అమ్మాయి పుట్టింది: కపిల్‌ శర్మ | Kapil Sharma Announces Blessed With Baby Girl | Sakshi
Sakshi News home page

అమ్మాయి పుట్టింది: కపిల్‌ శర్మ

Dec 10 2019 10:08 AM | Updated on Dec 10 2019 12:42 PM

Kapil Sharma Announces Blessed With Baby Girl - Sakshi

‘అమ్మాయి పుట్టింది. మీ అందరి ఆశీస్సులు కావాలి. జై మాతాదీ... లవ్‌ యు ఆల్‌’ అంటూ బాలీవుడ్‌ కమెడియన్‌, నటుడు కపిల్‌ శర్మ అభిమానులతో శుభవార్త పంచుకున్నాడు. తనకు కూతురు జన్మించిన విషయాన్ని ట్విటర్‌ వేదికగా తెలియజేశాడు. ఈ క్రమంలో హీరోయిన్‌ రకుల్ ప్రీత్‌సింగ్‌, సింగర్‌ గురురాంధవా తదితర సెలబ్రిటీలు సహా నెటిజన్ల నుంచి కపిల్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా గతేడాది తన చిరకాల స్నేహితురాలు గిన్నీ చరాత్‌ను కపిల్‌ వివాహమాడిన సంగతి తెలిసిందే. అత్యంత సన్నిహితుల మధ్య డిసెంబరు 12న వీరి వివాహ వేడుక పంజాబీ సంప్రదాయ ప్రకారం జరిగింది. ఈ క్రమంలో కపిల్‌ తన హోం టౌన్‌ అమృత్‌సర్‌లో డిసెంబరు 14న సన్నిహితుల కోసం, ముంబైలో డిసెంబరు 24న ఇండస్ట్రీ ప్రముఖుల కోసం.. రెండు రిసెప్షన్‌ పార్టీలు ఇచ్చాడు. ఇక ప్రస్తుతం తనకు తండ్రిగా ప్రమోషన్ రావడంతో కపిల్‌ ఆనంద డోలికల్లో తేలియాడుతున్నాడు.

కాగా ‘కామెడీ నైట్స్‌ విత్‌ కపిల్‌’ షోతో ఫేమస్‌ అయిన కపిల్‌ శర్మ.. స్టార్‌ కమెడియన్‌గా ఎదిగాడు. ఒక షోకు అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న కమెడియన్‌గా కూడా రికార్డు సృష్టించాడు. పలు బాలీవుడ్‌ సినిమాలలో కూడా నటించిన కపిల్‌.. ‘సన్‌ ఆఫ్‌ మంజీత్‌ సింగ్‌’  అనే సినిమాతో నిర్మాతగా కూడా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ప్రస్తుతం ‘ద కపిల్‌ శర్మ షో’తో కపిల్‌ బిజీగా ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement