మహిళపై సామూహిక అత్యాచారం, దోపిడీ | woman kidnapped, gangraped, robbed | Sakshi
Sakshi News home page

మహిళపై సామూహిక అత్యాచారం, దోపిడీ

Sep 10 2014 3:33 PM | Updated on Aug 30 2018 5:27 PM

మహిళపై సామూహిక అత్యాచారం, దోపిడీ - Sakshi

మహిళపై సామూహిక అత్యాచారం, దోపిడీ

ఓ మహిళను తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేసి, ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, విలువైన వస్తువులను దోచుకెళ్లారు.

మీరట్: ఉత్తరప్రదేశ్లో ముగ్గురు దుండగులు ఓ మహిళను తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, విలువైన వస్తువులను దోచుకెళ్లారు. మీరట్ సమీపంలోని ఖార్ఖాడ పట్టణంలో ఈ సంఘటన జరిగింది.

ముగ్గురు పిల్లల తల్లియిన 35 ఏళ్ల యువతి బ్యాంక్కు వెళ్లి తిరిగివస్తుండగా దుండగులు ఆమెను కిడ్నాప్ చేశారు. బాధితురాలిని సమీపంలోని అడవికి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డారు. ఆమె దగ్గరున్న డబ్బు, మొబైల్ ఫోన్, బంగారు నగలు దోచుకుని పారిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని గుర్తించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement