ఎన్డీయేకు ఏ కూటమి ప్రత్యామ్నాయం కాదు

No alliance is a substitute for NDA - Sakshi

16 సీట్లు గెలిచి కేసీఆర్‌ పీఎం అయితే.. 300 సీట్లతో మేమేం కావాలె? 

విపక్షాలపై బీజేపీ నేత మురళీధర్‌రావు ధ్వజం 

వరంగల్, కరీంనగర్‌లలో బీజేపీ విజయ సంకల్పయాత్ర సభలు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌/కరీంనగర్‌:  ఎన్డీయేకు ఏ కూటమి కూడా ప్రత్యామ్నాయం కాదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు స్పష్టం చేశారు. గురువారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ, కరీంనగర్‌లలో జరిగిన బీజేపీ విజయ సంకల్పయాత్ర’సభల్లో ఆయన ప్రసంగించారు. దేశంలో ఫెడరల్‌ ఫ్రం ట్‌ ఉనికిలో కూడా లేదన్నారు. ప్రత్యేక విమా నాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రులను కలసి ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో కేసీఆర్‌ హంగామా చేయడానికే పరిమితమయ్యారని విమర్శించారు. ఫెడరల్‌ ఫ్రంట్, మహాకూటమి పేర్లతో దేశంలో 50 మంది దాకా ప్రధానమంత్రులు కావాలని కల లు కంటున్నారని విమర్శించారు. వీరంతా వారానికి ఒక్కరు ప్రధానిగా ఉండాలని భావిస్తున్నారా అని ఎద్దేవా చేశారు. మోదీ ప్రభు త్వం ఐదేళ్లలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథ కాలు అమలు చేశారన్నారు. అవినీతికి ఆస్కా రం లేని పాలన అందించారన్నారు. దేశం కోసం మోదీని మరోసారి ప్రధానిని చేయాల్సిన బాధ్యత ప్రతిపౌరుడిపై ఉందన్నారు. 

బీజేపీతోనే స్థిరమైన ప్రభుత్వం 
దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో చూసినా కూటమి ఏర్పాటు కాలేదని, కూటమి కడతామన్న పార్టీ్టలు ఒకరిపై మరొకరు పోటీ పడుతున్నారని మురళీధర్‌రావు అన్నారు. స్థిరమైన ప్రభుత్వాన్ని అందించేది బీజేపీ మాత్రమేనన్నారు. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు వస్తే ఢిల్లీని నడిపిస్తామంటున్నారు.. 16, 20, 30 సీట్లు వచ్చిన వారు ఢిల్లీని నడిపిస్తే 300 సీట్లు వచ్చే వారు ఏం చేయాలి అని ప్రశ్నించా రు.   

కేసీఆర్‌ నిజమైన హిందువు కాదు
కేసీఆర్‌ నిజమైన హిందువు కాదని.. షేర్వాణి వేసుకున్న మరో ఒవైసీ అని లక్ష్మణ్‌ విమర్శించారు. కేసీఆర్‌ చేసిన యాగాలన్నీ ఆయన స్వార్థం కోసమేనని పేర్కొన్నారు. రావణా సురుడు కూడా యాగాలు చేశారని గుర్తు చేశారు. రావణాసురుడు రాక్షసుడు, వక్రబుద్ధి కలిగిన వాడని, కేసీఆర్‌ కూడా అలాగే కొడుకును అందలమెక్కించేందుకు యాగాలు చేస్తున్నారని విమర్శించారు. కొండగట్టులో 60 మంది బస్సు ప్రమాదంలో చనిపోతే పరామర్శించేందుకు రాని కేసీఆర్‌.. హిందువు ఎలా అవుతారని ప్రశ్నించారు. అసదుద్దీన్‌ చంకలో దూరి మోదీని తిట్టడం మైనార్టీ ఓట్ల కోసం కాదా? అని అన్నారు. కేసీఆర్, సోనియా పిల్లల కోసం కాకుండా మీ పిల్లల కోసం నరేంద్ర మోదీని ప్రధాని చేసేందుకు ప్రజలంతా బీజే పీకి ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.  ఆయా సభల్లో వరంగల్, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల బీజేపీ అభ్యర్థులు చింతా సాంబమూర్తి, హుస్సేన్‌ నాయక్, కరీంనగర్‌ అభ్యర్థి బండి సంజయ్, పెద్దపల్లి అభ్యర్థిఎస్‌.కుమార్‌లు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top