breaking news
-
బీజేపీపై ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యతిరేక శక్తులను మళ్లీ బీజేపీ దింపబోతుందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన వాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలకు ఆపరేషన్ స్టార్ట్ చేసింది. అందుకే తెలంగాణ ఉద్యమకారులపై కుట్ర చేస్తుందంటూ ఆమె ఆరోపణలు గుప్పించారు. ‘‘నాకు ఎమ్మెల్సీ ఇస్తే ఎందుకు అక్కసు. నేను తెలంగాణ కోసం ఆస్తులు అమ్మాను’’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు.కేసీఆర్ నా పార్టీని విలీనం చేయాలని రిక్వెస్ట్ చేస్తే.. విలీనం చేసా.. నన్ను విమర్శించిన వారిని ఎవరినీ వదిలిపెట్టాను. కేసీఆర్‌ను వదిలిపెట్టేది లేదు.. అవినీతి విషయం లో అన్ని లెక్కలు తేలుస్తాం’’ అంటూ విజయశాంతి హెచ్చరించారు. ‘‘నేను కొత్త మనిషిలాగా ప్రశ్నలు వేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్లకు నేను సేవలు అందించాను. బీజేపీ, బీఆర్ఎస్ సరైన నిర్ణయాలు తీసుకోలేదు కాబట్టే ఆ పార్టీని వదిలేశాను’ అని విజయశాంతి చెప్పారు.‘‘ఎమ్మెల్సీగా మీ బండారం బయట పెడతానని భయం అవుతోందా?. నా పార్టీని విలీనం చేయించుకొని నన్ను మోసం చేశారు. విజయశాంతికి తెలంగాణకి సంబంధం లేదా?. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అన్నారు కాబట్టి నేను బీజేపీకి వెళ్లాను. నేను తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు కేసీఆర్ టీడీపీలో ఉన్నారు. తెలంగాణ కేసీఆర్ సొత్తు కాదు. తెలంగాణ రాష్ట్ర సాధనకు నా వంతు కృషి నేను చేశాను. తెలంగాణ ఇస్తున్న సమయంలో కేసీఆర్ పార్లమెంటులో లేరు’’ అని విజయశాంతి అన్నారు.‘‘కేసీఆర్ తన దొరబుద్ది నిరూపించుకుంటున్నారు. దొరలు ఓటేస్తేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారా?. నింద వేయడం కాదు. నేను గట్స్ ఉన్న మహిళని. ప్రతిరోజూ నన్ను అవమానించారు. నన్ను హింసపెట్టి పార్టీని విలీనం చేయించుకున్నారు. ఇద్దరి ఆశయం తెలంగాణ రాష్ట్రం అయినప్పుడు రెండు పార్టీలు ఎందుకని అనుకున్నాం. తెలంగాణ వ్యతిరేకి కిరణ్ కుమార్‌రెడ్డి బీజేపీలోకి వచ్చినందుకు ఆ పార్టీని వదిలేశాను. మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి, కిషన్ రెడ్డి స్నేహితులు ’’ అని విజయశాంతి పేర్కొన్నారు. కాపలా కుక్కలాగా తెలంగాణని కాపాడుకున్నాం. 7 లక్షల కోట్ల అప్పు ఎలా అయిందో విడిచిపెట్టకుండా అడగాలి. కేసీఆర్ మోసాలన్నీ బయటకి తీయాలి. కేసీఆర్ ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడు. మేం కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది’’ అంటూ విజయశాంతి వ్యాఖ్యానించారు. -
అధికారులకు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: కొందరు అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. చిన్న స్థాయి అధికారి నుంచి పెద్ద స్థాయి అధికారుల వరకు అలసత్వం వహిస్తున్నారని.. ఎమ్మార్వో అయినా, ఐఏఎస్ అయినా పని చేయకపోతే ప్రభుత్వం నుంచి సీరియస్ చర్యలు ఉంటాయంటూ ఆయన హెచ్చరించారు.‘‘కేటీఆర్, హరీష్ ఒకటై కవితని బయటకి పంపే ప్రయత్నం చేస్తున్నారు. మహిళకు మంత్రి పదవి ఇవ్వకపోతే కవితకి అడగడం చేత కాలేదు. బీసీల కోసం మాట్లాడే హక్కు కవితకి ఎక్కడిది?. సామాజిక న్యాయానికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. తెలుగు ప్రజల గుండెల్లో విజయశాంతి ఉంటుంది. అద్దంకి, విజయశాంతి, శంకర్ నాయక్ రాకతో మండలిలో మా బలం పెరుగుతుంది’’ అని మహేష్ గౌడ్ చెప్పారు.అసెంబ్లీలో జగదీశ్వర్‌రెడ్డి వ్యవహరించిన తీరు సరిగా లేదు. కేటీఆర్ గవర్నర్‌పై వ్యవహరించిన తీరు అందరం చూశాం. దళితులపై కేసీఆర్ పద్ధతి ఎలా ఉండేదో అందరికీ తెలుసు. భట్టి విక్రమార్కకు సీఎల్పీ హోదా లేకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో విజయశాంతి పాత్ర ఉంది. 2023 ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా విజయశాంతి పని చేసింది. మహిళలకు మంత్రి పదవి ఇవ్వని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం మాట్లాడడం సిగ్గుచేటు’’ అంటూ మహేష్ గౌడ్ దుయ్యబట్టారు.‘‘నిరంతరం పార్టీ కోసం పని చేసిన వ్యక్తులకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చాం. దక్షిణాది రాష్ట్రాల రాజకీయ నాయకుల మీటింగ్ కి మేం తప్పకుండా వెళ్తాం. దక్షిణ భారత దేశంలో పార్లమెంట్ సీట్లు పెంచకపోతే ఊరుకోం’’ అని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు. -
నాకు మంత్రి పదవి వస్తే వారికే లాభం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తనకు మంత్రి పదవి వస్తే పార్టీకి, తెలంగాణ ప్రజలకే లాభమని.. కానీ ఆ పదవి ఎప్పుడు వస్తుందో చెప్పలేనంటూ వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. గురువారం ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ, భువనగిరి పార్లమెంట్ స్థానం గెలవాలని తనకు అప్పగిస్తే.. నిద్రహారాలు మాని గెలిపించానన్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి సస్పెన్షన్‌పై రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ.. అసెంబ్లీలో జగదీస్‌రెడ్డి చాలా అతి చేశారన్నారు. మేము ఎవ్వరిని టార్గెట్ చేయం.. తప్పు చేస్తే వదిలి పెట్టం.. ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి చైర్‌ను ప్రశ్నించడం సరికాదు. స్పీకర్ కుర్చీని ఎవ్వరు క్వశ్చన్ చేయలేరు. స్పీకర్‌ను అవమానించినందుకే చర్యలు తీసుకున్నాం. ఎథిక్స్ కమిటికి సిఫార్సు చేశాం’’ అని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. -
ఇదే మా సవాల్.. మీ సవాల్‌కు మేము కూడా సిద్ధమే!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధులపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణాకు కేంద్రం అన్యాయం చేస్తుందని, రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులను సైతం ఇవ్వడం లేదని విమర్శించారు. దీనిపై ఎవరైనా చర్చకు వస్తారేమో రండి.. అంటూ రాష్ట్ర బీజేపీ నాయకులకు పొన్నం సవాల్ విసిరారు. తెలంగాణ శాసనసభలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ల మధ్య ఇదే అంశంపై తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే బీజేపీ నాయకులు చర్చకు రావాలంటూ పొప్నం సవాల్ చేశారు.పొన్నం ప్రభాకర్ సవాల్ ను స్వీకరిస్తున్నా అంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ‘ పొన్నం ప్రభాకర్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రం ద్వారా జరుగుతున్నాయి. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన నిధులపై చర్చ జరపాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం’ అని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.దీనికి కౌంటర్ గా తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందని పొన్నం ప్రభాకర్ మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో రాష్ట్ర బీజేపీ లేఖ విడుదల చేయాలి. మూసీకి నిధులు ఇవ్వాలి, మూసీకి నిధులు ఇవ్వాలి. కరీంనగర్ నుంచి మంచిర్యాల వరకూ రైల్వే లైన్ ఇవ్వాలి. తెలంగాణ కోసం ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇచ్చేలాగ రాష్ట్ర బీజేపీ ప్రయత్నం చేయాలి’ అని పొన్నం స్పందించారు. -
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. నేటితో(గురువారం) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థ/ల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగీవ్రమైంది. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు మాత్రమే ఉండగా, వీరిపై పోటీకి ఎవరూ సిద్ధం కాలేదు. దాంతో ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి.కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ లకు ఎమ్మెల్సీ టికెట్లు కేటాయించగా, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యంలు అభ్యర్థులుగా ఉన్నారు. కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా ఒక సీటును సీపీఐకి ఇచ్చింది కాంగ్రెస్. రెండు స్థానాలను సీపీఐ అడిగినప్పటికీ ఒక స్థానమే సీపీఐకి కేటాయించింది కాంగ్రెస్. వీరి మధ్య గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పొత్తు కుదిరింది. దాంతో సీపీఐకి ఎమ్మెల్సీ స్థానం కేటాయించక తప్పలేదు. అయితే ఉపసంహరణ గడువు ముగియడంతో అధికారిక ప్రకటన వెలువడింది. ఐదుగురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాలు అందించారు. -
జగదీష్‌రెడ్డి సస్పెన్షన్.. కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డిని స్పీకర్ సస్పెన్షన్ చేయడంతో నెక్లెస్ రోడ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. రేపు(శుక్రవారం) తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనానికి కేటీఆర్ పిలుపునిచ్చారు.ఢిల్లీలో రేవంత్ ఆదేశాలతో తమ గొంతు నొక్కారు. ఒక సభ్యుడి గొంతు నొక్కినంత మాత్రాన పోరాటం ఆగదు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంలో చెప్పిన అబద్దాలపై జగదీష్‌రెడ్డి ప్రశ్నించారు. సభలో మాట్లాడుతుంటే కాంగ్రెస్ సభ్యులు రన్నింగ్ కామెంట్రీ చేశారు. జగదీష్‌రెడ్డి సంయమనం పాటించారు’’ అని కేటీఆర్ చెప్పారు.‘‘జగదీష్‌రెడ్డి అనని మాటను అన్నట్లుగా చిత్రీకరిస్తూ సస్పెండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తోంది. తప్పు చేయకపోయినా స్పీకర్‌పై గౌరవంతో విచారం వ్యక్తం చేస్తామని చెప్పాం. మా వాదనను కూడా వినిపించుకోలేదు. తప్పు మాట్లాడి ఉంటే ఆ వీడియోలు బయటపెట్టాలి. జగదీష్‌రెడ్డి చేసిన తప్పుపై వివరణ కూడా తీసుకోలేదు’’ అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. -
అవసరమైతే స్పీకర్‌పై అవిశ్వాసం పెడతాం: హరీష్ రావు
హైదరాబాద్, సాక్షి: స్పీకర్‌ను ‘మీ’ అని సంబోధించడం.. అవమానించడం ఎలా అవుతుంది? అని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు. గురువారం అసెంబ్లీలో జరిగిన పరిణామాలు.. జగదీష్‌రెడ్డి అంశంపై తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను జగదీష్‌రెడ్డి అవమానించలేదు. సభ మీ ఒక్కరిది కాదు.. అందరిదీ అన్నారు. మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధమేమీ కాదు. అదేం అన్‌పార్లమెంటరీ పదమూ కాదు. కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్‌లో పడింది. స్పీకర్‌ను కలిసి రికార్డులు తీయాలని అడిగాం. పదిహేను నిమిషాలు ఎదురు చూసినా.. ఆయన వీడియో రికార్డులు చూపించలేదు. అసలు సభ ఎందుకు వాయిదా వేశారో కూడా తెలియదు. స్పీకర్ గనుక ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించకపోతే.. అవిశ్వాసం పెట్టడానికైనా మేం సిద్ధం’’ అని హరీష్‌రావు అన్నారు. సభలో సభ్యులందరికీ సమానమైన హక్కులు ఉంటాయని సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గడ్డం ప్రసాద్ కుమార్ అంటే మాకు అపారమైన గౌరవం ఉంది. కానీ, కాంగ్రెస్ నేతలు మాట్లాడే మాటలు విచిత్రంగా ఉన్నాయి అని అన్నారాయన. మరోవైపు.. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. స్పీకర్ అందరికి సమానం.. అందరి తరఫున సభలో కూర్చున్నారని జగదీష్ రెడ్డి అన్నారు మరి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.. అందుకే స్పీకర్ కుర్చీతో డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగింది అని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఇదీ చదవండి: స్పీకర్‌పై జగదీష్‌రెడ్డి వ్యాఖ్యలు.. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం -
తెలంగాణ అసెంబ్లీ నుంచి జగదీష్‌రెడ్డి సస్పెన్షన్
👉తెలంగాణ అసెంబ్లీ: జగదీష్‌రెడ్డి సస్పెన్షన్👉బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ వేటు👉ఈ సెషన్ మొత్తానికి జగదీష్‌రెడ్డి సస్పెన్షన్👉స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చర్యలు👉సభ నుంచి వెళ్లిపోయిన బీఆర్ఎస్ సభ్యులు👉తిరిగి ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ..👉అసెంబ్లీ లాబీ లోకి చేరుకున్న మార్షల్స్👉ఇప్పటికే స్పీకర్ తో అధికార కాంగ్రెస్ ,ప్రతిపక్ష బిఆర్ఎస్ సభ్యులు భేటీ.👉ఈ సభ మీ సొత్తు కాదని స్పీకర్ ను ఉద్దేశించి వాఖ్యానించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.👉జగదీష్ రెడ్డి వాఖ్యల పట్ల అధికార కాంగ్రెస్ అభ్యంతరం..👉జగదీష్ రెడ్డి సస్పెండ్ కు అధికార కాంగ్రెస్ డిమాండ్..👉అధికార కాంగ్రెస్ ,ప్రతిపక్ష బిఆర్ఎస్ సభ్యుల పోటాపోటీ నిరసన నేపథ్యంలో సభను వాయిదా వేసిన స్పీకర్..👉సభలో జరిగిన వ్యవహారం పై సీఎం కు రిపోర్ట్ చేసిన మంత్రి శ్రీధర్ బాబు.👉దలిత స్పీకర్ ను అవమానించిన విషయం లో కఠినంగా ఉండాలని సీఎం ఆదేశం..👉జగదీష్ రెడ్డి సస్పెండ్ కు పట్టుబట్టాలని మంత్రులు నిర్ణయం .👉సభ ప్రారంబంకాగానే జగదీష్ రెడ్డి సస్పెండ్ కు పట్టుబట్టాలని మంత్రి సీతక్కకు సూచించిన శ్రీధర్ బాబు..👉అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఇవాళ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. స్పీకర్‌ను జగదీష్ అవమానించారని.. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని అధికార కాంగ్రెస్ పట్టుబడుతోంది. అయితే జగదీష్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేం లేదని, కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని బీఆర్ఎస్ ప్రతి విమర్శలకు దిగింది.👉గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా.. ఇవాళ శాసనసభలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులు పరస్పరం వ్యంగ్యాస్త్రాలు సంధించుకోగా.. ఒకానొక స్థితిలో పరిస్థితి చేజారిపోయింది. స్పీకర్ ఛైర్‌ను సభ్యులు ప్రశ్నించకూడదని స్పీకర్ గడ్డం ప్రసాద్ అనడంతో పరిస్థితి మారిపోయింది. 👉ఈ సభ మీ ఒక్కరి సొత్తేం కాదంటూ జగదీష్‌రెడ్డి స్పీకర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు.. సభను అదుపులో పెట్టాలంటూ స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి బీఆర్ఎస్ సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో సభ వాయిదా పడింది.👉మరోవైపు.. హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను విడిగా కలిశారు. జగదీష్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల రికార్డును పరిశీలించాలని కోరారు. అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ‘‘జగదీష్ రెడ్డి స్పీకర్‌ను అవమానించలేదు. సభ మీ ఒక్కరిదీ కాదు.. అందరి అన్నారు. మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధం కాదు. మీ ఒక్కరిదీ అనే పదం అన్‌పార్లమెంటరీ పదమూ కాదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నిరసన చేశారో తెలీదు. సభను ఎందుకు వాయిదా వేశారో తెలీదు’’ అని అన్నారు.👉ఇంకోవైపు.. జగదీష్‌రెడ్డి అంశాన్ని ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ దృష్టికి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీసుకెళ్లారు. ఆయనకు ఫోన్లో విషయాన్ని తెలియజేశారు. అనంతరం సీఎం ఛాంబర్లో మంత్రులు ఈ అంశంపై భేటీ అయ్యారు. జగదీష్‌రెడ్డి స్పీకర్ ప్రసాద్‌కు క్షమాపణలు చెప్పాల్సిందేనని, వినకుంటే సస్పెండ్ చేయాల్సిందేనని మంత్రులు పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా గతంలో స్పీకర్ చైర్లో పేపర్లు విసిరినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్న సందర్భాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో ఒక్కొక్కరుగా మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. స్పీకర్‌పై వ్యాఖ్యలకుగానూ క్షమాపణలు చెప్పకపోతే జగదీష్‌రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసే అంశాన్ని సైతం పరిశీలించాలని స్పీకర్‌ను కోరతామని అన్నారు. ఇదిలా ఉంటే.. జగదీష్ మాట్లాడిందాంట్లో తప్పేం లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అంటుండగా, స్పీకర్ కుర్చీతో కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగిందని ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. -
బీజేపీలో పాత సామాను వెళ్లిపోవాలి.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీలోని పాత సామాను బయటకు పోవాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డారు. హిందువులు పండుగలు ఎలా చేసుకోవాలో రేవంత్ చెప్పాల్సిన పనిలేదంటూ చురకలంటించారు.తెలంగాణలో హోలీ నిబంధనలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజాసింగ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో నిజాం పాలనలా కాంగ్రెస్ పాలన సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొమ్మిదో నిజాం లాగా వ్యవహరిస్తున్నారు. హిందువులు పండుగలు ఎలా చేసుకోవాలో రేవంత్ చెబుతారా?. హోలీ 12 గంటల వరకే జరుపుకోవాలన్న నిబంధన ఎందుకు?. రంజాన్ నెలలో ముస్లింలు హడావుడి చేసినా పట్టించుకోరు. కాంగ్రెస్ అంటేనే హిందువుల పండుగ వ్యతిరేకి. హిందువుల జోలికి వస్తే రేవంత్ తప్పకుండా మూల్యం చెల్లించుకుంటాడు. కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు కూడా పడుతుంది’ అని ఘాటు విమర్శలు చేశారు.ఇదే సమయంలో తెలంగాణ బీజేపీ నేతలపై రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. రాజాసింగ్ మాట్లాడుతూ..‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. అలా జరగాలి అంటే.. బీజేపీలోని పాత సామాను బయటకు పోవాలి. బీజేపీ అధిష్టానం దీనిపై ఫోకస్ పెట్టాలి. తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే ఆ ముఖ్యమంత్రిని సీక్రెట్‌గా కలుస్తారు. నా అయ్య పార్టీ అనుకునే వాళ్లను పంపితేనే బీజేపీకి మంచి రోజులు వస్తాయి. తెలంగాణలో హిందువులు సేఫ్‌గా ఉండాలంటే బీజేపీ రావాలి’ అని చెప్పుకొచ్చారు. -
స్పీకర్‌పై జగదీష్‌రెడ్డి వ్యాఖ్యలు.. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బుధవారం తీవ్ర గందరగోళం నెలకొంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఉద్దేశించి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు శాసనసభలో అలజడి రేపాయి. ప్రతిపక్షంగా తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదంటూ బీఆర్ఎస్ స్పీకర్‌పై ఆరోపణలకు దిగగా.. బీఆర్ఎస్ సభ్యులు దళిత స్పీకర్‌ను అవమానించారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల ఆందోళనలతో గందరగోళం నెలకొనగా సభ కాసేపు వాయిదా పడింది.తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు హాట్‌హాట్‌గా నడుస్తున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రవేశపెట్టారు. అయితే ఈ తీర్మానం చర్చ సందర్భంగా మాజీ మంత్రులు వర్సెస్ మంత్రులుగా వ్యవహారం నడిచింది. మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి గవర్నర్ ప్రసంగంపై సెటైర్లు వేస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో మంత్రి కోమటిెడ్డి వెంకట్ రెడ్డి అడ్డు పడి వాస్తవాలు మాట్లాడాలని జగదీష్‌రెడ్డికి సూచించారు. ఆ వెంటనే తలసాని జోక్యం చేసుకుని కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. సభలో సభ్యులందరికీ సమాన నిబంధనలు ఉంటాయని అన్నారు. ఈలోపు.. మంత్రి శ్రీధర్ బాబు - బీఆర్ఎస్ సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. శ్రీధర్ బాబు ప్రసంగానికి బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే బీఆర్ఎస్ సభ్యులు వ్యంగంగా నవ్వారు కాబట్టే అధికారం కోల్పోయారని శ్రీధర్ బాబు సెటైర్లు వేశారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఒకానొక తరుణంలో పరిస్థితి చేజారిపోతుండడంతో స్పీకర్ ప్రసాద్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘బీఆర్ఎస్ సభ్యులు సభను అవమానం ఇచ్చే విధంగా బీఆర్ఎస్ ప్రవర్తించవద్దు. స్పీకర్ తీరును సభ్యులు ప్రశ్నించొద్దు’’ అని స్పీకర్ ప్రసాద్ అనడంతో జగదీశ్ రెడ్డి లేచారు. స్పీకర్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ వ్యాఖ్యలను ఖండించిన జగదీశ్ రెడ్డి.. ‘‘మీరు ఈ సభకు పెద్ద మనిషి మాత్రమేనని, ఈ సభ అందరిదని, మీ ఒక్కరికే సొంతం కాదు’’ అని అన్నారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు.జగదీష్ రెడ్డి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఆయన్ని సభ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. పోటీగా బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పొడియం దగ్గరగా వెళ్లారు. సభను ఆర్డర్లో పెట్టాలని, ప్రతిపక్ష పార్టీకి కనీస గౌరవం ఇవ్వరా? అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో.. దళిత స్పీకర్‌ను అవమానించిన జగదీష్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్‌కు దిగింది. ఈ ఆందోళనలతో సభ వేడెక్కగా.. కాసేపు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. -
విచారణకు రావాల్సిందే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి పోలీసుల నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసుకు సంబంధించి రేపు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో, ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి బిగ్ షాకిచ్చారు పోలీసులు. ఆయన ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన క్యాసినో, కోళ్ల పందేల కేసులో తాజాగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాదాపూర్‌లోకి పోచారం ఇంటికి వెళ్లిన పోలీసులు.. నోటీసులు అంటించారు. ఈ క్రమంలో రేపు మొయినాబాద్ పోలీసు స్టేషన్లో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక, అంతకుముందు ఈ కేసులో ఇచ్చిన నోటీసులకు లాయర్ ద్వారా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. తాజాగా నోటీసుల నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్‌లోని తోల్కట్ట గ్రామంలో సర్వే నెంబర్ 165/a లో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో కోడి పందేల నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో పోచంపల్లిని నిందితుడిగా చేర్చారు. పోచంపల్లిపై సెక్షన్-3 అండ్ గేమింగ్ యాక్ట్, సెక్షన్-11 యానిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు ఇచ్చిన నోటీసులకు అప్పుడు.. తన లాయర్ ద్వారా పోచంపల్లి సమాధానం ఇచ్చారు. అనంతరం, పోచంపల్లి స్పందిస్తూ..‘ఫామ్‌హౌస్ తనదేనని.. రమేష్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చానని ఆయన తెలిపారు. అతను ఇంకో వ్యక్తికి లీజుకిచ్చారనే విషయం తనకు తెలియదన్న పోచంపల్లి.. తాను ఫామ్‌హౌస్‌కు వెళ్లి 8 ఏళ్లు అయ్యిందన్నారు. లీజు డాక్యుమెంట్లను పోలీసులకు అందించానని తెలిపారు. -
మాటకు మాట.. తిప్పికొట్టాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దూకుడుగా వ్యవహరించి.. ప్రతిపక్షాలను కకావికలం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయన్న విషయాన్ని గుర్తించాలని.. సభ లోపల వారు మాట్లాడే ప్రతి పదాన్ని మాటకు మాట తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్లో కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) సమావేశమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్న ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘ఈ బడ్జెట్ సమావేశాలు కీలకమైనవి. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నాం. ఈ 15 నెలల కాలంలో ప్రజాప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చించేందుకు బడ్జెట్ సమావేశాలను వేదికగా చేసుకోవాలి..’’ అని సూచించారు. గత పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ కంటే ఎక్కువ కుంభకోణాలు చేసినవారెవరూ లేరని, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే ఆ కుంభకోణాలను ప్రస్తావించి తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. మొక్కుబడిగా హాజరవడం కాదు.. కాంగ్రెస్ సభ్యుల్లో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా సమావేశాలకు హాజరుకావాలని, అంటే వచ్చి సంతకం పెట్టి వెళ్లిపోవడం కాదని, సభను సీరియస్‌గా ఫాలో కావాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు సభ ప్రొసీడింగ్స్‌పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇష్టమైన సబ్జెక్టులను ఎంచుకుని వాటిపై అధ్యయనం చేసి సభలో మాట్లాడే ప్రయత్నం చేయాలని.. ఆయా సబ్జెక్టులపై ప్రతిపక్షాలు చెప్పే అంశాలను తిప్పికొట్టే స్థాయికి అవగాహన పెరగాలని చెప్పారు. సభ్యుల మధ్య సమన్వయం ఉండాలని, ప్రతి ఆరుగురు ఎమ్మెల్యేలు కలిసి ఓ మంత్రి సహకారంతో తమకు ఇష్టమైన సబ్జెక్టుల గురించి నేర్చుకోవాలని సూచించారు. నాకేమిటనే నిర్లక్ష్యం వద్దు ‘‘ప్రతిపక్షాల విమర్శలను అటు సభలో, ఇటు బయట కూడా సమర్థంగా ఎదుర్కోవాలి. బీఆర్ఎస్ ఏం చేసినా చూసీ చూడనట్టు ఉంటే వచ్చే ఎన్నికల్లో మీపై అభ్యర్ధిని నిలబెట్టరని ఏమైనా అనుకుంటున్నారా? ప్రతిపక్షాలు మాట్లాడే అంశాల గురించి నాకేమిటి, నా గురించి కాదు కదా? అని వదిలేయకుండా సమష్టి బాధ్యతగా తీసుకుని తిప్పికొట్టాలి..’’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉండాలని సూచించారు. సభకు ఎవరు వస్తున్నారో, లేదో చూసుకోవాల్సిన బాధ్యత విప్లదేనని చెప్పారు. పార్లమెంటు తరహాలోనే ప్రతి రోజు మూడు సార్లు ఎమ్మెల్యేల అటెండెన్స్ తీసుకోవాలని విప్‌లను ఆదేశించారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలను కలుస్తా.. త్వరలోనే జిల్లాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలను కలుస్తానని, అందరితో కలసి భోజనం చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. జిల్లాల వారీ అభివృద్ధిపై సమీక్షలు జరుపుతామని, అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి మేలు చేసే కార్యక్రమాల గురించి చర్చిద్దామని తెలిపారు. అలాగే ప్రతి ఎమ్మెల్యేతో కూడా తాను వ్యక్తిగతంగా మాట్లాడుతానని.. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని సమస్యలు, అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసుకోవాలని సూచించినట్టు సమాచారం. చెప్పేది సీరియస్‌గా తీసుకోండి.. సీఎల్పీ సమావేశంలో సభ్యుల అటెండెన్స్ గురించి రేవంత్ మాట్లాడుతున్న సమయంలోనే నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి అసెంబ్లీ కమిటీ హాల్ నుంచి బయటికి వెళ్లారు. ఆ సమయంలోనే సీఎం పలు వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ‘‘సభ్యులందరూ కచ్చితంగా సభకు రావాలని నేను చెబుతుంటే కొందరు ఫోన్ చూసుకుంటూ బయటికి వెళుతున్నారు. సీఎల్పీ సమావేశంలో కూర్చునే ఓపిక కూడా ఉండదా? రాజకీయాలంటే పిల్లాలట కాదు. ఒక్కసారి గెలవగానే సరిపోదు. వచ్చే ఎన్నికల్లో కూడా గెలవడానికి సీరియస్‌గా ప్రయత్నించాలి. నాన్సీరియస్గా ఉంటే ఎలా?’’ అని పేర్కొన్నట్టు సమాచారం. -
రాజకీయ పార్టీలకు భట్టి,జనారెడ్డి బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: రాజకీయ పార్టీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ నేత జానారెడ్డి బహిరంగ లేఖ రాశారు. నియోజకవర్గాల పునర్విభజనపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని.. ప్రతి పార్టీని ఆహ్వానిస్తామని తెలిపారు.జనాభా ప్రాతిపదికన జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉందని.. జరగబోయే నష్టం గురించి అన్ని పార్టీలను ఆహ్వానించి చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశానికి అన్ని పార్టీలు హాజరుకావాలని భట్టి విక్రమార్క, జానారెడ్డిలు సంయుక్తంగా బహిరంగ లేఖ విడుదల చేశారు. ప్రతి పార్టీని ప్రత్యేకంగా ఆహ్వానిస్తామని.. త్వరలోనే తేదీ, వేదిక ప్రకటిస్తామని బహిరంగ లేఖ ద్వారా వారు స్పష్టం చేశారు. -
తొలిసారి కాదు .. రెండో సారి ఎన్నికల్లో గెలవడం గొప్ప .. సీఎల్పీలో రేవంత్
సాక్షి,హైదరాబాద్ : ‘మొదటి సారి ఎన్నికల్లో గెలవడం గొప్పకాదు.. రెండో సారి గెలవడం గొప్ప’అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్ధేశం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై సీఎల్పీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో ఇవి రెండో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు. ఈ బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమైనవి. 15 నెలల్లో ప్రజా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై పూర్తిగా చర్చించుకునేందుకు ఈ సమావేశాల్లో అవకాశం ఉంది. ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలి. సభ్యులు ఖచ్చితంగా సభకు రావాల్సిందే. సమావేశాల్లో సభ్యులంతా సమన్వయంతో ముందుకెళ్లాలి. ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశం అవుతా. వచ్చే నెల 6 నుండి జిల్లాల వారిగా జిల్లా ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు,ఎంపీలు ,ఇతర ప్రజాప్రతినిధులతో లంచ్ మీటింగ్‌లు పెట్టుకుందాం. స్థానిక సమస్యలు, ఇతర అంశాలపై చర్చిద్దాం. మంత్రుల నియోజవర్గాలకు ఎక్కువ నిధులు వెళ్తున్నాయి అనే భావన చాలా మందిలో ఉంది. ఈ బడ్జెట్ సమావేశం లో అలా జరగదు.ఎమ్మెల్యేలందరికీ సమానంగా నిధులు ఇస్తాం.మొదటి సారి గెలవడం పెద్ద విషయం కాదు.రెండవసారి గెలవడం గొప్ప విషయం.మంత్రులు తప్పనిసరిగా హౌస్‌లో ఉండాలి.మొక్కుబడిగా హాజరుకావడం మంచిది కాదు’అని సూచించారు. -
సీఎల్పీలో ఎమ్మెల్యేకి సీఎం రేవంత్ క్లాస్!
సాక్షి, హైదరాబాద్: సొంత పార్టీ ఎమ్మెల్యేపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మాట్లాడే సమయంలో మీరు మధ్యలో వెళ్లిపోతే ఎలా? క్రమశిక్షణతో మెలిగితేనే ఫ్యూచర్ ఉంటుందని క్లాస్ తీసుకున్నారు. ఇంతకి సీఎం రేవంత్ క్లాస్ తీసుకున్న ఎమ్మెల్యే ఎవరు? అసలేం జరిగింది. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శాసనసభలో ప్రసంగించారు. ఈ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎల్పీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహానికి గురయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన విధానంపై సీఎం రేవంత్ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలకు పలు సూచనలు చేస్తున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కే.జానారెడ్డి కుమారుడు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి సమావేశం నుంచి భయటకు వెళ్లారు. దీంతో ఎమ్మెల్యే తీరుపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మాట్లాడుతున్నా కదా. మీరు బయటకు వెళ్లడం ఏంటి? అని ప్రశ్నించారు. క్రమశిక్షణతో మెలిగితేనే ఫ్యూచర్ ఉంటుందని క్లాస్ తీసుకున్నారు. అనంతరం, తన ప్రసంగాన్ని కొనసాగించారు. -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీలో మేం చేసిన డిమాండ్స్ ఇవే
సాక్షి,హైదరాబాద్: చంద్రబాబు ప్రభుత్వం నీళ్లు తరలిస్తుంటే రేవంత్ సర్కార్ చోద్యంగా చూస్తోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇదే అంశంపై చర్చించాలని తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం (BAC Meeting)లో డిమాండ్ చేసినట్లు చెప్పారు. అసెంబ్లీలో స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ (Telangana Assembly Speaker) అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. అనంతరం హరీష్ రావు మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రశ్నా పత్రాలు లీక్ అయినట్లు.. అసెంబ్లీ బిజినెస్ ముందే లీక్ అవటంపై అభ్యంతరం తెలిపాం ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వొద్దని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా స్పీకర్‌ను బుల్డోజ్ చేస్తున్న విషయాన్ని బీఏసీలో లేవనెత్తాం. సంఖ్యా బలాన్ని బట్టి బీఆర్ఎస్కు సభలో సమయం ఇవ్వాలని కోరాం. తమ విజ్ఞప్తికి అంగీకారం తెలిపారు. రైతాంగ సమస్యలు, తాగు సాగు నీటి సమస్యలపై చర్చించాలని కోరామని.. వివిధ (సుంఖిశాల,పెద్దవాగు కొట్టుకుపోవడం,ఎస్ ఎల్ బీసీ ప్రమాదం) ప్రాజక్టులు కూలిపోవటంపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేమన్నారు. మంత్రులు సభకు ప్రిపేర్ అయ్యి రావాలని కోరామన్నారు.అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి స్పీకర్ చొరవ తీసుకుని నిధులు ఇప్పించాలని కోరినట్లు చెప్పారు. నదీ జలాల వినియోగంలో విఫలం రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీఏసీలో చెప్పామన్నారు. ఏపీ నీళ్ళు తరలించుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూసిందని విమర్శించారు. బిల్లులు చెల్లింపుకు 20 శాతం కమిషన్ విషయాన్ని అసెంబ్లీలో చర్చించాలని కోరినట్లు తెలిపారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవటం చర్చించాలని, బార్స్, వైన్స్, బెల్ట్ షాపులు పెంచటంపై చర్చించాలని కోరినట్లు చెప్పారు. ఎల్ఆర్ఎస్ ఉచిత హామీపై చర్చ జరపాలని డిమాండ్ చేశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కూలిన పిల్లర్‌ను కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని బీఏసీలో చెప్పామన్నారు. నిరుద్యోగభృతి, జాబ్ క్యాలెండర్‌పై అసెంబ్లీలో చర్చించాలని బీఏసీలో కోరినట్లు హరీష్ రావు వెల్లడించారు. -
గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ గరం వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో(Governor Budget Speech) కొత్త విషయాలేవీ లేవని.. మరోసారి అబద్ధాలే చెప్పించారని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR) గరం అయ్యారు. బుధవారం గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.గత 15 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా వైఫల్యం చెందింది. ఆ వైఫల్యాలను అంగీకరిస్తారేమోనని అసెంబ్లీకి వచ్చాం. కానీ, అది జరిగేలా కనిపించడం లేదు. ఇది గవర్నర్ ప్రసంగంలా లేదు. గాంధీ భవన్ ప్రెస్‌మీట్‌లా ఉంది. రైతు సమస్యలతో పాటు దేనని ప్రస్తావించలేదు. గవర్నర్‌తో అన్నీ అబద్ధాలే చెప్పించారు. తద్వారా గవర్నర్ హోదాను దిగజార్చింది ఈ ప్రభుత్వం. రాష్ట్రంలో 400 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. రేవంత్ చేతకానితనం వల్లే రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి. రైతులు బాధ పడుతున్నారు. కానీ, రైతు సమస్యలపై గవర్నర్ ప్రసంగంలో ఊసే లేదు. సాగునీటి తో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటిదాకా 30 శాతం మించి రుణమాఫీ జరగలేదు. సాగు నీటి సంక్షోభం నెలకొన్నది. కేసీఆర్(KCR)పై కోపంతో మేడిగడ్డకు మరమత్తులు చేయించడం లేదు. 20% కమిషన్ కోసం కాంట్రాక్టర్లు ధర్నా చేశారు. సిగ్గుపడాల్సిన విషయం ఇది.... గురుకులాల్లో అధ్వానమైన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో అప్పులు చేశారంటూ గుండె బాదుకున్న సన్నాసులు.. ఏడాదిలోనే 1లక్ష 50 వేల కోట్ల అప్పు చేశారు. ఈ అంశం గవర్నరు ప్రసంగం లో లేదు. ఏడాదిలోనే వరి ధాన్యం పండించామని దేశంలో నెంబర్ వన్ అని చెప్పుకున్నారు. సిగ్గులేదు ఈ కాంగ్రెస్ పార్టీకి. గ్రామాలకు వెళ్తే తరిమి కొడుతున్నారు అని కేటీఆర్ మండిపడ్డారు. -
ఈనెల 19న బడ్జెట్.. 27 వరకు తెలంగాణ అసెంబ్లీ
Assembly Session Updates..👉బీఏసీ సమావేశం ముగిసింది.. 👉ఈనెల 27వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని నిర్ణయం. 👉19న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి విక్రమార్క👉హోలీ రోజున, ఆదివారం అసెంబ్లీకి సెలవు. గవర్నర్‌ను అబద్దాల ప్రచారానికి వాడుకున్నారు: హరీష్గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రకటనగవర్నర్ ప్రసంగంలో దశ లేదు, దిశ లేదుగవర్నర్లు మారారు తప్ప ప్రసంగం మారలేదుసీఎం స్తుతి, అసత్యాలు తప్ప కొత్తగా ఏం లేదుప్రసంగం మొత్తం అర్థ సత్యాలు, అబద్దాలు, అవాస్తవాలుఏడాదిన్నర పాలన వైఫల్యానికి నిదర్శనం గవర్నర్ ప్రసంగంఅబద్దాల ప్రచారానికి గవర్నర్‌ను సైతం వాడుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది.గతేడాది గవర్నర్ ప్రసంగానికి, ఈసారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏం లేదు.👉 స్పీకర్ ఛాంబర్లో ప్రారంభమైన BAC సమావేశం. బీఆర్ఎస్ నుంచి సమావేశానికి హాజరైన హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డిముగిసిన ప్రసంగం.. 👉తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ముగిసింది. 👉36 నిమిషాలకు పాటు సాగిన గవర్నర్ ప్రసంగం👉జై తెలంగాణ అంటూ ప్రసంగాన్ని ముగించిన గవర్నర్ 👉తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.👉ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తున్నారు. బీఆర్ఎస్ సభ్యుల నినాదాలు..తెలంగాణలో రుణమాఫీ, ఆరు గ్యారంటీలపై గవర్నర్ ప్రసంగం..రుణమాఫీ జరిగింది, రైతులకు బోనస్ లభించింది అంటూ గవర్నర్ ప్రసంగంఆరు గ్యారెంటీల అమలు జరిగింది, గృహలక్ష్మి, మహాలక్ష్మి పథకాలు అమలు అంటూ గవర్నర్ ప్రసంగం.కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్న బీఆర్ఎస్ సభ్యులు.గవర్నర్ తో అబద్ధాలు చెప్పిస్తున్నారు అంటూ నిరసన 👉అసెంబ్లీకి ముఖ్యమంత్రి రేవంత్ సహా, మంత్రులు, ఎమ్మెల్యేలు చేరుకున్నారు. అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్..👉బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సభకు హాజరయ్యేందుకు ఆయన అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ వద్ద కేసీఆర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. అనంతరం వారితో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా అసెంబ్లీలో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.👉అసెంబ్లీ లాబీలో కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పఠాన్‌చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. తన తమ్ముడి కుమారుడి పెళ్లి కార్డు ఇచ్చిన మహిపాల్ రెడ్డి. పెళ్లికి రావాలనిక కేసీఆర్‌ను కోరిన ఎమ్మెల్యే, 👉మొదటి రోజున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శాసనసభ, మండలి సంయుక్త సమావేశాలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ వెంటనే సభ వాయిదా పడనుంది. తర్వాత శాసనసభ వ్యవహారాల కమిటీ(బీఏసీ) సమావేశం సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరగనుంది. సభను ఎన్నిరోజులు నిర్వహించాలనేది ఈ భేటీలో నిర్ణయించనున్నారు.👉రెండో రోజు(13న) గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుంది. ఈ తీర్మానం ఆమోదం తర్వాత మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.👉మూడో రోజు(14న) హోలీ నేపథ్యంలో సభకు సెలవు ఉంటుందని తెలుస్తోంది. తిరిగి ఈ నెల 15 నుంచి 18 వరకూ సభలో కులగణన సర్వేపై చర్చ, బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చలు తీర్మానాలు ఉంటాయని సమాచారం. స్థానిక సంస్థల్లో, విద్య-ఉద్యోగావకాశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి వేర్వేరు బిల్లులకు ఆమోదం తెలపనుంది.👉అనంతరం, ఈ నెల 18 లేదా 19న 2025-26 రాష్ట్ర బడ్జెట్‌ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజు సెలవు ఉంటుంది. అనధికార సమాచారం మేరకు ఈ నెల 27 లేదా 28 వరకు సభ జరగవచ్చని తెలుస్తోంది. బీఏసీలో నిర్ణయం తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. -
కాంగ్రెస్‌ను ప్రశ్నించిన రేవతి అరెస్ట్.. రేవంత్‌పై కేటీఆర్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సీనియర్ జర్నలిస్ట్ రేవతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె అరెస్ట్ నేపథ్యంలో ప్రభుత్వం తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ తెలంగాణను నియంతల రాజ్యంగా మార్చారని ఆరోపించారు. రాహుల్ గాంధీ చెబుతున్న రాజ్యాంగబద్ధమైన పాలన ఇదేనా అని ప్రశ్నించారు.సీనియర్ మహిళా జర్నలిస్టు రేవతిని బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. 12 మంది పోలీసులు మఫ్టీలో ఆమె ఇంటికి వెళ్లి రేవతిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో జర్నలిస్ట్ రేవతి ఫోన్, ఆమె భర్త దర్శకుడు చైతన్య దంతులూరి ఫోన్, ల్యాప్‌టాప్ సైతం బలవంతంగా తీసుకెళ్లారు పోలీసులు. ఇదే సమయంలో రేవతికి సంబంధించిన పల్స్ యూట్యూబ్ ఆఫీస్‌ను పోలీసులు సీజ్ చేశారు. అయితే, రైతు బంధు రావట్లేదని ఒక రైతు మాట్లాడిన వీడియో ప్రసారం చేసినందుకు పెట్టిన అక్రమ కేసులో జర్నలిస్ట్ రేవతిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.ఇక, జర్నలిస్ట్ రేవతి అరెస్ట్‌పై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా కేటీఆర్..‘రేవతి అరెస్ట్‌ను ఖండిస్తున్నాం. తెల్లవారుజామునే రేవతి గారి ఇంటిపై దాడిచేసి ఆమెతోపాటు కుటుంబ సభ్యులను నిర్బంధించి ప్రభుత్వం వేధింపులకు గురిచేసింది. రేవంత్ రెడ్డి తన కుటుంబంతో పాటు, తన పైన ఒత్తిడి చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని రేవతి స్వయంగా ఆరోపించిన నేపథ్యంలో ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం.రేవతితో పాటు యువ జర్నలిస్టు తన్వి యాదవ్ అరెస్టు చేయడం దారుణం.ప్రజా ప్రభుత్వం అని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణను నియంతల రాజ్యంగా రేవంత్ రెడ్డి మార్చిండు. చట్ట వ్యతిరేకంగా మహిళా జర్నలిస్ట్ రేవతిని అరెస్టు చేసిన తీరు, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో మీడియాపై విధించిన ఆంక్షలను, ఎమర్జెన్సీ నాటి దుర్మార్గపు రోజులను గుర్తుకు తెస్తున్నాయి. రాహుల్ గాంధీ చెబుతున్న రాజ్యాంగబద్ధమైన పాలన ఇదేనా?. ప్రజా పాలనలో మీడియా స్వేచ్ఛ అనేదే లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మీడియా మీడియా, సోషల్ మీడియా గొంతుకలపై చేస్తున్న ఈ దాడులను, అక్రమ కేసులను వెంటనే ఆపాలి. ఒక రైతు కాంగ్రెస్ సర్కారులో తను ఎదుర్కొంటున్న కష్టాలను చెబితే ఆ వీడియోను పోస్టు చేసిన జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఈ ప్రభుత్వ నిర్బంధ పాలనకు పరాకాష్ట. అక్రమ కేసులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఆపాలి’ అని ఘాటు విమర్శలు చేశారు. సీనియర్ మహిళా జర్నలిస్టు రేవతి అరెస్టును ఖండిస్తున్నాను. ఉదయం 5 గంటలకు ఇంటి మీద దాడి చేసి జర్నలిస్టు రేవతిని అక్రమంగా అరెస్ట్ చేయడం రాష్ట్రంలో కొనసాగుతున్న ఎమర్జెన్సీ తరహా పాలనకు నిదర్శనం. @revathitweets పాటు యువ జర్నలిస్టు తన్వి యాదవ్‌ను అరెస్టు చేయడం దారుణం. ఒక రైతు… pic.twitter.com/4mXy8LufOo— KTR (@KTRBRS) March 12, 2025మరోవైపు.. జర్నలిస్ట్ రేవతి అరెస్ట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం స్పందించారు. ఈ సందర్బంగా కవిత ట్విట్టర్ వేదికగా.. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రశ్నిస్తే బుకాయింపులు.. బెదిరింపులు.. అరెస్టులు. జర్నలిస్టు రేవతి అక్రమ అరెస్టును ఖండిస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రశ్నిస్తే బుకాయింపులు.. బెదిరింపులు.. అరెస్టులు..జర్నలిస్టు రేవతి @revathitweets గారి అక్రమ అరెస్టును ఖండిస్తున్నాను— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 12, 2025 -
పసుపు రైతులు అల్లాడుతుంటే.. రేవంత్ సర్కార్ ఏం చేస్తోంది?: కవిత
సాక్షి, హైదరాబాద్: పసుపు రైతుల ఆందోళనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. పసుపు రైతుల ఆందోళనలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా? అంటూ ప్రశ్నించారు. గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందంటూ నిలదీశారు. మాటలు చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు. క్వింటాలు పసుపుకు 15 వేల ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు పసుపునకు కనీసం 9 వేలు రాని పరిస్థితి ఉంది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు తీసుకోకపోవడం దారుణమని కవిత ధ్వజమెత్తారు.‘‘ఇది రైతులను నయవంచన చేయడమే, మోసం చేయడమే. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రూ.15 వేల మద్దతు ధర చెల్లిస్తూ పసుపు పంటను కొనుగోలు చేయాలి. పసుపు బోర్డు తీసుకొచ్చామని చెబుతున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం రైతులను పరామర్శించడం లేదు. పసుపు బోర్డుకు చట్టబద్ధత లేకపోవడంతో రైతులకు ప్రయోజనాలు కలగడం లేదు. పసుపుకు ధరలు పెంచుతామని, మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో బండి సంజయ్ చెప్పారు. కానీ ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి పసుపు రైతులను ఆదుకోవాలి’’ అని కవిత డిమాండ చేశారు. -
కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ భవన్లో శాసనసభాపక్ష(BRSLP) సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఈ భేటీకి హాజరు అయ్యారు. ఇటు శాసన సభలో, అటు మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ వాళ్లతో చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాలపై ప్రధానంగా దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలి రోజు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి.. మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లిపోయారు. ఆ టైంలో బడ్జెట్ తన మార్క్ విమర్శలు గుప్పించారాయన. అయితే.. ఈ దఫా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ పూర్తిగా హాజరు అవుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే జరిగితే.. ఈ సెషన్ వాడీవేడిగా జరిగే ఛాన్స్ లేకపోలేదు. -
రియల్ బ్రోకర్లతో రేవంత్ స్కాం
సాక్షి, హైదరాబాద్: నలుగురు రియల్ ఎస్టేట్ బ్రోకర్ల అండతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) రూ. వేల కోట్ల భారీ కుంభకోణానికి తెరలేపుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు(KTR) ఆరోపించారు. త్వరలో హైదరాబాద్‌లో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ)పై పరిమితులు విధించడం ద్వారా ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్)కు కృత్రిమ డిమాండ్ పెంచే కుట్ర జరుగుతోందన్నారు.హైదరాబాద్‌లో టీడీఆర్‌లను ఎవరు అడ్డగోలుగా కొన్నారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలోని బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో కేటీఆర్ సోమవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘త్వరలో ఎఫ్ఎస్ఐపై పరిమితులను బూచిగా చూపి టీడీఆర్‌లను తిరిగి బిల్డర్లకు అడ్డగోలు ధరలకు అమ్మేందుకు రేవంత్ ముఠా సిద్ధంగా ఉంది. ఎఫ్ఎస్ఐపై ఉమ్మడి ఏపీలో వై.ఎస్. ప్రభుత్వం అవలంబించిన విధానాన్నే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొనసాగించింది.గతంలో టీడీఆర్ పద్ధతిలో రూ. వేల కోట్ల విలువచేసే 400 ఎకరాలను జీహెచ్ఎంసీ ప్రజావసరాల కోసం సేకరించింది. ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లకుండా పౌరులకు ఉపయోగపడే ఈ విధానాన్ని రేవంత్ అక్రమ సంపాదనకు మార్గంగా ఎంచుకున్నాడు. ఇన్సైడ్ ట్రేడింగ్ లాంటి ఈ కుంభకోణంపై ఈడీ, సీబీఐ విచారణ జరిపించాలి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. అవినీతి మార్గాలు తెలిసింది రేవంత్‌కే.. ‘దేశ చరిత్రలో అవినీతి మార్గంలో డబ్బు సంపాదనకు అత్యధిక మార్గాలు తెలిసింది రేవంత్‌కే. ఆయన పాలనలో ప్రైవేటు దోపిడీ పెరిగి ప్రభుత్వ ఆదాయం తగ్గింది. కేంద్రంతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకోవడానికే రేవంత్ తరచూ ఢిల్లీ వెళ్తున్నాడు. రేవంత్, కిషన్‌రెడ్డి దొంగాట ఆడుతూ జనం దృష్టిని మళ్లించే ప్రయత్నంలో ఉన్నారు. రేవంత్‌ను ఉద్దేశించే కాంగ్రెస్‌లో బీజేపీ కోవర్టులు ఉన్నారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు’అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘స్థానికం’, ఉపఎన్నికల ఉద్దేశంతోనే మండలి ఎన్నికకు దూరం స్థానికసంస్థల ఎన్నికలు, 10 అసెంబ్లీ స్థానాల్లో ఉపఎన్నికలు వస్తాయనే ఉద్దేశంతోనే శాసనమండలి పట్టభద్రుల స్థానం ఎన్నికకు దూరంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు. ఎమ్మెల్యేల బేరసారాలకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే రెండో అభ్యరి్థని మండలి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలపలేదని కేటీఆర్ చెప్పారు. అసెంబ్లీకి కేసీఆర్ హాజరవుతారు గవర్నర్ ప్రసంగంతోపాటు బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని కేటీఆర్ తెలిపారు. అయితే ప్రభుత్వంలో ఉన్న వారు మాట్లాడే పిచ్చిమాటలు, పనికిరాని మాటలు, బూతులు వినాల్సిన అవసరం కేసీఆర్‌కు లేదని ఒక కొడుకుగా, పార్టీ కార్యకర్తగా తన అభిప్రాయమన్నారు. కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్ నేతలు, రేవంత్ ఆవగింజంత కూడా సరిపోరని వ్యాఖ్యానించారు. మళ్లీ ఫార్ములా–ఈ నోటీసులు రావచ్చు.. ఈ నెల 16 నుంచి 27లోగా మళ్లీ తనకు ఫార్ములా–ఈ కేసు పేరిట విచారణ నోటీసులు రావచ్చని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ‘ఫార్ములా–ఈ’ని ప్రశ్నిస్తున్న వారు రూ. 200 కోట్లతో రేవంత్ ప్రభుత్వం నిర్వహించే మిస్ వరల్డ్ పోటీలతో హైదరాబాద్‌కు ఏం ఒరుగుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. బయటి దేశాల్లో జరుగుతున్న మరణాలను రేవంత్ తనకు అంటగట్టడం విడ్డూరమని.. తాను కేసీఆర్ అంత మంచివాడిని కానని వ్యాఖ్యానించారు. బీసీలకు రిజర్వేషన్లపై రేవంత్‌కు చిత్తశుద్ది ఉంటే ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ఆమరణ దీక్ష చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
కేసీఆర్‌ను కొట్టింది నేనే.. గద్దె దింపిందీ నేనే!
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్(KCR)ను బండకేసి కొట్టింది నేనే.. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి ఎన్నికల్లో ఓడగొట్టిందీ నేనే. గద్దె దింపింది నేనే..ఆ కుర్చిలో కూర్చుందీ నేనే. సీఎంగా ఉండి పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి గుండు సున్నా ఇచ్చింది నేనే. ప్రస్తుతం నాది ముఖ్యమంత్రి స్థాయి. ఆయనది మాజీ ముఖ్యమంత్రి స్థాయి..’ అని సీఎం ఎ.రేవంత్‌రెడ్డి(Revanth Reddy) అన్నారు.స్థాయి అంటే ఏంటని, ఎలా వస్తుందని ప్రశ్నించారు. ‘ఉదయం నుంచి సాయంత్రం వరకు తాగితే స్థాయి వస్తుందా? డ్రగ్స్ పెట్టుకుని పార్టీలు చేసుకుంటే వస్తుందా?..’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులతో కలిసి సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబిచ్చారు. కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్‌లో ఎవరూ సరిపోరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల గురించి విలేకరులు ప్రశ్నించగా రేవంత్ స్పందించారు. కేసీఆర్‌కు ఇప్పుడు అసెంబ్లీకి వచ్చే స్థాయి లేదు ‘కేసీఆర్‌కు ఇప్పుడు అసెంబ్లీకి వచ్చే స్థాయి లేదు. ఆయనకు, కొడుకు కేటీఆర్‌కు బలుపు తప్ప ఏమీ లేవు. ఆ కుటుంబానికి ఎందుకంత బరితెగింపో అర్థం కావడం లేదు. అయినా కేసీఆర్ చెల్లని రూపాయి. ఆయన గురించి మాట్లాడడం వృ«థా. బీఆర్ఎస్ చేసిన అప్పులు, తప్పుల కారణంగానే రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉంది. రాష్ట్ర అభివృద్ధి కోసం 39 సార్లు కాదు. 99 సార్లు అయినా ఢిల్లీకి వెళ్తా. అయినా బీఆర్ఎస్కు తెలంగాణతో సంబంధం లేదు. అందుకే వాళ్లు ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. రాష్ట్రానికి ఏమీ జరగొద్దని ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారు. స్పైడర్ సినిమాలో విలన్ తరహాలో రాష్ట్రంలో ఎవరైనా చనిపోతే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు సంబరపడుతూ, తీన్మార్ డ్యాన్సులు చేస్తున్నారు. యూజ్లెస్ ఫెలో మాట్లాడే మాటలు పట్టించుకోవద్దు కేసీఆర్ పదేళ్లలో చేయలేని పనులు మేము 14 నెలల్లో చేశాం. కాళేశ్వరం, మేడిగడ్డలు లేకుండానే రికార్డు స్థాయిలో పంటలు పండించాం. అయినా రాయలసీమను రతనాల సీమ చేస్తామని చెప్పి రొయ్యల పులుసు తిన్నోళ్లు ఎవరు? యూజ్లెస్ ఫెలో, హౌలేగాడు మాట్లాడే మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బీజేపీకి హరీశ్‌రావు లొంగిపోయాడు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పని చేయాలని, కాంగ్రెస్‌ను ఓడించాలనే ఉద్దేశంతోనే డబ్బులు పంచి మరీ బీజేపీకి హరీశ్‌రావు ఓట్లు వేయించాడు..’ అని రేవంత్ ఆరోపించారు. నిధులు ఏ రూపంలో వచ్చినా లెక్కబెడదాం ‘తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చిన నిధులపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చర్చకు సిద్ధం కావాలి. 2014 జూన్ 2 నుంచి పన్నుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్రానికి ఎన్ని నిధులు వెళ్లాయి? మళ్లీ కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్ని నిధులు తిరిగి వచ్చాయి? ఏ రూపంలో వచ్చినా సరే లెక్కపెడదాం. నేను, మా ఉప ముఖ్యమంత్రి భట్టి వస్తాం. కిషన్‌రెడ్డితో పాటు ఎవరినైనా రమ్మనండి. చర్చిద్దాం. తెలంగాణ నుంచి వెళ్లిన దానికంటే కేంద్రం నుంచి ఒక్క రూపాయి ఎక్కువ వచ్చినా అక్కడే కిషన్‌రెడ్డికి సన్మానం చేస్తా..’ అని సీఎం సవాల్ చేశారు. ఎక్కువ సాగుతోనే నీటికి ఇబ్బందులు ‘గత పదేళ్ల కాలంలో కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక మా నడ్డి విరుగుతోంది. అయినప్పటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఎప్పుడైనా యాసంగిలో 35–40 లక్షల ఎకరాలు సాగవుతుంది. కానీ ఈసారి రాష్ట్రంలో ఏకంగా 55 లక్షల ఎకరాలు సాగయింది. అందుకే అక్కడక్కడా నీటికి ఇబ్బందులు వస్తున్నాయి. అయినా ఏ రిజర్వాయర్ నుంచి ఏ మేరకు ఎప్పుడు నీళ్లు ఇవ్వాలన్న దానిపై అధికారులు ఎప్పుడో షెడ్యూల్ సిద్ధం చేశారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకున్నాం. మహారాష్ట్ర నుంచి వచ్చే అనుమతులను బట్టి తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణం పనులు ఉంటాయి. రిజల్ట్స్ వేరు..రిజర్వేషన్లు వేరు కృష్ణమాదిగ బీజేపీ నేతలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. రిజల్ట్స్ వేరు, రిజర్వేషన్లు వేరు. గతంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో పేర్కొన్న రూల్ ఆఫ్ రిజర్వేషన్ల మేరకు ఇప్పుడు ఫలితాలు ప్రకటిస్తున్నాం. పాత నిబంధనలను మేము మార్చలేం. కొత్తగా నోటిఫికేషన్లు ఇస్తే అందరికీ న్యాయం చేస్తాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. కిషన్‌రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడ? ‘రీజనల్ రింగు రోడ్డు ఇచ్చామంటూ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ చెప్పిన మాటను నిలబెట్టుకోవాలి. నేను మెట్రో తెచ్చానని కిషన్‌రెడ్డి అంటున్నాడు. హైదరాబాద్‌లో జైపాల్‌రెడ్డి తెచ్చిన మెట్రో కనపడుతోంది కానీ కిషన్‌రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడుంది? కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులపై ఉప ముఖ్యమంత్రి భట్టి నిర్వహించిన సమావేశానికి రమ్మంటే సమయం లేదని కిషన్‌రెడ్డి చెప్పారు. మరి కేంద్రమంత్రి ఖట్టర్ సికింద్రాబాద్‌లో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల సమీక్షకు ఎందుకు వెళ్లలేదు? కేంద్రమంత్రి ఖట్టర్ కూడా కిషన్‌రెడ్డిని హడావుడిగా పిలిచాడా? కేసీఆర్ ఫీలవుతాడనే ఆ సమావేశానికి కిషన్‌రెడ్డి వెళ్లలేదు. కేసీఆర్ చెప్పిన చదువు మా దగ్గర చెపితే ఎలా?..’ అని రేవంత్ అన్నారు. -
నేనే మెట్రో తెచ్చా అంటున్నారు.. ఆ మెట్రో ఎక్కడుందో?: రేవంత్
హైదరాబాద్: కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సెటైర్లు వేశారు. కిషన్‌రెడ్డి.. మెట్రో తానే తెచ్చానని చెప్పుకుంటున్నాడని, ఆయన తెచ్చిన మెట్రో ఎక్కడుందో తనకైతే తెలియదంటూ చమత్కరించారు రేవంత్. మీడియాతో చిట్ చాట్ లో భాగంగా రేవంత్ మాట్లాడారు. ‘ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి సహకరించడం లేదు. తెలంగాణకు నిధులు తెస్తే ఆయనకు సన్మానం చేస్తాం. ఇటీవల అఖిల పక్షం సమావేశం నిర్వహిస్తే కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ లో ఉండి రాలేదు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ హైదరాబాద్ కు వచ్చేది కూడా కిషన్‌రెడ్డికి తెలియదా?, ఈటల వచ్చారు.. కానీ కిషన్‌రెడ్డి రాలేదు. మెట్రో నేనే తెచ్చానని కిషన్‌రెడ్డి అంటారు. నాకైతే జైపాల్ రెడ్డి తెచ్చిన మెట్రో కన్పిస్తోంది కానీ కిషన్‌రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడుంది?,రీజనల్ రింగ్ రోడ్డు ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.. అదే ఇవ్వమని అంటున్నాం. అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడటం లేదు. భూసేకరణ అడ్డుకుంటుంది ఈటల, లక్ష్మణ్. ప్రాజెక్టులు ముందుకు వెళ్ళకుండా అడ్డుకుంటుంది రాష్ట్ర బీజేపీ నేతలే. మూసీకి నిధులు తెస్తే కిషన్‌రెడ్డికి సన్మానం చేసి గండపిండేరం తొడుగుతాను. సబర్మతి, యమునా, గంగా ప్రక్షాళనకు నిధులు ఇస్తున్న కేంద్రం మూసీకి ఎందుకు ఇవ్వడం లేదు? అని రేవంత్ ప్రశ్నించారు.ఇక రేవంత్ తన ఢిల్లీ పర్యటనపై కూడా మాట్లాడారు. ఢిల్లీకి 39 సార్లు కాదు 99 సార్లు వెళ్తాను. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి రాష్ట్రానికి కావాల్సినవి తెచ్చుకుంటా. రాష్ట్రానికి కావాల్సిన అనేక అంశాలను క్లియర్ చేసుకొని వచ్చాను. కుల గణన ప్రభావమే అన్ని పార్టీలు బీసీలకు టికెట్లు ఇచ్చాయి. హరీష్ రావు మోసం వల్లే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓడిపోయాం’ అని రేవంత్ పేర్కొన్నారు. -
కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు.. బడ్జెట్‌పై మాట్లాడతారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలో చెల్లుబాటు కావడం లేదని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్‌ను చూసి తెలంగాణ ప్రజలు జాలి పడాలన్నారు. అలాగే, ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరవుతారని తెలిపారు.ఎమ్మెల్సీ కోటాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రవణ్ నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో నేడు అసెంబ్లీకి కేటీఆర్ వచ్చారు. నామినేషన్ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రవణ్‌ను 2023లోనే ఎమ్మెల్సీగా కేసీఆర్ నామినేట్ చేశారు. అప్పుడు బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకుంది. శ్రవణ్ బీఆర్ఎస్ను వదిలిపెట్టి వెళ్లి ఉంటే ఇప్పటికే చట్ట సభల్లో అడుగుపెట్టేవాడు. కానీ, బీఆర్ఎస్పై నమ్మకంతో పార్టీలోనే ఉన్నాడు.రెండు జాతీయ పార్టీలదీ ఒకటే ధోరణి. రాష్ట్రాలపై పెత్తనం చెలాయిస్తున్నాయి. రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే నలుగురు బ్రోకర్లు టీడీఆర్ ల్యాండ్ కొనే పనిలో తిరుగుతున్నారు. టీడీఆర్ అతి పెద్ద కుంభకోణానికి తెరలేపబోతున్నారు. రేవంత్ ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తున్నారు. ఎఫ్ఎస్ఐ నిబంధనల ద్వారా శిఖం భూముల ధరలు కృత్రిమంగా పెంచే యోచనలో రేవంత్ ఉన్నారు. తెలంగాణలో రేవంత్ అండ్ టీమ్ ప్రైవేటు దోపిడీ పెరుగుతోంది. ప్రభుత్వ ఆదాయం తగ్గుతోంది. ప్రభుత్వం లేని అప్పులు చూపించి.. ఎక్కువ మిత్తి చూపిస్తున్నారు. కేంద్రంతో మంచి సంబంధం ఉన్న రేవంత్.. తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చాడో చెప్పాలి. 15 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఒక్క పోరాటమైనా చేసిందా?. బీజేపీ హడావుడి సోషల్ మీడియాలో ఎక్కువ.. సొసైటీలో తక్కువ అంటూ సెటైర్లు వేశారు.తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్ అట్టర్ ప్లాప్‌గా ఉంది. అందుకే అటెన్షన్ కోసం డైవర్షన్ రాజకీయం చేస్తున్నారు. ఈ-కారు రేసును ముందుకు తెచ్చారు. ప్రపంచ సుందరి పోటీలు పెట్టి సీఎం ఏం సాధిస్తారు?. 200 కోట్లు ఖర్చు పెట్టారు ఏం లాభం వస్తుంది?. ఎవరికి ఉద్యోగాలు వస్తాయి’ అని ప్రశ్నించారు.