ఆమె మళ్లీ ఎందుకు వచ్చిందో? | Bengaluru Gang rape case: Police sent her out of park, but she returned | Sakshi
Sakshi News home page

ఆమె మళ్లీ ఎందుకు వచ్చిందో?

Nov 13 2015 10:24 AM | Updated on Sep 3 2017 12:26 PM

బెంగళూరులోని కబ్బన్ పార్క్

బెంగళూరులోని కబ్బన్ పార్క్

మహిళపై గ్యాంగ్ రేప్ బెంగళూరులో సంచలనం రేపింది.

బెంగళూరు: మహిళపై గ్యాంగ్ రేప్ బెంగళూరులో సంచలనం రేపింది. కబ్బన్ పార్క్ లో ఉన్న కర్ణాటక స్టేట్ లాన్ టెన్నిస్ అసోసియేషన్(కేఎస్ఎల్ టీఏ)లో తుమకూరుకు చెందిన 30 ఏళ్ల మహిళలపై ఇద్దరు సెక్యురిటీ గార్డులు బుధవారం రాత్రి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే కబ్బన్ పార్క్ నుంచి బుధవారం సాయంత్రమే ఆమెను పోలీసులు బయటకు పంపించారు. ఆమె మళ్లీ ఎందుకు పార్క్ కు తిరిగి వచ్చిందో తెలియడం లేదని దర్యాప్తు అధికారులు అంటున్నారు.

సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో కేఎస్ఎల్ టీఏ కార్యాలయానికి ఆమె వచ్చి టెన్నిస్ శిక్షణకు దరఖాస్తు కావాలని అడిగింది. సెక్యురిటీ సిబ్బంది ఆమెకు అప్లికేషన్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోవాలని కోరారు. అయితే తిరిగి వెళ్లకుండా పార్క్ లో కూర్చుందని కేఎస్ఎల్ టీఏ అధికారి ఒకరు తెలిపారు. 'రాత్రికి అక్కడే భోజనం చేసి పడుకుంటానని, ఉదయం నుంచి టెన్నిస్ శిక్షణ ప్రారంభిస్తానని సెక్యురిటీలో చెప్పింది. పార్క్ నుంచి వెళ్లిపోవాలని ఎంతగా చెప్పినా వినలేదు. చివరకు పోలీసులకు ఫోన్ చేశాం. ఆమెను పోలీసులు బయటకు పంపారు' అని అధికారి వెల్లడించారు.

అయితే గ్యాంగ్ రేప్ తో తమ సిబ్బందికి సంబంధం లేదని కేఎస్ఎల్ టీఏ అధికారి తెలిపారు. కబ్బన్ పార్క్ సెక్యురిటీ సిబ్బంది ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలిపారు. గురువారం పోలీసులు కేఎస్ఎల్ టీఏ సిబ్బంది వాంగ్మూలం నమోదు చేశారు. సీసీ టీవీ పుటేజీని పరిశీలించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement