మహిళల సూపర్‌ లీగ్‌కు హర్మన్‌ప్రీత్‌ దూరం | Harman Preet distance to the Women's Super League | Sakshi
Sakshi News home page

మహిళల సూపర్‌ లీగ్‌కు హర్మన్‌ప్రీత్‌ దూరం

Aug 2 2017 12:07 AM | Updated on Sep 17 2017 5:03 PM

మహిళల సూపర్‌ లీగ్‌కు హర్మన్‌ప్రీత్‌ దూరం

మహిళల సూపర్‌ లీగ్‌కు హర్మన్‌ప్రీత్‌ దూరం

భారత మహిళల క్రికెట్‌ స్టార్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఇంగ్లండ్‌లో జరిగే టి20 సూపర్‌ లీగ్‌కు దూరం కానుంది.

భారత మహిళల క్రికెట్‌ స్టార్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఇంగ్లండ్‌లో జరిగే టి20 సూపర్‌ లీగ్‌కు దూరం కానుంది. ఇటీవలి ప్రపంచకప్‌లో తన అద్భుత బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్న హర్మన్‌ప్రీత్‌ ప్రస్తుతం భుజం నొప్పితో బాధపడుతోంది. దీంతో నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండటంతో సర్రే స్టార్స్‌ జట్టు తరఫున ఆడలేకపోతోంది.

‘ప్రపంచకప్‌ చివరి దశలో నొప్పితోనే ఆడాను. తాజాగా ఎడమ భుజంలో చీలిక ఏర్పడడంతో మహిళల సూపర్‌ లీగ్‌లో ఆడలేకపోతున్నాను’ అని హర్మన్‌ప్రీత్‌ పేర్కొంది. గత డిసెంబర్‌లో ఆస్ట్రేలియాలో జరిగిన మహిళల టి20 బిగ్‌బాష్‌ లీగ్‌లోనూ ఆడిన ఆమె అక్కడా విశేషంగా రాణించి అత్యధిక పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా నిలిచింది.

Advertisement

పోల్

Advertisement