మీ ప్రార్థనలతోనే పునర్జన్మ : సీఎం జయలలిత

మీ ప్రార్థనలతోనే పునర్జన్మ : సీఎం జయలలిత - Sakshi


తమ అమ్మ జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అన్నాడీఎంకే కార్యాలయం ఆదివారం చేసిన ప్రకటన ఆ పార్టీ వర్గాల్ని ఆనందోత్సాహాల్లో ముంచింది. అమ్మ పునర్జన్మ పొందారని, త్వరలో ప్రజా సేవకు అంకితం కానున్నారన్న ఆ ప్రకటన ఆ పార్టీ వర్గాలకు తీపి కబురే. ఇన్నాళ్లూ అమ్మ రాక కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తూ వచ్చిన అన్నాడీఎంకే వర్గాల్లో  ఈ ప్రకటన ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.

 

సాక్షి, చెన్నై :  సెప్టెంబర్ 22వ తేదీ రాత్రి అనారోగ్యంతో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. జ్వరంతో బాధ పడుతున్న అమ్మ ఒకటి రెండు రోజుల్లో ఇంటికి చేరుకుంటారని సర్వత్రా భావించారు. అయితే, రక రకాల వదంతులు, ప్రచారాలు బయలు దేరడంతో అన్నాడీఎంకే వర్గాల్లో ఆందోళన, ఉత్కంఠ బయలు దేరింది. అమ్మ ఆరోగ్య క్షేమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా రోజుల తరబడి ప్రార్థనలు, పూజలు, హోమాలు సాగుతూ వస్తున్నాయి.  లండన్ నుంచి వచ్చిన డాక్టర్ రిచర్డ్, ఢిల్లీ ఎయిమ్స్ వైద్య బృందం, సింగపూర్ వైద్య బృందం అమ్మకు అందిస్తూ వచ్చిన వైద్య చికిత్సలు ఫలితాన్ని ఇవ్వడంతో ఆరోగ్య పరిస్థితిపై కొన్నాళ్లు అపోలో వర్గాలు బులిటెన్ రూపంలో వివరించారుు.

 

అదే సమయంలో జయలలితను పరామర్శించేందుకు వచ్చిన వాళ్లంతా, వైద్యులతో, ఆసుపత్రి వర్గాలతో మాట్లాడినట్టు, విచారించినట్టు పేర్కొంటూ వచ్చారేగానీ, ఏ ఒక్కరూ స్వయంగా పరామర్శించినట్టు వ్యాఖ్యానించక పోవడం ఆ పార్టీ వర్గాలకు ఓ వెలితిగానే ఉంటూ వచ్చింది. అన్నాడీ ఎంకే వర్గాలు సైతం వైద్యులు పేర్కొంటూ వస్తున్నట్టుగానే వ్యాఖ్యలు చేస్తూ వచ్చారేగానీ, అధికారికంగా పార్టీ కార్యాలయం తరఫున ఎలాంటి ప్రకటన వెలువడ లేదని చెప్పవచ్చు. దీంతో జయలలిత సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి పోయెస్ గార్డెన్‌కు ఎప్పుడెప్పుడు చేరుకుంటారా అన్న ఎదురు చూపులు మరింతగా పెరిగారుు.

 

అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి రెండు సార్లు మీడియాతో మాట్లాడుతూ, జయలలిత ఆరోగ్యం మెరుగు పడ్డట్టు ప్రకటించడం అన్నాడీఎంకే వర్గాలకు  ఆనందకర సమాచారంగా మారింది.   ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి అన్నాడీఎంకే కార్యాలయం విడుదల చేసిన ప్రకటన అమ్మ సేనల్లో ఆనందోత్సాహాన్ని నింపినట్టు అరుుంది. జయలలిత ఏ విధంగా స్పందిస్తారో అదే రీతిలో తాజాగా ప్రకటన విడుదల కావడం విశేషం.

 

త్వరలో మీ సేవకు : అన్నాడీఎంకే కార్యాలయం విడుదల చేసిన ప్రకటన మేరకు....’ నా ప్రియాతి ప్రియమైన అన్నాడీఎంకే కార్యకర్తల్లారా..... తన మీద  అశేష ప్రేమాభిమానాల్ని కలిగిన తమిళ ప్రజల్లారా.....మీ అందరికీ నమస్కారం ...మీరు  చూపిన ప్రేమానురాగాలు,  ఆప్యాయత, చేసిన పూజలు, ప్రార్థనలతో మీ సహోదరి పునర్జన్మను పొందినట్టు ప్రకటించారు. ఈ సమాచారాన్ని ఆనందంగా మీతో పంచుకుంటున్నానని,  మీ ప్రేమానురాగాలు, ఆప్యాయత ఉండగా నాకేమి లోటు అని ఆ ప్రకటనలో జయలలిత స్పందించడంతో అన్నాడీఎంకే వర్గాలకు ఆనందమే. దేవుడి ఆశీస్సులతో త్వరలో సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా యథా ప్రకారం సేవకు అంకితం అవుతానని ప్రకటించారు. విశ్రాంతి అన్నది తెలియదని, శ్రమ అన్నది నా నుంచి తొలగి పోదని  పేర్కొంటూ, దివంగత ఎంజీ.

 

రామచంద్రన్  మార్గ దర్శకంలో తన జీవితాన్ని తమిళ ప్రజలకు అంకితం చేశానని, అన్నాడీఎంకే అభివృద్ధి కోసం శ్రమిస్తూ ముందుకు సాగుతున్నానని గుర్తు చేశారు. తన మీదున్న ప్రేమాప్యాయతలతో కొందరు సహోదరులు ప్రాణత్యాగం చేసినట్టుగా సమాచారం తన దృష్టికి వచ్చి తీవ్ర మనోవేదనకు గురయ్యానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి శ్రమ, విశ్వాసం అన్నాడీఎంకే అభివృద్ధికి ఉపయోగ పడాలని పేర్కొంటూ,  అరవకురిచ్చి తంజావూరు, తిరుప్పర గుండ్రం, పుదుచ్చేరిలోని నెల్లితోపు నియోజకవర్గాలకు ఈనెల 19వ తేదీన జరగనున్న ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థుల గెలుపునకు శ్రమించాలని పిలుపునిచ్చారు.

 

నేరుగా వచ్చి కలవ లేని పరిస్థితి ఉన్నందున, అన్నాడీఎంకే అభ్యర్థుల విజయాన్ని, తమ విజయంగా భావించాలని, గెలుపు లక్ష్యంగా ముందుకు సాగి ఓటర్ల తీర్పును చరిత్ర చెప్పుకునే విధంగా ముందుకు సాగాలని విన్నవించుకున్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top