
పాదయాత్రలో వైఎస్ జగన్
సాక్షి, ప్రకాశం : వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. శనివారం ఉదయం వైఎస్ జగన్ చీమకుర్తి మండలం గాడిపర్తివారిపాలెం శివారు నుంచి 102వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. దారిపొడవునా రాజన్న బిడ్డకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. అక్కడ నుంచి జననేత వైఎస్ జగన్ దర్శి మండలంలోకి ప్రవేశిస్తారు. శివరాంపురం చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరిస్తారు.
10 గంటలకు విరామం తీసుకుంటారు. అనంతరం 2.45 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. కొర్రపాటి వారి పాలెం క్రాస్ మీదుగా తాళ్లూరు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. ఇప్పటి వరకు జననేత 1,370.8 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు.