ఫేమస్‌ అవ్వటానికి ఇలా చేస్తావా..? : హీరో | Neil Nitin Mukesh's Reply To The Trolls on Social Media | Sakshi
Sakshi News home page

ఫేమస్‌ అవ్వటానికి ఇలా చేస్తావా..? : హీరో

Aug 31 2019 10:04 AM | Updated on Aug 31 2019 10:08 AM

Neil Nitin Mukesh's Reply To The Trolls on Social Media - Sakshi

బాలీవుడ్‌లో ఎలాంటి గాడ్‌ఫాదర్‌ లేకపోయినా హీరోగా క్యారెక్టర్‌, ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఆకట్టుకున్న నటుడు నీల్‌ నితిన్‌ ముఖేష్‌. ఇటీవల సౌత్‌ సినిమాలతోనూ అలరిస్తున్న ఈ నటుడు తాజాగా సాహో సినిమాతో మరోసారి మెప్పించాడు. అయితే సాహో రిలీజ్‌ తరువాత అంకూర్‌ పాటక్‌ అనే వ్యక్తి నీల్‌ను ఉద్దేశిస్తూ అభ్యంతరకర ట్వీట్‌ చేశాడు. ‘ఇది 2019, ఇంకా సినిమాలో నటిస్తున్నందుకు నిర్మాతలు నీల్‌ నితిన్‌ ముఖేష్‌కు డబ్బు ఎందుకు ఇస్తున్నారు? నాకు సమాధానం కావాలి’ అంటూ ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్‌పై స్పందించిన నీల్‌.. ‘మీరు ఎవరో నాకు తెలీదు. తెలుసుకోవాలని కూడా లేదు. కానీ మీరు ఫేమస్‌ కావడానికి ఇది సరైన పద్ధతేనా..? మీకో విషయం చెప్పాలి. నేను గాడ్‌ ఫాదర్‌ లేకుండా 12 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఇప్పటికీ కొనసాగుతున్నాను’ అంటూ రిప్లై ఇచ్చారు. నీల్‌ స్పందనపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రోల్స్‌కు సరైన సమాధానమిచ్చారంటూ నీల్‌ను అభినందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement