అనుష్క శర్మ లవ్‌ ఎఫైర్స్‌..! | Rumoured Relationships About Anushka Sharma Before Marriage | Sakshi
Sakshi News home page

అనుష్క శర్మ లవ్‌ ఎఫైర్స్‌.. రూమర్లు!

Oct 5 2019 10:12 PM | Updated on Oct 5 2019 11:13 PM

Rumoured Relationships About Anushka Sharma Before Marriage - Sakshi

కోహ్లితో పరిచయం ఏర్పడక ముందు అనుష్కకు పలువురితో లవ్‌ ఎఫైర్స్‌ ఉన్నట్టు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిలో బాలీవుడ్‌ నటులు రణవీర్‌ సింగ్‌, షాహిద్‌ కపూర్‌ కూడా ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌ నటిగా గుర్తింపు పొందిన అనుష్క శర్మ.. టీమిండియా ఆటగాడు విరాట్‌ కోహ్లిని వివాహమాడి అందరి దృష్టిని ఆకర్శించింది. చిత్ర పరిశ్రమలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా ఈ జంటకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. అయితే కోహ్లితో పరిచయం ఏర్పడక ముందు అనుష్కకు పలువురితో లవ్‌ ఎఫైర్స్‌ ఉన్నట్టు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిలో బాలీవుడ్‌ నటులు రణవీర్‌ సింగ్‌, షాహిద్‌ కపూర్‌ కూడా ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. విరుష్క వివాహం 2017లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందే జోహిబ్‌ యూసఫ్‌ అనే వ్యక్తితో డేటింగ్‌ చేసినట్లు ముచ్చట్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆమె తొలి ప్రేమికుడు కూడా ఆయనేననే పుకారు షికారు చేస్తోంది. 

కొంతకాలం జోహిబ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన తరువాత.. రణవీర్‌ సింగ్‌తో పరిచయం ఏర్పడటంతో అతనికి గుడ్‌బై చెప్పినట్లు తెలిసింది. బ్యాండ్‌ బాజా సినిమాతో రణవీర్‌ బాలీవుడ్‌కు పరిచయమైన విషయం విదితమే. ఈ మూవీలో రణవీర్‌కు జంటగా అనుష్క నటించింది. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు వార్తలు బలంగానే వినిపించాయి. కొంతకాలం తరువాత దీపికా, రణవీర్‌ ప్రేమ ప్రయాణం మొదలు కావడంతో.. అనుష్క బ్రేకప్‌ చెప్పినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరోనటుడు షాహిద్‌ కపూర్‌తో కూడా అనుష్క రొమాన్స్‌ చేసినట్లు తాజాగా తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి ‘బద్మాష్‌ కంపెనీ’ సినిమాలో నటించారు. ఆ సమయంలోనే వీరు దగ్గరయినట్లు ఓ వార్త సంస్థ కథనాన్ని ప్రచురించింది. అయితే రణవీర్‌తో ప్రేమ వ్యవహారంపై అప్పట్లోనే స్పందించిన అనుష్క.. ఆ వార్తలను కొట్టిపారేసింది. కాగా రెండేళ్ల కిత్రం వివాహ బంధంతో ఒకటైన విరాట్‌-అనుష్క జంట మంచి గుర్తింపును తెచ్చుకుంది. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే ఈ జంట.. ఒకరిపై ఒకరు ప్రేమలు కురిపించుకుంటూ అభిమానులను పలుకరిస్తూ ఉంటారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement