రేపే ‘సామజవరగమన’

Samajavaragamana First Single From Allu Arjun Ala Vaikunta Puram On 28th September - Sakshi

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ హ్యాట్రిక్‌ కొట్టేందుకు రెడీ అయ్యారు. వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి లాంటి సూపర్‌ హిట్‌ చిత్రాలు రాగా.. మరోసారి ప్రేక్షకులకు ఆ మ్యాజిక్‌ చూపించేందుకు సిద్దమయ్యారు. అల వైకుంఠపురంలో అంటూ విడుదలైన చేసిన టీజర్‌, టైటిల్‌, అల్లు అర్జున్‌ లుక్‌ ఇలా అన్నింటిపైనా.. పాజిటివ్‌ బజ్‌ ఏర్పడింది. ఇక తాజాగా ఈ మూవీలోని పాటలు రిలీజ్‌ చేసేందుకు ముహుర్తం ఫిక్స్‌ చేశారు.

ఇందులో భాగంగా.. సామజవరగమన అనే పాటను రేపు (సెప్టెంబర్‌ 28) ఉదయం పది గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సాంగ్‌ ప్రోమోకు విపరీతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.  గీతాఆర్ట్స్‌, హారికా హాసిని క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2020 సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేయనున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top