breaking news
kesav prasad mourya
-
బీజేపీకి ఓటేస్తే పాక్‌పై అణుబాంబు వేసినట్టే..
థానే : బీజేపీకి ఓటు వేస్తే పాకిస్తాన్‌పై అణుబాంబు వేసినట్టేనని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. థానేలోని మిరా భయేందర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి నరేంద్ర మెహతా తరపున ప్రచారం చేసిన మౌర్య తనదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రజలు ఈవీఎంల్లో కమలం గుర్తును ఎంచుకుంటే పాకిస్తాన్‌పై అణుబాంబును జారవిడిచినట్టు అవుతుందని అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మరోసారి బీజేపీకి పట్టం కట్టాలని కోరారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 రద్దు బీజేపీ వల్లే సాధ్యమైందని, కమలం గుర్తు అభివృద్ధికి సంకేతమని చెప్పారు. లక్ష్మీ దేవత సైకిల్ లేదా వాచ్‌పై కూర్చోదని, ఆమె కమలం పువ్వుపై మాత్రమే కూర్చుంటారని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 21న జరగనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 24న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. -
దళితుడికి యూపీ బీజేపీ పీఠం
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా కేశవ్ ప్రసాద్ మౌర్యను ఎంపిక చేసిన బీజేపీ.. ఆయన్ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష నుంచి తప్పించనుందా?. తాజా పరిణామాలు ఈ విషయాన్నే ధ్రువపరుస్తున్నాయి. బీసీ వర్గానికి చెందిన మౌర్య ఎలాగూ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న తరుణంలో దళితుడిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని చేసే యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలిసింది. ఓబీసీలు ఎక్కువగా ఉన్న యూపీలో 2017 ఎన్నికల్లో విజయానికి వ్యూహంగా మౌర్యను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేసింది బీజేపీ. తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయం తర్వాత బలహీనంగా ఉన్న దళిత మద్దతును పెంచుకునేందుకు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే, అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయం ఇంకా స్పష్టత రాలేదు.