మద్య నిషేధంపై సీఎం ఆలోచించాలి | Sakshi
Sakshi News home page

మద్య నిషేధంపై సీఎం ఆలోచించాలి

Published Mon, Feb 6 2017 3:50 AM

మద్య నిషేధంపై సీఎం ఆలోచించాలి - Sakshi

కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ

సాక్షి, కామారెడ్డి: ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే గాకుండా నైతిక విలువలు దిగజారడానికి కారణ మవుతున్న మద్యాన్ని నిషేధించాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ... సీఎం కేసీఆర్‌కు సూచించారు. కామారెడ్డి జిల్లాలోని పాతరాజంపేటలోని ఆర్ష గురుకులం బ్రహ్మ మహావిద్యాలయంలో నిర్వహిస్తున్న 35వ యోగా సాధన శిబిరం ఆదివారం ముగిసింది. ఆదాయం కోసం మద్యానికి ప్రాధాన్యతనివ్వడం సరికాదని, ఇతర మార్గాలను అన్వేషించి మద్యాన్ని నిషేధించే యత్నం చేయాలన్నారు. కార్యక్రమంలో స్వామి బ్రహ్మానంద సరస్వతి, భారత్‌ స్వాభిమాన్‌ ట్రస్ట్‌ ప్రాంతీయ అధ్యక్షుడు శ్రీధర్‌రావు పాల్గొన్నారు.

వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నాం..
కేంద్రం బడ్జెట్‌లో వ్యవసాయం, సాగునీటి ప్రాజె క్ట్‌లు, పంటల బీమా పథకం, వ్యవసాయ పరి శోధన కేంద్రాలకు రూ. 10 లక్షల కోట్ల నిధులను కేటాయించిందని దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆయన ఆదివారం కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. పంటల బీమా పథకానికి గత బడ్జెట్‌లో రూ. 5,500 కోట్లు కేటాయించగా ఈసారి రూ.13,240 కోట్లకు పెంచారన్నారు. దేశ వ్యాప్తంగా 649 కృషి విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement