ఆసియా క్రీడల్లో భారత్ మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. రోయింగ్ పురుషుల సింగిల్స్ స్కల్స్ విభాగంలో సవర్ణ్ సింగ్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
ఇంచియాన్ : ఆసియా క్రీడల్లో భారత్ మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. రోయింగ్ పురుషుల సింగిల్స్ స్కల్స్ విభాగంలో సవర్ణ్ సింగ్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. కాగా. పురుషుల రోయింగ్ లైట్ వెయిట్ సింగిల్ స్కల్ విభాగంలో దుశ్యంత్ చౌహాన్ కంచు మోత మోగించిన విషయం తెలిసిందే. అతను 7 నిమిషాల 26.57 సెకన్లలో రేసు పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచాడు. ఈ రేస్‌లో ఎక్కువ సేపు ఆధిక్యంలో కొనసాగినా...చివర్లో ప్రతికూల వాతావరణం కారణంగా వెనుకబడిన దుశ్యంత్ కాంస్యంతోనే సరి పెట్టుకోవాల్సి వచ్చింది.