టీఆర్‌ఎస్‌కు బీజేపీ మద్దతు!

BJP Leader Laxman Says That They Will Support TRS If They Ignores MIM - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:   తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీకి తమ మద్దతును ప్రకటిస్తామని బీజేపీ ప్రకటించింది. తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి కానీ ప్రధాన పార్టీల్లో మాత్రం ప్రశాంతత కరువైపోయింది. ఇప్పటిదాకా వెలువడిన సర్వేలు మరింత గందరగోళానికి గురిచేశాయి. స్పష్టమైన మెజార్టీలను సాధిస్తామని ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే  బీజేపీ మాత్రం హంగ్‌ వచ్చే పరిస్థితి కూడా ఉండొచ్చని.. అలా హంగ్‌ వచ్చే పరిస్థితే వస్తే తమ పార్టీ మద్దతు ఇస్తేనే ఎవరైనా అధికారం చేపడతారని అంటోంది. అలాంటి పరిస్థితులో కాంగ్రేసేతర, ముస్లిమేతర పార్టీలకు తమ మద్దతును ఇస్తామని బీజేపీ వర్గాలు అంటున్నాయి. కేసీఆర్‌.. ఎమ్‌ఐఎమ్‌ను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోకపోతే..తాము మద్దతు ఇస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ప్రకటించారు.

అయితే ఇదే విషయంపై కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి స్పందించారు. అనంతపురంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌కు షరతులతో కూడిన మద్దతును ఇస్తామన్నారు. ఎమ్‌ఐఎమ్‌తో కలవకుంటే తాము మద్దతు ఇచ్చేందుకు సిద్దమంటూ పేర్కొన్నారు. చంద్రబాబు-కాంగ్రెస్‌ల పొత్తు అనైతికమంటూ మండిపడ్డారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top