
అత్యంత అందమైన అమ్మాయి భార్యగా వచ్చింది..
మొహాలి : వరుస ఓటముల తర్వాత దక్కిన విజయంతో రాయల్‌చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి తెగ ఖుషి అవుతున్నాడు. శనివారం కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో ఆర్సీబీ ఆటగాళ్లు.. అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ మ్యాచ్ అనంతరం గెలిచిన ఉత్సాహంలో ఏబీ డివిలియర్స్, కోహ్లి సరదాగా చిట్ చాట్ చేశారు. ఏ అవకాశం దొరికిన సతీమణి, బాలీవుడ్ నటి అనుష్కశర్మను ఆకాశానికెత్తే కోహ్లి.. ఈ సారి కూడా భార్యపై పొగడ్తల వర్షం కురిపించాడు. తన స్ట్రెస్ బస్టర్ ఆమెనని తెలిపాడు.
‘గతేడాది నా జీవితంలో జరిగిన గొప్ప విషయం ఏంటంటే నా పెళ్లి కావడం. ఈ పెళ్లితో నా ప్రపంచమే మారిపోయింది. అత్యంత అందమైన, గొప్ప వ్యక్తిత్వం కలిగిన భార్య నాకుంది. అది నన్ను మరింత బలవంతుడిని చేసింది. అంతకు ముందు చిన్న చిన్న విషయాలకే తీవ్ర ఆందోళనకు గురయ్యేవాడిని. కానీ ఆమె నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా ఆలోచన విధానం మారిపోయింది. ఎప్పుడు ఆమె నన్ను ఉత్సాహపరుస్తూనే ఉంటుంది. సానుకూల దృక్పథంతో ఉండాలని చెబుతోంది. మ్యాచ్ దూరంగా ఉన్న సమయాన్ని ఆమెతోనే గడుపుతాను. ప్రస్తుతం నాకున్న ఒత్తిడిని అధిగమించడానికి ఆమెనే కారణం. ఆమెతో గడిపితే ఎలాంటి ఒత్తిడైనా దూరం అవుతోంది.’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. విజయం దక్కిన రాత్రి తమకు చాలా ప్రత్యేకమని కోహ్లి తెలిపాడు. గత ఆరు మ్యాచ్‌ల్లో మేం దారుణంగా ఓడిపోయాని, చేసిన తప్పులపై ఆలోచించి విజయం కోసం వ్యూహం రంచించామని పేరొన్నాడు.
‘Stability, balance & good wives’ – secrets to @imVkohli & @ABdeVilliers17' success
— IndianPremierLeague (@IPL) April 14, 2019
The celebrated batting duo, the men who share 2 double century stands for @RCBTweets - chat after a welcome win at Mohali! By @tanmoym. #KXIPvRCB
📹 WATCH: https://t.co/2Ki9ZdQ8vQ pic.twitter.com/41HVJDuAAd