యూనిస్ ఖాన్ కెరీర్లోనే.. | 5 Runs for Younis Khan in his last four Test innings, first time he scored less than 10 runs in any four consecutive innings | Sakshi
Sakshi News home page

యూనిస్ ఖాన్ కెరీర్లోనే..

Nov 26 2016 1:07 PM | Updated on Sep 4 2017 9:12 PM

యూనిస్ ఖాన్ కెరీర్లోనే..

యూనిస్ ఖాన్ కెరీర్లోనే..

పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ యూనిస్ ఖాన్ తన టెస్టు కెరీర్లో ఓ చెత్త రికార్డును మూట గట్టుకున్నాడు.

హామిల్టన్: పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ యూనిస్ ఖాన్ తన టెస్టు కెరీర్లో ఓ చెత్త రికార్డును మూట గట్టుకున్నాడు. వరుసగా నాలుగు ఇన్నింగ్స్లో ఘోరంగా విఫలమైన యూనిస్.. కేవలం ఐదు పరుగులు చేసిన అప్రథను మూటగట్టుకున్నాడు. తాజాగా న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో యూనిస్(2) విఫలమయ్యాడు. అంతకుముందు మూడు ఇన్నింగ్స్ ల్లో యూనిస్ నమోదు చేసిన పరుగులు 0, 2,1 గా ఉన్నాయి. ఇలా వరుసగా నాలుగు ఇన్నింగ్స్ ల్లో 10 వ్యక్తిగత పరుగుల కంటే తక్కువ చేయడం యూనిస్ టెస్టు కెరీర్లో ఇదే తొలిసారి.

ఈ మ్యాచ్ రెండో రోజు ఆటలో భాగంగా పాకిస్తాన్ 51 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.పాక్ ఆటగాళ్లు సమీ అస్లామ్(5) , అజహర్ అలీ(1), యూనిస్ ఖాన్(2), అసాద్ షఫిక్(23), రిజ్వాన్(0)లు పెవిలియన్ కు చేరారు. దాంతో ఆట ముగిసే సమయానికి పాక్ ఐదు వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. అంతకుముందు 77/2 ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 271పరుగుల వద్ద ఆలౌటైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement