కర్ణాటక నుంచి తమిళనాడుకు కుప్పం మీదుగా వెళ్తున్న రూ. కోటి విలువచేసే ఎర్రచందనం లారీని అటవీ శాఖాధికారులు బుధవారం పట్టుకున్నారు.
కుప్పం, న్యూస్‌లైన్: కర్ణాటక నుంచి తమిళనాడుకు కుప్పం మీదుగా వెళ్తున్న రూ. కోటి విలువచేసే ఎర్రచందనం లారీని అటవీ శాఖాధికారులు బుధవారం పట్టుకున్నారు. వుందస్తుగా వచ్చిన సమాచారం మేరకు పోలీసులు, అటవీ శాఖాధికారులు కర్ణాటక, ఆంధ్ర సరిహద్దులోనివి.
కోట వద్ద కాపుకాశారు. వుహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న లారీలో ఎర్రచందనం దుంగలు ఉన్నాయన్న అనుమానంతో తనిఖీ చేశారు. వీరిని చూసి డ్రైవరు, క్లీనరు వాహనాన్ని వదిలిపెట్టి పరారయ్యూరు. వాహనాన్ని కుప్పం అటవీ శాఖ కార్యాలయూనికి తరలించి పూర్తిగా తనిఖీ చేశారు. అందులో ఎర్రచందనం ఉన్నట్లు బయుటపడింది. ఈ వాహనంలో మాత్రలు, వుందుల బాక్సులు, ప్లాస్టిక్ కవర్లు, వివాహ పత్రికలు, వురిన్ని పార్సిళ్లు నింపారు. అడుగు భాగంలో ఎర్రచందనం దుంగలు వేశారు.