విధి అనుకూలిస్తేనే : రాజమౌళి | RRR Team Rajamouli, Jr Ntr Friendship Day Tweet | Sakshi
Sakshi News home page

విధి అనుకూలిస్తేనే : రాజమౌళి

Aug 4 2019 10:49 AM | Updated on Aug 4 2019 11:39 AM

RRR Team Rajamouli, Jr Ntr Friendship Day Tweet - Sakshi

దర్శకధీరుడు రాజమౌళి స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆసక్తికర ట్వీట్ చేశారు. వారాహి చలనచిత్రం అధినేత, నిర్మాత సాయి కొర్రపాటితో కలిసి దిగిన ఫోటోను తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన జక్కన్న.. ‘విధి అనుకూలిస్తేనే సాయిగారిలాంటి వ్యక్తిని కలిస్తాం. చిన్నపిల్లాడి మనస్తత్వం, నమ్మకానికి రూపం, వెన్నంటి ఉండే బలం. ఆయన నా భీమ్‌. ఆయన ఎల్లప్పుడు ఆనందంగా ఉండాలని ఆశిస్తున్నా’ అంటూ కామెంట్ చేశారు. ఈ ట్వీట్‌ను ఆర్‌ఆర్‌ఆర్‌ యే దోస్తీ(#RRRYehDosti) అనే హ్యాష్‌ ట్యాగ్‌తో పోస్ట్ చేశారు.

ఆర్‌ఆర్ఆర్‌ హీరో ఎన్టీఆర్‌ కూడా ఇదే హ్యాష్‌ ట్యాగ్‌తో ట్వీట్ చేశాడు. రామ్‌చరణ్‌తో కలిసి తాను  దిగిన ఫోటోను షేర్ చేసిన తారక్‌ ‘స్నేహం ఎంపికలో నెమ్మదిగా వ్యవహరించండి. కానీ ఒక్కసారి స్నేహం చేస్తే ఎప్పటికీ వారితో బలమైన బంధాన్ని కొనసాగించండి’ అంటూ సోక్రటిస్‌ చెప్పిన కోట్‌ను పోస్ట్ చేసిన తారక్‌, ఇంతకన్నా మా స్నేహం గురించి చెప్పడానికి మరో వాఖ్యం లేదని కామెంట్ చేశాడు‌. రామ్‌ చరణ్‌ కూడా తారక్‌తో తనకున్న అనుబం‍ధాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement