బీజేపీకి ఓటేస్తే పాక్‌పై అణుబాంబు వేసినట్టే..

Keshav Maurya  Says Voting For BJP Means Nuclear Bomb Dropped On Pak - Sakshi

థానే : బీజేపీకి ఓటు వేస్తే పాకిస్తాన్‌పై అణుబాంబు వేసినట్టేనని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య అన్నారు. థానేలోని మిరా భయేందర్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి నరేంద్ర మెహతా తరపున ప్రచారం చేసిన మౌర్య తనదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రజలు ఈవీఎంల్లో కమలం గుర్తును ఎంచుకుంటే పాకిస్తాన్‌పై అణుబాంబును జారవిడిచినట్టు అవుతుందని అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మరోసారి బీజేపీకి పట్టం కట్టాలని కోరారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్టికల్‌ 370 రద్దు బీజేపీ వల్లే సాధ్యమైందని, కమలం గుర్తు అభివృద్ధికి సంకేతమని చెప్పారు. లక్ష్మీ దేవత సైకిల్‌ లేదా వాచ్‌పై కూర్చోదని, ఆమె కమలం పువ్వుపై మాత్రమే కూర్చుంటారని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్‌ 21న జరగనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 24న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top