యూరప్‌కి సూపర్‌స్టార్ | Rajinikanth, Sonakshi Sinha to romance in Europe? | Sakshi
Sakshi News home page

యూరప్‌కి సూపర్‌స్టార్

Sep 8 2014 12:28 AM | Updated on Sep 2 2017 1:01 PM

యూరప్‌కి సూపర్‌స్టార్

యూరప్‌కి సూపర్‌స్టార్

రజనీకాంత్ మాస్ ఇమేజ్ శిఖరం అంత. ఆ స్థాయిని అందుకునే సినిమా తీయడమంటే.. దర్శకునికి కత్తిమీద సామే. అయితే... కె.ఎస్.రవికుమార్‌కి మాత్రం రజనీతో

రజనీకాంత్ మాస్ ఇమేజ్ శిఖరం అంత. ఆ స్థాయిని అందుకునే సినిమా తీయడమంటే.. దర్శకునికి కత్తిమీద సామే. అయితే... కె.ఎస్.రవికుమార్‌కి మాత్రం రజనీతో సినిమా తీయడమంటే సరదా. ఆయన్ను ఎవరెస్ట్ అంత చూపించడమంటే ఇంకా సరదా. అలా తీసిన సినిమాలే ముత్తు, నరసింహా. మళ్లీ ఆ స్థాయి కేరక్టరైజేషన్స్ కోసం, రజనీ-కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రజనీకాంత్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ‘లింగా’తో ఆ ఎదురు చూపులకు తెరపడ్డట్టయ్యింది. రెండు పాటల మినహా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది కూడా.
 
  మిగిలిన రెండు పాటలనూ యూరప్‌లో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో సూపర్‌స్టార్ అత్యంత శక్తిమంతంగా కనిపిస్తారని సమాచారం. ఆయన ఆహార్యం, అభినయం, స్టయిల్స్... అభిమానులు పండుగ చేసుకునేలా ఉంటాయని తెలిసింది. ఏఆర్ రెహమాన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను అక్టోబర్ 23న విడుదల చేయనున్నారు. అలాగే రజనీకాంత్ పుట్టిన రోజు కానుకగా డిసెంబర్ 12న సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం. అనుష్క, సోనాక్షీ సిన్హా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మాత.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement