డిసెంబర్‌లో సినీ తారల బ్యాడ్మింటన్ | Cinema artists Badminton likely to be held in december | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌లో సినీ తారల బ్యాడ్మింటన్

Nov 26 2014 5:31 AM | Updated on Aug 13 2018 4:19 PM

డిసెంబర్‌లో సినీ తారల బ్యాడ్మింటన్ - Sakshi

డిసెంబర్‌లో సినీ తారల బ్యాడ్మింటన్

సినీ తారల క్రికెట్ క్రీడా వినోదాన్ని చూసిన చెన్నై సినీ, క్రీడాభిమానులు ఇప్పుడు తారల బ్యాడ్మింటన్ క్రీడా పోటీల సందడిని చూడనున్నారు.

తమిళసినిమా: సినీ తారల క్రికెట్ క్రీడా వినోదాన్ని చూసిన చెన్నై సినీ, క్రీడాభిమానులు ఇప్పుడు తారల బ్యాడ్మింటన్ క్రీడా పోటీల సందడిని చూడనున్నారు. తారల క్రికెట్ అంటేనే కావలసినంత మజా ఉంటుంది. అలాంటిది ఈ బ్యాడ్మింటన్ క్రీడల్లో సినీ తారలతో పాటు సంగీత, నృత్య కళాకారుల బృందం పాల్గొననుండటం విశేషం. డిసెంబర్ 11 నుంచి 14 వరకు జరుగనున్న ఈ తారల బ్యాడ్మింటన్ క్రీడా పోటీలకు నగరంలోని ఫారం మాల్ వేదిక కానుంది. నటి, నృత్య దర్శకురాలు అభినయ, గ్రీన్స్ గ్రూప్ కంపెనీ అధినేత రోజా గణేష్ కలిసి నిర్వహించనున్న సినీ కళాకారుల బ్యాడ్మింటన్ పోటీల వివరాలను అభినయ తెలుపుతూ, సినీ తారల క్రీడలను అభిమానులు విజయవంతం చేయడం చూస్తున్నామన్నారు.
 
 అలాంటి వారందరి కోసం ఈసారి బ్యాడ్మింటన్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సారి చెన్నైలో తారల బ్యాడ్మింటన్ క్రీడా పోటీలను నిర్వహించడానికి సిద్ధమైనట్లు వివరించారు. ఈ పోటీల్లో సినీ తారలు, నృత్య దర్శకులు, సంగీత కళాకారులు పాల్గొనున్నారని తెలిపారు. ఈ పోటీలను సేవ సంఘాల నిధి కోసం వినియోగించనున్నట్లు తెలిపారు. గ్రీన్స్ గ్రూప్ కంపెనీ అధినేత రోజాగణేషన్ మాట్లాడుతూ, కళాకారుల బ్యాడ్మింటన్ నాలుగు గ్రూపులుగా ఆడనున్నారని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement