తమిళనాడు, కేరళ, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో రేపు (సోమవారం) అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
తమిళనాడు/కేరళ/పుదుచ్చేరి: తమిళనాడు, కేరళ, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో రేపు (సోమవారం) అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో 233 స్థానాల్లో పోలింగ్ జరుగనుంది. అయితే తమిళనాడులో ఒకచోట ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడంతో వాయిదా వేసినట్టు తెలిసింది. ఇప్పటివరకూ రూ. 100 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 65 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, లక్షమందికిపైగా భద్రతా సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటోంది. తమిళనాడులోని ఆర్కేనగర్ స్థానంలో అత్యధికంగా 45 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మొత్తం 1,103 మంది అభ్యర్థులు బరిలోకి దిగుతుండగా.. వీరిలో 109 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.