‘మారి’గా ధనుష్ | Kajal Agarwal to romance Dhanush | Sakshi
Sakshi News home page

‘మారి’గా ధనుష్

Nov 18 2014 2:41 AM | Updated on Oct 30 2018 5:58 PM

‘మారి’గా ధనుష్ - Sakshi

‘మారి’గా ధనుష్

నటుడు ధనుష్ మారిగా మారిపోతున్నారు. వేల్లై ఇల్లా పట్టాదారి చిత్రం తర్వాత ఈయన నటించిన చిత్రం ఏదీ విడుదల కాలేదు. అయితే రెండు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకొని

 నటుడు ధనుష్ మారిగా మారిపోతున్నారు. వేల్లై ఇల్లా పట్టాదారి చిత్రం తర్వాత ఈయన నటించిన చిత్రం ఏదీ విడుదల కాలేదు. అయితే రెండు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకొని వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. వాటిలో ఒకటి హిందీ చిత్రం షమితాబ్ కాగా రెండోది అనేగన్. ఈ రెండు చిత్రాలు రజనీ కాంత్ లింగ చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నాయని సమాచారం. రెండింటిలో షమితాబ్ ముందు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయం అటుంచితే ధనుష్ తదుపరి చిత్రం షూటింగ్‌తో బిజీ అయ్యారు.
 
 ఈ తాజా చిత్రానికి మారి అనే పేరును నిర్ణయిం చారు. వాయు మూడి పేసవుం చిత్రం తర్వాత బాలజీమోహన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ తొలిసారిగా ధనుష్‌తో రొమాన్స్‌కు సిద్ధమవుతున్నారు. చిత్రం షూటింగ్ తొలి షెడ్యూల్ ఇప్పటికే పూర్తి అయ్యింది. మలి షెడ్యూల్ ఈ నెల 20 నుంచి పది రోజుల పాటు చెన్నైలో జరగనుందని చిత్ర యూనిట్ తెలిపింది. మూడు రోజుల పాటు స్థానిక ట్రిప్లికేన్‌లో చిత్రీకరించనున్నట్లు ఇదే షెడ్యూల్‌లో నటి కాజల్ అగర్వాల్ షూటింగ్‌లో పాల్గొననున్నారని చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రంలో మారి గా ధనుష్ కోరమీసాలు, పిల్లి గడ్డం పెంచి చాలా కొత్తగా కనిపించనున్నారు. విశేషం ఏమిటంటే వేల్లై ఇలా పట్టదారి చిత్రం తర్వాత ధనుష్ తన హుండర్‌బార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం ఇది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement