మంగళగిరిలో సచిన్ 100 ఎకరాలు కొన్నాడా?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రియల్టర్ల సర్కిల్ లో ఓ రూమర్ సంచలనం రేపుతోంది.
మంగళగిరి: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రియల్టర్ల సర్కిల్ లో ఓ రూమర్ సంచలనం రేపుతోంది. మంగళగిరికి సమీపంలో క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వంద ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు ప్రచారం జోరుగా జరుగుతోంది. విజయవాడ-గుంటూరు పట్టణాల మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పడవచ్చనే ఊహాగానాల మధ్య రెండు జిల్లాల్లోనూ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.
మంగళగిరిలో రాజధాని ఏర్పడవచ్చనే ఊహాగానాల నేపథ్యంలో 100 ఎకరాల భూమిని సచిన్ కొనుగోలు చేసిన అంశం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఆగస్టు 1 విజయవాడలో పీవీపీ మాల్ ప్రారంభించడానికి వస్తున్న అంశాన్ని ఈ రూమర్ కు అక్కడి రియల్టర్లు జత చేస్తున్నారు. అయితే సచిన్ భూమి కొనుగోలు అంశాన్ని చాలా మంది తేలికగా తీసుకుంటున్నారు. భూముల ధర పెంచేందుకే రియల్టర్లు ఇలాంటి చవకబారు ప్రచారానికి పూనుకున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.