శ్రీమంతుడు వంటి హిట్ ఇచ్చినా...! | Koratala waiting for heroes after srimanthudu success | Sakshi
Sakshi News home page

శ్రీమంతుడు వంటి హిట్ ఇచ్చినా...!

Sep 15 2015 10:56 AM | Updated on Sep 3 2017 9:27 AM

శ్రీమంతుడు వంటి హిట్ ఇచ్చినా...!

శ్రీమంతుడు వంటి హిట్ ఇచ్చినా...!

'శ్రీమంతుడు' లాంటి సూపర్ హిట్ తరువాత ఏ దర్శకుడికైన నెక్ట్స్ సినిమా స్టార్ట్ చేయటం చాలా ఈజీ.. కానీ కొరటాల శివ విషయంలో మాత్రం అలా జరగటం లేదు. ఈ సినిమా రిలీజ్ అయి 6 వారాలు దాటుతున్న ఇంతవరకు కొరటాల చేయబోయే...

'శ్రీమంతుడు' లాంటి సూపర్ హిట్ తరువాత ఏ దర్శకుడికైన నెక్ట్స్ సినిమా స్టార్ట్ చేయటం చాలా ఈజీ.. కానీ కొరటాల శివ విషయంలో మాత్రం అలా జరగటం లేదు. ఈ సినిమా రిలీజ్ అయి 6 వారాలు దాటుతున్న ఇంతవరకు కొరటాల చేయబోయే నెక్ట్స్ సినిమా మీద క్లారిటీ రాలేదు. స్టార్ హీరోలందరూ క్యూలోనే ఉన్నారన్న టాక్ వినిపిస్తున్నా ఎవరితో సినిమా స్టార్ చేస్తాడన్న విషయం అర్థం కావటం లేదు.

'మిర్చి' రిలీజ్ తరువాత కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నాడు కొరటాల శివ. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మిర్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాదించినా, మరో అవకాశం కోసం కొరటాల చాలా కాలం వెయిట్ చేయక తప్పలేదు. చాలా మంది హీరోలతో సినిమా ట్రై చేసి ఫైనల్ గా మహేష్ను ఒప్పించి 'శ్రీమంతుడు' సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచినా పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. మరోసారి కొరటాలకు వెయిటింగ్ తప్పేలా లేదు.

ఎన్టీఆర్ హీరోగా మైత్రి మూవీస్ బ్యానర్లో ఒక సినిమాతో పాటు బండ్లగణేష్ నిర్మాతగా రామ్చరణ్ హీరోగా ఒక సినిమాకు సంబందించి టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే చరణ్, ఎన్టీఆర్లు బిజీగా ఉండటంతో ఏ సినిమా సెట్స్ మీదకు వెళ్లాలన్న ఇంకా ఆరునెలలకు పైగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరి కొరటాల వెయిట్ చేస్తాడా లేక వేరే హీరోలను ట్రై చేస్తాడా చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement