ఐర్లాండ్ బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. యూఏఈ బ్యాట్స్మెన్ను క్రీజులో కుదురుకోనీకుండా కట్టడి చేస్తున్నారు.
బ్రిస్బేన్: ఐర్లాండ్ బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. యూఏఈ బ్యాట్స్మెన్ను క్రీజులో కుదురుకోనీకుండా కట్టడి చేస్తున్నారు. ప్రపంచ కప్ గ్రూప్-బిలో భాగంగా బుధవారం ఐర్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో యూఏఈ 35 ఓవర్లలో 6 వికెట్లకు 131 పరుగులు చేసింది.
ఆరంభంలో నిలకడగా ఆడుతున్న యూఏఈని ఐర్లాండ్ బౌలర్ స్టిర్లింగ్ దెబ్బ తీశాడు. స్టిర్లింగ్ వరుస ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టాడు. స్టిర్లింగ్ బౌలింగ్లో ఓపెనర్ రఫెలో (13), కృష్ణ చంద్రన్ (0) అవుటవడంతో యూఏఈకి కష్టాలు మొదలయ్మాయి. కాసేపటి తర్వాత కెవిన్ ఒబ్రెయెన్ వరుస ఓవర్లలో హాఫ్ సెంచరీకి చేరువైన అలీ (45), స్వప్నిల్ పాటిల్ (2)ను పెవిలియన్ చేర్చాడు. దీంతో యూఏఈ కోలుకోలేకపోయింది. ఆ తర్వాత ఖుర్రం ఖాన్, షైమన్ అన్వర్ కాసేపు వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసినా ఫలితం లేకపోయింది. ఖుర్రం ఖాన్, ముస్తఫా వెంటవెంటనే అవుటయ్యారు.