మూల భారతీయోద్యమ పితామహుడు

మూల భారతీయోద్యమ పితామహుడు - Sakshi


నిజాం హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన ఔరంగా బాదులో 1908 డిసెంబర్ 21న బత్తుల శ్యాం సుందర్ ఒక పేద దళిత కుటుంబంలో పుట్టాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్థిక, రాజనీతి, న్యాయశాస్త్రాల్లో ఉన్నత విద్య అభ్యసించాడు. 1930-34 మధ్యలో నిమ్నజాతి యువతను సమైక్యపరిచి యంగ్ మెన్స్ అసోసియేషన్ ఆఫ్ హైద రాబాద్ సంస్థను స్థాపించాడు. హైదరాబాద్ రాష్ట్రంలో దళితుల విద్య, ఆర్థిక, రాజకీయ సామా జిక సమస్యల గురించి పోరాడాడు. పి.ఆర్ వెంకటస్వామి, భాగ్యరెడ్డివర్మ లాంటి సహచరులతో, హైదరాబాదులో దళితులకు విద్యా వసతి సౌక ర్యాలకు ఉద్యమించాడు.



నిజాం పాదుషాకు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ దళిత, మైనారి టీ, బలహీన వర్గాల విముక్తికోసం జాతీయ స్థాయిలో ఎన్నో సంఘాలను స్థాపించాడు. నిజాం రాష్ట్రంలో దళిత కులాల ప్రజాప్రతినిధులను ఆ ప్రజలే ఎన్నుకునేలా ప్రత్యేక నియోజకవర్గాలను ప్రవేశపెట్టాలని 24 వేల గ్రామాల నుంచి 50 వేల మందితో గొప్ప ప్రదర్శన నిర్వహించాడు. 1948 లో హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు డిప్యూటీ స్పీకర్‌గా ఎంపికయ్యాడు. దళితుల విద్యావసతి సౌకర్యాలకోసం నిజాంను ఒప్పించి, శాసనసభ ఆమోదంతో కోటి రూపాయల నిధిని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర వహించాడు.



మరాట్వాడాలోని మిళింద్ కాలే జీ, విద్యా సంస్థల నిర్మాణానికి డా. అంబేద్కర్ అభ్యర్థన మేరకు నిజాం చేత 12 లక్షల రూపాయల విరాళాన్ని శ్యాంసుందర్ ఇప్పించాడు. నిమ్నవ ర్గాల విద్యావసతుల కోసం అంబేద్క ర్ ఏర్పర్చిన పీపుల్స్ ఎడ్యుకేషనల్ సొసైటీకి కార్యనిర్వాహక వర్గ సభ్యుడి గా ఎంపికయ్యాడు. ఎందరో మిత్రు లు అత్యున్నత పదవుల్లో ఉన్నప్పటికీ కేవలం కట్టుబట్టలతో, అద్దెగదిలో అత్తెసరు వస తులతో అతి సామాన్య జీవితం గడిపాడు. బ్రహ్మ చారిగా జీవితం గడిపిన శ్యాం ఉర్దూ, మరాటీ, ఆంగ్లం, హిందీ, కన్నడ భాషల్లో లబ్ద ప్రతిష్టుడు.



ఐక్యరాజ్యసమితికి హైదరాబాద్ స్టేట్‌లోని 90 లక్షల మంది దళితుల ప్రతినిధిగా హాజరై ఆయన చేసిన ప్రసంగాన్ని ప్రపంచ స్థాయి పత్రి కలు పతాక స్థాయిలో ప్రచురించాయని, ఆయన వ్యాసాలను ఆయా దేశాల ప్రముఖ పత్రికలు ప్రచురించాయని తెలుస్తోంది. హోచిమిన్, చౌ ఎన్-లై వంటి ప్రపంచ ప్రముఖులతో స్నేహ సం బంధాలు కొనసాగించాడు. చౌఎన్-లై మన దేశా న్ని తొలిసారి సందర్శించినప్పుడు ఆయన ప్రధాని నెహ్రూతో హైదరా బాద్‌లో శ్యాంసుందర్ అనే మిత్రుణ్ణి కలవాల్సి ఉందని తెలిపారట. దాం తో హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో శ్యాంసుందర్‌ను ఢిల్లీ రప్పించారట. అలాగే ప్రపంచ స్థాయి మేధావులు హెరాల్డ్ జె. లాస్కీ, జీ పాల్ సార్త్రే వంటి వారితో శ్యాం సుందర్‌కు పరిచయం ఉండేది. దళిత ముస్లిం ఐక్య సంఘటనపై ఆయన చేసిన ప్రతిపాదన దేశంలోనే ఒక వినూత్నమైన విముక్తి సిద్ధాంతం. దేశచరిత్రలో నిరంతరం పీడ నకు గురైన ఈ రెండు జాతులు ఐక్యమై భారత దేశంలో నిజమైన విప్లవాన్ని సాధించాలని కోరు కున్నారు. దాంతో సనాతన హిందువులు ఆయ నపై కేసులు పెట్టి, అరెస్టు చేయించి హింసించా రు. తనపై బనాయించిన కుట్రకేసుకు ఆయన ప్రత్యుత్తరమే ‘సజీవ దహనం’ (దే బర్న్) పుస్తకం గా వెలువడింది. దీంట్లో దళితులు హిందువులు కారనే అంశాన్ని భారత న్యాయస్థానం ముందు ససాక్ష్యంగా వెల్లడించారు. దేవాలయ ప్రవేశం వంటిపై పూతల ద్వారా దళితుల వెనుకబాటుత నం పోదని, మతం మార్చుకున్నంత మాత్రాన దళితుల సామాజికార్థిక రాజకీయ సమస్యలు పరిష్కారం కావని విస్పష్టంగా ప్రకటించారు.



శ్యాం సుందర్ 1968లో ప్రారంభించిన భీం సేన దేశంలో తొలి దళిత ఉద్యమం. నిజానికి భీం సేన కార్యక్రమాలే మహారాష్ట్రలో దళిత పాంథర్స్ ఉద్యమానికి మాతృకగా పనిచేశాయి. దేశంలో తామే మూల భారతీయులమని వీరు ప్రకటిం చారు. ఆయన రచించిన ‘మూల భారతీయులు’ (ఒరిజనల్ ఇండియన్స్) పుస్తకంలో ఆర్యులు రాకముందు ఈ దేశాన్ని తామే పాలించామని, మూల భారతీయులం ఎన్నటికీ హిందువులం కామని స్పష్టం చేశారు. అంబేద్కర్ ‘కులనిర్మూ లన’లో ప్రతిపాదనలను మరింత విస్తృతపరిచా రు. హిందీ, ఆంగ్లం, ఉర్దూ, కన్నడ, తెలుగు భాష ల్లో ఆయన రచనలను ప్రచురించారు. దళితుడిగా జన్మించినందువల్ల ఆయనకు దక్కాల్సిన కీర్తి, దక్కలేదంటున్నారు. శాంసుందర్ వంటి వారి ఆలోచనలు, రచనలు నేటి సమాజానికి కూడా అందవలసిన అవసరం ఉంది. చరిత్ర చీకటిలో చిదిమేసిన ఆయన మేథస్సును నేటి తరాలు కూడా అర్థం చేసుకోవాలి.

 (నేడు బత్తుల శ్యాం సుందర్ జయంతి)

 ఎ.ఎన్ నాగేశ్వరరావు  బెంగళూరు

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top