తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఎన్నికల్లో పోటీ చేశారనే ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ 22 మంది భివండీ మున్సిపల్ కార్పొరేషన్
♦ జారీ చేసిన బాంబే హైకోర్టు
♦ 27న విచారణకు హాజరుకావాలని ఆదేశం
సాక్షి, ముంబై : తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఎన్నికల్లో పోటీ చేశారనే ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ 22 మంది భివండీ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లకు బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఎన్నికల్లో పోటీ చేశారని ఆరోపిస్తూ మాజీ కార్పొరేటర్ సిద్ధేశ్వర్ కామ్మూర్తి బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు వీరందరికి నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్పొరేటర్లంతా సుప్రీం కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. కేసు విచారణ జరపాలని హైకోర్టును సుప్రీం ఆదేశించింది. ఆ మేరకు తదుపరి విచారణ ఈ నెల 27న జరుపుతామని బాంబే హైకోర్టు న్యాయమూర్తి మోహిత్ షా తెలిపారు.
విచారణ సమయంలో 22 మంది కార్పొరేటర్లు కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీచేశారు. ఆరోపణలు ఎదుర్కొంట్ను వారిలో స్థాయీ సమితి సభాపతి ప్రశాంత్ లాడ్, బీజేపీకి చెందిన అస్మితా చౌదరి, మహేశ్ చౌగులే ఉన్నారు. భివండీ కార్పొరేషన్‌కు 2013లో 90 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఓబీసీ రిజర్వుడు స్థానాల్లో పోటీ చేసి 22 మంది గెలిచారు. వీరంతా నామినేషన్ పత్రాలతోపాటు థానే జిల్లా అధికారి కార్యాలయం ద్వారా జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించారు. కాని వీరు తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించారని ఆరోపిస్తూ సిద్ధేశ్వర్ పిటిషన్ దాఖలు చేశారు.


