టైటిల్‌కు చేరువలో వీర్ మీనన్ | Veer Menon closer to the title | Sakshi
Sakshi News home page

టైటిల్‌కు చేరువలో వీర్ మీనన్

Jul 18 2014 1:47 AM | Updated on Sep 4 2018 5:07 PM

టైటిల్‌కు చేరువలో వీర్ మీనన్ - Sakshi

టైటిల్‌కు చేరువలో వీర్ మీనన్

జాతీయ సెయిలింగ్ చాంపియన్‌షిప్ లేజర్ 4.7 విభాగంలో వీర్ అమర్ మీనన్ (ఆర్‌ఎంవైసీ) టైటిల్‌కు మరింత చేరువయ్యాడు.

 జాతీయ సెయిలింగ్ చాంపియన్‌షిప్
 సాక్షి, హైదరాబాద్: జాతీయ సెయిలింగ్ చాంపియన్‌షిప్ లేజర్ 4.7 విభాగంలో వీర్ అమర్ మీనన్ (ఆర్‌ఎంవైసీ) టైటిల్‌కు మరింత చేరువయ్యాడు. బుధవారం తొలి మూడు రేస్‌లను గెలుచుకున్న వీర్ ఈవెంట్ మూడో రోజు గురువారం కూడా అదే జోరును కనబర్చాడు. హుస్సేన్‌సాగర్‌లో జరుగుతున్న ఈ పోటీల నాలుగు, ఐదు, ఆరు రేస్‌లలో కూడా వీర్ అగ్రస్థానంలో నిలవడం విశేషం.
 
  ఇతర సెయిలర్లు అతనికి కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయారు. 4.7తో పాటు లేజర్ రేడియల్‌లో కూడా మీనన్, ఎనిమిదో రేస్‌లో రెండో స్థానంలో నిలిచి సత్తా చాటాడు. లేజర్ స్టాండర్డ్ విభాగంలో ధర్మేంద్ర సింగ్ (ఏవైఎన్) రెండు రేస్‌లను గెలుచుకోగా...లేజర్ రేడియల్ విభాగంలో సికింద్రాబాద్ ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్‌కు చెందిన దిలీప్ కుమార్ ఒక రేస్‌లో తొలి స్థానంలో నిలిచాడు.
 
 గురువారం రేస్‌ల ఫలితాలు
 లేజర్ రేడియల్ విభాగం: ఏడో రేస్ - 1. గౌరవ్ రణ్‌ధావా (ఐఎన్‌డబ్ల్యూటీసీ), 2. షరీఫ్ ఖాన్ (ఏవైఎన్), 3. ముజాహిద్ ఖాన్ (ఏవైఎన్).
 
 ఎనిమిదో రేస్ - 1. హర్‌ప్రీత్ సింగ్ (ఏవైఎన్), 2. వీర్ మీనన్ (ఆర్‌ఎంవైసీ), 3. దిలీప్ కుమార్ (ఈఎంఈఎస్‌ఏ).
 
 తొమ్మిదో రేస్ - 1. దిలీప్ కుమార్ (ఈఎంఈఎస్‌ఏ), 2.  షరీఫ్ ఖాన్ (ఏవైఎన్), 3. హర్‌ప్రీత్ సింగ్ (ఏవైఎన్)
 
 లేజర్ స్టాండర్డ్ విభాగం: నాలుగో రేస్ - 1. ధర్మేంద్ర సింగ్ (ఏవైఎన్), 2. జస్వీర్ సింగ్ (ఏవైఎన్), 3. గుర్జీత్ సింగ్ (ఏవైఎన్).
 
 ఐదో రేస్ - 1. ధర్మేంద్ర సింగ్ (ఏవైఎన్), 2. గజేంద్ర సింగ్ (ఏవైఎన్), 3. రమేశ్ కుమార్ (ఏవైఎన్).
 ఆరో రేస్ - 1. జస్వీర్ సింగ్ (ఏవైఎన్), 2. గజేంద్ర సింగ్ (ఏవైఎన్), 3. రమేశ్ కుమార్ (ఏవైఎన్).
 
 లేజర్ 4.7 విభాగం: నాలుగో రేస్ - 1. వీర్ అమర్ మీనన్ (ఆర్‌ఎంవైసీ), 2. రవీందర్ ఎం (టీఎన్‌ఎస్‌ఏ), 3. శిఖర్ గార్గ్ (ఎన్‌ఎస్‌ఎస్).
 
 ఐదో రేస్ -  1. వీర్ అమర్ మీనన్ (ఆర్‌ఎంవైసీ), 2. రవీందర్ ఎం (టీఎన్‌ఎస్‌ఏ), 3. ధీర్ సింఘీ (ఆర్‌ఎంవైసీ).
 
 ఆరో రేస్ - 1. వీర్ అమర్ మీనన్ (ఆర్‌ఎంవైసీ), 2. విష్ణు సుజీశ్ (టీఎన్‌ఎస్‌ఏ), 3. శిఖర్ గార్గ్ (ఎన్‌ఎస్‌ఎస్).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement