‘మూడు కోతులు...ఓ మేక’తో పూరి? | mudu kotulu oka meka is a new movie from puri | Sakshi
Sakshi News home page

‘మూడు కోతులు...ఓ మేక’తో పూరి?

Dec 9 2016 11:49 PM | Updated on Mar 22 2019 1:53 PM

‘మూడు కోతులు...ఓ మేక’తో పూరి? - Sakshi

‘మూడు కోతులు...ఓ మేక’తో పూరి?

దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తన సినిమాల టైటిల్స్‌ విషయంలో ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచిస్తుంటారు.

దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తన సినిమాల టైటిల్స్‌ విషయంలో ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచిస్తుంటారు. ఆయన చిత్రాల పేర్లు చూస్తే చాలు... ఆ విషయం మనకు అర్థం అవుతుంది. ‘ఇడియట్‌’, ‘దేశముదురు’, ‘పోకిరి’, ‘లోఫర్‌’ – ఇలాంటి టైటిల్సే ఇందుకు నిదర్శనం. తాజాగా ఆయన ‘మూడు కోతులు.. ఒక మేక’ అనే ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ను ఫిల్మ్‌ఛాంబర్‌లో రిజిస్టర్‌ చేయించారని సమాచారం. నిజానికి, ఇటీవల విడుదలైన ‘ఇజం’ తర్వాత తెలుగులో ఆయన ఏ కొత్త చిత్రాన్నీ ప్రకటించలేదు.

ప్రస్తుతం ఆయన కన్నడంలో తెరకెక్కించిన ‘రోగ్‌’ సినిమా విడుదల పనుల్లో ఉన్నారని తెలుస్తోంది. ఆ పనులన్నీ కాగానే, సొంత నిర్మాణ సంస్థ అయిన వైష్ణో అకాడమీ పతాకంపై ‘మూడు కోతులు.. ఒక మేక’ పేరుతో ఆయన చిత్రం తెరకెక్కించనున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ప్రస్తుతం పూరి స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసే పనిలో ఉన్నారట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement