ఆమెతో పనిచేయడం హాయిగా ఉంటుంది | zareen a comfortable person to work with: mohit madaan | Sakshi
Sakshi News home page

ఆమెతో పనిచేయడం హాయిగా ఉంటుంది

Jan 24 2017 8:21 PM | Updated on Sep 5 2017 2:01 AM

ఆమెతో పనిచేయడం హాయిగా ఉంటుంది

ఆమెతో పనిచేయడం హాయిగా ఉంటుంది

ప్రముఖ బాలీవుడ్‌ నటి జరీన్‌ ఖాన్‌పై నటుడు మోహిత్‌ మదాన్‌ ప్రశంసలు కురిపించారు. ఆమెతో నటించడం చాలా అనువుగా ఉంటుందని చెప్పారు.

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ నటి జరీన్‌ ఖాన్‌పై నటుడు మోహిత్‌ మదాన్‌ ప్రశంసలు కురిపించారు. ఆమెతో నటించడం చాలా అనువుగా ఉంటుందని చెప్పారు. 2006లో వచ్చిన థ్రిల్లర్‌ సినిమా అక్సర్‌కి సీక్వెల్‌గా అనంత మహదేవన్‌ దర్శకత్వంలో ప్రస్తుతం అక్సర్ ‌–2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో జరీన్‌ ఖాన్‌, మోహిత్‌ కలిసి నటిస్తున్నారు.

సినిమా షూటింగ్‌ సమయాల్లో తాము ఎంతో సరదాగా ఉండేవాళ్లమని, పరస్పరం జోకులు వేసుకుంటూ హాయిగా గడిపేవాళ్లమని చెప్పారు.ఈ కారణంగా తనతో నటించేటప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగలేదని, తను చాలా సపోర్టివ్‌గా ఉండేదని అన్నారు. ఈ చిత్రాన్ని మొత్తం టీమ్‌ అంతా కలిసి కష్టపడి రూపొందించామని, కచ్చితంగా అందర్నీ మెప్పిస్తుందన్న నమ్మకం ఉందని మోహిత్‌ తెలిపాడు. అక్సర్‌ 2 ఏప్రిల్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement