ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ క్రీడాకారిణి సామ సాత్వికకు భారత అండర్-14 జట్టులో స్థానం లభించింది. ఐటీఎఫ్ ఆసియా 14 అండ్ అండర్ డెవలప్‌మెంట్ చాంపియన్‌షిప్-2014లో భారత జట్టుకు సాత్విక ప్రాతినిధ్యం వహిస్తుంది.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ క్రీడాకారిణి సామ సాత్వికకు భారత అండర్-14 జట్టులో స్థానం లభించింది. ఐటీఎఫ్ ఆసియా 14 అండ్ అండర్ డెవలప్‌మెంట్ చాంపియన్‌షిప్-2014లో భారత జట్టుకు సాత్విక ప్రాతినిధ్యం వహిస్తుంది.
ఈ నెల 15నుంచి 28 వరకు వియత్నాంలోని హోచిమిన్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. జాతీయ స్థాయి అండర్-14 విభాగంలో ప్రదర్శనను బట్టి ఎంపిక చేసిన ఐదుగురు అమ్మాయిలలో సాత్విక కూడా ఎంపికైంది. గతంలో అండర్-12 భారత నంబర్‌వన్‌గా ఉన్న ఈ అమ్మాయి ప్రస్తుతం నాసర్ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతోంది.