నేనలా చేస్తే... అభిమానులు హర్ట్ అవుతారు! | Salman Khan Fans will get hurt | Sakshi
Sakshi News home page

నేనలా చేస్తే... అభిమానులు హర్ట్ అవుతారు!

Jul 28 2015 12:15 AM | Updated on Apr 3 2019 6:23 PM

నేనలా చేస్తే... అభిమానులు హర్ట్ అవుతారు! - Sakshi

నేనలా చేస్తే... అభిమానులు హర్ట్ అవుతారు!

నా సినిమాల్లో ఆటా పాటా ఫైట్లూ ఉండాల్సిందే’’ అని అంటున్నారు కండలవీరుడు సల్మాన్ ఖాన్. బాలీవుడ్ దర్శక, నిర్మాతలు ఇప్పుడు ప్రయోగాల బాట పడుతున్నారు.

 ‘‘నా సినిమాల్లో ఆటా పాటా ఫైట్లూ ఉండాల్సిందే’’ అని అంటున్నారు కండలవీరుడు సల్మాన్ ఖాన్. బాలీవుడ్ దర్శక, నిర్మాతలు ఇప్పుడు  ప్రయోగాల బాట పడుతున్నారు. కేవలం కథాకథనాల మీద దృష్టి పెడుతూ, అవసరమైతే పాటల్లేకుండా కూడా సినిమాలు తీయడానికి కూడా వెనుకాడటంలేదు. దీనికి ఉదాహరణ ఇటీవలే వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘బేబి’. అలాగే త్వరలో విడుదల కానున్న షారుక్‌ఖాన్ ‘ఫ్యాన్’, సైఫ్ అలీఖాన్ ‘ఫాంటమ్’ చిత్రాల్లో కూడా పాటలు లేకపోవడం విశేషం.
 
 హాలీవుడ్ శైలిని అనుసరిస్తూ ఇలా పాటల్లేకుండా సినిమాలు తీయడంపై సల్మాన్ స్పందిస్తూ -‘‘నా సినిమాల్లో ఒక్క పాట లేకపోయినా, చక్కటి రొమాన్స్ లేకపోయినా నా అభిమానులు హర్ట్ అవుతారు. అందుకే నేను ప్రయోగాత్మక చిత్రాల్లో నటించినా పాటలు, రొమాన్స్ సీన్స్ ఉండేలా చూసుకుంటా. అందుకు తాజా ఉదాహరణ ‘బజరంగీ  భాయ్‌జాన్’. చూసిన ప్రతి ఒక్కర్నీ కంట తడిపెట్టించిన ఈ చిత్రంలో వాణిజ్య అంశాలు మెండుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, అవి కథకు ఆటంకం కాలేదనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement