షిజియాన్‌ను నాలుగోసారీ ఓడిస్తా | P.V sindhu will defeate to Shaojin Wang at fourth time | Sakshi
Sakshi News home page

షిజియాన్‌ను నాలుగోసారీ ఓడిస్తా

Mar 30 2014 1:42 AM | Updated on Sep 2 2017 5:20 AM

ప్రపంచ మూడో ర్యాంకర్ షిజియాన్ వాంగ్ (చైనా)ను వరుసగా నాలుగోసారి ఓడిస్తానని హైదరాబాద్ షట్లర్ పి.వి.సింధు ధీమా వ్యక్తం చేసింది.

సింధు ధీమా  
 ఇండియా ఓపెన్ డ్రా క్లిష్టం
 
 న్యూఢిల్లీ: ప్రపంచ మూడో ర్యాంకర్ షిజియాన్ వాంగ్ (చైనా)ను వరుసగా నాలుగోసారి ఓడిస్తానని హైదరాబాద్ షట్లర్ పి.వి.సింధు ధీమా వ్యక్తం చేసింది. మంగళవారం నుంచి జరిగే ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ తొలి రౌండ్‌లో షిజియాన్‌తో తలపడనున్న నేపథ్యంలో సింధు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇండియా ఓపెన్ విజేతలకు అందించే ట్రోఫీలను శనివారం ఆవిష్కరించారు.
 
 ఈ కార్యక్రమంలో సింధుతోపాటు పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్, భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షుడు అఖిలేశ్ దాస్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు. 2012, 2013 ఇండియా ఓపెన్‌లో సెమీస్‌కు చేరుకున్న సింధు ఈసారి మరింత మెరుగైన ప్రదర్శనను కనబరుస్తానని విశ్వాసం వ్యక్తం చేసింది. ‘ఈసారి డ్రా చాలా క్లిష్టంగా ఉంది. తొలి రౌండ్‌లోనే షిజియాన్ ఎదురుకానుంది. గతంలో మూడుసార్లు ఆమెను ఓడించా. కాబట్టి నాలుగోసారి కూడా గెలుస్తాననే నమ్మకం ఉంది’ అని సింధు వ్యాఖ్యానించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement