ఇటీవల విడుదలైన ఒక సినిమాలో భట్రాజు కులాన్ని ఒక యాచక వృత్తిగా వర్ణిస్తూ, వీరు పొగడందే బతకలేరన్నట్లుగా చూపించారు.
ఇటీవల విడుదలైన ఒక సినిమాలో భట్రాజు కులాన్ని ఒక యాచక వృత్తిగా వర్ణిస్తూ, వీరు పొగడందే బతకలేరన్నట్లుగా చూపించారు. సినిమా అనేది మొత్తం సమాజంలోకి ఒక సంకేతాన్ని బలంగా చొచ్చుకు పోయేట్లు చేసే శక్తివంతమైన ప్రచార సాధనం. ఒక కులాన్ని కించపరిచేలా చూపించడంలో ఆ సినిమా నిర్మాతల ఉద్దేశమేమిటి? ప్రతికులా నికి గౌరవం, ఆత్మాభిమానం ఉంటాయి. ఈ సినిమాలో బ్రాహ్మణులను కూడా దూషించడంతో వారూ అవమానభారంతో కుంగిపోతున్నారు. భట్రాజులంటే కవులు. గతంలో రాజుల కొలువులో ఉంటూ వారి మంచి కార్యాలను పద్యరూపంలో రాసి ఆ గ్రంథాలను అంకితమిచ్చి వారిచ్చే భూములు, నగదును స్వీకరించేవారు.
నన్నయ్యభట్టు, నారాయణభట్టు, డిండిమభట్టు, కుంకుమభట్టు వంటివారు ఈ కోవకు చెందినవారే. రాజులను పొగుడుతూ వారి వెంట తిరిగేవారు వందిమా గదులే. భట్టు అంటే పండితుడు అని అర్థం. సినిమా సకల వర్గాల ప్రజ లను రంజింపజేసే వినోదసాధనం కాగా దానికి కులాలతో పనేమిటి? ఈ పని ఎవరు చేసినా మానసికక్షోభ మాత్రం సదరు కులానిదే. దక్షిణ భారత దేశంలోని అగ్రనటుడి సినిమాలో కూడా కుల ప్రస్తావనలు మాను కోకపోతే ఈ దేశం మారేదెన్నడు? ఆ సినిమాలో కులాన్ని కించ పరుస్తూ చిత్రించిన సన్నివేశాలను తక్షణమే తొలగించాలి.
- యు.శేషంరాజు, కదిరి