
సాహోకు పోటీగా బరిలోకి దించుతున్నారు
‘సాహో’ రేంజ్ ఎలా ఉంటుందో శాంపిల్‌గా నిన్న ఓ టీజర్ వదిలి అందర్నీ షాక్‌కు గురి చేసింది చిత్రయూనిట్. అసలే బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ జాతీయ స్థాయిలో దూసుకుపోతుండగా.. సాహో చిత్రాన్ని ప్యాన్‌ఇండియా మూవీగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్ స్క్రీన్‌పై ఇంతవరకు చూడని బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సాహోను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.
అయితే ఆగస్టు 15న ఈ మూవీ రాబోతోందని అందరికీ తెలిసిందే. ఆ రోజున మరే చిత్రాన్ని విడుదల చేయడానికి ఏ నిర్మాత సాహసించరు. దాదాపు ఆ వారం మొత్తం సాహో హవా నడుస్తుంది. అయితే బాలీవుడ్‌లో ఓ చిత్రం సాహోతో పోటీపడేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా, విద్యాబాలన్, నిత్యామీనన్ లాంటి భారీ తారాగణంతో రాబోతోన్న మిషన్ మంగళ్ చిత్రాన్ని సాహోకు పోటీగా బరిలోకి దించుతున్నారు. మరి ‘సాహో’ ముందు నిలబడి మిషన్ మంగళ్ గెలుస్తుందో లేదో చూడాలి.
OFFICIAL... No change in release date... #MissionMangal to release on 15 Aug 2019... Stars Akshay Kumar, Vidya Balan, Sonakshi Sinha, Taapsee Pannu, Nithya Menen, Kirti Kulhari and Sharman Joshi... Directed by Jagan Shakti. #IndependenceDay pic.twitter.com/ERe8DUgEW0
— taran adarsh (@taran_adarsh) June 13, 2019