
సౌత్ సినిమాలో విద్యాబాలన్
కహాని, డర్టీ పిక్చర్ లాంటి సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న విద్యాబాలన్ త్వరలో పూర్తి స్థాయి సౌత్ సినిమాకు రెడీ అవుతోంది. పెళ్లి తరువాత సినిమాల విషయంలో...
కహాని, డర్టీ పిక్చర్ లాంటి సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న విద్యాబాలన్ త్వరలో పూర్తి స్థాయి సౌత్ సినిమాకు రెడీ అవుతోంది. పెళ్లి తరువాత సినిమాల విషయంలో వేగం తగ్గించిన ఈ బ్యూటి, ప్రస్తుతం సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో ఓ నిజ జీవిత కథలో నటించడానికి అంగీకరించినట్టుగా తెలిపింది విద్యా.
డర్టీ పిక్చర్ సినిమా తరువాత తనకు చాలా మంది బయోపిక్ కథలే వినిపించారన్న విద్యా, అవేవి తనకు నచ్చలేదని తెలిపింది. అయితే తాజాగా మళయాలంలో కమలాదాస్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో నటించేందుకు అంగీకరించింది. ఈ సినిమాను మళయాలంలోనే తెరకెక్కిస్తున్నా.. హిందీ సబ్ టైటిల్స్తో ఉత్తరాదిలోనూ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
ఈ సినిమాకు సంబందించిన సాంకేతిక నిపుణులు, ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. విద్యాబాలన్ నటించిన లేటెస్ట్ మూవీ తీన్ గత శుక్రవారం రిలీజ్ అయి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నవాజుద్ధీన్ సిద్ధిఖీలతో కలిసి నటించింది విద్యా.