు చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు రెండు వర్గాల నేతలు అడ్డుకున్నారు.మామునూర్ ఎయిర్‌పోర్టు విషయమై వరంగల్‌లో ఉద్రిక్తత నెలకొంది. మామునూర్ విమానాశ్రయానికి ఇటీవల కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విమానాశ్రయానికి కేంద్రం అనుమతి ఇవ్వడంతో ప్రధాని మోదీకి పూలాభిషేకం చేసేందుకు బీజేపీ శ్రేణులు శనివారం ఉదయం అక్కడికి చేరుకున్నాయి. విమానాశ్రయం వద్ద మోదీకి పూలాభిషేకం చేసేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు.కాగా, బీజేపీ నేతలు అక్కడికి వచ్చిన సమయంలోనే కాంగ్రెస్ శ్రేణులు సైతం విమానాశ్రయం వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే విమానాశ్రయం రెడీ అవుతోందని వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఇరు వర్గాలు మధ్య ఘర్షణ తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇరు వర్గాల నేతలు ఎన్నికల కోడ్‌ను ఉల్లఘించడం గమనార్హం. -
కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్(తీన్మార్ మల్లన్న)కు బిగ్ షాక్ తగిలింది. మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని, పైగా పార్టీ శిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులకు వివరణ ఇవ్వలేదని, అందుకే క్రమశిక్షణ చర్యల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రకటించారు. ఇక, ఎమ్మెల్సీ మల్లన్న సస్పెన్షన్‌పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పార్టీ లైన్ ఎవరు దాటినా ఊరుకునేది లేదు. మల్లన్నను ఎన్నోసార్లు హెచ్చరించాం. బీసీ కుల గణన ప్రతులను చించడంపై ఏఐసీసీ సీరియస్ అయ్యింది. మల్లన్న చేసిన వ్యాఖ్యలు చాలా తప్పు. పార్టీ లైన్ దాటితే ఎవ్వరినీ వదలిపెట్టం’ అని హెచ్చరించారు. వరంగల్ సభలో చేసిన వ్యాఖ్యలు, కులగణన నివేదికపై మల్లన్న ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ వర్గాన్ని కించపరిచేలా ఆయన మాట్లాడారు. ఈ వ్యాఖ్యలకుగానూ ఫిబ్రవరి 5వ తేదీన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 12వ తేదీలోపు ఆ వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని కోరింది. అయితే.. ఆయన నుంచి స్పందన లేకపోవడంతో ఇవాళ చర్యలకు ఉపక్రమించింది. సొంత పార్టీ విషయంలో నవీన్ వైఖరి మొదటి నుంచి చర్చనీయాంశంగానే ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన నివేదిక ప్రతులను ఆయన దగ్ధం చేశారు. అలాగే.. సర్వేలో 40 లక్షల మంది బీసీలను తగ్గించారని ఆరోపించారు. కుల గణన నివేదికను వ్యతిరేకించాలని పిలుపు కూడా ఇచ్చారు. మరోవైపు.. వరంగల్‌లో జరిగిన బీసీ సభలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించడంపై పీసీసీకి ఫిర్యాదులు అందాయి. రెడ్డి కులాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన అతనిపై చర్యలు తీసుకోవాలని పలువురు పార్టీ శ్రేణులు కోరారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి మల్లన్నను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రెడ్డి కులానికి బహిరంగ క్షమాపణ చెప్పి మల్లన్న తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆ సంఘం ప్రతినిధులు హెచ్చరించారు కూడా. ఈ క్రమంలో.. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ జి.చిన్నారెడ్డి మలన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే జానారెడ్డి కళ్లలో ఆనందం కోసమే తనకు చిన్నారెడ్డి నోటీసులు జారీ చేశారంటూ కరీంనగర్లో నవీన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలే చేశారు. -
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ కాంగ్రెస్‌లో మరో అలజడి రేగింది. పార్టీ కోసం కష్టపడుతున్నవారిని పక్కనపెడుతున్నారని, నిన్న మొన్న చేరుతున్నవాళ్లకు పదవులు ఇవ్వడం ఏమాత్రం సరికాదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి(Malreddy Rangareddy) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.రాష్ట్ర జనాభాలో అధికంగా.. 42 శాతం జనాభా రంగారెడ్డి జిల్లాలోనే ఉంది. అలాంటి జిల్లాకు దయచేసి అన్యాయం చేయకండి. గతంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్(Hyderabad) జిల్లాలకు కనీసం ఆరుగురు మంత్రులు ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు ఎంత మంది ఉన్నారు?. ఒకవేళ సామాజిక సమీకరణలు అడ్డు వస్తున్నాయంటే రాజీనామాకు నేను సిద్ధం. జిల్లా అభివృద్ధి కోసం.. మంత్రి ప్రాతినిధ్యం కోసం ఇంకొకరిని గెలిపించేందుకు నేను రెడీ అని కాంగ్రెస్ అధిష్టానంను ఉద్దేశించి మల్రెడ్డి రంగారెడ్డి వ్యాఖ్యానించారు. రానున్న గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకోనైనా గ్రేటర్ పరిధిలోని నేతలకు మంత్రి పదవి ఇవ్వాలని అన్నారాయన. ఇక.... పార్టీలోకి ఎవరొచ్చినా గౌరవం ఇవ్వాలి. కానీ పదవులు ఇవ్వొద్దు. ఇప్పటికప్పుడు పార్టీలోకి వచ్చిన వాళ్ళని మంత్రులుగా తీసుకోవద్దు. నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి పార్టీ కోసం కష్టపడ్డ వారిని పక్కన పెట్టడం సరైంది కాదు. పని చేసిన వారిని పక్కన పెడితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వస్తున్నాయి. కనీసం పదేండ్లు కష్టపడ్డ వారికి పదవులు ఇవ్వాలి. కార్యకర్తల మనోభావాలను.. నేతల సీనియారిటీనీ పరిగణనలోకి తీసుకోవాలి అని ఆయన కోరారు. ఈ క్రమంలో ‘‘పార్టీ లైన్ దాటోద్దు కాబట్టి ఏం మాట్లాడలేకపోతున్న’’ అని మల్రెడ్డి వ్యాఖ్యానించడం కొసమెరుపు. -
పేదల కన్నీళ్లు అర్థం చేసుకోవాలి.. వారి ముఖాల్లో సంతోషం కన్పించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, ఇలాంటివి ఇంకెక్కడా జరగ డం లేదని తాను భావిస్తున్నానని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ చెప్పారు. ‘‘మనకు ఇంకా నాలుగేళ్ల సమయముంది. మన ప్రభుత్వం, సీఎం అనేక పనులు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.మనం ప్రభుత్వాన్ని నడపడం ద్వారా తెస్తున్న మార్పు మన అంతర్గత వ్యవహారాల్లోనూ కనిపించాలి. మనం కళ్లు మూసుకుంటే పేదల ముఖాలు కనిపించాలి.వారి కన్నీళ్లు అర్థం చేసుకోగలగాలి. వారి ముఖాల్లో సంతోషం కనిపించేలా చేయాలి. అప్పుడే మనం సవ్య దిశలో వెళ్తున్నట్టు. అలా జరగకపోతే మన పంథాను మార్చుకోవాలి. మార్చుకోకపోతే ప్రజల్లో విశ్వాసం ఉండదు..’ అని అన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి ఆమె హాజరయ్యారు. కార్యకర్తలు ఆత్మగౌరవంతో బతకాలి: ‘చివరి బంతిలో కూర్చున్న వారికి కూడా సంక్షేమ ఫలాలు అందుతున్నాయో లేదో సమీక్ష చేసుకోవాలి. అలా అందకపోతే మనం ప్రభుత్వంలోకి వచ్చి ఉపయోగం లేదు. కాంగ్రెస్ కార్యకర్తల కృషితోనే అధికారంలోకి వచ్చాం. కార్యకర్తలు ఆత్మగౌరవంతో బతకాలి. వారు ఆత్మగౌరవంతో నిలబడేలా చేయాల్సిన బాధ్యత అధికారంలోకి వచ్చిన వారిపై ఉంటుంది. తెలంగాణతోపాటు పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇది మన ప్రభుత్వమని కార్యకర్తలకు అనిపించాలి. ప్రభుత్వంలో కార్యకర్తల భాగస్వామ్యం ఉండాలి. పదేళ్లపాటు జెండా మోసిన వారి అభిప్రాయాలను విని, వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది..’ అని మీనాక్షి చెప్పారు. సామాజిక సర్వే ఎజెండా క్షేత్రస్థాయికి చేరాలి: ‘ఓవైపు ప్రత్యర్థి పార్టీల రాజకీయ వాదాలను నియంత్రిస్తూనే, కాంగ్రెస్ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అందువల్ల వ్యక్తి వాదం వద్దు. అందరం కలిసి సంఘటితంగా పనిచేయాలి. తెలంగాణలో ప్రాంతీయ పార్టీ కూడా ఉంది. ఆ పార్టీతో పోరాడే విధానం వేరుగా ఉండాలి. బీజేపీ, బీఆర్ఎస్లకు పెద్ద తేడా ఏమీ లేదు. అయితే వారిని ఎదుర్కొనేందుకు నిర్దిష్ట కార్యాచరణ ఉండాలి.దేశంలోనే తొలిసారి తెలంగాణలో కులగణన జరిగింది. ఇది దేశానికే రోల్‌మోడల్ కావాలి. సామాజిక సర్వే ఎజెండా క్షేత్రస్థాయికి చేరాలి. ప్రభుత్వం ఎంత పనిచేసినా పార్టీపరంగా ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ఉపయోగం ఉండదు. జై బాపూ, జై భీం, జై సంవిధాన్ కార్యక్ర మాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇందుకోసం జిల్లా, మండల, గ్రామ స్థాయిలో కార్యాచరణ రూపొందించుకోవాలి..’ అంటూ దిశానిర్దేశం చేశారు. రైల్వేస్టేషన్‌కు రావొద్దు.. బ్యాగులు మోయొద్దు: ‘అందరం అన్నదమ్ముల్లా కలిసి పనిచేద్దాం. పార్టీ కార్యకర్తలు ఎవరు ఫోన్ చేసినా నేను మాట్లాడతా. నా కోసం ఎవరూ రైల్వేస్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదు. పార్టీ కార్యకర్తలను వెనుక తిప్పుకోవడం, జిందాబాద్‌లు కొట్టించుకోవడం సరికాదు. నా బ్యాగులు కూడా ఎవరూ మోయవద్దు. ఒకవేళ నాకు బలం లేకపోతే నేనే సహాయం అడుగుతా. బ్యానర్లు, హోర్డింగుల్లో ఫొటోలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలంటే కుదరదు. ప్రజల్లో ఉన్నప్పుడే గెలుస్తారు. పార్టీ కార్యకర్తలు వారి పనిచేసుకుంటూ వెళ్లాలి. ఎక్కడా ఆత్మగౌరవాన్ని తక్కువ చేసుకోవద్దు. ఏడాది కష్టపడిన విధంగానే మరో నాలుగేళ్లు కష్టపడదాం. అందరితో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వమంటే పేదల ప్రభుత్వమని నిరూపిద్దాం..’ అని మీనాక్షి పిలుపునిచ్చారు. -
‘పేదల ముఖాల్లో నవ్వులు చూడాలి.. అప్పుడే మనం పని చేసినట్లు’
హైదరాబాద్: ప్రస్తుతం మన ప్రభుత్వంలో ఉన్నామని, పేదవాడి కోసం పని చేయాలన్నారు తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్., ఈరోజు హైదరాబాద్ లో జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘ఇప్పుడు మనం ప్రభుత్వం లో ఉన్నాం.. పేద వాడి కోసం పని చేయాలి. పేదల మొఖంలో నవ్వులు చూడాలి.. అప్పుడే మనం పని చేసినట్టు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎంతో పోరాట శక్తి ఉంది.. అనేక రకాలుగా పోరాటాలు చేసాము.. అందుకే తెలంగాణ లో అధికారంలోకి వచ్చాము.రాహుల్ గాంధీ రాజ్యాంగ రక్షణ కోసం భారత్ జొడో యాత్ర నిర్వహించి ఒక మైదానాన్ని తయారు చేశారు.మనం దాని కోసం పోరాటం చేయాలి. బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలతో మనం ఇక్కడ పోరాటం చేయాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పోరాటం చేసి స్వాతంత్రాన్ని తెచ్చింది... కాంగ్రెస్ ఎలాంటి పోరాటానికి అయిన సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇవన్నీ ప్రజలకు సక్రమంగా అందాలి పదేళ్లు గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడి పని చేసారు. వారికి న్యాయం జరగాలి.. పదవులు పొందిన వారు ప్రజల కోసం పని చేయాలి. మనం చేసిన పనులను ప్రజలకు వివరించాలి. దేశంలో ఎక్కడా లేని విదంగా ఇక్కడ కులఘనన చేపట్టాము.. ఇది చాలా గొప్ప విషయం. ప్రతి గ్రామ గ్రామానికి వెళ్లి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలి. గ్రామ గ్రామన పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలి. ఈ విషయంలో పీసీసీ ఒక పకడ్బందీగా కాలెండర్ సిద్ధం చేయాలి’ అని మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. -
‘ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా కార్యకర్తలు పని చేయాలి’
హైదరాబాద్: ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా కాంగ్రెస్ కార్యకర్తలు పని చేయాలన్నారు మంత్రి సీతక్క. టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘ అధికారం అనేది వస్తుంది.. పోతుంది. కానీ 140 ఏళ్లుగా దేశానికి పార్టీ సేవలు చేస్తుంది.పార్టీ అనేది తల్లి లాంటిది. తల్లి లేకపోతే పిల్లలు అనాథలు అవుతారు. కాబట్టి క్షేత్ర స్థాయిలో పార్టీ జెండా పండగ కార్యక్రమాలు చేయాలి. గ్రామ గ్రామాన ప్రభుత్వ కార్యక్రమాలు వివరించాలి. అర్హులకు పథకాలు అందేలా చూడాలి. ప్రజల్లోకి విస్తృతంగా ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకు వెళ్ళాలి. భవిష్యత్ లో పార్టీ బలోపేతం కు ఉపయోగ పడుతుంది. రాహుల్ గాంధీ చరిత్మకమైన భారత్ జోడొ యాత్ర చేశారు. నిర్మాణాత్మకంగా పార్టీ పటిష్టత కోసం పని చేయాలి. మరో వందేళ్లు పార్టీ నిలబడేలా కార్యాచరణ తీసుకోవాలి. పార్టీ లోకి కొందరు వస్తుంటారు పోతుంటారు.. అవేవీ పట్టించుకో వద్దు’ అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. -
మేం ‘పింక్ బుక్’ రాస్తున్నాం.. ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ వార్నింగ్!
సాక్షి, హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) ప్రత్యర్థి పార్టీల నేతలకు, అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. మేం పింక్ బుక్ (pink book) రాస్తున్నాం. కార్యకర్తలపై దాడులు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోం’ అని హెచ్చరించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో శుక్రవారం బీసీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ (brs) నాయకులు ఎమ్మెల్సీ కవిత, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ‘బీసీలకు విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో 46 శాతం రిజర్వేషన్లకు వేర్వేరుగా 3 బిల్లులు పెట్టాలి. మూడింటికి ఒకే బిల్లు పెడితే కోర్టుల్లో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి.కాంగ్రెస్ చేపట్టిన కుల గణన సర్వే తప్పుడు తడకగా ఉంది. 2014 కేసీఆర్ (kcr) జరిపిన సర్వేలో బీసీలు 52 శాతం ఉన్నట్లు తేలింది. నేటి కాంగ్రెస్ సర్వే 46 శాతం బీసీలు ఉన్నట్లు చెబుతోంది. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా బీసీ హక్కులకు రాజ్యాంగ రక్షణ రాకపోవడం బాధాకరం. బీసీలకు రాజ్యాంగ రక్షణ కల్పించి ఉంటే అభివృద్ధిలో భారత్ అమెరికాను మించిపోయేది’అని వ్యాఖ్యానించారు.మరోవైపు, నాగర్ కర్నూల్ సొంత జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ‘సింగోటం ఆలయ అభివృద్ధి కోసం మాజీ సీఎం కేసీఆర్ రూ.15 కోట్లు కేటాయించారు. దేవుడికిచ్చిన డబ్బులను జూపల్లి కృష్ణారావు క్యాన్సిల్ చేయించారు. ఆలయ అభివృద్ధికి కేటాయించిన రూ.15 కోట్లను క్యాన్సిల్ చేయడం దారుణం. జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ నాయకుల మీద కక్ష్య గట్టి కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పలు హత్య కేసుల్లోని హంతకులకు కొమ్ము కాస్తున్నారు. జూపల్లి నియోజకవర్గానికి రావాలి. టూరిజం మంత్రిలా కాకుండా టూరిస్ట్లా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గానికి రావడం లేదు. మేం పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం. కార్యకర్తలపై దాడులు చేసిన వారు నాయకులైనా, అధికారులైనా ఉపేక్షించేది లేదని’ స్పష్టం చేశారు. -
‘వచ్చే ఎన్నికల నాటికి ఏ పార్టీలో ఉంటాడో తెలీదు’
నిజామాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి మండిపడ్డారు. కేంద్ర మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఉన్న కిషన్‌రెడ్డిడ్డికి సీఎం రేవంత్ రాసిన లేఖ దిక్కుమాలినదిగా అభివర్ణించారు రాకేశ్‌రెడ్డి. కిషన్‌రెడ్డిడ్డిని విమర్శించే నైతిక హక్కు రేవంత్ కు లేదంటూ ధ్వజమెత్తారు.‘ మూడు పార్టీలు మారి.. ఢిల్లీకి కప్పం కట్టి సీఎం కుర్చీ తెచ్చుకున్న వ్యక్తి రేవంత్. పుట్టినప్పుడే కాషాయ జెండాను ముద్దాడిన వ్యక్తి కిషన్‌రెడ్డి. కిషన్‌రెడ్డిని విమర్శించే నైతిక హక్కు రేవంత్‌కు లేదు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా చేసిన ఘనత కిషన్‌రెడ్డిది. నిజాయితీలో మచ్చలేని వ్యక్తి కిషన్‌రెడ్డిడ్డి. రానున్న ఎన్నికల్లో రేవంత్ కు గట్టి సమాధానం చెబుతాం. వచ్చే ఎన్నికల నాటికి రేవంత్ ఏ పార్టీలో ఉంటాడో తెలీదు. రాబార్ట్ వాద్రా కోసం మూసీ ప్రాజెక్టు చేపడితే మేమేందుకు నిధులిస్తాం. అవినీతి ప్రాజెక్టుల తప్ప, ప్రజలకు ఇచ్చిన ఒక్క హమీ కూడా నెరవేర్చడం లేదు. తెలంగాణకు నిధులిచ్చి ఆదుకుంటున్నది కేంద్ర ప్రభుత్వమే’ అని ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి తెలిపారు రేవంత్ Vs కిషన్‌రెడ్డి.. బహిరంగ లేఖతో సీఎం కౌంటర్ -
రేవంత్ Vs కిషన్‌రెడ్డి.. బహిరంగ లేఖతో సీఎం కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య పరస్పర విమర్శలపర్వం కొనసాగుతోంది. పలు ప్రాజెక్ట్‌ల అంశమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డికి కౌంటరిస్తూ తాజాగా సీఎం రేవంత్ బహిరంగ లేఖను విడుదల చేశారు. దీంతో, తెలంగాణలో మరోసారి రాజకీయం హీటెక్కింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ తాజాగా తొమ్మిది పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో రాష్ట్రానికి చెందిన ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేశామో తెలియజేశారు. ఇక, సీఎం రేవంత్ లేఖలో.. ఆర్ఆర్ఆర్, మూసీ, మెట్రో ఫేజ్-2, హైదరాబాద్ సివరేజ్, వరంగల్ అండర్ గ్రౌండ్ సివరేజ్ కోసం ఎన్ని సార్లు కేంద్ర మంత్రులను, అధికారులను కలిసినా ఉపయోగం లేదు. మేము సిస్టం ఫాలో అయ్యాం.. కానీ, కేంద్రమే పక్కన పెట్టింది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇదిలా ఉండగా, రెండు రోజుల క్రితమ ప్రధాని మోదీతో సమావేశానంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘హైదరాబాద్‌లో మెట్రో రెండోదశ ప్రాజెక్టును కేంద్ర క్యాబినెట్ వద్దకు వెళ్లకుండా కిషన్‌రెడ్డే అడ్డుకున్నారు. తన మిత్రుడు కేసీఆర్ పదేళ్లలో చేయని పని ఇప్పుడు చేస్తే రేవంత్‌రెడ్డికి పేరొస్తుందనే అలా చేశారు. నాకు రాష్ట్ర ప్రయోజనాల కంటే పేరు ముఖ్యం కాదు. కావాలంటే అనుమతులు, నిధులు తెప్పించి ఆ పేరును కిషన్‌రెడ్డినే తెచ్చుకోమనండి. నేను కూడా ఆయన పేరే ఊరూరా ప్రచారం చేస్తా. సన్మానిస్తాం అన్నారు. అలాగే, తెలంగాణ అభివృద్ధికి అవసరమైన ఐదు ప్రాజెక్టులకు సహకరించాలని మోదీకి విన్నవించాం. వాటికి అనుమతులు, నిధులు తీసుకురావాల్సిన బాధ్యత కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లదే. లేకపోతే వారిద్దరూ గుజరాత్‌కో.. ఇంకో రాష్ట్రానికో వెళ్లిపోవాలి. తెలంగాణలో వారికి తిండి దండగ’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి గాలి మాటలు. బెదిరింపు రాజకీయాలకు నేను భయపడను. నేను మెట్రోను అడ్డుకున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజంగా రేవంత్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ఇది నిరూపించాలి. ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలను మానుకోవాలి. సీఎం స్థాయి వ్యక్తి అవగాహన లేక మాట్లాడుతున్నారు. నాపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. -
తెలంగాణ ప్రాజెక్టులను సర్వనాశనం చేసింది మీరే
అచ్చంపేట రూరల్: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టులు పూర్తి చేయడం కంటే.. వారి జేబులు నింపుకోవడంపైనే శ్రద్ధ చూపారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులను సర్వనాశనం చేసిన ఘనత కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులదేనని చెప్పారు. గురువారం దోమలపెంటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పలు అంశాలను వెల్లడించారు.నల్లగొండ జిల్లా ప్రజలను ఫ్లోరైడ్ నీటి నుంచి కాపాడటంతోపాటు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించి పరుగులు పెట్టించారన్నారు. సొరంగ పనులు ముందుకుసాగడానికి గత ప్రభుత్వం కరెంట్ కూడా అందించలేదని చెప్పారు. ఎస్ఎల్బీసీ వద్ద ఎంతో నిష్ణాతులైన రెస్క్యూ బృందాలతో సహాయక చర్యలు జరుగుతున్నాయన్నారు. పూర్తిగా పారదర్శకంగా దేశ, విదేశాల్లో ఉన్న టన్నెల్ నిపుణులతో సమన్వయం చేసుకొని రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నామని తెలిపారు.11 ఏజెన్సీలను కోఆర్డినేట్ చేసి పనులు పర్యవేక్షిస్తున్నామన్నారు. రెండుమూడు రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తవుతుందని, రెండు,మూడు నెలల్లో టన్నెల్ పనులు పునఃప్రారంభించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల నుంచి పనులు జరుగుతున్నాయని, ఇప్పుడు అనుమతులు అడగటం సిగ్గు చేటని, వారుచెప్పే మాటల్లో అర్థం లేదన్నారు. మాజీ మంత్రులు మాట్లాడుతున్నవి అబద్ధపు మాటలని చెప్పారు.గత ప్రభుత్వంలో పనులు పూర్తి చేయకపోగా, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి మాజీ మంత్రి హరీశ్‌రావుకు సిగ్గుండాలన్నారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను ఏ ప్రతిపక్ష నాయకుడికి చూసేందుకు అనుమతి ఇవ్వలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుకు సైతం అనుమతి ఇవ్వలేదని గుర్తు చేశారు. తాము భిన్నంగా వ్యవహరిస్తున్నామని, సొరంగ సంఘటనను పరిశీలించేందుకు బీఆర్ఎస్ నాయకులకు అనుమతులు ఇచ్చామని చెప్పారు. హెలికాప్టర్లో తిరగాలన్న మోజు లేదుతాను పాలన మరిచి హెలికాప్టర్లో చక్కర్లు కొడుతున్నానని బీఆర్ఎస్ నాయకులు అర్థంపర్థం లేని ఆరోపణలు చేయడం సిగ్గు చేటని, తాను సొరంగంలో చిక్కుకున్న 8 మంది ప్రాణాలను కాపాడటానికే హెలికాప్టర్ ఉపయోగిస్తూ అధికారులతో సమీక్షలు నిర్వహించేందుకే ఇక్కడకు వస్తున్నామని మంత్రి ఉత్తమ్ అన్నారు. తాను పైలట్‌నని, హెలికాప్టర్లో తిరిగే మోజు తనకు లేదన్నారు.గత ప్రభుత్వంలో శ్రీశైలం పవర్‌హౌస్‌లో 9 మంది చనిపోతే ఎవరూ పట్టించుకోలేదని, అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి అక్కడకు వెళ్తుంటే దారిలో అరెస్టు చేశారన్నారు. సొరంగ ఘటనను రాజకీయ లబ్ధికోసం బీఆర్ఎస్ మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జగదీశ్‌రెడ్డి మంత్రిగా ఉండి ఎస్ఎల్బీసీకి కరెంటు కట్ చేయడంతోనే డీవాటర్ చేయడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయని, గత పాలకులు సక్రమంగా పనిచేసి ఉంటే ప్రాజెక్టు ఎన్నడో పూర్తయ్యేదన్నారు. సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, వి.హన్మంతరావు పాల్గొన్నారు. -
రేవంత్‌రెడ్డి ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రి
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ డైరెక్షన్లోనే సీఎం రేవంత్ ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీజేపీతో రేవంత్ కలిసి పనిచేస్తున్నారని, ఇటీవల సీఎం, మోదీ నడుమ జరిగిన భేటీతో వారి దోస్తీ బట్టబయలైందన్నారు. గురువారం తెలంగాణ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య భాగస్వామ్యం ఉందని, అందులో భాగంగానే లేనిపోని విషయాలను తెచ్చి ఆ రెండు పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీకి అంటగడుతున్నారని ఆమె మండిపడ్డారు.‘న్యాయవాది సంజీవరెడ్డి మరణం, భూపాలపల్లిలో భూతగాదాలతో వ్యక్తి హత్య, దుబాయిలో ఓ వ్యక్తి మరణం వంటి ఘటనలను బీఆర్ఎస్కు సీఎం అంటగడుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా ఇది. కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడం మినహా సీఎంకు ఇంకో ఆలోచన లేదు’అని కవిత మండిపడ్డారు. ప్రభుత్వ అప్పులపై నెలకు రూ.6,500 కోట్ల వడ్డీ కడుతున్నామని సీఎం అబద్దాలు చెబుతున్నారన్నారు. ఎస్ఎల్బీసీ విపత్తును పక్కన పెట్టి సీఎం ఎన్నికల ప్రచారానికి వెళ్లారని, సీఎంకు తెలంగాణ ప్రజలు ముఖ్యమా.. కాంట్రాక్టర్లు ముఖ్యమా అని ఆమె ప్రశ్నించారు. -
తెలంగాణలో తుగ్లక్ పాలన.. రేవంత్‌పై ఈటల ఫైర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో తుగ్లక్ పాలన నడుస్తోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. ప్రధాని మోదీని విమర్శిస్తే.. కేసీఆర్‌కు పట్టిన గతే సీఎం రేవంత్‌రెడ్డికి పడుతుందని మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయాలపై ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా.. గవర్నమెంట్ పనుల టెండర్లు తీసుకోవడం అంటే ఉరి వేసుకోవడమే అన్నట్లుగా మారింది. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయకుంటే ఈ మాత్రం పనులు కూడా కనిపించవు. సీసీ రోడ్లు, చౌరస్తాలో వెలిగే లైట్లు, స్మశాన వాటికలు, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయి.. వీటిపై చర్చకు వస్తారా రండి. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కోసం 25 ఏళ్లు కొట్లాడినాం.. మూత వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం... తెరిచింది బీజేపీ ప్రభుత్వం. కాజీపేట కొచ్ ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వం కేటాయించిందిఅధికారం చేతిలో ఉన్న పని చేసే దమ్ము రేవంత్ కు లేదు.. కానీ కిషన్ రెడ్డి మీద విమర్శలు చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా పనులు ఎలా ముందుకు వెళ్తాయి. తెలంగాణలో తుగ్లక్ పాలన నడుస్తుంది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ దగ్గర బస్టాప్ కట్టలేని దుస్థితి. కాచిగూడ, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లో పనులు చూసి రావాలని రేవంత్‌కు సూచన.మోదీ గురించి మాట్లాడిన కేసీఆర్ ఏమైపోయారో రేవంత్‌కు అదే గతి పడుతుంది. రిటైర్డ్ ఉద్యోగులకు కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేని దుస్థితి నెలకొంది.. సిగ్గు అనిపించడం లేదా? అని ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. -
‘రాజకీయాలు చేయడం కోసం వెళ్లారా?’
హైదరాబాద్: ఎస్ఎల్బీసీకి వెళ్లిన బీఆర్ఎస్ నేతల తీరు చూస్తుంటే వారు రాజకీయాలు చేయడం కోసమే అక్కడకు వెళ్లినట్లు ఉందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ ఘటనను ప్రకృతి విలయలాగా చూడాలి కానీ రాజకీయాలు చేస్తామనడం సరైంది కాదన్నారు. ‘హరీష్ రావు రాజకీయాలు చేయడం కోసం ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదాన్ని వాడుకోవడం నిజంగా సిగ్గుచేటు. ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే జరిగింది.కాళేశ్వరం టన్నెల్ కూలినప్పుడు ప్రాణ నష్టం జరిగింది.. మీరు ప్రతిపక్షాలకు అనుమతి ఇచ్చిన చరిత్ర లేదు. మేము పోయి రాజకీయం చేయలేదు. శ్రీశైలంలో పవర్ హౌస్ పెయిల్ అయినప్పుడు ఆ జిల్లాకు చెందిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని, మల్లు రవిని పోనియ్యలేదు. మీరు పర్మిషన్ అడగకున్నా slbc కి పోతం అంటే పోనిచ్చినం. హరీష్ రావు రెస్క్యూ టీమ్ కు సలహాలు ఇవ్వనక్కర్లేదు. అక్కడ ఏజెన్సీలు పని చేస్తున్నాయి. ఎనిమిది మంది కుటుంబాలను ఎలా ఆదుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. రెస్క్యూ ను ప్రభుత్వం రిజాల్వ్ చేస్తుంది’ అని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. -
నాకు హెలికాప్టర్లో తిరగాలి అన్న షోకు లేదు
మహబూబ్ నగర్: మరో రెండు మూడు రోజుల్లో ఎస్ఎల్బీసీ సహాయక చర్యలు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అదే సమయంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను రెండు, మూడు నెలల్లో పునః ప్రారంభిస్తామన్నారు మంత్రి.‘ పదేళ్ల పాటు అధికారుంలో ఉన్న బీఆర్ఎస్.. ఈరోజు ఎస్ఎల్బీసీ టన్నెల్ అనుమతుల గురించి మాట్లాడుతోంది. హరీష్ రావు మాటలు పూర్తి అబద్ధాలు.. గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ ద్వారా 30 టీఎంసీల గ్రావిటీ ద్వారా వస్తుంటే బీఆర్ఎస్ వాళ్లు పనులు వదిలిపెట్టి వెళ్లారు. వారు సరైన పని చేసి ఉంటే తెలంగాణలో 30 టీఎంసీల నీళ్లు వచ్చి, మూడు నాలుగు లక్షల ఎకరాల నల్గొండ భూములు సాగులోకి వచ్చేవి.మేము ప్రజాస్వామ్యుతంగా జరిగిన ప్రమాదంపై అందరూ చూసేందుకు అనుమతి ఇస్తున్నాం. వారి హయాంలో ఎన్ని ప్రమాదాలు జరిగినా ప్రతిపక్షంలో ఉన్న మాకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. వాళ్ల హయాంలో 1.81 లక్షల కోట్లు ఖర్చు పెట్టి నామమాత్రపు పనులు చేశారు. వారి హయాంలోనే నీటి పారుదల శాఖ నిర్వీర్యం అయ్యింది. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం బ్లాస్ట్ జరిగి.. 9 మంది చనిపోతే ఒక్కరు కూడా పరామర్శకు రాలేదు. ఆరోజు రేవంత్ రెడ్డి వస్తుంటే కారులో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దేవాదులలో ఏడుమంది చనిపోతే, అస్తిపంజరాలు ఐదేళ్ల తర్వాత దొరికాయి. హరీష్ ఎప్పుడైనా ఆ విషయం గురించి మాట్లాడారా?, ఎన్నో ప్రమాదాలు జరిగినప్పుడు వారి హయాంలో అడిగే నాథుడే లేకున్న పరిస్థితి. ఇప్పుడు ఇక్కడకి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.దేవాదులలో ఏడు మంది చనిపోతే.. ఆస్తిపంజరాలు ఐదేళ్ల తర్వాత దొరికాయి హరీష్ రావు ఎప్పుడైనా ఆ విషయం గురించి మాట్లాడావా..ఎన్నో ప్రమాదాలు జరిగినప్పుడు వారి హయాంలో అడిగే నాథుడే లేకున్న పరిస్థితి.ఇక్కడికి వచ్చి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. పాలమూరు రంగారెడ్డి లో 27,500 కోట్లు ఖర్చుపెట్టి ఒక ఎకరాకు కూడా నిరంది ఇవ్వలేదు. ఎస్ఎల్బీసీకి కరెంట్ కట్ చేస్తే డి ఓటరింగ్ చేయలేక పనులు ఆగిపోయాయి అప్పుడు జగదీశ్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు ఏమి చేశాడు. నాకు హెలికాప్టర్ లో తిరగాలి అన్న షోకు లేదు.. నేను ఓ పైలట్ ను. భారతదేశంలో టన్నెల్ ప్రమాదాలలో అత్యంత నిపుణులను కలిగిన 11 ఏజెన్సీలను తీసుకువచ్చి సమర్థవంతంగా మా ప్రభుత్వం సహి చర్యలు నిర్వహించింది. బీఆర్ఎస్ నాయకులు చెప్పిన మాటలు ప్రత్యేక అబద్ధాలు ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాను’ ’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. -
రేవంత్.. మెట్రో అడ్డుకున్నట్టు నిరూపించే దమ్ముందా?: కిషన్‌రెడ్డి సవాల్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి. నిజంగా రేవంత్‌కు ధైర్యం ఉంటే తాను మెట్రోను అడ్డుకున్నా అనే విషయం నిరూపించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు మెట్రోపై ప్లానింగ్ ఉందా? అని ప్రశ్నించారు.కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి గాలి మాటలు. బెదిరింపు రాజకీయాలకు నేను భయపడను. నేను మెట్రోను అడ్డుకున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజంగా రేవంత్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ఇది నిరూపించాలి. ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలను మానుకోవాలి. సీఎం స్థాయి వ్యక్తి అవగాహన లేక మాట్లాడుతున్నారు. ఇలాంటి వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో.. ప్రధాని నరేంద్ర మోదీని అడిగి.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ప్రజలకు హామీలు ఇచ్చారా?. హామీల, పథకాల అమలు విషయంలో మాపై తోసేసి చేతులు దులుపుకుంటున్నారు. దమ్ములేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పథకాలకు అవసరమైన వనరులు సమకూర్చుకోవాల్సిన బాధ్యత సీఎంకు లేదా?. ప్రధానికి కాగితం ఇవ్వగానే పనులు అయిపోతాయా? అని ప్రశ్నించారు.అంతకుముందు, ప్రధానితో సమావేశానంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘హైదరాబాద్‌లో మెట్రో రెండోదశ ప్రాజెక్టును కేంద్ర క్యాబినెట్ వద్దకు వెళ్లకుండా కిషన్‌రెడ్డే అడ్డుకున్నారు. తన మిత్రుడు కేసీఆర్ పదేళ్లలో చేయని పని ఇప్పుడు చేస్తే రేవంత్‌రెడ్డికి పేరొస్తుందనే అలా చేశారు. నాకు రాష్ట్ర ప్రయోజనాల కంటే పేరు ముఖ్యం కాదు. కావాలంటే అనుమతులు, నిధులు తెప్పించి ఆ పేరును కిషన్‌రెడ్డినే తెచ్చుకోమనండి. నేను కూడా ఆయన పేరే ఊరూరా ప్రచారం చేస్తా. సన్మానిస్తాం అన్నారు. అలాగే, తెలంగాణ అభివృద్ధికి అవసరమైన ఐదు ప్రాజెక్టులకు సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విన్నవించాం. వాటికి అనుమతులు, నిధులు తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లదే. లేకపోతే వారిద్దరూ గుజరాత్‌కో.. ఇంకో రాష్ట్రానికో వెళ్లిపోవాలి. తెలంగాణలో వారికి తిండి దండగ’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
హెలికాప్టర్ నుంచి చూస్తే టన్నెల్లో ఏం జరుగుతుందో తెలుస్తుందా?
హైదరాబాద్, సాక్షి: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(SLBC) సొరంగం ప్రమాద తదనంతర సహాయక చర్యల్లో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల ఎనిమిది మంది ప్రాణాలు గాలిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారాయన. హరీష్‌రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నేతల బృందం ఇవాళ(గురువారం) ఎస్ఎల్బీసీ వద్దకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో.సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం(SLBC Tunnel Accident) జరగడం దురదృష్టకరం. కానీ, ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వ స్పందన కరువైంది. ప్రమాదం జరిగి ఐదు రోజులు గడుస్తున్నా సహాయక చర్యలు అసలు ప్రారంభం కాలేదని.. అసలు ఏజెన్సీ ప్రతినిధుల మధ్య సమన్వయమే లేదని ఆరోపించారాయన. ప్రమాదంపై ఇప్పటిదాకా ప్రభుత్వమే ఒక అంచనాకి రాలేకపోతున్నారు. ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి మాటల మధ్య పొంతన లేదు. హెలికాప్టర్లో వెళ్తున్న మంత్రులు పోటాపోటీగా ఇంటర్వ్యూ లు ఇస్తున్నారే తప్ప సహాయక చర్యలను పర్యవేక్షించడం లేదు. సహాయక చర్యలను వెంటనే ప్రారంభించాలి. ఎంత తొందరగా సహాయక చర్యలు మొదలైతే అంత ఉపయోగకరంగా ఉంటుంది. రేవంత్‌కు కౌంటర్ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఎనిమిది మంది ప్రాణాల కంటే.. ఎన్నికల ప్రచారమే ముఖ్యంగా కనిపిస్తోంది. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఆయన ఎగవేతల రేవంత్ రెడ్డి. అబద్ధాలు మాట్లాడుతారు కాబట్టి ఆయన అబద్దాల రేవంత్ రెడ్డి. ఎక్కడా SLBC సహాయక చర్యలపై ఆయన డైరెక్షన్ ఇచ్చినట్లు కనిపించడం లేదు. మొత్తం పది ఏజెన్సీలకు డైరెక్షన్ కరువైంది. సహాయక చర్యల్లో విఫలమై.. బీఆర్ఎస్పై బుదరల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ సహాయక చర్యలను చూడటానికి, మా అనుభవంతో సూచనలు చేయడానికి వెళ్తున్నాం. మూర్ఖులు మమ్మల్ని అడ్డుకుంటే ఏం జరుగుతుందో చూద్దాంబీఆర్ఎస్ హయాంలోనే పనులుకరోనా కారణంగా కూలీలు వెళ్లిపోవడంతో SLBC పనులు ముందుకు వెళ్ళలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కంటే BRS ప్రభుత్వంలోనే అధిక పనులు చేశాం. కాంగ్రెస్ హయంలో పనులు మూలకు పడితే.. రూ.100 కోట్ల రూపాయల మొబలైజేషవ్ నిధులిచ్చాం. మా హయాంలో 13 కిలోమీటర్లు పని జరిగింది. ఢిల్లీలో రేవంత్ రెడ్డి BRS పై బుదర జల్లుతున్నారు. ఆయన మాట్లాడాల్సింది SLBC సహాయక చర్యలపై. తన పాలన వైఫల్యం నుంచి బయటపడేందుకు గత ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. SLBC సందర్శన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుతాను’ అని హరీష్ రావు అన్నారు. సోయిలేకుండా మాట్లాడుతున్నారుఎస్సెల్బీసీలో జరిగిన ప్రమాదం.. 8 మంది కార్మికుల ఆచూకీ తెలియకపోవడం దురదృష్టకరం. బీఆర్ఎస్ తరఫున ఈ ప్రభుత్వానికి వారం రోజులు సమయం ఇచ్చాం. ఇవాళ హరీశ్ రావు నేతృత్వంలో ఎస్సెల్బీసీ వెళ్తున్నాం. ఘటనా స్థలాన్ని పరిశీలించి సూచనలు చేస్తాం. తెలంగాణ మంత్రులు సోయి లేకుండా మాట్లాడుతున్నారు. వాటర్, నీళ్లు కలిశాయి అని మాట్లాడటం బాధాకరం. మంత్రుల తీరు జాతీయ స్థాయిలో పరువు తీసేలా ఉంది. అందుకే ఆ పదవుల్లో ఉండాలో లేదో వాళ్లే తేల్చుకోవాలి. ::నల్లగొండలో మీడియాతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి -
తెలంగాణ: ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
Telangana MLC Elections Polling Updates..తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన పోలింగ్వచ్చే నెల 3వ తేదీన కౌంటింగ్ఖమ్మం :ఖమ్మం పట్టణంలోని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం రిక్కా బజార్ వద్ద ఉద్రిక్తత..ప్రధాని నరేంద్ర మోడీపై UTF నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతల ఆందోళనబీజేపీ నేతలను అడ్డుకుని, ఇరు వర్గాల టెంట్ లను తొలగించిన పోలీసులు..బీజేపీ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాటపోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత పరిస్థితి..బిజెపి నేతలను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు..అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలని పోలీస్ వాహనాన్ని అడ్డుకున్న బీజేపీ శ్రేణులు..చివరకు అదుపులోకి తీసుకున్న బీజేపీ నేతలను వదిలేయడంతో సద్దుమణిగిన వివాదం...2 గంటల వరకూ పోలింగ్ శాతం ఇలా..మధ్యాహ్నం 2 గంటల వరకు మెదక్-నిజామాబాద్- కరీంనగర్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శాతం - 40.61మధ్యాహ్నం 2 గంటల వరకు మెదక్-నిజామాబాద్- కరీంనగర్-ఆదిలాబాద్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శాతం - 63.49 12 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా.. ఉదయం 12 గంటల వరకు మెదక్-నిజామాబాద్- కరీంనగర్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శాతం - 19.20 %ఉదయం 12గంటల వరకు మెదక్-నిజామాబాద్- కరీంనగర్-ఆదిలాబాద్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శాతం - 33.98%ఖమ్మంలో ఉద్రిక్తత..ఖమ్మం నగరంలోని రిక్కాబజార్ సెంటర్లో ప్రచార టెంట్లో అభ్యర్థుల ఫ్లెక్సీల ఏర్పాటుతో వివాదం.యుటీఎఫ్, బీజేపీ నేతల మధ్య వాగ్వివాదం, తోపులాటఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులువరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ ఉపాధ్యాయ పోలింగ్ సమీపంలో ఉద్రిక్తత.కరీంనగర్ జిల్లా:కరీంనగర్ జిల్లాలో ఉదయం 10 గంటల వరకు పోలింగ్ శాతం..గ్రాడ్యుయేట్స్ 6.37%టీచర్స్ 13.10%సూర్యాపేట జిల్లా..సూర్యాపేట జిల్లా కొనసాగుతున్న పోలింగ్ఇప్పటి వరకు శాతం 14.68% పోలింగ్ నమోదు.👉జగిత్యాల జిల్లా కేంద్రంలోని పురాణి పెట్ స్కూల్ లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కు ను వినియోగించుకున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పోలింగ్ ప్రారంభమైంది. మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ జిల్లాల పట్టభద్రులు, అదే జిల్లాల ఉపాధ్యాయ, వరంగల్–ఖమ్మం–నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది.👉ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించి శాసనమండలిలో తమ బలాన్ని పెంచుకోవాలని భావిస్తున్న బీజేపీ నాయకత్వం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ కూడా ఉత్తర తెలంగాణలో గెలిచి పట్టు నిలుపుకునే ప్రయత్నంలో పావులు కదిపింది.👉వరంగల్–ఖమ్మం–నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న హర్షవర్ధన్‌రెడ్డి (పీసీసీ అధికార ప్రతినిధి)కి అధికార అభ్యర్ధిగా కాకుండా కాంగ్రెస్ పరోక్ష మద్దతు అందిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఎక్కడా అభ్యర్ధిని నిలపలేదు. ఏ స్వతంత్ర అభ్యర్ధికి కూడా ప్రత్యక్ష, పరోక్ష మద్దతు ప్రకటించలేదు. కరీంనగర్ ఉపాధ్యాయ పరిధిలో ఇలా... 👉మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో తమ అభ్యర్థి మల్క కొమురయ్య గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా బీజేపీ అంచనా వేస్తోంది. ఇక్కడ ప్రధానంగా మల్క కొమురయ్య (బీజేపీ), వంగా మహేందర్‌రెడ్డి (పీఆర్టీయూ), అశోక్‌కుమార్.వై (యూటీఎఫ్, ఇతర సంఘాల మద్దతు), సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్‌రెడ్డి (ఎస్టీయూ, ఇతర సంఘాలు)ల మధ్య పోటీ ఉంటుందని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ పరిధిలో ఇలా... 👉మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల స్థానంలో ప్రధానంగా సి.అంజిరెడ్డి, ప్రసన్న హరికృష్ణల మధ్య పోటీ ఉంటుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్ధిగా బరిలో ఉన్న నరేందర్‌రెడ్డికి విజయావకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే పలువురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉండడంతో వారికి పడే ఓట్లను బట్టి ఫలితాలు ప్రభావితం అవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సి.అంజిరెడ్డి (బీజేపీ), ఉటుకూరి నరేందర్‌రెడ్డి (కాంగ్రెస్), ప్రసన్న హరికృష్ణ (బీఎస్పీ), రవీందర్‌సింగ్(ఏఐఎఫ్బీ)ల మధ్య పోటీ ఉంటుందని భావిస్తున్నారు. వరంగల్ ఉపాధ్యాయ పరిధిలో ఇలా... 👉వరంగల్–ఖమ్మం–నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ప్రధానంగా సరోత్తమ్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డిల మధ్య పోటీ ఉండే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చివరకు టీచర్లను ఇన్ఫ్లుయన్స్ చేయడం మనీ మేనేజ్మెంట్ అనేది కీలకంగా మారిందని చెబుతున్నారు. హర్షవర్ధన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు పరోక్షంగా మద్దతు ప్రకటించినట్టు చెబుతున్నారు. శ్రీపాల్‌రెడ్డి కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.👉టీచర్ల సమస్యలపై సరిగ్గా స్పందించలేదని సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు సమాచారం. ఇక మాజీ ఎమ్మెల్సీ పూలరవీందర్ ఓటింగ్‌పై ఏ మేరకు ప్రభావం చూపుతారనే దానిని బట్టి ఓటింగ్ సరళిలో మార్పులు వచ్చి విజేతలపై స్పష్టత వస్తుందంటున్నారు. ఇక్కడ ప్రధానంగా హర్షవర్ధన్‌రెడ్డి (టీచర్స్ జేఏసీ అభ్యర్ధి, టీపీసీసీ అధికార ప్రతినిధి), పులి సరోత్తమ్‌రెడ్డి (బీజేపీ), శ్రీపాల్‌రెడ్డి (పీఆర్టీయూ మద్దతు), మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ (ఎస్టీ్టయూ, బీసీ సంఘాల మద్దతు), సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి (యూటీఎఫ్ అభ్యర్థి)ల మధ్యనే పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్ క్యాపిటల్‌గా హైదరాబాద్: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్ క్యాపిటల్‌గా హైదరాబాద్ ఖ్యాతి గాంచిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందని.. ప్రపంచ అవసరాల్లో 60 శాతానికి పైగా వ్యాక్సిన్లు, 20% జనరిక్ మందులు ఇక్కడి నుంచే సరఫరా అవుతున్నాయని తెలిపారు. బయో ఆసియా– 2025 సదస్సు ముగింపు కార్య క్రమంలో కిషన్‌రెడ్డి ప్రసంగించారు. ‘‘గత పదేళ్లలో భారత ఫార్మా ఎగుమతుల విలువ రెట్టింపు అయింది. 2014లో ఫార్మా ఎగుమతి విలువ 15 బిలియన్ డాలర్లుకాగా.. 2024 నాటికి అది 27.85 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ పరిశోధనలు, ఏఐ–హెల్త్ కేర్, తయారీ రంగంలో వేగంగా వృద్ధి చెందుతూ.. ‘వసుధైక కుటుంబం’అనే భావనకు ప్రతిబింబంగా నిలుస్తోంది..’’అని తెలిపారు. ఫార్మాలో తెలంగాణ కీలకం.. ఫార్మా రంగంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని కిషన్‌రెడ్డి చెప్పారు. దేశంలోని ఫార్మా ఆదాయంలో 35శాతం, బల్క్ డ్రగ్స్‌లో 40శాతం ఆదాయం భాగ్యనగరం నుంచే వస్తోందన్నారు. 800 ఫార్మా, బయోటెక్, మెడ్‌టెక్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీ, ఫార్మాసిటీ, మెడికల్ డివైజెస్ పార్కు వంటివి భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని... 2047 నాటికి 500 బిలియన్ డాలర్ల లైఫ్ సైన్సెస్ ఎకానమీ సృష్టి దిశగా హైదరాబాద్ అడుగులు వేస్తోందని చెప్పారు. లైఫ్ సైన్సెస్ రంగానికి సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గ్లోబల్ హెల్త్‌కేర్ రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ఇన్నోవేటర్లు, శాస్త్రవేత్తలు భారత్‌తో కలసి పనిచేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాగా.. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో వినూత్న ఆవిష్కరణలు చేసిన వారికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర శ్రీధర్‌బాబు బహుమతులు అందజేశారు. 200కుపైగా దేశాలకు భారత మందులు: పీయూష్ గోయల్ ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్‌గా భారతదేశం గుర్తింపు పొందిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. బయో ఆసియా–2025 సదస్సు ముగింపు సందర్భంగా ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా 200కుపైగా దేశాలకు జనరిక్ మందులు సరఫరా చేస్తున్నాం. ఇన్నోవేషన్, రీసెర్చ్, డెవలప్మెంట్, హైవాల్యూ బయో ఫార్మాపై దృష్టి సారించాం..’’అని పీయూష్ గోయల్ తెలిపారు. ఫార్మా రంగంలో సమాచార మార్పిడి, పెట్టుబడులు, ఆవిష్కర్తలకు సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్స్, జహీరాబాద్‌లో ఇండ్రస్టియల్ జోన్, భారత్ మాల కార్యక్రమంలో భాగంగా 2,605 కిలోమీటర్ల జాతీయ రహదారులు, 4 గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టులు, నిజామాబాద్ పసుపుబోర్డులను తెలంగాణకు కేటాయించామని వివరించారు. హైదరాబాద్‌ను ఫార్మా కేంద్రంగా నిలుపుతాం: మంత్రి శ్రీధర్‌బాబు 22వ బయో ఆసియా సదస్సుకు 44 దేశాల నుంచి 3 వేల మంది డెలిగేట్స్, 100 మంది వక్తలు హాజరయ్యారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. 200 బిజినెస్ టు బిజినెస్ మీటింగ్‌లు జరిగాయని వెల్లడించారు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు అన్నిరకాలుగా అండగా ఉంటామని తెలిపారు. బయో ఆసియా సదస్సు ముగింపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో లైఫ్ సైన్స్ పాలసీని త్వరలో తీసుకొస్తామని.. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో లైఫ్ సైన్స్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నామని శ్రీధర్‌బాబు తెలిపారు. ‘‘అమెరికా, ఆ్రస్టేలియా, తైవాన్ దేశాల సంస్థలు మన రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని బయో ఆసియా సదస్సులో తెలిపాయి. పరిశోధనల ద్వారా కొత్త టెక్నాలజీని ఉపయోగించి మందులు తక్కువ ఖర్చుతో బాధితులకు అందించాలన్నది లక్ష్యం. మాపై నమ్మకంతో పెట్టుబడులు పెట్టండి, చెప్పింది చేస్తామని హామీ ఇస్తున్నాం. ప్రపంచంలోనే హైదరాబాద్‌ను ఫార్మా పరిశ్రమల కేంద్రంగా నిలపడానికి మా ప్రభుత్వం కార్యాచరణ తీసుకుంది..’’ అని వెల్లడించారు. -
కూటమి కక్ష.. పోసాని కృష్ణమురళీ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలో పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు పోసాని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజకీయాలకు దూరంగా ఉన్న పోసానిని కూడా కూటమి సర్కార్ వదలలేదు. పోసానికి ఆరోగ్యం బాగోలేదని ఆయన సతీమణి చెప్పిన కూడా పోలీసులు పట్టించుకోలేదు. ఆరోగ్యం బాగోలేదన్నా కూడా పోలీసులు దురుసుగా వ్యవహరించారు.పోసాని అరెస్టు విషయంలో ఏపీ పోలీసులు గేమ్ పోసాని అరెస్టు విషయంలో ఏపీ పోలీసులు గేమ్ ఆడుతున్నారు. అరెస్టు నోటీసులో రేపటి తేదీ వేశారు. మరో వైపు, కుటుంబ సభ్యులకు ఇచ్చిన అరెస్టు సమాచారంలో అన్నమయ్య జిల్లా సంబేపల్లి పీఎస్‌గా పోలీసులు పేర్కొన్నారు. కాని, పోసాని కుటుంబ సభ్యులకు పోలీసులు ఇచ్చిన ఫోన్ నంబర్లో ఓబులపల్లి పీఎస్ అంటూ పోలీసులు చెప్పారు. న్యాయపరమైన వెసులుబాటు రానీయకుండా రెండు చోట్ల నుంచి కేసులను డ్రైవ్ చేస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోసానిపై 111 కేసు పెట్టడమే దీనికి నిదర్శనమని వైఎస్సార్సీపీ వర్గాలు అంటున్నాయి.కావాలనే అక్రమ కేసులు పెట్టి వేధింపులు: అంబటి రాంబాబుఏ కారణంతో పోసానిని అరెస్ట్ చేశారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పోసానిని ఎందుకు అరెస్ట్ చేశారో ఏపీ ప్రజలకు చెప్పాలన్నారు. ‘కూటమి ప్రభుత్వం కనీసం చట్టాన్ని కూడా గౌరవించడం లేదు. ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పకుండా పోసానిని తీసుకెళ్లారు. కావాలనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఏపీలో లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది’’ అంబటి దుయ్యబట్టారు.