ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉచిత నీటి సరఫరా నిర్ణయంపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. సబ్సిడీల వల్ల ధరలు కిందికి దిగిరావని
ధరలు దిగిరావు
Jan 1 2014 11:25 PM | Updated on Mar 29 2019 9:18 PM
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉచిత నీటి సరఫరా నిర్ణయంపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. సబ్సిడీల వల్ల ధరలు కిందికి దిగిరావని ఆ పార్టీ అగ్రనాయకుడు అరుణ్‌జైట్లీ ఆరోపించారు. సమాజంలోని బలహీనవర్గాలు ఇప్పటికీ లబ్ధి పొందలేకపోతున్నాయన్నారు. నీటిపై సబ్సిడీ విషయంలో బలహీనవర్గాలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. సబ్సిడీ పథకానికి నగరంలోని నిరుపేదలందరినీ దూరంగా ఉంచారని బుధవారం తన బ్లాగ్‌లో విమర్శించారు. సబ్సిడీల కోసం పన్ను చెల్లింపుదారుల నుంచి వచ్చే రాబడిని ప్రభుత్వం వాడుకుంటోందన్నారు. మరింత మొత్తంలో సబ్సిడీ ఇస్తే ఆ మేరకు ఆ తర్వాత పన్నులను పెంచక తప్పదన్నారు.
కాగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు ఆప్ నే త, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నగరంలోనిప్రతి ఇంటికీ 666 లీటర్ల నీటిని ఉచితంగా ఇవ్వడంతోపాటు 400 యూనిట్లలోపు వినియోగించేవారికి విద్యుత్ చార్జీల్లో 50 శాతం మేర రాయితీ ప్రకటించిన సంగతి విదితమే. ఈ విషయమై అరుణ్‌జైట్లీ స్పందిస్తూ స్వల్పకాలిక లబ్ధి కోసం సబ్సిడీలపై దృష్టి సారిస్తే మున్ముందు అది పెనుభారంగా పరిణమించడం అనివార్యమన్నారు. ఇందుకు బదులు నీటి సరఫరా వ్యవస్థకు దూరంగా ఉన్నవారిని అందులోకి తీసుకురాగలగడమే పెనుసవాలన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో పైప్‌లైన్లతోపాటు, ప్రతి ఇంటికీ ట్యాప్‌ల ఏర్పాటు అనేది మంచి బోర్డు అందుబాటులో ఉన్నపుడే సాధ్యమవుతుందన్నారు. ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ)తో సాధ్యం కాదన్నారు.
Advertisement
Advertisement