విడవలూరుకు చెందిన దినేష్‌రెడ్డి అనే వ్యక్తికి బ్రెయిన్ డెడ్ అయింది.
నెల్లూరు: విడవలూరుకు చెందిన దినేష్‌రెడ్డి అనే యవకుడికి బ్రెయిన్ డెడ్ అయింది. దాంతో యవకుడు దినేష్‌రెడ్డి అవయవాలను దానం చేసేందుకు అతడి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. ఈ నెల 13న దినేష్‌రెడ్డికి ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్‌కు గురయ్యాడు.
అయితే దినేష్‌రెడ్డి బ్రతకడం కష్టమని వైద్యులు చెప్పడంతో అతడి తల్లిదండ్రుల అంగీకారం మేరకు నెల్లూరు జిల్లాలోని నారాయణ ఆస్పత్రిలో విజయవంతంగా అవయవదానం ఆపరేషన్ చేశారు. దినేష్ రెడ్డి కిడ్నీని నెల్లూరులోని కిమ్స్ ఆస్పత్రికి తరలించి.. మరొక కిడ్నీని నారాయణ ఆస్పత్రిలో ఉంచారు. గుండె, కాలేయాన్ని గ్రీన్ ఛానెల్ ద్వారా హైదరాబాద్‌కు అధికారులు తరలించినట్టు సమాచారం.