మణిరత్నం చిత్రంలో కార్తీ? | Karthi in Mani Ratnam movie | Sakshi
Sakshi News home page

మణిరత్నం చిత్రంలో కార్తీ?

Jan 11 2016 2:42 AM | Updated on Sep 3 2017 3:26 PM

మణిరత్నం చిత్రంలో కార్తీ?

మణిరత్నం చిత్రంలో కార్తీ?

ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం నూతన చిత్రం విషయంలో ఒక క్లారిటీ వచ్చినట్లు తాజా సమాచారం.

ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం నూతన చిత్రం విషయంలో ఒక క్లారిటీ వచ్చినట్లు తాజా సమాచారం. విషయం ఏమిటంటే కడల్ వంటి ఫ్లాప్ చిత్రం తరువాత ఈ దర్శకుడికి మలి చిత్రం చేయడానికి ఎంత ఆలస్యమైందో ఓకే కణ్మణి వంటి సక్సెస్‌ఫుల్ చిత్రం తరువాత అంత జాప్యం జరుగుతుండడం గమనార్హం. ఓకే కణ్మణి విజయోత్సాహంతో మణిరత్నం వెంటనే మల్టీస్టారర్ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో భారీ ఎత్తున తెరకెక్కించాలని తలచారు.
 
 అందులో టాలీవుడ్ స్టార్స్ నాగార్జున, మహేశ్‌బాబు, ఐశ్వర్యారాయ్ హీరోహీరోయిన్లుగా నటింపజేయడానికి ప్రయత్నాలు చేశారు. అన్ని సక్రమంగా జరుగుతున్నాయనుకుంటున్న తరుణంలో ఆ చిత్రం నుంచి ఆ స్టార్స్ తప్పుకున్నారు. దీంతో మణిరత్నం మరో ప్రయత్నానికి సిద్ధమయ్యారు.నాగార్జున, మహేశ్‌బాబుల పాత్రలో కార్తీ, మలయాళ యువనటుడు దుల్కర్‌సల్మాన్, నిత్యామీనన్, కీర్తీసురేష్‌లను ఎంపిక చేశారు. ఆ కాంబినేషన్ సెట్ అయిపోయిందనుకునేంతలోనే దుల్కర్‌సల్మాన్, కార్తీసురేష్ అనూహ్యంగా చిత్రం నుంచి వైదొలిగారు.
 
 ఆ తరువాత దుల్కర్‌సల్మాన్‌ను రీప్లేస్ చేయడానికి టాలీవుడ్ నటుడు నానీ సిద్ధమయ్యారనే ప్రచారం జరిగింది. ఒక సమయంలో అసలు ఈ ప్రాజెక్టే ఆగిపోయిందనే వదంతులు సాగాయి. ఇన్ని రకాల ప్రచారాల తరువాత తాజాగా కార్తీ, నిత్యామీనన్ జంటగా మణిరత్నం చిత్రం చేయడానికి సిద్ధమయ్యారని సంక్రాంతి తరువాత ఈ చిత్రం ప్రారంభం కానుందని సమాచారం. కాగా కార్తీ ప్రస్తుతం కాష్మోరా చిత్రాన్ని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు.మరో పక్క నాగార్జునతో కలిసి నటిస్తున్న దోస్త్ చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉందన్నది గమనార్హం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement