'ఆమె నిందితురాలని నేను చెప్పలేదు' | AK Antony 'did not have the guts' to order CBI probe in time, says Parrikar | Sakshi
Sakshi News home page

'ఆమె నిందితురాలని నేను చెప్పలేదు'

May 27 2016 1:00 PM | Updated on May 28 2018 3:25 PM

'ఆమె నిందితురాలని నేను చెప్పలేదు' - Sakshi

'ఆమె నిందితురాలని నేను చెప్పలేదు'

అగస్టావెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో 101 శాతం రాజకీయ జోక్యం ఉందని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ అన్నారు.

న్యూఢిల్లీ: అగస్టావెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో 101 శాతం రాజకీయ జోక్యం ఉందని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ అన్నారు. ఈ స్కామ్ వెలుగులోకి వచ్చినప్పుడు అప్పటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారని ఆరోపించారు. సీబీఐ దర్యాప్తుకు ఆదేశించే సాహసం చేయలేకపోయారని, ఆయనకు గట్స్ లేవని పేర్కొన్నారు.

ఈ కుంభకోణంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిందితురాలని తాను ఎప్పుడూ అనలేదని స్పష్టం చేశారు. ఆమె పేరును తానేప్పుడు ఈ చర్చలోకి లాగలేదన్నారు. ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పలేదన్నారు. అగస్టావెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో ఎవరు ఉన్నారనేది దర్యాప్తులో తేలుతుందన్నారు. సీబీఐ దర్యాప్తులో తమ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవడం లేదని, కేసు పురోగతి గురించి మాత్రమే అడిగామని పరీకర్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement