పాండ్యా ఆల్‌రౌండరే కానీ..

Sourav Ganguly Says Don't Compare Hardik Pandya with Kapil Dev

కోల్‌కతా: భారత యువ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా నైపుణ్యమున్న ఆల్‌రౌండరే కానీ... ఇప్పుడే విఖ్యాత కపిల్‌ దేవ్‌తో పోల్చడం సరికాదని మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అన్నారు. ఇటీవలే ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో భారత్‌ 4–1తో గెలవడంలో పాండ్యా కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే. దీంతో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు కూడా అందుకున్నాడు. ‘భారత జట్టుకు అవసరమైన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌. అయితే కపిల్‌ దేవ్‌తో పోలిస్తే అది తొందరపాటు అవుతుంది.

కపిల్‌ ఓ చాంపియన్‌ క్రికెటర్‌. పాండ్యా ఇలాగే మరో 10–15 ఏళ్లు నిలకడగా ఆడిన తర్వాతే ఆ అంచనాకు రావాలి. ఇప్పుడు మనం అతని ఆటతీరును అస్వాదిద్దాం. అతను చాలా మంచి క్రికెటర్‌. సానుకూల దృక్పథంతో పోరాడే ఆటగాడు. తనకు దేన్నైనా ఎదుర్కొనే సత్తా ఉంది. కోహ్లి సేన విజయాల్లో పాండ్యా ఇలాగే రాణించాలని ఆశిస్తున్నా’ అని గంగూలీ అన్నారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top